fat losing foods
బరువు తగ్గించే ఆహర పదార్ధలు |
అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గించుకోవడం చాలా కష్టం అని
భావిస్తుంటారు. దానికి తోడు ఉన్న బరువును తగ్గించుకోవడానికి బదులుగా
బద్దకిస్తుంటారు . బరువు తగ్గించుకోడానికి సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోవడం వల్ల
బరువు తగ్గించుకోవడం అంత కష్టమైనది కాదు.
అదనపు బరువుతో బాధపడే వారు, శరీరంలోని అదనపు కొవ్వును
కరిగించుకోవడానికి కొన్ని ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ సహాయపడుతాయి. ఇవి క్యాలరీలను
తగ్గించడం మాత్రమే కాదు, స్లిమ్ గా కూడా మార్చుతాయి. సరైన సమయంలో
సరైన ఆహారంను తీసుకోవడం ద్వారా మీరు బరువు తగ్గాలనే లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు.
కొన్ని రోజుల పాటు ఈ ఆహారాలను తీసుకోవడంతో పాటు ఎఫెక్టివ్ వర్కౌట్స్ చేయడం వల్ల
అద్భుతమైన ఫలితాలను గమనించవచ్చు . శరీరంలో
చేరిన అదనపు కొవ్వును సులభంగా తగ్గించుకోవచ్చు. ఈక్రింద ఉదహరించిన ఫ్యాట్ బర్నింగ్
ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. అయితే ఈ ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్ ను
ఎక్కువగా తీసుకోకూడదు. బరువు తగ్గించుకొనే క్రమంలో పరిమితంగా మాత్రమే వీటిని
తీసుకోవాలి. లేదంటే మీరు పొట్ట సమస్యలకు గురి అవుతారు.
- వెల్లుల్లి: వెల్లుల్లిలో అల్లిసిన్(allicin)అనే అంశం కలిగి ఉండి యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉండి శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను నివారిస్తుంది.
- గ్రీన్ టీ: గ్రీన్ టీ గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్స్ మెటబాలిజమ్కు అనువైన పరిస్థితిని శరీరంలో కల్పిస్తాయి. అలాగే క్యాన్సర్ నిరోధక కారకాలు, కొవ్వు అదుపులో ఉంచే అంశాలు గ్రీన్ టీలో పుష్కలం.ఇది బరువు తగ్గించడంలో బాగా సహాయపడుతుంది మరియు శరీరంలో మెటబాలిజం రేటును పెంచుతుంది. అలాగే మరో ప్రయోజనం హార్ట్ రేటు పెంచుతుంది. మీ గుండె కొట్టుకోవడం పెంచుతుంది, దాంతో మరిన్ని క్యాలరీలను మీరు కరిగించుకోవచ్చు.
- దాల్చిన చెక్క: మసాలాలో వాడే దాల్చిన చెక్క ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది తీయగా, ఘాటుగా ఉంటుంది. దాల్చిన చెక్క నుండి సేకరించే నూనెలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్నాయి. అందుకే, వాటి నుండి సోకే ఏ వ్యాధులైనా సరే ఇట్టే మాయం అవుతాయి.
- అల్లం: అల్లం శరీరంలోని జీవక్రియలను వేగవంతం చేస్తుందని ఆరోగ్యనిపుణులు నిర్ధారించారు . మరియు ఇది కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది . ఇంకా విటమిన్స్, మినిరల్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉంటుంది
- నిమ్మరసం: భోజనం చేసిన తర్వాత నిమ్మరసం, నిమ్మజ్యూస్ తాగడం వల్ల శరీరానికి చాలా మంచిది. శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇందులోని సిట్రస్ ఆమ్లం బరువు పెరగనీయకుండా అడ్డుకుంటుంది.
- ఉల్లిపాయ: జీవక్రియలను చురుకుగా ఉంచడంలో ఉల్లిపాయలు ప్రధాణ పాత్రను పోషిస్తాయి. అంతే కాదు, మనం వండే ఆహారాలకు మంచి రుచిని అందిస్తాయి. అందుకే పచ్చిగా కూడా సలాడ్స్ లో జోడించాలి.
- ఓట్స్: ఓట్స్ తినడానికి మాత్రమే రుచిగా మాత్రమే కాదు ఇవి తిన్న తర్వాత కడుపు నిండుగా అనిపిస్తుంది. దాంతో అధికంగా తినాలనే కోరికను ఓట్స్ తగ్గిస్తాయి. ఓట్స్ లో ఫైబర్ అధికంగా ఉండి కొలెస్ట్రాల్ లెవల్స్ ను మరియు కొవ్వులు సమతుల్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది.
- పెరుగు: లోఫ్యాట్ పెరుగులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఆకలిని కంట్రోల్ చేస్తుంది మరియు ఎముకలు మరియు దంతాలను బలోపేతం చేస్తుంది. మరియు పెరుగులో అధిక శాతంలో ప్రోటీనులు మరియు విటమిన్ డి పుష్కలంగా ఉంది.ఇది మీశరీరానికి నిరంతరం ప్రసరిస్తుంటుంది. కాబట్టి లోఫ్యాట్ పెరుగుతో పాటు, లోఫ్యాట్ మిల్క్, చీజ్ వంటి వాటిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవచ్చు.
- గుడ్డు: గ్రుడ్లు జింక్, విటమిన్ B, అయోడిన్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, మరియు ప్రోటీన్ కలిగి ఉన్నాయి. గుడ్లలో అధిక ప్రోటీనులు మరియ ఇతర ముఖ్యమైన ఖనిజాలు ఉండి అతి తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. మీ శరీరాన్ని, కండర పుష్టిని పెంచుకోవడానికి ఇది చాలా సహాయపడుతుంది. అధిక కొవ్వును నియంత్రించడానికి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచుకోవడానికి గుడ్లు బాగా సహాయపడుతాయి. గుడ్డు ఆరోగ్యం, పోషక విలువలు కల బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే శరీర కొవ్వు కరిగి ఎనర్జీ వస్తుంది. గుడ్డు పొట్ట నింపుతుంది. కొవ్వును కరిగించి ఎనర్జీగా మార్చి శరీరానికిస్తుంది.
COMMENTS