2014
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
నిత్యం యవ్వనంతో ఉండటం కంటే మరో వరం లేదు. ముఖ్యంగా వయసు తెలిసిపోయేది చర్మంతోనే. తెల్లబడే తలకు రంగు వేసైనా వృద్ధాప్యాన్ని కనిపించకుండా ఆపవచ్చేమో గాని, ముడుతలు పడే చర్మానికి ఏం చేసి వృద్ధాప్య లక్షణాలను ఆపగలం? చర్మంపై త్వరగా వృద్ధాప్య లక్షణాలు కనబడటానికి కారణాలు, వాటిని నివారించేందుకు తీసుకు వాల్సిన జాగ్రత్తలను తెలుసుకోవాలనుకునే వారి కోసమే ఈ కథనం.
చర్మం మన దేహంలోని అతి పెద్ద అవయవం. సూర్యుడి హానికారక కిరణాలనుంచి, వాతావరణంలోని వేడిమి/చలి నుంచి, అనేక సూక్ష్మక్రిములనుంచి రక్షణ కల్పిస్తుంది చర్మం. అదే లేకపోతే ఏ జీవి మనుగడా సాధ్యం కాదు. ఇలా రక్షణ కల్పించే ప్రక్రియలో దానికి అయ్యే హానిని అదే తొలగించు కుని, దానికి అయ్యే గాయాలను అదే చక్కబరచుకుంటుంది. ఎప్పటికప్పుడు తనను తాను రిపేర్‌ చేసుకుంటుంది. అయితే కాలం గడుస్తున్న కొద్దీ చర్మంలో వయసు తాలూకు అనేక మార్పులు కనిపిస్తాయి. చర్మంపై కాల ప్రభావాన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. మొదటిది అంతర్గతంగా వచ్చే మార్పుల (ఇంట్రిన్సిక్‌) తాలూకు కారణాలు, రెండోది బాహ్య కారణాలు (ఎక్స్‌‌రటిన్సిక్‌). వయసు పైబడటానికి అంతర్గత (ఇంట్రిన్సిక్‌) కారణాలు కాలం గడుస్తున్న కొద్దీ చర్మంలో వచ్చే మార్పులకు ప్రధాన కారణం జన్యువుల్లో ఉంటుంది. కొందరు... ముఫ్ఫైలలో ఉన్నా టీన్స్‌లో ఉన్నట్లే కనబడతారు. దానికి కారణం వారి జన్యువులే.
ఇలా అంతర్గత కారణాలతో జరిగే వయసు మార్పులను ‘స్వాభావిక వయసు మార్పులు’ (నేచురల్‌ ఏజింగ్‌) అంటారు. మన చర్మం బిగుతుగా ఉండటానికి కారణం... అందులో కొలాజెన్‌ అనే పదార్థం. ఈ కొలాజెనే చర్మం కణాలను పట్టి ఉంచినట్లుగా బిగుతుగా ఉంచడానికి సపోర్ట్‌ ఇస్తుంది. అయితే కాలం గడుస్తున్న కొద్దీ కొలాజెన్‌ ఉత్పత్తి మందగిస్తూ పోతుంటుంది. అలా మందగిస్తున్నకొద్దీ... చర్మాన్ని సాగదీసినప్పుడు మళ్లీ యథాస్థితికి వచ్చే గుణం (ఎలాస్టిసిటీ) తగ్గివదులుగా మారుతుంది. ఇక చర్మంపైన మృతకణాలు ఎప్పటికప్పుడు తొలగిపోయి, ఆ స్థానంలో మళ్లీ కొత్త కణాలు పుడుతుంటాయి. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ మృతకణాల స్థానాన్ని తీసుకునే కొత్త కణాల ఉత్పత్తి కూడా మందగిస్తుంటుంది. ఈ మార్పులన్నీ 20 తర్వాత నుంచి కనిపిస్తుంటాయి కాబట్టి ఏజింగ్‌ ఆ వయసు నుంచే మొదలవుతుంది.

వయసు పెరగడంతో వచ్చే స్వాభావిక మార్పులివి... 
  • చాలా సూక్ష్మమైన ముడుతలు (సాధారణంగా నుదు టిమీదపై ప్రస్ఫుటంగా కనిపిస్తాయి) 
  • చర్మం క్రమంగా పారదర్శకం కావడం 
  • చర్మం కింద ఉండే కొవ్వు క్రమంగా తగ్గిపోతుండటంతో చెంపల భాగంలో గుంటలు పడటం.
  • అలాగే కంటి చుట్టుపక్కల ఉన్న చర్మం కింది కొవ్వు కూడా తగ్గుతూ పోతుంది. అలాగే అరచేతుల వెనక భాగంలో,మెడ దగ్గర చర్మం వదులవుతూ ఉంటుంది 
  • కాలక్రమాంలో ఎముక కాస్తంత కురచగా మారడంతో ఎముక చుట్టూ ఉండే చర్మం వదులవుతుంది
  • పొడిగా ఉండే చర్మంలో దురదలు వస్తాయి. (అక్కడి గ్రంథుల సంఖ్యతగ్గడం వల్ల). 
  • స్వేదగ్రంథుల సంఖ్య తగ్గడంతో చెమటలు తగ్గి శరీరాన్ని చల్లబరిచే గుణం క్రమంగా తగ్గుతుంది.
  • శరీరంపై ఉండే వెంట్రుకలు క్రమంగా తెల్లబడతాయి. హార్మోనల్‌ మార్పుల వల్ల తలపై (మాడు భాగంలోని) వెంట్రుకలు క్రమంగా పలచబడతాయి. ఈ మార్పు స్ర్తీ, పురుషులిద్దరిలోనూ చోటుచేసుకుంటుంది 

ఇకస్ర్తీలలో అవాంఛనీయమైన వెంట్రుకల పెరుగుదల ఎక్కువ వుతుంది. (ఈస్ట్రోజెన్‌ తగ్గడం వల్ల)  గోళ్ల చివర అర్థచంద్రాకారంలో ఉండే తెల్లటి భాగం క్రమంగా మాయమై పోయి, గోళ్లపై చిన్న చిన్న గాట్ల వంటివి ఏర్పడుతుంటాయి. అయితే పై మార్పులు కొందరిలో ఇరవైలలో కాకుండా నలభైల్లోకి వచ్చే వరకూ ప్రారంభం కావు. ఇక కొందరిలో వయసు పెరగడం అనే ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. దీనికీ జన్యువులే కారణం. ఈ కండిషన్‌ను ‘వీనర్స్‌ సిండ్రోమ్‌’ అంటారు ఈ సిండ్రోమ్‌తో బాధ పడేవారిలో వెంట్రుకలు టీనేజ్‌లోనే తెల్లబడతాయి. ముప్ఫయిలలో క్యాటరాక్ట్‌ వస్తుంది. 

వయసు పైబడటానికి బయటి కారణాలు (ఎక్స్‌ట్రిన్సిక్‌) 

వయసు పైబడినట్లుగా కనిపించడానికి అనేక  కారణాలు దోహదం చేస్తాయి. వాటిలో ముఖ్యమైనవి...

సూర్యుడికి ఎక్స్‌పోజ్‌ కావడం : సూర్యుడి కిరణాలకు ఎక్స్‌ పోజ్‌ కావడం వల్ల చర్మం కొన్ని మార్పులకు గురవుతుంది. కమిలినట్లుగా మారడం, ప్రెకిల్స్‌ (చిన్న చుక్కల్లా కనిపించే గోధుమ రంగు మచ్చలు), ఏజ్‌ స్పాట్స్‌, చర్మంపై సన్నటి ముడుతలు కనిపిస్తాయి. చర్మాన్ని సాగదీసినప్పుడు ఇవి మాయమౌతాయి. కొన్ని సందర్భాల్లో కాస్త ఎరగ్రా, గరుకుగా కనిపించే పులిపిరి కాయల్లాంటి యాక్టినిక్‌ కెరటోసిస్‌ వల్ల వయసు ఉన్నదాని కంటే ఎక్కువగా కనిపిస్తుంది. ఇది తర్వాతి దశలో చర్మ క్యాన్సర్‌కూ దారితీయవచ్చు సూర్యరశ్మికి ఎక్స్‌పోజ్‌ కావడం వల్ల వయసు పైబడినట్లుగా మారడాన్ని ‘ఫొటో ఏజింగ్‌’ అంటారు. ఒకరి చర్మం ఫొటో ఏజింగ్‌కు గురికావడం అన్నది మళ్లీ ఆ వ్యక్తి చర్మపు రంగుతో పాటు అతడు ఎంతసేపు ఎండవేడికి ఎక్స్‌పోజ్‌ అవుతున్నాడనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఫెయిర్‌గా (తెల్లటి/ఎరట్రి చర్మపు రంగుతో) ఉండేవారికి చర్మంలో మెలనిన్‌ అనే పదార్థం తక్కువగా ఉంటుంది. అందుకే వీళ్లు సూర్యరశ్మి ప్రభావానికి ఎక్కువగా గురవుతుంటారు. ఇక చర్మం డార్క్‌గా మారుతున్న కొద్దీ పై దుష్ర్పభావాలు తగ్గుతాయి. సూర్యరశ్మి తాలూకు దుష్ర్పభావాలకు చర్మం గురికావడం అన్నది కాలక్రమేణా జరుగుతుంటుంది. దీనివల్ల చర్మం నల్ల బడటం, మందంగా మారడం, ముడుతలు పడటం జరుగుతుంది. అదేపనిగా సూర్యుడికి ఎక్స్‌పోజ్‌ కావడం వల్ల పై మార్పులన్నీ శాశ్వతం అయ్యే అవకాశమూ ఉంది. అందుకే వేడి ప్రదేశాల్లో నివసించేవారిలో ఏజింగ్‌ మార్పులన్నీ వారి ఇరవైలలోనే కనిపించడం మొదలవుతుంది.


సూర్యరశ్మివల్ల కలిగే ఏజింగ్‌ ప్రక్రియ నివారణకు...

Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
మానసిక ఒత్తిడి వల్ల కలిగే శారీరకంగానూ సమస్యలు ఎదురవుతాయని గుర్తించినప్పుడు చేయాల్సిందల్లా దాన్ని అధిగమించడం, నియంత్రిం చడం. దీనివల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయని తేలింది కూడా. ఉదాహ రణకు మొదటిసారి గుండెపోటుకు గురైనవారు, ఒత్తిడిని సమర్థంగా నియంత్రించుకోగలిగితే 74 శాతం మందిలో రెండో స్ట్రోక్ రాకుండా నివారిం చుకోగలగడం సాధ్యమేనని తేలింది. పైగా ఇలా ఒత్తిడి నియంత్రణ కారణంగా వ్యాధి నిరోధకశక్తి కూడా పెరిగి అది కూడా జబ్బులను దూరం చేస్తుందని నిరూపితమైంది. ఒత్తిడిని అధిగమించడానికి మార్గాలివి...

  • ఒత్తిడికి కారణాన్ని గుర్తించి, దాని నుంచి దూరంగా ఉండాలి. దాంతోపాటు ఒత్తిడిని దూరం చేసుకోడానికి మరికొన్ని ప్రత్యామ్నాయ మార్గాలివి... ? చాలా లోతుగా గాలి పీల్చడం వంటి బ్రీతింగ్ వ్యాయా మాలు చేయడం ? ఏదైనా అంశం తీవ్రంగా బాధపెడుతుండటం లేదా పదే పదే గుర్తుకొస్తూ పశ్చాత్తాపానికి గురిచేస్తుంటే మరింకేదైనా వ్యాపకంలో పడుతూ దాన్ని మరచిపోయి, ఒత్తిడి నుంచి విముక్తం కావడం. 
  • ఒత్తిడికి గురయ్యే క్షణాల్లో చిక్కుకున్నప్పుడు అది తప్పని పరిస్థితి అని, దాని కార ణంగా ఒత్తిడికి గురవుతూ అంతర్మధనానికి లోనుకోవడం కంటే... అది తప్పించుకోలేని పరిస్థితి కాబట్టి, ఆ పరిస్థితుల్లో ఎవరున్నా చేయగలిగింది ఉండదని, కాబట్టి ఆ స్థితిని యథాతథంగా స్వీకరించడం మంచిదని సర్దిచె ప్పుకోవడం 
  • పరిస్థితులను సానుకూల దృక్పథంతో చూడటం, సమస్యల ను అధిగమించాల్సిన కోణంలో పరిశీలించడం వంటి కొన్ని మార్గాల ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చు.ఏ శారీరక లక్షణాల ద్వారా ఒత్తిడి ఉన్నట్లు గుర్తించవచ్చు.
కొన్నిసార్లు తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పటికీ మనకు అది తెలియకపోవచ్చు. కానీ కొన్ని శారీరక లక్షణాలు సైతం ఒత్తిడిని గుర్తించేలా చేస్తాయి. అవి...


1. నిద్రపట్టకపోవడం 
2. ఆకలి లేకపోవడం 
3. కండరాలు బిగుతుగా పట్టేయడం. 
4.మాటిమాటికీ తలనొప్పి 
5. జీర్ణకోశ సమస్యలు
6. దీర్ఘ కాలంగా దిగులు, బాధ లాంటివి ఉండి ఎంతకూ తగ్గకపోవడం. 

ఇవి కనిపిస్తున్నప్పుడు ఆ శారీరకబాధలు చిన్నవే కదా అంటూ నిర్లక్ష్యం చేయకూడదు. వీలైనంత త్వరగా డాక్టర్ను సంప్రదించి మానసిక ఒత్తిడి, శారీరక సమస్యలకు దారితీయకముందే జాగ్రత్తపడాలి.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
ఒత్తిడి అనేది కేవలం మనల్ని ఇబ్బంది పెట్టే ఆ సమయంలోని మానసిక స్థితి మాత్రమే కాదు. దానివల్ల కొన్ని శారీరకమైన మార్పులూ వస్తాయి. ఫలితంగా శరీరం దెబ్బతింటుంది. అది ఎన్ని రకాలుగా జరుగుతుందో చూద్దాం.
ఒత్తిడి కారణంగా వచ్చే పది పాపులర్ సమస్యలు :
1. గుండెజబ్బులు: పైన పేర్కొన్నట్లుగా ఒత్తిడికి గురయ్యేవారిలో దీర్ఘ కాలిక గుండెజబ్బులు ఎక్కువగా ఉండటం చాలా సాధారణమైన విషయం. ఒక్కోసారి ఒత్తిడి గుండెపోటుకు దారితీస్తుందన్న విషయం తెలిసిందే.
2. ఆస్తమా: ఒత్తిడి ఆస్తమాను ప్రేరేపిస్తుందని ఇప్పటికే వైజ్ఞానిక శాస్తపరంగా రుజువైంది. అంతేకాదు... తల్లిదండ్రుల ఒత్తిడి పిల్లలకూ హాని చేస్తుందని తేలింది. ఒకవేళ తల్లిదండ్రులు తీవ్రమైన ఒత్తిడికి గురయ్యేవారే అయితే వారి పిల్లలకు ఆస్తమా వచ్చే అవకాశాలు చాలాఎక్కువని అధ్యయనాల్లో తేలింది. అంటే... తమ
ఒత్తిడి వల్ల వారు తమనే కాకుండా తమ సంతతిని, ముందు తరాలవారినీ బాధిస్తున్నారన్నమాట. గర్భవ
తిగా ఉన్నవారిలో కొందరిని ఎంపిక చేసుకుని ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. వారిలో సగం మందిని ఒత్తిడికి, మరో సగం మందిని కాలుష్యపు పొగకు ఎక్స్పోజ్ అయ్యేలా చేశారు. ఈ అధ్యయన ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. నిజానికి కాలుష్యపు పొగకు గురైన గర్భిణులకు పుట్టిన వారి కంటే... ఒత్తిడికి గురైన గర్భవతులకు పుట్టిన పిల్లల్లో అత్యధికులకు ఆస్తమా సోకింది. 
3. స్థూలకాయం: మన శరీరంలో కొవ్వు పేరుకునే ప్రాంతాల్లో... తొడలు, పృష్టభాగం కంటే పొట్టలో పేరుకునే కొవ్వు వల్ల తీవ్రమైన హాని కలుగుతుంది. కానీ ఒత్తిడి వల్ల పొట్టభాగంలో కొవ్వు పేరుకోవడం ఎక్కువగా జరుగుతుంది. తద్వారా ఆరోగ్య హాని కూడా ఎక్కువేనన్నమాట. అంటే ఒత్తిడి వల్ల రెండు రకాల నష్టాలని గుర్తించాలి. మొదటిది పొట్ట రావడం, రెండోది ఆ పొట్ట వల్ల ఆరోగ్యభంగం జరగడం.
4. డయాబెటిస్: తీవ్రమైన మానసిక ఒత్తిడి... డయాబెటిస్కు దారితీస్తుందన్న విషయం తెలిసిందే. మళ్లీ ఇది రెండురకాలుగా బాధిస్తుంది. డయాబెటిస్ కారణంగా ఆకలి పెరిగి... మనం తినకూడని అనారోగ్యకరమైన పదార్ధలైన వేపుళ్లు, బేకరీ పదార్థాలు తినేలా చేస్తుంది. ఇవి తిన్న తర్వాత రక్తంలో గ్లూకోజ్ పాళ్లు పెరగడం కారణంగా మనం అనారోగ్యానికి గురవుతాం. ఇలా ఒక అనారోగ్యం మరో ప్రతికూలతకూ, ఆ ప్రతికూలత మరో అనారోగ్యానికీ ఒక చక్రంగా సాగిపోతూ అనారోగ్యపు ఊబిలోకి దించుతూపోతుంది.
5. తలనొప్పి: ఒత్తిడివల్ల కొన్ని తలనొప్పులూ, మైగ్రేన్ రావడం సహజం. వాటి కోసం వాడే నొప్పి నివారణ మందులతో కొన్ని దుష్ఫలితాలు రావడం సాధారణం. వాటితో మరింత అనారోగ్యం కలగడం మరింత సర్వసా ధారణం. ఇలా ఒకటికొకటి తోడవుతూ ఆరోగ్యాన్ని మరింతగా దెబ్బతీయడం అన్నది ఒత్తిడి తాలూకు మరో చెడు లక్షణం.
6. డిప్రెషన్, యాంగ్జైటీ: ఒత్తిడికి గురైన వారుఉద్వేగాలకు లోనవుతుంటారు. ఇలాంటివారిలో యాంగ్జైటీ కనిపించడం మామూలే. ఇలా దీర్ఘకా లిక భావోద్వేగాలకు గురయ్యేవారిలో 80 శాతం మంది ఒత్తిడులకు లోనవుతుంటారు. వీరిలో చాలామంది కొంతకాలం తర్వాత తీవ్ర నిరాశ, నిస్పృహలకూ దీర్ఘకాలంలో డిప్రెషన్కు లోనైన దాఖలాలు చాలా ఉన్నాయి.
7. జీర్ణకోశ సమస్యలు: ఒత్తిడికి గురయ్యేవారిలో చాలామంది జీర్ణకోశ సమస్యలకు గురవుతుండటం సాధారణం. వీరిలో చాలామందికి ఒత్తిడికి గురికాగానే కడుపులో యాసిడ్స్ స్రవించి మంట రావడం, అలా మంటలు వచ్చే వారిలో చాలామందికి దీర్ఘకాలంలో కడుపులో అల్సర్స్ కనిపిస్తాయి. ఇలా గ్యాస్ పైకి తన్నేవారికి ఛాతీలో నొప్పి రావడం చాలా సాధారణంగా కని పించే పరిణామం. ఆ సంకేతాన్ని కొన్నిసార్లు గుండెపోటుగా పొరబడటమూ చాలామందిలో చూస్తుంటాం. ఇలా దీర్ఘకాలం గ్యాస్ పైకి ఎగదన్నుతుండేవారు గ్యాస్ట్రిక్ ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ) అనే శారీరక రుగ్మతకూ లోనవుతుంటారు. ఈ దుష్పరిణామాలన్నీ ఒత్తిడి కారణంగానే జరుగుతాయన్న విషయం గుర్తుంచుకోవాలి.
8. అల్జైమర్స్ డిసీజ్: ఒత్తిడి కారణంగా మెదడులో కలిగే గాయాలు తీవ్రమై అల్జైమర్స్ డిసీజ్కు దారితీస్తుందని కొన్ని అధ్యయన ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. పైగా ఒత్తిడి వల్ల అల్జైమర్స్ డిసీజ్ తీవ్రం కావడం చాలా
వేగంగా జరుగుతుంది. అంటే ఒత్తిడి లేనివారిలో అల్జైమర్స్ డిసీజ్ కాస్త ఆలస్యమైతే... ఒత్తిడి వల్ల అది రావాల్సిన సమయం కంటే ముందుగా వచ్చే అవకాశాలూ ఉన్నాయని గుర్తించాలి. పైగా ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ అది తీవ్రమయ్యే వేగం కూడా పెరుగుతుందని గ్రహించాలి.
9. వేగంగా వయసు పైబడటం: ఒత్తిడి వల్ల త్వరగా వృద్ధులైపోయే మరో దుష్పరిణామం కనబడుతోంది. తల్లుల, పిల్లల డీఎన్ఏలను పరిశీలిస్తూ జరిగిన ఒక అధ్యయనంలో ఈ ఫలితాలు స్పష్టమయ్యాయి. ఒత్తిడికి గురైనవారు, తమ తల్లులతో పోలిస్తే వేగంగా వృద్ధాప్య దశకు సమీపించి నట్లు, వారిలో వృద్ధాప్యలక్షణాలు చాలా త్వరగా కనిపించినట్లుగా అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. అంటే... ఒకరు ఆ వయసుకు కనబరచాల్సిన లక్షణాలను 9 నుంచి 17 ఏళ్ల ముందుగానే కనబరుస్తున్నట్లు ఆ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
10. చాలా ముందుగా మరణించడం (ప్రీ-మెచ్యుర్ డెత్) : ఒకరి ఆరోగ్య పరిస్థితిని బట్టి వారిలో మరణం ఎప్పుడు సంభవించవచ్చో కొంతమేరకు అంచనా వేయడం మామూలే. అయితే కొందరిలో మరణించాల్సిన వయసు
కంటే ముందే మరణించడం జరుగుతుంది. అప్పుడు చాలా త్వరగా పోయా రంటూ బాధపడటం మామూలే. ఒత్తిడితో ఇలాంటి మృతులు సంభవించడా న్ని అధ్యయనవేత్తలు చాలా దృష్టాంతాలలో పరిశీలించారు. తీవ్రమైన దీర్ఘ కాలిక ఒత్తిడికి లోనయ్యేవారిలో మరణం చాలా ముందుగా వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.

Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
‘ఒత్తిడి అలా కొనసాగుతూ ... అది ఎలాంటి హానీ చేయకపోతే దాన్ని ఎంతకాలమైనా భరించ గలం’ అనుకునే వాళ్లూ ఉన్నారు. కానీ దురదృష్టం ఏమిటంటే ఒత్తిడి అన్నది కేవలం ఆ సమయానికే పరిమితం కాదు. ఒత్తిడి అప్పటికి తొలగినా... దాని భవిష్యత్ పరిణామాలు మాత్రం వేరుగా ఉంటాయి. దీర్ఘకాలం పాటు కొనసాగుతూ ఉండే ఒత్తిడి అలా అలా వేర్వేరు వ్యాధులకు దారితీస్తుంది. అదీ నిజమైన సమస్య. అందుకే ఏరోజుకు కలిగే ఒత్తిడిని ఆ రోజుకు అలా భరిద్దాంలే అనుకుంటే కుదరదు. అదలా దీర్ఘకాలం పాటు కొనసాగుతూ పోతూ ఉంటే, దాని వల్ల వచ్చే వేర్వేరు వ్యాధులు... అందు వల్లదాన్ని నివారించుకోవాల్సిన ఆవశ్యకత గురించిన అవగాహన కోసం... ఈ కథనం. 

వ్యాధి నిరోధక శక్తిపై ఒత్తిడి ప్రభావం... 
మనకు ఏదైనా గాయం అయినప్పుడు అక్కడ వాపు రావడం, ఎరబ్రారడం (ఇన్ఫ్లమేషన్) వంటి పరిణామాలు జరుగుతాయి. ఇది బాధాకరంగానే ఉన్నా, కాస్త వ్యవధి తర్వాత ఆ ఎరుపూ, మంటా, వాపు వంటివి దానంతట అదే తగ్గడం మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఒత్తిడి తీవ్రంగా ఉన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ను నివారించే శక్తిని మన శరీరం కోల్పోతుంది. ఈ విషయం కార్నెగీ మెలాన్ యూనివర్సిటీకి చెందిన షెల్డన్ కోహెన్ అనే అధ్యయనవేత్త ఆధ్వర్యంలో జరిగిన అధ్యయన ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ అధ్యయన ఫలితాలు నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ తాలూకు మార్గదర్శ కాల్లో చోటుచేసుకున్నాయి కూడా. ఒత్తిడి అన్నది శరీరంపై ఎలా దుష్ర్పభావం చూపుతుందన్న విషయం మొదటిసారిగా స్పష్టమైన తార్కాణాలతో వెల్లడైంది. నిజానికి మనలో ఇన్ఫ్లమేషన్ కలిగిన ప్పుడు కార్టిజోల్ అనే హార్మోన్ విడుదలై, అది వ్యాధి నిరోధక అంశాలను ప్రేరేపిస్తుంది. దాంతో ఆ వ్యాధి నిరోధకతను కలిగించే అంశాలు ఇన్ఫ్లమేషన్ను నియంత్రిస్తాయి. కానీ దీర్ఘకాలపు ఒత్తిడి కారణంగా కార్టిజోల్ అన్న హార్మోన్ స్రవించినా అది సరిగా పనిచేయదు. దాంతో ఒత్తిడి కారణంగా వ్యాధి నిరోధక అంశాలు కార్టిజోల్ వల్ల సరిగా ప్రేరణ చెందవు. ఫలితంగా ఇన్ఫ్లమేషన్ తగ్గదు. అంతే కాదు... ఈ థియరీ మరికొన్ని దృష్టాంతాల ద్వారా కూడా వాస్తవమని తేలింది. సాధారణంగా మనకు జలుబు చేస్తే, ఒకటి రెండు రోజుల తర్వాత దానంతట అదే తగ్గుతుంది. కానీ దీర్ఘకాలం పాటు ఒత్తిడికి గురయ్యే వారిలో జలుబు తగ్గడానికి చాలాకాలం తీసుకుంటుంది. కారణం... ఒత్తిడి ప్రభావం మన వ్యాధినిరోధక అంశాలపై ప్రతికూలంగా పడటమే. ఇలా మానసికమైన ఒత్తిడి కేవలం మానసికంగానే బాధించకుండా క్రమంగా అది శారీరక బాధలైన స్థూల కాయం, గుండెజబ్బులు, అల్జైమర్స్ వ్యాధులు, డయాబెటిస్, డిప్రెషన్, జీర్ణకోశ సమస్యలు, ఆస్తమా వంటి వాటికి దారితీస్తుందని స్పష్టంగా గుర్తించారు.

Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
మనిషి చూడటానికి బాగున్నంత మాత్రాన వారికి ఎలాంటి సుఖవ్యాధులూ లేనట్లు కాదు. చాలామందికి సుఖవ్యాధి ఉన్నా అసలా విషయం వారికి తెలియకపోవచ్చు కూడా. కొందరిలో పైకి ఎలాంటి లక్షణాలూ లేకుండా కూడా సుఖవ్యాధులు ఉండొచ్చు. కొందరిలో లక్షణాలున్నా కూడా వాటిని మూత్రనాళ ఇన్ఫెక్షన్లుగా, ఏదో ఫంగల్‌ ఇన్ఫెక్షన్లుగా పొరబడే అవకాశమూ ఉంటుంది. కాబట్టి కొత్త వారితో లైంగిక సంపర్కం ఏమాత్రం శ్రేయస్కరం కాదు.
ఏరకమైన అనుమానం ఉన్నా అరమరికలు, దాపరికాలు లేకుండా భాగస్వామితో మాట్లాడటం, సంభోగానికి ముందు సురక్షిత విధానాల చర్చించటం మంచిది. 'మనకు ఇలాంటి సమస్యలు రావులే' అన్న లేనిపోని భరోసా పెట్టుకోవద్దు. సుఖవ్యాధులు ఎవరికైనా, ఏ వయసులోనైనా రావచ్చు. మీరు ప్రతిసారీ ఒక్క భాగస్వామితోనే సంభోగంలో పాల్గొంటుండొచ్చుగానీ.. ఆ భాగస్వామికి ఇతరులతో సంబంధాలు లేవన్న భరోసా కష్టం. కాబట్టి ఎవరితోనైనా తగు జాగ్రత్తలు ముఖ్యం. యోని సంభోగమే కానవసరం లేదు.. మలద్వార సంభోగం, అంగచూషణం వంటివి కూడా సుఖవ్యాధులు సంక్రమించటానికి మార్గాలే!

సుఖవ్యాధులకు సంబంధించి ఏ కొంచెం అనుమానంగా ఉన్నా ప్రామాణికమైన చికిత్స అందించే వైద్యులకు చూపించుకుని, పరీక్షలు చేయించుకోవటం మంచిది. అంతేగానీ నాటువైద్యుల వంటివారిని ఆశ్రయించటం మంచిది కాదు.

