చిలుకూరు బాలాజీ దేవాలయం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలంలోని చిలుకూరు గ్రామంలో ఉంది. నగర విస్తరీకరణలో ప్రస్తుతం ఈ క్షేత్రము హైదరాబాదు నగరంలో ఒక భాగమైపోయింది. నగరంలోని అన్ని ప్రాంతాలనుండి బస్సులు నడుస్తుంటాయి.

ఆలయ విశిష్టత


బాలాజీ వేంకటేశ్వరుని అనేక నామాల్లో ఒకటి. ఈ ఆలయం పెద్ద ఆర్భాటాలు లేకుండా, సాదాసీదా గా ఉంటుంది. భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొంటుంటారు. మ్రొక్కుగా ప్రదక్షిణలు చేస్తుంటారు. ఇక్కడ మొక్కుకుంటే వీసా తొందరగా వస్తుందని చాలామంది నమ్మకం. అందుకే ఇక్కడి బాలాజిని వీసా బాలాజీ అని కూడా పిలుస్తారు.
 దేవాలయం మరీ చిన్నదిగా ఉండి, కేవలం లోపల నలుగురైదుగురు మాత్రమే పట్టే వీలు కలిగి ఉంటుంది. కొంతకాలం వరకూ కనీస రవాణా సౌకర్యాలు సైతం లేని ఈ దేవాలయం ఇప్పుడు ప్రత్యేక బస్సులు నడిపించే పరిస్థితికి చేరుకొన్నది. తెలంగాణ తిరుమలగా ఖ్యాతి గాంచిన, హైదరాబాదుకు అతి సమీపంలోని చిలుకూరు గ్రామంలో వెలిసిన, చిలుకూరు బాలాజీ దేవాలయంపై బులెమోని వెంకటేశ్వర్లు సుమారు మూడు సంవత్సరాలపాటు పరిశోధన చేసి వ్రాసిన గ్రంథం "చిలుకూరు క్షేత్ర చరిత్ర".

చారిత్రికత

క్రీ.శ.1067లో అప్పటి రాజు అసగ మారస నేతృత్వంలో ఈ దేవాలయన్ని నిర్మించారు.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: