bad smell in mouth
- సాధారణంగా వేళకు భుజించకుండా వేళతప్పి తినడం ఒక ముఖ్య కారణం
- అంతేకాక అరగని పదార్ధాలను, మాంసాహారలను అతిగా సేవించడం వల్ల జీర్ణక్రియ దెబ్బతిని తిన్న ఆహారం మురిగిపోయి కడుపులోని ఆ దుర్గంధమంతా పైకెగదన్ని నోటి నుండి దుర్వాసనగా వెలువడుతుంటుంది.
- మరికొంతమందికి భోజునం తరవాత మంచినీటితో పుక్కిలించే అలవాటు లేకపోవడంవల్ల పళ్ళసంధుల్లో ఇరుక్కున్న ఆహారపు తునకలు కొంతసేపటికి కుళ్ళిపోయి కంపుకొడుతూ నోట్లో దుర్వాసనను పుట్టిస్తుంటయ్.
- అలాంటి వారు తమ ఆహారం విషయంలో క్రమశిక్షణ పాటించటం ఎంతో అవసరం.
- రోజూ ఉదయం 9 గంటలలోపు మొదటి భోజనం, రాత్రి 8 గంటలలోపు రెండవ భోజనం,మధ్యాహ్నం అల్పాహారం క్రమంతప్పకుండా సేవించడానికి అలవాటుపడాలి.
- ఇలా ఎప్పటికప్పుడు ఆహారం తీసుకుంటుంటే వారి దంతాలు మరియూ చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండి నోటి ఆరోగ్యం ఎంతో మెరుగు పడుతుంది.
- భోజనం చేసిన తరువాత మరచిపోకుండా పదిపన్నెండుసార్లు నోటినిండా నీళ్ళు పోసుకుని నిదానంగా బాగా పుక్కిలించి ఊసివేయాలి.
- ఆ తరువాత ఒక్క లవంగాన్ని బుగ్గన పెట్టుకుని చప్పరిస్తుంటే దుర్వాసన హరించి నోరు సుగంధభరితమౌతుంది.
COMMENTS