కండోమ్‌ వాడకం చాలా విధాలుగా శ్రేయస్కరం. కానీ ప్రపంచవ్యాప్తంగా సుఖవ్యాధుల నివారణ విషయంలో కండోమ్‌ల ప్రాధాన్యాన్ని చాలామంది గుర్తించటం లేదని అధ్యయనాలు ఘోషిస్తున్నాయి. చాలామంది కండోమ్‌లను కేవలం గర్భనిరోధక సాధనాలుగానే గుర్తిస్తున్నారు. సుఖవ్యాధుల నివారణ విషయంలో వీటికి ఉన్న ప్రాధాన్యం చాలా ఎక్కువ. వీటితో గనోరియా, క్లమీడియా, ట్రైకోమొనియాసిస్‌ వంటి చాలా రకాల సుఖవ్యాధులను నివారించుకోవచ్చు. ప్రతిసారీ, సక్రమంగా వాడుతుంటే కండోమ్‌లతో 98% వరకూ సుఖవ్యాధులను నివారించుకోవచ్చు. ప్రతిసారీ కండోమ్‌ వాడుతున్నాం కదా అనుకుంటూ ఒక్కసారి దాన్ని నిర్లక్ష్యం చేసినా సుఖవ్యాధి సంక్రమించొచ్చు. కాబట్టి ప్రతిసారీ సురక్షితచర్యలు తీసుకోవటం ముఖ్యమని తెలుసుకోవాలి.

జననాంగాల మీద పుండ్లు, రసి, దద్దు, స్రావాల వంటి అసహజ లక్షణాలున్న వారితో సంభోగానికి దూరంగా ఉండటం మంచిది. కొత్తవారితో సంభోగానికి దూరంగా ఉండటం అవసరం. ఎందుకంటే గనోరియా వంటి వ్యాధులున్నా కూడా మహిళల్లో పైకి ఎలాంటి లక్షణాలూ కనబడకపోవచ్చు. అలాగే పురుషుల్లో కూడా చాలా సుఖవ్యాధుల లక్షణాలు కనబడకపోవచ్చు. కానీ వారి నుంచి సంక్రమించే అవకాశాలు ఉంటాయి.

సుఖవ్యాధి ఏదైనా ఉందని గుర్తించిన తర్వాత.. అది పూర్తిగా తగ్గే వరకూ వైద్యుల సలహా లేకుండా సంభోగంలో పాల్గొన వద్దు. భాగస్వాములిద్దరూ వైద్యులను సంప్రదించటం అవసరం. సుఖవ్యాధులకు చికిత్స సూచిస్తే ఆ చికిత్స పూర్తయిన తర్వాత మళ్లీ వైద్యులను కలిసి, పూర్తిగా నయమైందని నిర్ధారించుకోవటం ముఖ్యం.

ఎదిగే పిల్లలకు సురక్షిత శృంగార పద్ధతుల గురించి, ప్రయోగాలు చేస్తే పొంచి ఉండే ప్రమాదాల గురించి తెలియజెప్పటం చాలా అవసరం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా సుఖవ్యాధుల వ్యాప్తి యుక్తవయసు వారిలోనే చాలా ఎక్కువగా కనబడుతోంది.

హెపటైటిస్‌-బి, హెపీవీ వంటివి సంక్రమించకుండా ఇప్పుడు టీకాలు అందుబాటులోకి వచ్చాయి. వైద్యుల సలహా మేరకు వీటిని పిల్లలకు, యుక్తవయస్కులకు ఇప్పించటం అన్ని విధాలా శ్రేయస్కరం.

సుఖ వ్యాదుల పై అవగాహనా                                                            సుఖ వ్యాదులు - వాటి పేర్లు   
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language

వైరస్‌ల కారణంగా వచ్చే ఈ వ్యాధులను అదుపులో పెట్టేందుకైతే మందులున్నాయి గానీ.. వీటిని శరీరం నుంచి పూర్తిగా నిర్మూలించి, సంపూర్ణంగా నయం చేయటం కష్టం.
హెర్పిస్‌
ఇది హెర్పిస్‌ సింప్లెక్స్‌ టైప్‌-2 అనే వైరస్‌ మూలంగా వస్తుంది. దీని బారినపడ్డ వారితో సెక్స్‌లో పాల్గొంటే.. 2-7 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. ముందుగా పురుషాంగం మీద, స్త్రీ జననావయాల మీద నీటి పొక్కుల్లాంటివి వస్తాయి. తర్వాత ఇవి చితికి పుండ్లు పడతాయి. చికిత్స తీసుకుంటే అప్పటికి తగ్గినప్పటికీ.. ఒంట్లో రోగనిరోధక శక్తి తగ్గినప్పుడల్లా ఈ పొక్కులు మళ్లీ మళ్లీ వస్తుండటం గమనార్హం. హెర్పిస్‌కు సకాలంలో చికిత్స తీసుకోకపోతే వైరస్‌ శరీరంలోని ఇతర భాగాలకూ వ్యాపిస్తుంది. దీంతో మెదడు పొరల వాపు, నడుము వద్ద నాడులు దెబ్బతినటం, పురుషుల్లో నంపుసకత్వం కూడా రావొచ్చు. గర్భిణులకైతే అబార్షన్‌ ముప్పూ పెరుగుతుంది. ఇది తల్లి ద్వారా బిడ్డకు సంక్రమించి రకరకాల సమస్యలు తెచ్చిపెడుతుంది.

జననాంగాలపై పులిపిర్లు
వీటినే 'వైరల్‌ వార్ట్స్‌' అంటారు. ఇవి హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ (హెచ్‌పీవీ) కారణంగా వస్తాయి. సెక్స్‌లో పాల్గొన్న ఐదారు నెలల్లో జననావయాలపై పులిపిర్లు వస్తాయి. రోగనిరోధకశక్తి తక్కువగా గలవారిలో నెల లోపే బయటపడొచ్చు. దీనివల్ల రకరకాల బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లు తేలికగా వస్తాయి కూడా. సమస్య తీవ్రమైతే మూత్రం నిలిచిపోవచ్చు. కొన్నిరకాల పులిపిర్లు మూత్ర మార్గంలోనూ పెరుగుతాయి. వీటితో జననావయాల్లో క్యాన్సర్ల ముప్పూ ఎక్కువ అవుతుంది. స్త్రీలల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లలో దాదాపు 40% వీటి మూలంగా వచ్చేవే.
హెచ్‌ఐవీ
ఎయిడ్స్‌ కారక హెచ్‌ఐవీ ముఖ్యంగా సెక్స్‌ ద్వారానే సంక్రమిస్తుంది. పరీక్షల్లో వైరస్‌ సోకినట్టు బయటపడినా కొన్ని సంవత్సరాల వరకూ పైకి ఎలాంటి లక్షణాలూ కనబడకపోవచ్చు. దీనివల్ల ఒంట్లో రోగనిరోధక శక్తి వేగంగా తగ్గిపోయి రకరకాల జబ్బులు, ఇన్‌ఫెక్షన్లు చుట్టుముడతాయి.

హెపటైటిస్‌-బి
సెక్స్‌తో పాటు ఇతరత్రా మార్గాల్లోనూ ఈ వైరస్‌ వ్యాపిస్తుంది. పైకి ఎలాంటి లక్షణాలూ కనబడవు. కానీ దీర్ఘకాలంలో కాలేయాన్ని దెబ్బతీస్తుంది. ఫలితంగా కామెర్లు, లివర్‌ గట్టిపడటం, లివర్‌ క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక సమస్యలు చుట్టుముడతాయి.

మొలస్కం కంటేజియాజం
ఇది 'పాక్స్‌ వైరస్‌' ద్వారా సంక్రమిస్తుంది. దీనిలో అంగం మీద మధ్యలో ఉబ్బెత్తుగా ఉండి, ముత్యపు రంగులో మొటిమల్లాంటి పొక్కులు వస్తాయి. ఇది అంత ప్రమాదకరమైంది కాకపోయినా బాగా ఇబ్బంది పెడుతుంది.

బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లు
సమర్థవంతమైన యాంటీబయాటిక్స్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లను నయం చేసే అవకాశమైతే ఉంది గానీ.. ఇవి బాగా ముదిరితే ఇతరత్రా చాలా దుష్ప్రభావాలు జీవితాంతం బాధించొచ్చు.

సిఫిలిస్‌
ట్రిపనోమా పాలిడమ్‌ అనే బ్యాక్టీరియా మూలంగా ఇది వస్తుంది. సెక్స్‌లో పాల్గొన్న తర్వాత 9-90 రోజుల్లో దీని లక్షణాలు ఆరంభమవుతాయి. ముందుగా అంగం మీద మచ్చలా వస్తుంది. తర్వాత పుండుగా మారుతుంది. నొప్పి ఉండదు. చికిత్స తీసుకోకపోయినా కొద్దిరోజులకు పుండు తగ్గిపోతుంది. రెండు మూడు నెలల తర్వాత రెండో దశలో ఒంటి మీద దద్దుర్లు వస్తాయి. దురద ఉండదు. కీళ్లనొప్పులు, నోటిలో పుండ్లు, కంజెక్టివైటిస్‌, తల వెంట్రుకలు రాలిపోవటం వంటి లక్షణాలు కనబడతాయి. కొందరిలో జ్వరం, కామెర్లు, లింఫ్‌ గ్రంథుల్లో వాపూ ఉండొచ్చు. చికిత్స తీసుకోకపోతే కొన్నేళ్ల తర్వాత ఒంటి మీదా, నాలుక పైనా, ఇంకా శరీరం లోపలి అవయవాలపైనా పెద్ద పెద్ద పుండ్లు పడొచ్చు. జబ్బు లోపల్లోపలే ముదిరిపోతే సిఫిలిస్‌ బారినపడ్డ పదేళ్లకు కొన్ని రకాల గుండెజబ్బులూ వస్తాయి.

గనోరియా
దీనికి మూలం నైసీరియా గనోరియా అనే బ్యాక్టీరియా. సెక్స్‌లో పాల్గొన్న 2-5 రోజుల్లో దీని లక్షణాలు కనిపిస్తాయి. మూత్రంలో మంట, మూత్ర విసర్జనలో నొప్పి, మూత్ర మార్గం నుంచి చీము, స్త్రీలల్లో తెల్లమైల వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొద్దిరోజుల తర్వాత మూత్రం నిలిచిపోవటం, మూత్రమార్గం సన్నబడి కుంచించుకుపోవటం, మూత్ర మార్గానికి రంధ్రం పడి దానిలోంచి మూత్ర విసర్జన కావటం వంటి సమస్యలు ముంచుకొస్తాయి. అంతేకాదు.. పురుషుల్లో వంధ్యత్వం, స్త్రీలల్లో పెలోపియన్‌ ట్యూబులు మూసుకుపోవటం లాంటి సమస్యలూ రావొచ్చు. ఈ బ్యాక్టీరియా కీళ్లు, గుండె, కళ్ల వంటి భాగాలకూ చేరితే రకరకాల సమస్యలు మొదలవుతాయి. స్త్రీలల్లో పొత్తికడుపు నొప్పి, తెల్లమైల అధికం కావటం, నెలసరి క్రమం తప్పిపోవటం, నడుము నొప్పి లాంటి సమస్యలు కూడా వస్తాయి.

