TRENDING NOW

Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
 చిలకలూరిపేట పట్టణంలోని ప్రముఖ లీలావతి హాస్పిటల్స్‌లో ప్రముఖ వైద్యురాలు డాక్టర్ లావు సుష్మ ఆధ్వర్యంలో గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. శస్త్రచికిత్సల కంటే సహజ ప్రసవాలకు (నార్మల్ డెలివరీ) ప్రాధాన్యతనిస్తూ, ఆమె అందిస్తున్న సేవలు గర్భిణులు మరియు వారి కుటుంబ సభ్యుల్లో ఎంతో నమ్మకాన్ని కలిగిస్తున్నాయి.

విజయవంతంగా సాధారణ ప్రసవం..

డాక్టర్ లావు సుష్మ సమక్షంలో లీలావతి హాస్పిటల్స్‌లో మరో సాధారణ ప్రసవం విజయవంతంగా జరిగింది. డాక్టర్ సుష్మ ప్రత్యేక పర్యవేక్షణ, నైపుణ్యంతో కూడిన చికిత్స ద్వారా తల్లి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖ ప్రసవం పొందింది.

తల్లీబిడ్డ క్షేమం – 2.8 కేజీల బాలుడి జననం..

ఈ ప్రసవంలో తల్లి 2.8 కేజీల బరువున్న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంతో క్షేమంగా ఉన్నారని వైద్య బృందం తెలిపింది.

వైద్యురాలికి కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు..

సాధారణ ప్రసవాన్ని విజయవంతంగా పూర్తి చేసి, తల్లీబిడ్డల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ చూపిన డాక్టర్ లావు సుష్మకు మరియు లీలావతి హాస్పిటల్స్ సిబ్బందికి బాలుడి కుటుంబ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
చిలకలూరిపేటలోని ప్రసిద్ధ 'లీలావతి హాస్పిటల్స్'లో మరో క్లిష్టమైన ప్రసవాన్ని వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. గతంలో సిజేరియన్  అయిన ఒక గర్భిణీ తీవ్రమైన నొప్పితో , పాత ఆపరేషన్ కుట్లు విడిపోయే అత్యంత ప్రమాదకరమైన స్థితిలో  ఆసుపత్రికి వచ్చారు. ఇది తల్లితో పాటు కడుపులోని బిడ్డకు కూడా ప్రాణాపాయమైన పరిస్థితి. ఈ విషమ పరిస్థితిని వెంటనే గుర్తించిన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ లావు సుష్మ గారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అత్యవసర చికిత్సకు ఉపక్రమించారు.

డాక్టర్ సుష్మ సమయస్ఫూర్తి... పండంటి మగబిడ్డకు జననం

మూడవసారి గర్భం దాల్చిన సదరు మహిళకు (G3P2L2), డాక్టర్ సుష్మ తన వైద్య బృందంతో కలిసి అత్యవసరంగా రిపీట్ సిజేరియన్  ఆపరేషన్‌ను అత్యంత చాకచక్యంగా నిర్వహించారు. తన అపారమైన వైద్య అనుభవంతో, డాక్టర్ సుష్మ ప్రాణాపాయ స్థితిలో ఉన్న తల్లిని సురక్షితంగా కాపాడటమే కాకుండా, 2.5 కిలోల బరువున్న ఆరోగ్యవంతమైన మగబిడ్డను ప్రాణాలతో కాపాడారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.

*lఅత్యవసర వైద్య సేవల్లో లీలావతి హాస్పిటల్స్ భరోసా.

