fat losing foods
చికెన్: మాంసాహారంలో లీట్ మీట్ ను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా
మంచిది, అదనపు కొలెస్ట్రాల్ చేరదు . లీన్ మీట్ ప్రోటీనులను అందిస్తుంది.
లీన్ మీట్ తినడం వల్ల పొట్ట ఫుల్ గా ఉన్నఅనుభూతిని కలిగిస్తుంది. ఎక్కువ సమయం ఆకలి
కానివ్వదు.
సాల్మన్: చేపల్లో అన్ సాచురేటెడ్ (అసంతృప్త కొవ్వు )కలిగి
ఉంటాయి. మరియు అత్యవసర ఖనిజలవణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వును
కరిగించడానికి బాగా సహాయపడుతాయి. కాబట్టి మీ రెగ్యులర్ డైట్ లో సాల్మన్ మరియు
మెకరేల్ వంటి ఆహారాలను మధ్యహ్నాభోజనంలో లేదా రాత్రి డిన్నర్ లో తీసుకోవడం వల్ల
బరుబు తగ్గడానికి మరియు అధికంగా అధనంగా పేరుకొన్న కొవ్వును కరిగించుకోవచ్చు.
స్వీట్ పొటాటో: ఆరోగ్యదాయకం స్వీట్ పొటాటో.... శరీరానికి
కావల్సిన పోషకపదార్థాలను అందించడంలోనే కాదు వివిధ రకాలుగా శరీరంలో చేరిన
విషపదార్థాలను తొలగించడంలో చిలుగడ దుంపలకు ప్రత్యేక స్థానం ఉంది. అనేక ఖనిజ
లవణాలతో పాటు దుంపలలో బరువు తగ్గించే లక్షణాలు కూడా తక్కువే
చీజ్: లో ఫ్యాట్
కాటేజ్ చీజ్ రెగ్యులర్ గా తీసుకోవాలి . ఈ ఆహారం వల్ల మన శరీరానికి క్యాల్షియం
మరియు ప్రోటీనులను అధికంగా అందివ్వొచ్చు . అయితే దీన్ని పరిమితంగా తీసుకోవాలి.
ఆపిల్స్: ప్రతిరోజూ యాపిల్ పళ్లు తింటే శరీరంలో పేరుకున్న
కొవ్వు కణాలు తగ్గుముఖం పడతాయి. యాపిల్ తోలులో ఉండే పెక్టిన్ శరీర కణాలు
కొవ్వును పీల్చుకోకుండా నియంత్రిస్తాయి.యాపిల్స్ లో ఉన్న పుష్కలమైన యాంటీ
ఆక్సిడెంట్స్ మరియు పోషకాంశాలను అటుంచితే..యాపిల్స్ లో నీటితో కూడిన పెక్టిన్ అధికంగా
ఉండటం వల్ల ఇవి ఫ్యాట్ సెల్స్ ను ఘననీయంగా తగ్గిస్తుంది.
స్ట్రాబెర్రీస్: స్ట్రాబెర్రీస్
మరియు బ్లూ బెర్రీస్ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం. ఎందుకంటే వీటిలో
యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్, మినిరల్స్ మరియు విటమిన్స్ పుష్కలంగా
ఉంటాయి. ఇవి మీలో అధిక క్యాలరీలను చేర్చవు కాబట్టి, రెగ్యులర్
గా వీటిని తీసుకోవచ్చు. స్ట్రాబెర్రీ శరీర బరువును తగ్గిస్తుంది. శరీరానికి
కావల్సిన శక్తిని ఇచ్చి, ఎక్కువ సేపు ఆకలికాకుండా సహాయపడుతుంది. కొవ్వును
కరిస్తుంది.
బ్రౌన్ బ్రెడ్: త్రుణధాన్యాలతో
తయారుచేసిన బ్రెడ్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం. శరీరంలో ఎక్కువ
క్యాలరీలను తగ్గిస్తుంది . జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది . ఇవి మన శరీరానికి
అవసరం అయ్యే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, క్యాల్షియం,
విటమిన్స్,
మినిరల్స్
మరియు ఫైబర్ ను అందిస్తుంది.
టమోటోలు: కొవ్వు
త్వరగా తగ్గాలంటే పచ్చి టమాటాలు తినండి. టమాట సలాడ్ కేన్సర్ కూడా నివారిస్తుంది. కనుక
కొద్ది ఆకలి వేస్తే టమాటాలు తినండి.
మిరియాలు: మెటబాలిజం
రేటును అమాంతంగా పెంచుతుంది. శరీరంలో కొవ్వు త్వరగా కరిగేందుకు సహాయపడుతాయి. ఆకలి
కోరికలను కంట్రోల్ చేస్తాయి . యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల వీటిని
రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.
మస్టర్డ్(ఆవాలు) : బరువు తగ్గడానికి మీరు తీసుకొనే ఆహారంలో
ఆవాలను లేదా ఆవనూనెను చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆవాల్లో ఫ్యాటీ
యాసిడ్స్ (ఒలియిక్, యురిసిక్ మరియు లినోలెనిక్ ఆమ్లం)లో సాచ్యురేటెడ్ ఫ్యాట్ మరియు
యాంటీఆక్సిడెంట్స్ ఉండి క్యాలొరీస్ ను బర్న్ చేస్తాయి. మరియు బరువు తగ్గిస్తాయి
పాప్ కార్న్: పాప్
కార్న్ ను మీరు బయట రెడీమేడ్ తెచ్చుకోవడం కంటే, కార్న్స్ ను
తీసుకొచ్చి, ఇంట్లో తయారుచేసుకోవడం ఆరోగ్యకరం . అవుట్ సైడ్ తయారుచేసే
వాటితో శరీరంలో అదనపు క్యాలరీలు చేరుతాయి.
పుచ్చకాయ: వేసవివచ్చిందే
పుచ్చకాయలు ఎక్కువగా మనకు అందుబాటులో ఉంటాయి. వీటిలో క్యాలరీలు తక్కువ మరియు
యాంటీయాక్సిడెంట్స్ మరయిు విటమిన్స్ ఎక్కువ.
బ్రొకోలీ: రీన్
వెజిటేబుల్స్ లో ఇది ఒక బెస్ట్ వెజిటేబుల్. ఉడికించిన బ్రొకోలీని ఒక కప్పు
తీసుకోవడం వల్ల మంచిది. బరువు తగ్గాలనుకొనే వారు ఈ హెల్తీ గ్రీన్ వెజిటేబుల్ ను
డైలీ డైట్ చేర్చుకోవాలి. 95కాలరీలున్న ఈ గ్రీన్ వెజిటేబుల్
రెగ్యులర్ గా తీసుకుంటే అతి త్వరగా బరువు తగ్గవచ్చు. అంతే కాదు ఇందులో సూపర్
క్యాన్సర్ ఫైటింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. బ్రొకోలీని మీ రెగ్యులర్ డైట్ లో
చేర్చుకోవడం వల్ల ఆకలిని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇంకా ఇందులో ఉండే అనేక రకాల
విటమిన్స్ వల్ల ఇది ఒక నేచులర్ ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్ లిస్ట్ లోకి చేరిపోయింది.
డ్రై నట్స్ : స్నాక్స్
తినే సమయంలో లేదా ఎక్కువగా ఆకలిగా ఉన్న సమయంలో బేకరీ ఫుడ్స్ కు, స్నాక్స్
ను తినడం కంటే నట్స్(డ్రై ఫ్రూట్స్)ను తినడం వల్ల నోటికి రుచి మాత్రమే కాదు,
శరీరానికి
కావల్సిన శక్తిని అందిస్తుంది. చాలా మందిలో నట్స్ తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారనో
లేదా కొవ్వు అధికం అవుతుందనో చెడు అభిప్రాయం చాలా మందిలో ఉంది. అందువల్లే చాలా
మంది వాల్ నట్స్ మరియు బాదాం వంటివి తినకుండా ఉంటారు. అయితే ఇది పూర్తి విరుద్దం. ఎందుకంటే
నట్స్ లో డైటరీ ఫైబర్ తో పాటు కొవ్వును కరిగించే లక్షణాలు కూడా పుష్కలంగా ఉండంటం
వల్ల వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల చెడు కొవ్వును నియంత్రించవచ్చు
కిడ్నీ బీన్స్ : ప్రోటీనులు
మరియు ఫైబర్ అధికంగా ఉండే కిడ్నీ బీన్స్ ను రెగ్యులర్ గా తీసుకోవడం ఆరోగ్యానికి
మంచిది మరియు బరువును కూడా వేగంగా తగ్గిస్తుంది
బ్రౌన్ రైస్ : రెగ్యులర్
గా తీసుకొనే వైట్ రైస్ కు చెక్ పెట్టి, బ్రౌన్ రైస్ తీసుకోవడానికి
అలవాటు పడితే , వెంటనే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బ్రౌన్ రైస్ ఒక హోల్
గ్రెయిన్ ఫుడ్: ఇందులో విటమిన్ బి, విటమిన్ ఇ, మెగ్నీషియం,
ఐరన్
మరియు ఫైబర్లు ఫుష్కలంగా ఉన్నాయి. ఇది బౌల్ ను రెగ్యులేట్ చేస్తుంది తర్వాత,
ఆకలిని
నియంత్రిస్తుంది. జీవక్రియలను మెరుగుపరుస్తుంది.
COMMENTS