ఖాంక్రాయిడ్‌
హీమోఫిలస్‌ డుక్రియీ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. సెక్స్‌లో పాల్గొన్న 2-7 రోజుల్లో జననావయావల మీద ఎక్కువ సంఖ్యలో పుండ్లు పడతాయి. నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. గజ్జల్లో బిళ్ల కట్టినట్టు వాపు కనిపిస్తుంది. పురుషాంగం మీది చర్మం కదలికలు బిగుసుకుపోతాయి. మూత్ర విసర్జన కూడా ఇబ్బందిగా ఉంటుంది.

క్యాండిడియాసిస్‌
ఇది ఫంగస్‌ కారణంగా వచ్చే సమస్య. దీన్ని పూర్తిగా నయం చెయ్యొచ్చు. ప్రధానంగా 'క్యాండిడా అల్బికాన్స్‌' అనే సూక్ష్మజీవి మూలంగా వస్తుంది. జననాంగాలపై పూత రావటం దీని లక్షణం. పురుషుల్లో అంగంపై ఎర్రటి పూత, స్త్రీలల్లో పెరుగులా చిక్కగా తెల్ల మైల అవుతుంటుంది. బయటి సంబంధాలు లేకున్నా భార్యాభర్తల్లో కూడా ఇది ఒకరి నుంచి మరొకరికి సంక్రమించొచ్చు.

ట్రైకోమొనియాసిస్‌
ఇది ట్రైకోమొనాస్‌ వజైనాలిస్‌ అనే సూక్ష్మక్రిమి వల్ల వస్తుంది. ఇది సంక్రమిస్తే పురుషులకు అంగంలో ఏదో చెప్పలేని అసౌకర్యం (టింగ్లింగ్‌ సెన్సేషన్‌) కలుగుతుంది. స్త్రీలల్లో తెల్లమైల, యోనిలో మంట, దురద వంటివి కనబడతాయి. ఇది భార్యాభర్తల్లో ఒకరి నుంచి మరొకరికీ సంక్రమిస్తుంది కూడా.

సుఖ వ్యాదుల పై అవగాహనా                                                             సుఖ వ్యాధులనివారణ మార్గాలు    
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
'సుఖవ్యాధులు’ వీటి గురించి బయటకు చెప్పుకోలేక.. ఆ బాధ అనుభవించలేక ఎంతోమంది నిత్యం నరకం చూస్తున్నారు. ఇవి లైంగికంగా సంక్రమించే సమస్యలు కాబట్టి వీటి గురించి వైద్యులను సంప్రదించేందుకు కూడా వెనకాడుతుంటారు. దీంతో ఇవి ముదిరిపోయి.. భాగస్వాములకు కూడా అంటుకుని.. అంతిమంగా సంసారం దుర్భరంగా తయారవుతుంది. అందుకే సుఖవ్యాధుల విషయంలో దాపరికాలు మంచివి అవి.

ఒకప్పుడు సిఫిలిస్‌, గనోరియా వంటి బ్యాక్టీరియా కారణంగా సంక్రమించే సుఖవ్యాధులు మానవాళిని భయంకరంగా కబళించాయి. అయితే శక్తిమంతమైన యాంటీబయాటిక్స్‌ కనిబెట్టిన తర్వాత ఇక సుఖవ్యాధులను జయించటం చాలా తేలిక అనుకున్నారు అంతా. అది కొంత నిజం కూడా. కానీ ఆశ్చర్యకరంగా ఇప్పుడు వైరస్‌ల ద్వారా వ్యాపించే సుఖవ్యాధులు విపరీతంగా ప్రబలిపోతున్నాయి. వీటిని నిర్మూలించటం మహా కష్టం. నియంత్రించటమూ తేలిక కాదు. మరోవైపు ఒకప్పుడు యాంటీబయాటిక్స్‌కు తేలికగా లొంగిన సుఖవ్యాధులు కూడా ఇప్పుడు వాటికి ఏమాత్రం లొంగకుండా.. మొండిగా తయారవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా అసలు సుఖవ్యాధులు దరిజేరకుండా పూర్తి సురక్షితమైన లైంగిక పద్ధతులు పాటించటం ఒక్కటే సరైన మార్గం.
సుఖవ్యాధులతో పెద్ద చిక్కేమంటే చాలా సందర్భాల్లో భాగస్వాములు ఇద్దరూ ఒకే సమయంలో చికిత్స తీసుకుంటేనే వాటిని పూర్తిగా నియంత్రించటం సాధ్యమవుతుంది. లేకపోతే అవి ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తూ... ఓ విష వలయంలా, విడదీయలేని చిక్కుముడిలా తయారవుతాయి. సుఖవ్యాధులు రావటానికి వైరస్‌లు, బ్యాక్టీరియా, ఫంగస్‌.. ఇలా రకరకాల సూక్ష్మక్రిములు కారణం కావచ్చు. ఒకసారి ఒంట్లో చేరితే.. పూర్తిగా నయం కానివీ చాలానే ఉన్నాయి. అందువల్ల సుఖవ్యాధుల విషయంలో చికిత్స కన్నా నివారణే ప్రధానమని వైద్యరంగం ఎప్పటి నుంచో హెచ్చరిస్తూనే ఉంది. దీనికోసం ఉత్తమమైన లైంగిక పద్ధతులేమిటో, సురక్షిత విధానాలేమిటో విస్తృతంగా ప్రచారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సుఖవ్యాధులంటే ఇప్పటికీ చాలామంది చాలామంది సిఫిలిస్‌, గనోరియా వంటివాటినే గుర్తుచేసుకుంటూ ఉంటారు. నిజానికి ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌, హెపటైటిస్‌ వంటివి వీటిల్లో భాగమేనని మరువకూడదు.

బ్యాక్టీరియా ద్వారా సంక్రమించే సిఫిలిస్‌, గనేరియా, క్లమీడియా, ట్రైకోమొనాసిస్‌ వంటి సుఖవ్యాధులకు ఇప్పుడు మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే తొలిదశలో సరైన చికిత్స తీసుకోకపోతే దీర్ఘకాలంలో ఇవి కూడా చాలా ప్రమాదాలు తెచ్చిపెడతాయి. వైరస్‌ల కారణంగా వచ్చే హెర్పిస్‌ పొక్కులు, పులిపుర్ల వంటి సమస్యలకు ఇప్పటికీ పూర్తిస్థాయి చికిత్స లేదు. ఇవి రాన్రానూ మహా మొండిగా తయారవుతున్నాయి కూడా. ఇక లైంగిక సంబంధాల ద్వారా వ్యాపించే హెపటైటిస్‌-బి వంటి వైరల్‌ వ్యాధులు కాలేయాన్ని కూడా దెబ్బతీస్తాయి. ఇలాంటి వైరల్‌ వ్యాధులను పూర్తిగా నయం చేసే చికిత్స అందుబాటులో లేకపోవటం వల్ల నివారణ ఒక్కటే సరైన మార్గం.

ఇంకా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందేమంటే- హెర్పిస్‌, సిఫిలిస్‌ వంటి సుఖవ్యాధులున్న వారికి హెచ్‌ఐవీ సోకే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయని అధ్యయనాల్లో గుర్తించారు. కాబట్టి సుఖవ్యాధులను ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యటానికి లేదు.

శరీర నిర్మాణపరంగా స్త్రీలకు సహజంగానే సుఖవ్యాధులు సంప్రాప్తించే అవకాశం ఎక్కువ. పైగా వీరికి సుఖవ్యాధులు సోకినా వెంటనే పెద్దగా లక్షణాలేమీ కనబడకపోవచ్చు కూడా. దీంతో వ్యాధి బాగా ముదిరే వరకూ కూడా చాలామంది వైద్యసహాయం తీసుకోవటం లేదు. కొన్ని రకాల సుఖవ్యాధుల మూలంగా దీర్ఘకాలంలో తీవ్రమైన పొత్తికడుపు నొప్పి, సంతాన రాహిత్యం, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ వంటివి ముంచుకొచ్చే ప్రమాదం ఉంటుంది. కొన్నిరకాల సుఖవ్యాధుల బారినపడిన స్త్రీలకు పుట్టే బిడ్డలకూ ఆ ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి సుఖవ్యాధుల విషయంలో స్త్రీలు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండటానికి వీల్లేదు.

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో దాదాపు 25 ఏళ్లకే యువతీ యువకులు ఏదో ఒక రకమైన సుఖవ్యాధి బారిన పడుతున్నారని, పైగా ఆ విషయాన్ని వారు గుర్తించే పరిస్థితి కూడా ఉండటం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. చాలా దేశాల్లో సుఖవ్యాధులు 15-24 ఏళ్ల మధ్య వయసు వారిలో వేగంగా వ్యాపిస్తున్నాయి. అందుకే చాలా దేశాల్లో ఇప్పుడు సుఖవ్యాధులకు తరచూ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. బయటి వ్యక్తులతో అసురక్షిత శృంగారంలో పాల్గొన్న వారు తప్పకుండా హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకోవాలనీ సూచిస్తున్నారు.