తల్లికి మరియు బిడ్డకు ముప్పు పొంచి ఉన్న ఇలాంటి క్లిష్టమైన కేసును సమయస్ఫూర్తితో ఛేదించిన డాక్టర్ లావు సుష్మను రోగి కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. అత్యవసర మరియు సంక్లిష్టమైన ప్రసవాలకు, మెరుగైన వైద్య సేవలకు చిలకలూరిపేటలోని లీలావతి హాస్పిటల్స్ ఒక నమ్మకమైన కేంద్రంగా మరోసారి నిరూపించుకుంది. ఎంతో శ్రద్ధతో వైద్యం అందించి రెండు ప్రాణాలను నిలబెట్టిన డాక్టర్ సుష్మ పై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
ఇది ప్రతి మనిషిలొ ఉండే సమస్య అయినప్పటికి ప్రతీ వ్యక్తి వివిధ రకముల శరీరం కలిగి ఉండటం వల్ల, మనిషికి ఒకరికీ మరొకరికీ మద్య మార్పు ఉంటుంది.
శరీర దుర్వాసన, చెమట మరియు ఇతర చర్మ స్రవాలు వల్ల వస్తుంది.  ఇది మిమ్మల్ని స్నేహితుల లేదా ఇతర  సమావేశాల నుంచి దూరం చేస్తుంది. మీరు ఎలాంటి కోవకు  చెందిన వారైనను, ఈ చెడు వాసన మీతో ఉన్నవారినే కాదు మిమల్ని కూడా ఎంతో ఇబ్బందికి  గురిచేసి అసౌకర్యాన్ని కలిపిస్తుంది.

     ఈ దుర్వాసన మన శరీరంలో  “eccrine” మరియు “apocrine” అనే  గ్రంధుల వల్ల వ్యాపిస్తుంది.

మొదటిగా శరీరం అంతటా వ్యాపించి ఉన్ననూ ముఖ్యంగా చేతులు పై, చేతుల కింది భాగము, చంకలు, అరికాళ్ళు, నుదురు పై ప్రభావం చూపిస్తాయి. తరువాత తొడల మధ్య చేరి ఎంతో ఇబ్బందిని కలిగిస్తాయి.

మార్కెట్లో ఎన్నో రకముల వివిధ ఉత్పత్తులు ఉన్నను అవి  తాత్కాలిక రక్షణ మాత్రమే ఇస్తాయి, కానీ ఈ సమస్యకు శాస్వత పరిష్కారం ఎంతో అవసరం.

 Deodorants, perfumes ఈ దుర్వాసనను కొంతవరకు తగ్గించినా శాస్వత పరిష్కారం ఎంతో అవసరం. వ్యక్తి యొక్క మానసిక మరియు భావోద్వేగ  ఒత్తిడి వల్ల కూడా ఈ దుర్వాసన వ్యాపిస్తుంది

చెడు వాసనకు కారణం:

పరిశుభ్రత సమస్య: మనం నివసించే ప్రదేశం శుబ్రంగా లేకపోయినా,స్నానము సరిగా  చెయకపొయినా, పరిశుభ్రమైన బట్టలు వేసుకోకపోయిన, ఎంతో  చిన్నవిగా అనిపించే ఇవి మన శరీర దుర్వాసనకు కారణం అవుతాయి

చర్మం సమస్య: చెడు వాసనకు కారణములలొ మరొకటి చర్మ సమస్యలు,  “eczema” లేదా “psoriasis” అనే  అలెర్జీలు ఉంటే నిర్దారించుకుని డాక్టరు ని సంప్రదించడం ఎంతో అవసరం

నివారణ మార్గములు :
  •  కాటన్ దుస్తులు ధరించాలి, ముఖ్యముగా  లోదుస్తులు ఇవి మీ చర్మానికి గాలి తగిలేలా చేసి దుర్గందాన్ని దూరం చేస్తాయి.
  • ప్రతీ రోజు స్నానంలో క్రిమి సంహారిక సబ్బును ఉపయోగించాలి.
  • ఎప్పటికప్పుడు చెమట పట్టే మరియు దుర్వాసన కలిగించే శరీర భాగాలను సబ్బుతొ శుబ్రముగా కడుక్కోవాలి.
  • నేరుగా నాడీ వ్యవస్థను ప్రభావితం మరియు మరింత చెమట ఉత్పత్తికి దారి తీసే టీ,కాఫీ వంటివి ఎంత తగ్గిస్తే అంత మంచిది.
  • రక్త కణాల పై ప్రభావితం చూపి చెమటకు మరియు శరీర దుర్గందానికి కారణమయ్యే మద్యం కి దూరంగా ఉండడం ఎంతో అవసరం.
 మీ రోజు వారి మందులు అనగా  స్టెరాయిడ్ ఆస్త్మా మందులు వల్ల కూడా చెమట వ్యాపించే అవకాశం ఎక్కువ, వీటి పై శ్రద్ద చూపించి సరైన మోతాదులో తీస్కోవాలి .

చెడు వాసనతో పోరాడేందుకు సహజ నివారణలు:

  • మీ స్నానం నీటిలో ఒక టేబుల్ స్పూన్  పటికను జోడించి తీసుకుంటే, ఎంతో తాజా, దుర్వాసన రహితమైన చర్మాన్ని పొందవచ్చు.
  • మీ స్నానం తర్వాత చివరిగా ఒక టేబుల్ స్పూన్ తేనెను నీటిలో కలిపి స్నానం చేస్తే  ఇది మీ శరీర దుర్వాసనని నియంత్రిస్తుంది.
  • ఉడికించిన పుదీనా ఆకులు స్నానపు నీటిలొ కలిపి చేస్తే రోజంతా చర్మం ఎంతో తాజాగా ఉంటుంది.
  • సరైన ఆహారం తీసుకోవడం వల్ల కూడ శరీర దుర్వాసనను తగ్గించటానికి ఎంతో సహయపడుతుంది,  ముఖ్యముగా   మీ ఆహారం 20% మాంసకృత్తులు, 20% నూనెలు మరియు కొవ్వులు కలిగి ఉండి పండ్లు మరియు కూరగాయలు తో  తీసుకొవడం ఎంతో అవసరం.
  • మంచి  నీళ్ళు ఎక్కువగా తీసుకొవడం వలన కూడ ఎంతో అవసరం.
  • ఒక టేబుల్ స్పూన్  సొంపుగింజలను తీసుకొవడం ద్వారా మీ శరీర తాజాతనమునకు ఎంతో ఉపయోగ పడుతుంది .
  • మన జీవన శైలి మన చేతుల్లోనె ఉంటుంది,అదనపు అలసట మరియు ఒత్తిడి  మన మానసిక స్తితిని పాడుచేస్తుంది .
 దుర్వాసన అనేది  వ్యక్తిత్వానికి మంచిది కాదు, దీని నియంత్రణకు పైన సూచించిన విధముగా పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
సాధారణంగా మగవారి కన్నా ఆడవారికే చర్మం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయి, కొన్ని అధ్యాయనాల ప్రకారం మగవారి చర్మం ఆడవారి చర్మం కన్నా ఆలస్యంగా ముడతలు పడుతుందంట కాని, మగవారి జీవనశైలి, వారి అలవాట్లు, వారిని చర్మ సమస్యలలో ముందుకు తీసుకు వచ్చి,ఆడవారితో సమానం చేసేశాయి. అవి..


  • షేవింగ్ : సాధరణంగా మగవారు షేవింగ్ ఎక్కువగా చేసుకోవడం వల్ల చర్మ సమస్యలు అధికంగా ఉంటాయి,షేవింగ్ వల్ల చర్మం కఠినంగా అయిపొయి, చర్మంలోని తేమను తీసివేస్తుంది, అందువల్ల చర్మం పొడిగా మారి ముడతలకు దారి తీస్తుంది.  మీరు షేవింగ్ ను చల్లని నీటితో చేసుకుని,తరువాత “మాయిశ్చరైజర్” ఉపయోగిస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు.
  • ధూమపానం: ధూమపానం అనేది మగవారి యొక్క “Manliness”కి చిహ్నము లాంటిది. కాని దీని వల్లనే మగవారి వయస్సు వారి అసలు వయస్సుకన్నా ఎక్కువగా అనిపిస్తుంది,ధూమపానము మగవారి అసలు వయస్సుకి మరికొంత వయస్సు కలిపి, చర్మం ముడతలకు, పొడిబారిపోవడానికి కారణం అవుతుంది.
  • అల్కహాల్ : మగవారికి ముఖ్యమైన, ఎంతో ఉపయోగకరమైన చిట్కా ఏమిటంటే మద్యానికి దురంగా ఉండటం, ఎందుకంటే మద్యం వల్ల రక్త నాళాలు అవసరమైన దానికంటే ఎక్కువగా సాగి ఇబ్బందులు కలిగిస్తాయి.
  • వ్యాయామం: వృద్దాప్యంగా కనిపించడం అనేది చర్మం వల్లే కాదు కుంగిపోయిన కండరాలు కూడా కారణం అవుతాయి,అందుకే ప్రతీ రోజూ వ్యాయామం చేయడం వల్ల కండరాలు బలపడి చర్మం ముడతలు పడకుండా ఉంటుంది.
  • ద్రాక్ష రసం: మగ వారి చర్మ సౌందర్యానికి ద్రాక్ష రసం ఎంతో మంచిది, ప్రతీ రోజూ ఆహారంతో పాటు ద్రాక్ష రసాన్ని తీసుకుంటే, మీ చర్మంలోని Elasticity ను పెంచి, మీ చర్మాన్ని అందంగా, యవ్వనంగా ఉంచుతుంది.
  • మసాజ్: రోజూ మీ ముఖం పై మెల్లగా మసాజ్ చేయడంవల్ల రక్త  ప్రసరణ సజావుగా సాగి చర్మాన్ని తాజాగా, యవ్వనంగా ఉంచుతుంది.
  •  రోజూ పాలతో మీ ముఖాన్ని శుబ్రం చేసుకుంటే చర్మంలోని మలినాలు అన్నీ పోయి మంచి ఫలితం కనిపిస్తుంది.
  • ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడుకోవచ్చు.  ముఖ్యంగా బచ్చలికూర లేదా చిక్కుళ్ళు వంటి కూరగాయలలో చర్మం ముడతలు పడకుండా చూసుకోవచ్చు.
  • సూర్యుని కాంతి: మీ చర్మాన్ని అధికంగా సుర్యుని కాంతిలో ఉంచకండి, దాని వల్ల మీ చర్మం ముడతలు పడటానికి ఎక్కువ అవకాశం ఉంది.

     మంచి నీరు అధికంగా తీసుకోవడం వల్ల కూడా చర్మాన్ని ముడతల బారి నుంచి కాపాడుకోవచ్చు. రోజుకి కనీసం 8 గ్లాసులు, లేదా 2 లీటర్ల నీరు తీసుకుంటే చర్మ రక్షణలో ఎంతో ఉపయోగపడుతుంది.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
  • సాధారణంగా వేళకు భుజించకుండా వేళతప్పి తినడం ఒక ముఖ్య కారణం
  • అంతేకాక అరగని పదార్ధాలను, మాంసాహారలను అతిగా సేవించడం వల్ల జీర్ణక్రియ దెబ్బతిని తిన్న ఆహారం మురిగిపోయి కడుపులోని ఆ దుర్గంధమంతా పైకెగదన్ని నోటి నుండి దుర్వాసనగా వెలువడుతుంటుంది.
  •  మరికొంతమందికి భోజునం తరవాత మంచినీటితో పుక్కిలించే అలవాటు లేకపోవడంవల్ల పళ్ళసంధుల్లో ఇరుక్కున్న ఆహారపు తునకలు కొంతసేపటికి కుళ్ళిపోయి కంపుకొడుతూ నోట్లో దుర్వాసనను పుట్టిస్తుంటయ్.
తీసుకోవల్సిన జాగ్రత్తలు :
  • అలాంటి వారు తమ ఆహారం విషయంలో క్రమశిక్షణ పాటించటం ఎంతో అవసరం.
  • రోజూ ఉదయం 9 గంటలలోపు మొదటి భోజనం, రాత్రి 8 గంటలలోపు రెండవ భోజనం,మధ్యాహ్నం అల్పాహారం క్రమంతప్పకుండా సేవించడానికి అలవాటుపడాలి.
  • ఇలా ఎప్పటికప్పుడు ఆహారం తీసుకుంటుంటే వారి దంతాలు మరియూ చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండి నోటి ఆరోగ్యం ఎంతో మెరుగు పడుతుంది.
  • భోజనం చేసిన తరువాత మరచిపోకుండా పదిపన్నెండుసార్లు నోటినిండా నీళ్ళు పోసుకుని నిదానంగా బాగా పుక్కిలించి ఊసివేయాలి.
  • ఆ తరువాత ఒక్క లవంగాన్ని బుగ్గన పెట్టుకుని చప్పరిస్తుంటే దుర్వాసన హరించి నోరు సుగంధభరితమౌతుంది.

Comments

Follow Us