pimple tretment
యాక్నె (మొటిమల వలన ఏర్పడిన మచ్చలు) పోవాలంటే రోజుకు రెండుసారు
ముఖంతోపాటు యాక్నె ఉన్న ప్రదేశవుంతా పన్నీటితో కడగాలి. తాజా నిమ్మరసాన్ని
కాచిన పాలలో కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత శుభ్రం చేయాలి. ఇలా రోజుకు రెండు
- మూడు సార్లు చేస్తే యాక్నె త్వరగా పోతుంది.
- రోజుకు రెండుసార్లు గోరువెచ్చటి నీటిలో ఉప్పు కలిపి ముఖం కడగాలి. యూకలిప్టస్ ఆయిల్‌తో మర్దన చేస్తే యాక్నె సమస్య తగ్గుతుంది.
- గుప్పెడు తులసి ఆకులు నీళ్లు కలిపి గ్రైండ్ చేసి ఫ్రిజ్‌లో పెట్టి చల్లబడిన తర్వాత ముఖానికి పట్టించాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే మొటిమలు, వాటి మచ్చలుపోతాయి.
- తాజా నిమ్మరసంతో రెండు - మూడు నిమిషాల పాటు మర్దన చేయాలి. రోజూ చేస్తుంటే యాక్నె క్రమంగా తగ్గుతుంది.
- యాక్నె పోవడానికి అన్నింటికంటే తక్కువ ఖర్చుతో చేసే ట్రీట్మెంట్ ఇది. టేబుల్ సాల్ట్‌లో రెండు చుక్కల నీళ్లు కలిపి ముఖానికి పట్టించి సున్నితంగా మర్దన చేసి ఆరినతర్వాత చన్నీటితో కడగాలి. ఉప్పుకు బదులుగా చక్కెర కూడ వాడవచ్చు.
- మెంతి ఆకులను గ్రైండ్ చేసి రాత్రి పడుకోబోయే ముందు ముఖానికి పట్టించి ఉదయం గోరు వెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటుంటే క్రమంగా తగ్గుతుంది. యాక్నెతోపాటు బ్లాక్‌హెడ్స్ కూడ తగ్గుతాయి.
- బార్లీ పొడి ఒక కప్పు, ఉప్పు నాలుగు టేబుల్ స్పూన్లు, పాలు ఒక కప్పు, స్ట్రాబెర్రీలు రెండు తీసుకుని అన్నింటినీ కలిపి గ్రైండ్ చేసి ముఖానికి యాక్నె ఉన్న చోట పట్టించి ఆరిన తర్వాత కడగాలి. ఇలా వారానికొకసారి చేస్తే పూర్తిగాతగ్గుతుంది.
- యాక్నెను తగ్గించడంలో వెల్లుల్లిది ప్రముఖపాత్ర. రోజులో వీలయినన్ని
సార్లు వెల్లుల్లిరసాన్ని పట్టించవచ్చు. చిదిమిన వెల్లుల్లితోముఖాన్ని మర్దన
చేసినా కూడ మంచి ఫలితం ఉంటుంది.
COMMENTS