శృంగారం అంటే కేవలం సంభోగమే కావాల్సిన అవసరం లేదు. సిఫిలిస్‌, హెర్పిస్‌, హెచ్‌ఐవీ వంటివి ముద్దులు, అంగచూషణం వంటి వాటి ద్వారానూ వ్యాపించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో నమ్మకమైన జీవిత భాగస్వామితో తప్ప ఇతరులతో లైంగిక సంబంధాలు పెట్టుకోక పోవటం మంచిది. సుఖవ్యాధులు రాకుండా చూసుకోవటానికి దీన్ని మించిన మార్గం మరోటి లేదు. ఒకవేళ ఇతరులతో ఎప్పుడైనా సెక్స్‌లో పాల్గొంటే తప్పనిసరిగా కండోమ్‌ ధరించాలి. భార్యాభర్తల్లో ఎవరికైనా జననాంగాల వద్ద ఇబ్బందిగా అనిపించినా, ఇతరత్రా లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ని సంప్రదించటం మేలు. నిర్లక్ష్యం చెయ్యకుండా చికిత్స తీసుకోవాలి. మందులు కూడా పూర్తికాలం వేసుకోవాలి. దీర్ఘకాలిక దుష్ప్రభావాల నివారణకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది.

వైరల్‌ వ్యాధులు  వాటి పేర్లు                                                                 సుఖ వ్యాధులనివారణ మార్గాలు      
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
మగవాళ్లు ఎందుకు అబద్ధాలు చెబుతారు? సాహసాలు చేయటానికి ముందుకెందుకు దూకుతారు? భావోద్వేగాలను వ్యక్తం చేయకుండా లోపలే ఎందుకు దాచుకుంటారు? వీటన్నింటికీ టెస్టోస్టీరాన్‌ హార్మోన్‌ ప్రభావమే కారణమని చెబుతున్నారు అమెరికా సైకియాట్రిస్ట్‌లు. వారు ఆడవారు, మగవారి ఆలోచనలు, ప్రవర్తనలకు గల తేడాలను విశ్లేషించారు. అందుకు కారణమవుతున్న అంశాలనూ వివరించారు.  అందులో కొన్ని విషయాలు మీ కోసం..


  • గర్భంలో ఉండగానే ఎనిమిదో వారం నుంచే మగశిశువు మెదడుపై టెస్టోస్టీరాన్‌ ప్రభావం పడుతోంది. దీంతోనే అబద్ధాలు ఆడటం, సాహసం చేయటం, భావోద్వేగాలను అణచుకోవటం వంటి లక్షణాలకు బీజం పడుతోంది.
  • యుక్తవయసులో మగపిల్లలు ఇతరులను ఎక్కువగా విమర్శిస్తుంటారు. అన్నింటి పైనా త్వరగా ఆసక్తి కోల్పోతుంటారు. మెదడును టెస్టోస్టీరాన్‌ ఎక్కువగా ప్రభావితం చేయటం వల్ల.. అసాధారణమైన భావోద్వేగాలు మాత్రమే వారిని ఉత్తేజితం చేయగలుగుతాయి. అందుకే ఉద్వేగభరితమైన వీడియోగేమ్‌లను ఆడేందుకు మగపిల్లలు ఇష్టపడుతుంటారు.
  • సంభోగానంతరం ఆనందాన్ని కలగజేసే ఆక్సిటోసిన్‌ హార్మోన్‌ హైపోథాలమస్‌లోకి విడుదల అవుతుంది. దీని ప్రభావంతో ఆడవాళ్లు తమ భాగస్వాములను హత్తుకోవాలని, మాట్లాడాలని భావిస్తుంటే.. మగవారిలో ఇది నిద్ర మాత్రలా పనిచేసి మగతను కలిగిస్తుంది. అందుకే వారు శృంగారంలో పాల్గొన్న తర్వాత వెంటనే నిద్రపోతుంటారు.
  • ఎవరైనా ఏదైనా సమస్యను మగవారికి చెప్పగానే సానుభూతికి బదులు ఏదో ఒక పరిష్కారాన్నే సూచిస్తుంటారు. మెదడులోని టెంపోరల్‌ పార్షల్‌ జంక్షన్‌ వ్యవస్థ చురుగ్గా పనిచేసి విశ్లేషణకు పురికొల్పటమే ఇందుకు కారణమవుతోంది. ఆ సమయంలో ఈ జంక్షన్‌. భావోద్వేగాలను రేకెత్తించే భాగంపై ఆధిపత్యం చెలాయిస్తుంది.
  • అయితే ఆడవారిలో ఇందుకు వ్యతిరేకంగా జరుగుతుంది. అందుకే స్త్రీలు పరిష్కారాలను సూచించే తార్కికత కంటే భావోద్వేగాలకే ఎక్కువ లోనవుతుంటారు.
  • కాబోయే తండ్రుల్లో టెస్టోస్టీరాన్‌ హార్మోన్‌ స్థాయి పెరుగుతుంది. అదే సమయంలో ప్రోలాక్టిన్‌ హార్మోన్‌ స్థాయి పడిపోతుంది. కాబోయే తల్లుల చర్మం నుంచి విడుదలయ్యే ఫెర్మోన్స్‌కు ప్రతిస్పందించటం వల్లే ఇలా జరగుతుండొచ్చు. ఇదే సమయంలో మెదడులో శబ్దాలను వినే భాగం మరింత చురుకుగా మారుతుంది.
  • అందువల్లే పిల్లల ఏడ్పును త్వరగా వినగలుగుతారు. పిల్లలు పుట్టే సమయానికి వారిని కనిపెట్టుకొని ఉండటంలో మగవారు ప్రధాన బాధ్యత తీసుకునే స్థాయికి చేరుకుంటారు.


Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
జుట్టు తల మీద ఒత్తుగా.. నల్లగా నిగనిగలాడాలనే మహిళలంతా కోరుకుంటారు. అందాన్ని, ఆకర్షణను తెచ్చిపెట్టే దీన్ని సంరక్షించుకోవటానికి రకరకాల పద్ధతులూ పాటిస్తుంటారు. కానీ అవే వెంట్రుకలు ముఖం మీద మొలిచి అందాన్ని దెబ్బతీస్తుంటే? 
మనసులో తీవ్ర వేదన మొదలవుతుంది. అనుక్షణం ఆలోచనలన్నీ దాని చుట్టే తిరుగుతూ ఆందోళనకు దారితీస్తుంది. నిజానికి మహిళలకు పెదవులు, చుబుకం, ఛాతీ, కడుపు, వెన్ను వంటి భాగాల మీద వెంట్రుకలు చాలా సూక్ష్మంగా.. కంటికి కనిపించని విధంగానే ఉంటాయి. కానీ కొందరిలో మాత్రం ఇవి గుబురుగా పెరుగుతూ నల్లగా స్పష్టంగా కనిపించటం చూస్తుంటాం. ఈ సమస్యను 'హిర్సుటిజమ్‌' అంటారు. సాధారణంగా స్త్రీలల్లో పురుష హార్మోన్లు (ఆండ్రోజెన్స్‌) తక్కువ మోతాదులోనే ఉత్పత్తి అవుతాయి. ఒకవేళ ఈ హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అయితే అవాంఛిత రోమాలు పెరగటం మొదలవుతుంది. ఇలా జరగటానికి కారణాలు అనేకం.
అయితే చాలామందిలో పాలీసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌ (పీసీఓఎస్‌) సమస్య అవాంఛిత రోమాలు పెరగటానికి కారణమవుతోంది. చూడటానికి ఇబ్బంది తప్పించి అవాంఛిత రోమాలన్నది చాలాసార్లు హానికరమైన సమస్యేమీ కాదు. అధికబరువు గలవారు బరువు తగ్గితే ఈ వెంట్రుకలు పెరగటమూ తగ్గుతుంది. బ్లీచింగ్‌ చేసుకోవటం ద్వారా వీటిని అంతగా కనిపించకుండా చూసుకోవచ్చు. షేవింగ్‌ చేసుకుంటే మరిన్ని వెంట్రుకలు మొలుస్తాయని అనుకుంటారు కానీ అది నిజం కాదు. కాకపోతే వెంట్రుకలు దట్టంగా కనిపిస్తాయి. ప్లకింగ్‌, ట్వీజింగ్‌, వ్యాక్సింగ్‌ సురక్షితమైన, చవకైన ప్రక్రియలు. అయితే వీటితో నొప్పి కలుగుతుంది. అలాగే మచ్చలు, వాపు, చర్మం నల్లబడటం, కొన్నిసార్లు చీముపట్టి ఇన్ఫెక్షన్లు రావటం వంటి ముప్పులూ ఉంటాయి. అవాంఛిత రోమాలను శాశ్వతంగా తొలగించే ఎలక్ట్రాలసిస్‌, లేజర్‌ వంటి ప్రక్రియలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. నిపుణులతో చికిత్స చేయించుకుంటే మంచి ఫలితం కనబడుతుంది.

Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
వృద్ధుల్లో తికమక పడడం, మతి మరుపు వంటి లక్షణలు సహజంగా కనిపించేవే గానీ ఇందుకు బీ12 విటమిస్ లోపమూ కారణం అవుతుండొచ్చని మీకు తెలుసా? ఎందుకంటే వయసు మీద పడుతున్నకొద్దీ మనం తీసుకునే ఆహారంలోని బీ12 విటమిస్ను గ్రహించే శక్తి కూడా తగ్గుతుంది. ఇది బీ12 లోపానికి దారితీస్తుంది. పైకి ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే ఈ లోపం ఎక్కువవుతుండొచ్చు. దీంతో తికమకపడం, మతిమరుపు వంటి లక్షణలు కనిపిస్తాయి. ఇలాంటివి వృద్ధుల్లో కనిపిస్తే వయసుతో పాటు వచ్చే లక్షణలుగానే చాలమంది పొరపడుతుంటారు. 


