మీ జీవిత భాగ్యస్వామితో అన్యోన్యత పెంచుకోవడానికి.....

couple, unhappy couples, angry couples, bharya bharthalu, wife and husband quarrels , telugu blog, apurup

వివాహం ఒక మధురానుభూతి. వివాహమైన తరువాత నూతన దంపతులు హానీమూన్ పేరిట కొద్ది రోజులు గడిపి నెమ్మదిగా తమ సంసారాన్ని ఏర్పరచుకోవడం ప్రారంభిస్తారు. అదే సమయంలో ఒకరి అభిరుచులు, ఇష్టాయిష్టాలు మరొకరు తెలుసుకోవడం కూడా ప్రారంభిస్తారు.
కొన్ని కొన్ని విషయాల్లో సర్దుకు పోవాల్సి రావడం, మరి కొన్ని విషయాల్లో రాజీపడటం మొదలవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ వైవాహిక బంధం మధురమైన అనుబంధంగా అలాగే నిలిచి పోతుందా? లేకపోతే నెమ్మదిగా ఒకరికొకరు దూరమై విడిపోయే పరిస్థితికి దారి తీస్తుందా? అనేది ఆ దంపతులపైనే ఆధారపడి ఉంటుంది. వివాహమైన తొలినాళ్లలో భార్యాభర్తలిద్దరూ పార్కుకు వెళ్లి కూర్చుని గంటల తరబడి ఏవేవో కబుర్లు చెప్పుకుంటారు. అయితే దైనందిన జీవితంలో ఎదురయ్యే వాస్తవాలు దీనికి భిన్నంగా ఉంటాయి. అనుకోని సంఘటనలు, అవాంతరాలతో వైవాహిక జీవితపు మాధుర్యం దెబ్బతింటూ వస్తుంది.

మనస్పర్థలకు కారణాలు
  • వివాహమైన కొన్నేళ్ల తరువాత భార్య మీద తనకు ఎంతో ప్రేమ ఉందనే విషయాన్ని మాటిమాటికీ చెప్పడం పెద్ద అవసరమైన విషయమేమీ కాదని భర్త భావిస్తాడు. ఏడాదికొకసారి, ఆమె పుట్టిన రోజునాడో, పెళ్లిరోజునాడో ఏదో ఒక బహుమతిని ఇచ్చి తనకు ప్రేమ ఉందని తెలియజెపుతాడే తప్ప వివాహమైన తొలినాళ్లలో లాగా 'స్వీట్ నథింగ్స్ మాట్లాడడు. భార్యాభర్తలిద్దరూ ఒకరిపట్ల మరొకరికి ఉండే ప్రేమను, అభిమానాన్ని సరైన రీతిలో వ్యక్తీకరించుకోకపోయినా, వారి తప్పులను మాత్రం వెంటనే ఎత్తి చూపడం, వాదించుకోవడం సర్వ సాధారణ విషయమవుతుంది.

  • భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడానికి ప్రధాన కారణం ఇద్దరి మధ్య ఏర్పడే సమాచార అంతరాయమే. ఒకరి అభిప్రాయాలు, భావోద్వేగాలు మరొకరు తెలుసుకునే అవకాశం లోపించడంతో ఇద్దరి మధ్య విభేదాలు ప్రారంభమై ఆగ్రహానికి, మనస్పర్థలకు వాగ్యుద్ధాలకు దారి తీస్తుంది. కొంతమందిలో వాగ్యుద్ధాలు 'మూగ నోముకు దారి తీస్తాయి. ఇది కొన్ని గంటలనుంచి కొన్ని రోజుల వరకూ సాగవచ్చు. ఈ పరిస్థితుల్లో ఒకరు మరొకరితో ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు పిల్లలతో మాట్లాడుతున్నట్లుగా 'మీ నాన్నకు ఈ విషయం చెప్పు.. 'మీ అమ్మకు ఈ విషయం చెప్పు అంటూ పిల్లలను మధ్యలోకి తీసుకు వస్తారు. తిరిగి మాటలు కలపాలంటే ఎవరు ముందుగా మాట్లాడాలనే సమస్య ఉత్పన్నమవుతుంది. ముందుగా తాను మాట్లాడితే ఓడిపోయినట్లవుతాననే భావన ఇద్దరిలోనూ ఉంటుంది.
పరిష్కార మార్గాలు
  • భార్యాభర్తల మధ్య సంబంధాలు మరీ పాడైపోకుండా ఉండాలంటే వారిద్దరి మధ్య భావ వ్యక్తీకరణ సక్రమంగా జరగడం అవసరం. ఏదో నిర్ణయాన్నో, అభిప్రాయాన్నో మనస్సులో ఉంచుకుని పైకి మరొకటి చెప్పడం సరైన విధానం కాదు.
  • ఎప్పుడూ ఏదో ఒక విధంగా విమర్శిస్తూ, గొణుక్కుంటూ ఉండకూడదు. ఏం చెప్పాలనుకున్నారో దానిని స్పష్టంగా చెప్పడం అవసరం. అలాగే ఏం కావాలనుకుంటున్నారో దానిని కూడా స్పష్టంగా తెలియజేయడం అవసరం. ఏదైనా అంశంపై అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఆ అంశానికే కట్టుబడి మాట్లాడుకోవాలి తప్ప, ఆ అంశంనుంచి పక్కదారిపట్టి గతాన్ని తవ్వి చూపడం మంచిది కాదు. భార్యాభర్తల మధ్య వాగ్యుద్ధం మొదలై, తీవ్ర ఆగ్రహా వేశాలకు గురవుతున్నప్పుడు, ఆ అంశంనుంచి దృష్టి మరల్చాలి.
  • చర్చ అక్కడితో ఆగకపోతే కోపం తగ్గే వరకూ అక్కడినుంచి లేచి వెళ్లిపోవాలి. కోపాన్ని ప్రదర్శించడానికి కొంతమంది వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు. వ్యంగ్యంగా మాట్లాడటం ద్వారా సమస్య మరింత జటిలమవుతుందే తప్ప పరిష్కారం లభించదు.
  • ఎప్పుడూ 'నా మాటే వేదవాక్కులా ఉండాలని భావించకూడదు. భార్యాభర్తల మధ్య సర్దుకుపోవడం, రాజీ పడటం అనేవి చాలా ముఖ్యమైన అంశాలు.

మరి కొన్ని కారణాలు :
  • భార్యాభర్తల మధ్య ఘర్షణలకు కారణమయ్యే వాటిలో సెక్స్ సమస్యలు కూడా ముఖ్యమైనవే. వైద్యపరమైన లైంగిక సమస్యలు కొన్నయితే, భార్యాభర్తల మధ్య సంబంధాలు దెబ్బతినడం వలన చెలరేగే సమస్యలు మరికొన్ని. ఘర్షణాత్మక కుటుంబాలలో ఎక్కువగా రెండవ రకానికి చెందిన సమస్యలే కనిపిస్తుంటాయి.
  • అతడికి/ఆమెకు సెక్స్లో కోరిక ఉన్నప్పటికీ, దెబ్బలాడుకున్నం దున తమ కోరికను వెల్లడించకుండా విముఖతను ప్రదర్శిస్తుం టారు. ఇది వారి కుటుంబ జీవనం మరింత ఛిద్రమవడానికి దారి తీస్తుంది. భర్తపై లేదా భార్యపై తన కోపాన్ని ప్రదర్శించడానికి అతడు/ ఆమె కోరినప్పుడు తిరస్కరించడాన్ని ఒక ఆయుధంగా వాడుకోవడం వీరిలో సాధారణంగా కనిపించే అంశం.
ఏం చేయాలి?
  • సాధారణంగా కుటుంబంలో చెలరేగే చిన్న చిన్న మనస్పర్థలు భార్యాభర్తలిద్దరూ కూర్చుని సామరస్యంగా చర్చించుకుంటే సరి పోతుంది. కలహాలు తీవ్రస్థాయిలో చెలరేగుతున్నప్పుడు, కుటుంబంలోని పెద్దవారితో చర్చించి, వారి సమక్షంలో సమస్యలను పరిష్కరించు కోవడానికి ప్రయత్నించాలి. సమస్య పుట్టడానికి మూల కారణమేమిటో తెలుసుకుని మళ్లీ ఆ పరిస్థితి ఉత్పన్నం కాకుండా చూసుకోవాలి.
  • సమస్యను పరిష్కరించు కోవడానికి మనస్ఫూర్తిగా ప్రయత్నిం చాలే తప్ప మొక్కుబడిగా మాత్రం కాదు. దీనికోసం కొంత రాజీ ధోరణిని ప్రదర్శించాలి. ఒకరికోసం మరొకరు తమ ప్రవర్తనలో ఎలాంటి మార్పులు చేసుకోగలుగుతారో పరిశీలించుకుని తదను గుణంగా మారడానికి ప్రయత్నించాలి. అంతే కాని, మనకు అను గుణంగా ఎదుటి వ్యక్తి మారాలని భావించకూడదు.
  • ఏదైనా అంశంపై చర్చ మొదలైనప్పుడు విమర్శించడాన్ని మానేయాలి. అలాగే గతాన్ని తవ్వి పోసుకుంటూ పరస్పరం నిందారోపణలు చేసుకోవడం కూడా మంచిది పద్ధతి కాదు. వివాహమైన తొలినాళ్లలో ఆనందంగా ఉన్న రోజులను గుర్తు చేసుకుంటూ, మళ్లీ అలా ఒక రోజైనా ఉండటానికి ప్రయత్నించాలి.
  • కోపంగా, అయిష్టంగా ఉన్నా సరే, దానిని మనస్సులోనే దాచుకుని, ఒక్క రోజైనా మళ్లీ సరదాగా గడపడానికి యత్నించాలి. ఇలా చేయడం వలన మళ్లీ ఒకరిపై ఒకరికి అభిమానం పెరుగుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది.