మన నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటనికి, ఎర్ర రక్తకణాల తయారీకి బీ12 విటమిస్ తప్పనిసరి. దీని లోపం కొద్ది మోతాదులోనే ఉంటే కండరాల బలహీనత, నిస్సత్తువ, వణుకు, మూత్రం ఆపుకోలేకపోవం, రక్తపోటు తక్కువ కావడం, కుంగుబాటు(డిప్రెషన్), మతిమరుపు వంటి గ్రహణ సమస్యలు తలత్తుతాయి. ఇక లోపం మరీ తీవ్రమైతే మాత్రం రక్తహీనతకు దారితీస్తుంది. అన్ని బీ విటమిన్ల మాదిరిగానే బీ12 కూడా నీటిలో కరుగుతుంది. అయితే మోతాదు ఎక్కువగా ఉంటే దీన్ని మన శరీరం.. కాలేయం, కణజాలల్లో నిల్వ చేసుకుంటుంది. అందువల్ల ఆహారం ద్వారా తగినంత బీ12 తీసుకోకపోయినా చాలకాలం పాటు రక్తంలో దీని మోతాదు తగ్గినట్లు కనిపించదు. ఒకవేళ నిల్వ మోతాదు తక్కువగా ఉంటే చాల త్వరగానే బీ12 లోపం కనబడొచ్చు. పిల్లల్లోనైతే అంతకన్నా ముందుగానే ప్రభావం చూపుతుంది. 

వేటి ద్వారా లభిస్తుంది? 

ఆహారం పదార్థాల్లోకేవలం మాంసంలో.. ముఖ్యంగా కాలేయంలో బీ12 అధిక మొత్తంలో ఉంటుంది. సుమారు 100 గ్రాముల కాలేయం ద్వారా 83 మైక్రోగ్రాముల విటమిస్ లభిస్తుంది. చేపలు, షెల్ఫిషలో కూడా ఎక్కువగానే ఉంటుంది. పాల పదార్థాలు, గుడ్లు లలోకాస్త తక్కువ.

మాంస పదార్థాల్లో ఈ బీ12 విటమిస్ ప్రోటన్లతో కలిసిపోయి ఉంటుంది. జీర్ణాశయంలోని ఆమ్లం ఇది విడుదలయ్యేల చేస్తుంది. అయితే వయసుతో పాటే జీర్ణాశయంలోని ఆమ్లం స్థాయీ తగ్గుతుండం వల్ల వృద్ధాప్యంలో బీ12ను గ్రహించే శక్తీ మందగిస్తుంది. ఇక శాకాహారంలో బీ12 చాల తక్కువగా ఉండమే కాదు.. దీన్ని శరీరం సరిగా గ్రహించలేదు కూడా. కాబట్టి పూర్తి శాకాహారులు, వృద్ధులు వైద్యుల సలహా మేరకు బీ12 మాత్రలు వేసుకోవం తప్పనిసరని నిపుణులు సూచిస్తున్నారు.

Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
ఈ మధ్య మీకు కారణం తెలియకుండానే తలనొప్పి వేధిస్తోందా? దీనికేమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది మీ విధి నిర్వహణలో భాగంగా తలెత్తిన ఒత్తిడి. దీన్ని పట్టించుకోకపోతే డిప్రెషన్‌లోకీ దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

భారత పరిశ్రమల అనుబంధ సంస్థ- అసోచామ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఒక సర్వేలో.. మనదేశంలో పలురంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో మానసిక ఒత్తిడి, బడలిక అధికంగా ఉంటున్నట్లు గుర్తించారు. భారతీయ ఉద్యోగివర్గంలో ఇంటికీ, ఆఫీసు పనికీ మధ్య తేడా చెదిరిపోతున్నట్లు తేల్చారు. పనివేళలు ఎక్కువవ్వటం, అసాధారణ పని వేళల్లో విధులు నిర్వర్తించాల్సి రావటం వంటివన్నీ మానసిక ఒత్తిడులను అంతకంతకూ పెంచుతూ పలురకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

ఒత్తిడి డిప్రెషన్‌కు కారణమవ్వటం మామూలే కానీ.. ఇది తీవ్రమైన తలనొప్పి వంటి సమస్యలకూ దారి తీస్తున్నట్లు గుర్తించారు. ఇలాంటి తలనొప్పులకు స్పష్టమైన కారణం కూడా తెలియటం లేదని పేర్కొంటున్నారు. తలనొప్పితోపాటు కాళ్లూ చేతుల్లో నొప్పులు, నిద్రలేమి, ఆకలి తగ్గటం, మహిళల్లోనైతే ఎక్కువెక్కువగా తినెయ్యటం వంటి సమస్యలు సృష్టిస్తున్నట్లు గుర్తించారు. 

అకస్మాత్తుగా ఇలా తలనొప్పి, కాళ్ల నొప్పుల వంటివి వేధిస్తున్నప్పుడు తరచూ ఆఫీసు వదిలి ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుండటం ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. ఎన్ని రకాల పరీక్షలు చేయించుకున్నా ఈ తరహా నొప్పులకు కారణాలేమిటనేది వైద్యులు సైతం గుర్తించలేకపోతున్నారు. ఎంతకీ అంతుచిక్కని పలురకాల నొప్పులు, దేనిపైనా ఆసక్తి లేకపోవటం, నీరసం వంటివి సతాయిస్తున్నప్పుడు ఇవన్నీ విధి నిర్వహణకు సంబంధించిన సమస్యలుగా అనుమానించాలని మానసిక నిపుణులు అంటున్నారు. 

అధిక వేతనాలు, పెరుగుతున్న కోర్కెలు, తీవ్రస్థాయి పోటీతత్వం, బాగా సంపాదించాలనే కాంక్ష.. వంటివన్నీ భారతీయ ఉద్యోగుల్లో ఒత్తిడులను పెంచుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చేసే పనినీ, పనిచేసే చోటునీ ఆస్వాదించటం, అనవసరమైన ఒత్తిడికి లోనుకాకుండా జాగ్రత్తగా వ్యవహరించటమే దీనికి పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. 

Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
మనసుని ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంచుకోవటానికి ఆహారం బాగా తోడ్పడుతుంది. ఇందుకోసం కొంతమంది కాఫీ, టీలను ఆశ్రయిస్తుంటే.. మరికొందరు స్వీట్ల వంటివి తెగ లాగించేస్తుంటారు. నిజానికి ఇవి మనసుని ఉత్సాహ పరచినా వీటితో దుష్రభావాలు ఎక్కువ. అంతకన్నా పోషకాలు దండిగా కలిగిన ఆహార పదార్థాలు తినటం ఎంతో మేలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి చాలా త్వరగా మూడ్‌నీ మార్చేస్తాయని వివరిస్తున్నారు. 

మోనోసాచ్యురేటెడ్‌ కొవ్వు, పొటాషియం:
 ఇవి మెదడుని ఆరోగ్యంగా ఉంచుతాయి. మెదడులోని నాడీకణాలు ఉత్తేజంగా ఉండేలా చేయటంలో పొటాషియం తోడ్పడుతుంది. బాదంపప్పు, వేరుశనగల్లో ఆరోగ్యకరమైన కొవ్వు.. అరటిపండు, చిలగడ దుంపల్లో బాగా పొటాషియం లభిస్తాయి. 

ట్రైప్టోఫాన్‌: 
మూడ్‌ని నియంత్రించటంలో సెరటోనిన్‌ పాత్ర చాలా కీలకం. ఇది మెదడులో న్యూరో ట్రాన్స్‌మీటర్‌గా పనిచేస్తుంది. ఈ సెరటోనిన్‌ ఎక్కువగా లభించాలంటే పాలు, చేమదుంపలు, చేమకూర, జీడిపప్పులను తింటే సరి. 

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు:
 మానసిక ఏకాగ్రత, విశ్రాంతి, కలుపుగోలుతనం పెంపొందటానికి ఒమేగా-3 కొవ్వులు సాయం చేస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచే ఈ కొవ్వులు లోపించటం వల్ల కుంగుబాటు, చిరాకు బాధించే అవకాశం ఉంది. అందుకే వీటిని పొందాలంటే ఆకుకూరలు.. చేపలు.. అవిసెగింజలు తీసుకుంటే మేలు.

ఫోలిక్‌ యాసిడ్‌, బి6 విటమిన్‌: 
కుంగుబాటుని దూరం చేసేందుకు ఈ రెండు విటమిన్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి తాజా కూరగాయలు, కాలేయం, పప్పుల్లో దండిగా ఉంటాయి. 
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
చదువులు కావచ్చు.. పోటీ పరీక్షలు కావచ్చు.. విద్యార్థుల మీద రకరకాల ఒత్తిళ్లుంటాయి. అలాంటప్పుడు యోగా, ధ్యానం చాలు అని చాలామంది అంటారు. అవే కాదు... ఆహారంతోనూ ఈ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

విటమిన్‌ 'సి': ఈ విటమిన్‌లో ఒత్తిడిని తగ్గించే గుణం ఉంటుంది. నారింజ, అనాస, టొమాటో, జామలో ఇది ఉంటుంది. మానసికంగా చిరాగ్గా, విసుగ్గా ఉన్నప్పుడు వీటిని తింటే మంచి ఫలితం ఉంటుంది.  

అరటిపండు: ఒత్తిడిని తగ్గించే ఔషధాల్లో అరటి పండు ఒకటి. ఓ చిన్న పండును తింటే సరిపోతుంది. అందులో తక్కువ కెలొరీలు లభించడమే కాదు, శరీరానికి అవసరమైన చక్కెర ఆ చిన్న పండు ద్వారా అందుతుంది. 
అంతేకాదు మెదడుకు మేలు చేసే సెరటోనిన్‌ అనే రసాయనం ఉత్పన్నమవుతుంది. దీనివల్ల ఉత్సాహంగా ఉండటం సాధ్యమవుతుంది. ఒత్తిడి కూడా నియంత్రణలోకి వచ్చేస్తుంది. 

నట్స్‌: వీటిలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మానసికంగానూ దృఢంగా మారతారు. ఉద్యోగినులూ, విద్యార్థినులూ వెంట ఎప్పుడూ డ్రై ప్రూట్స్‌ ఉంచుకుంటే సరిపోతుంది. అలవాటుగా మార్చుకుంటే ఇంకా మంచిది. ఒత్తిడిగా అనిపించినప్పుడు తిన్నా అది దూరమవుతుంది. 

ఓట్స్‌: ఇవి మనకు కావల్సినప్పుడు అందుబాటులో ఉండకపోవచ్చు. అందుకే ఓట్స్‌తో చేసిన బిస్కెట్లు, చిక్కీలు తినడం మంచిది. వీటిలో ఉండే కార్బోహైడ్రేట్లు ఒత్తిడిని దూరం చేస్తాయి. శరీరం కూడా వీటిని త్వరగా గ్రహిస్తుంది. ఓట్స్‌ తేలికపాటి ఆహారం కావడం వల్ల జీర్ణసంబంధిత సమస్యలూ రావు.

చేప నూనె: ఎక్కువగా ఒత్తిడికి గురై, టెన్షన్లు ఎదుర్కొనేవాళ్లు..వంటకు మామూలు నూనెకు బదులు, చేప నూనెను ఎంచుకోవడం మంచిది. దీనిలో ఉండే విటమిన్‌ ఈ ఒత్తిడిని దూరం చేసే హార్మోన్లను శరీరంలోకి విడుదల చేస్తుంది. విద్యార్థులు దీనికి ఎంత ప్రాధాన్యమిస్తే అంత మంచిది.  

Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
సెల్‌ఫోన్ల సాంకేతిక పరిజ్ఞానం పెరగటంతోపాటు ఉపయోగించేవారి విస్తృతీ పెరుగుతోంది. సెల్‌ఫోన్లను ఎక్కువగా వాడితే సమస్యలూ ఎక్కువేనని, వాటిలోని రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీతో అనారోగ్య సమస్యలు చోటుచేసుకుంటాయనే నేపథ్యంలో పరిశోధకులు ఎన్నో అధ్యయనాల్ని పరిశీలించారు. ఇంతకీ సెల్‌ఫోన్లతో నిజంగానే సమస్యలున్నాయా? అనే దిశగా అధ్యయనాలు సాగిస్తున్నారు. పిల్లలు, గర్భిణులు, కడుపులోని పిండాలు, వృత్తిపరంగా ఫోన్లను ఎక్కువగా వినియోగించే వారికి సెల్‌ఫోన్లతో ఎంతోకొంత హాని ఉంటోందనే వాదనల నిగ్గు తేల్చేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు. 

సెల్‌ఫోన్లతో అందరూ అనుకున్నంతగా, ప్రచారం చేస్తున్నంత హాని మాత్రం లేదని కొలరాడో యూనివర్సిటీ పరిశోధకులు ఫ్రాంక్‌ బార్నెస్‌ స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు వీటితో ముప్పు ఉన్నట్లు తేలకపోయినా.. దీర్ఘకాలంలో ఎలాంటి సమస్యలు వస్తాయనే దిశగా మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందంటున్నారు. ఇవే కాకుండా సెల్‌ఫోన్‌ టవర్లపై పనిచేసే వారిపై ప్రభావం ఎలా ఉంటోందన్నదీ పరిశీలించాలంటున్నారు. పాఠశాల వయసు పిల్లలు సెల్‌ వాడటం వల్ల తలెత్తే మంచీచెడ్డల్నీ పట్టించుకోవాల్సి ఉందన్నారు. ఎందుకంటే.. పెద్దలతో పోలిస్తే.. పిల్లల్లో తల, పుర్రె పరిమాణం, మందం కొంత తక్కువగా ఉండటం వల్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందా? అనేదీ గమనించాల్సి ఉందన్నారు. ప్రస్తుత కాలంలో సెల్‌ఫోన్లను చేతుల్లో పట్టుకోవటమే కాకుండా నడుము బెల్టులకూ పెట్టుకోవటం వల్ల నాడీ వ్యవస్థపై ప్రభావం ఎంతమేర ఉంటుందన్నదీ గమనించాల్సిన అవసరం ఉందని వారి వాదన. 
అమెరికా ఆహార, ఔషధ సంస్థ (ఎఫ్‌డీఏ) సెల్‌ఫోన్లపై సమగ్ర అధ్యయనం చేయాలని నేషనల్‌ రీసెర్చి కౌన్సిల్‌(ఎన్‌ఆర్సీ- అమెరికా) కు పురమాయించింది. దీనికోసం భారీ వర్క్‌షాప్‌ నిర్వహించి పలు దేశాల నుంచి నిపుణుల్ని ఆహ్వానించి సెల్‌ఫోన్లపై పలు నివేదికల్ని విశ్లేషించి, దీర్ఘకాలిక వినియోగంతో వాటివల్ల తలెత్తే సమస్యల్ని విశ్లేషించారు. సెల్‌ఫోన్లు, వ్యక్తిగత కంప్యూటర్లు వంటి వాటితో వెలువడే విద్యుత్తు తరంగాల వల్ల పిల్లలు, గర్భిణులు, కడుపులోని పిండాలపై ప్రభావాన్ని దీర్ఘకాలంపాటు పరిశీలిస్తేనే ముప్పు ఏమిటనేది తెలుస్తుందని, దీనికోసం మరింతగా అధ్యయనాలు సాగాల్సిందేనని నిపుణులు అభిప్రాయపడ్డారు. రాబోయే కాలంలో సెల్‌ఫోన్లు వినియోగించే ధోరణిలోనూ పలుమార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందనీ భావిస్తున్నారు. ఇప్పటికే చాలామేరకు సమాచారాన్ని మెసేజ్‌ల రూపంలో పంపించుకుంటూ, సంభాషణల్ని తగ్గిస్తున్నారనీ ఫలితంగా వీటితో తలెత్తే ముప్పు తీవ్రతల్లోనూ మార్పులు వచ్చే అవకాశం ఉందని శహిస్తున్నారు. కాకపోతే.. మెదళ్లు ఎదిగే దశలో పిల్లలు ఎక్కువగా వాడటమే ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. ఇలాంటి అన్ని అంశాల నేపథ్యంలో సెల్‌పోన్ల వాడంకపై ఇప్పుడే తీవ్రస్థాయి ఆందోళన చెందటం అనవసరమనీ, అధ్యయన ఫలితాలు వందశాతం వెలువడ్డాకే ఒక నిర్ణయానికి రావటం శ్రేయస్కరమని స్పష్టం చేస్తున్నారు. 

Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
విటమిన్‌-ఇని సమృద్ధిగా తీసుకుంటే 65 ఏళ్ల పైబడిన వృద్ధులు శారీరకంగా బలంగా ఉంటారని తాజా అధ్యయనంలో గుర్తించారు.  మన శరీరంలో తయారుకాదు, విటమిన్‌-ఇ ని ఆహార పదార్థాల ద్వారానే తీసుకోవాలి. వృక్ష సంబంధ నూనె, సోయా గింజలు, మొక్కజొన్న, ఆలివ్‌ నూనె, గుడ్డుసొన, ఆకుకూరలు వంటి ఆహార పదార్థాలతో విటమిన్‌-ఇ అందుతుంది. ఇవి యాంటీఆక్సిడెంట్లనూ అందివ్వటం వల్ల శారీరక ఆరోగ్యం చక్కగా ఉంటుందని అమెరికా పరిశోధకుల అధ్యయనంలో గుర్తించారు. విటమిన్‌-ఇ మన శరీరంలోని కణజాలాన్ని అన్నిరకాల దాడుల నుంచి రక్షిస్తుంటుంది. వృద్ధాప్య లక్షణాల్ని నెమ్మదింప జేయటంతోపాటు, చర్మ కణాలు క్షీణించటాన్నీ అడ్డుకుంటుంది. 

యేల్‌ యూనివర్సిటీ పరిశోధకులు కొంతమంది వాలంటీర్లు రక్తం శాంపిళ్లను పరీక్షించి విటమిన్ల స్థాయుల్ని గణించగా 65 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో విటమిన్‌-ఇ తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. విటమిన్‌-ఇ తక్కువగా ఉన్నవారిలో శారీరక సామర్థ్యం 1.62 రెట్లు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. విటమిన్‌ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాల్ని సరిపడినంతగా తీసుకుంటే ఈ సమస్య తక్కువగా ఉంటున్నట్లు గుర్తించారు. దీనికోసం సప్లిమెంట్లు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదనీ, ఆరోగ్యకరమైన ఆహారంతోనే విటమిన్‌ను పొందవచ్చని స్పష్టం చేశారు.

Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
పొగతాగటం ఒక్క వూపిరితిత్తులనే కాదు. శరీరంలోని చాలా భాగాలనూ దెబ్బతీస్తుంది. ఈ అలవాటును ఎప్పుడు మానేస్తే అప్పట్నుంచే మంచి ఫలితం కనబడుతుందని నిపుణులు చాలాకాలంగా చెబుతూనే ఉన్నారు. దీన్ని
బలపరుస్తూ మరో రుజువూ లభించింది. పొగతాగే అలవాటు మానేస్తే కంట్లో శుక్లం ఏర్పడే ముప్పూ తగ్గుతున్నట్టు తాజాగా బయటపడింది. మన కంట్లో పారదర్శకమైన కటకం ఉంటుంది. దీనిలోంచి కాంతి కిరణాలు ప్రసరించి ఆయా దృశ్యాలు స్పష్టంగా కనబడతాయి. కానీ ఇది వృద్ధాప్యంలో మబ్బుమబ్బుగా (శుక్లం) మారిపోతుంది. దీంతో చూపు మసకబారుతుంది. ఇలా శుక్లం ఏర్పడటానికీ పొగ తాగే అలవాటుకూ గల సంబంధంపై స్వీడన్‌ పరిశోధకులు ఇటీవల ఒక అధ్యనం చేశారు. పొగ అలవాటు లేనివారితో పోలిస్తే.. రోజుకి 15 కన్నా ఎక్కువ సిగరెట్లు తాగినవారికి శుక్లాల ముప్పు 42% అధికంగా ఉంటున్నట్టు గుర్తించారు. అయితే పొగ మానేసిన 20 ఏళ్ల తర్వాత శుక్లాల ముప్పు 21 శాతమే ఉంటుండటం గమనార్హం. పొగ తాగటానికీ ఇతర కంటి సమస్యలకూ సంబంధం ఉండటం వల్ల దీన్ని అలవాటు చేసుకోకపోవటమే మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. ఒకవేళ పొగ అలవాటుంటే దాన్ని మానేయటం ఉత్తమమని సూచిస్తున్నారు.