COMMENTS

పేరు

50+ Health Tips,4,చిట్కాలు,23,సుఖ వ్యాధులు,3,సుఖ సంసారం సందేహలు-సమాధానలు,43,Actress Image Gallery,1,beauty,9,beauty tips,28,beauty tips for men,2,Child Health,3,children health,1,computers,2,dental,3,depression,3,devotional,3,diabetics,7,Diet,21,Exercise,2,family,3,family tips,6,Fitness,20,fitness tips,26,fun,1,gents,6,Gents Health,10,girl health,10,girls,10,hair care,1,health,11,health articles,204,health tips,44,healthy food,1,Interview Tips,4,jokes,21,karalu,19,ladies,24,ladies health,56,men,1,men health,5,muslim,1,National NEWS,1,non veg,7,obesity,8,office skills,1,Personality Development,26,question and answers,33,ramjan special,10,Receipe,7,recipes,45,science,4,science facts,6,skin care,7,Suka Samsaram,43,sweet,18,techno tips,3,telugu movie comedy bits,17,temples,28,veg,26,videos,18,women,17,women 40+,8,wonders,2,yoga,2,
ltr
item
APURUPA: మీ జీవిత భాగ్యస్వామితో అన్యోన్యత పెంచుకోవడానికి.....
మీ జీవిత భాగ్యస్వామితో అన్యోన్యత పెంచుకోవడానికి.....
couple, unhappy couples, angry couples, bharya bharthalu, wife and husband quarrels , telugu blog, apurup
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgE0HSRDhSi7VUi3IHO021SHdI6ruW6aQr1VZwCx8Xk4_GTnTw3fNXQW9NpoSQxPjxB6NFyX216vHuCHwPOgXqwB_aJijAup_yv5AdARp6Aoy5sRN5QF2Pw9VTF_WeAeqbaVR3hm1sBHzM/s1600/angry+couple.jpg
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgE0HSRDhSi7VUi3IHO021SHdI6ruW6aQr1VZwCx8Xk4_GTnTw3fNXQW9NpoSQxPjxB6NFyX216vHuCHwPOgXqwB_aJijAup_yv5AdARp6Aoy5sRN5QF2Pw9VTF_WeAeqbaVR3hm1sBHzM/s72-c/angry+couple.jpg
APURUPA
http://apurup.blogspot.com/2014/07/blog-post_74.html
http://apurup.blogspot.com/
http://apurup.blogspot.com/
http://apurup.blogspot.com/2014/07/blog-post_74.html
true
7218074760681550171
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy