ప్రపంచ వ్యాప్తంగా మధుమేహ వ్యాధి అత్యంత ఆందోళనకరమైన రీతిలో విస్తరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పది సెకన్లకు ఇద్దరు కొత్తగా మధుమేహ వ్యాధికి గురవుతున్నారు. ప్రస్తుతం 28.5 కోట్ల మంది మధుమేహ రోగుల్లో 5 కోట్ల 8 లక్షల మంది భారతదేశంలోనే ఉండడం గమనార్హం. మధుమేహ వ్యాధితో ఉన్న రోగి ఆసుపత్రిలో చేరడానికి దారితీస్తున్న అతిసాధారణ కారణం పాదాల సమస్య. చిన్న పుండుగా మొదలై పాదం తొలగింపునకు దారితీసే ప్రమాదకర పాదాల సమస్యను మధుమేహ రోగులు సరైన అవగాహనతో తగిన జాగ్రత్తలు పాటించి నివారించుకోవాలి. అందుకే మధుమేహ వ్యాధి ఉన్నవారు తమపాదాల సంరక్షణ గురించి సరైన అవగాహన కలిగి ఉండాలి. పాదాల సంరక్షణ గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం.

పాదాల సంరక్షణ 

ప్రత్యేక వైద్య విభాగం

మధుమేహ వ్యాధి ఉన్న వారిలో ప్రతి నలుగురిలో ఇద్దరికి పాదాలకు సంబంధించిన సమస్య ఉంది. సగటున ప్రతి 30 సెకన్లకు ఒక అంగచ్ఛేదం (అంప్యూటేషన్‌) మధుమేహం కారణంగా జరుగుతున్నది. మధుమేహ వ్యాధిలో పాదాలకు సమస్యలు రావడంవల్ల దీర్ఘకాలం ఆసుపత్రిలో ఉండాల్సిరావడంసంక్లిష్టమైన చికిత్సఒక్కోసారి అంగవైకల్యం ప్రాప్తించడం వంటి ఇబ్బందుల కారణంగా రోగులకే కాకుండా దేశానికి కూడా ఆర్థికభారమైఉత్పత్తి సామర్థ్యం కూడా దెబ్బ తింటున్నది. ఇంతగా ప్రాధాన్యత సంతరించుకున్న పాదాల సమస్యకు చికిత్స చేసేందుకు మధుమేహ వ్యాధిలోనే ప్రత్యేకంగా 'పొడియాట్రిఅన్న స్పెషాలిటీ ఆవిర్భవించింది. దీర్ఘకాలంగా మధుమేహం ఉన్నవారిలో 15 శాతం మందికి పాదాల సమస్య వచ్చే అవకాశం ఉన్నది. పాదాలపై ఏర్పడే పుండ్లుఎర్రని మచ్చలులోపలకుపెరిగిన గోళ్లుతీయడానికి కష్టంగా ఉన్న ఆనెలుచీము ఏర్పడడంఒక్కోసారి తీవ్రమైన కేసు. వేలు లేదా పాదం నల్లబడడం (గ్యాంగ్రీన్‌)ముదిరితే ఆ భాగం లేదా మొత్తం పాదం తీసివేయాల్సి రావడం జరుగుతుంది.

ఐదు అంచెలు

పాదాల పుండ్లను అంచనావేసి చికిత్స చేసేందుకు చాలా పద్దతులున్నప్పటికీ సాధారణంగా వేగర్స్‌ పద్ధతి ప్రకారం ఆరు గ్రేడులుగా విభజిస్తారు.
•  గ్రేడ్‌ 1 : పుండ్లు లేనప్పటికీ పుండ్లు ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
  గ్రేడ్‌ 2 : పుండు ఉపరితం వరకే పరిమితమై ఉంటుంది.
  గ్రేడ్‌ 3 : పుండు చర్మం కింద కండరంఎముకకీలు లోకి పాకి ఉంటుంది.
 గ్రేడ్‌ 4 : పుండు లోతుగా క్రిమి దోషం తో ఉంటుంది. ఆస్టియోమైలైటిస్‌ అంటే ఎముకకు కూడా క్రిమి దోషం ఉంటుంది.
•  గ్రేడ్‌ 5 : ఏదో ఒక భాగంలో కణజాలం కుళ్లిపోయి ఉంటుంది. దీనినే లోకలైజ్డ్‌ గాంగ్రీన్‌ అంటారు.
•  గ్రేడ్‌ 6 : ఈ దశలో గాంగ్రీన్‌ చాలా విస్త్రృతంగా వ్యాపించి ఉంటుంది. ఆ భాగం తొలగించాల్సి వస్తుంది.
పాదాల పుండ్లకు చికిత్స
   అవసరమైన మేరకు ఇన్సులిన్‌ ఇంజక్షన్‌తో మధుమేహాన్ని నియంత్రించాలి.
   చెడుచనిపోయిన కణజాలాన్ని తొలగించిగాయాన్ని శుభ్రపరచాలి.
   ఇన్‌ఫెక్షన్‌ నియంత్రించేందుకు సరైన యాంటిబయాటిక్స్‌ వాడాలి.
   పుండు మానేసేందుకు వీలుగా పాదంపై బరువు మోపకుండా చూడాలి.
   చర్మం ఎక్కువగా పోయిన సందర్భాల్లో మానని పుండుపై చర్మం అతికించడం చికిత్సలో భాగం.
 మొండిగా ఉన్న కేసుల్లో ఆ భాగాన్ని లేదా పాదాన్ని తొలగించి ప్రొస్తెటిక్‌ ఆంగాల్ని అమర్చడం మరో చికిత్స. పాదాల సంరక్షణ
   మధుమేహ రోగి ప్రతి రోజూ తన పాదాలను పరీక్షించుకోవాలి. ఏవైనా పుండ్లుకాలిన గుర్తులుబొబ్బలుచర్మం నల్లబడడంలేదా ఎర్రని ఆనెలువేళ్ల వంకరలోపలికి పెరుగుతున్న వేలిగోళ్లు వంటి మార్పులు గుర్తించాలి. పాదాల అడుగు భాగాన్ని కూడా పరీక్షించుకోవాలి.

తీసుకోవలసిన జాగ్రత్తలు :

  ప్రతి రోజూ మీ పాదాలను గోరువెచ్చని నీళ్లుసబ్బుతో శుభ్రపరుచుకోవాలి.
•  పాదాలను వేళ్ల మధ్య భాగంలో కూడా పొడిగా ఉండేలా తుడుచుకోవాలి.
  వేళ్ల గోళ్లను సమంగా కత్తిరించండి.
  పాదాల చర్మం పొడిగాఉంటే మాయిశ్చరైజర్‌ లోషన్‌ రాయండి. వేళ్ల మధ్య రాయకండి.
•  పాదాలకుఎక్కువ చెమట పడుతుంటేఏదైనా టాల్కమ్‌ పౌడర్‌ రాయండి.
•  ప్యూమైస్‌ రాయితో ఆనెలను లేదా గరుకు చర్మాన్ని అరిగేలా చేయండి.
•  మెత్తనిసరైన పాదరక్షలు ధరించండి. కాళ్లకు సరిపడే మేజోళ్లను వాడండి. కాస్త వదులుగా ఉంటే మంచిది.
•  పాదరక్షలు కొత్తవి కొన్నప్పుడు నిదానంగారాపిడి తగలకుండా అలవాటు చేసుకోండి. ఎంచుకునేటప్పుడు     వేళ్లవైపు వెడల్పుగా ఉండేలామడమ భాగం కూడా ఇరుకుగా లేకుండా చూసుకోండి.
•  రోజూ ధరించడానికి ముందు మట్టిచిన్న రాళ్లుమేకులు వంటి వాటికై పాదరక్షలు పరిశీలించాలి.
 కాళ్లల్లో రక్తప్రసారం మెరుగయ్యేందుకు రోజూ పాదాల్ని కిందకూపైకీపక్కలకూ కదుపుతూ వ్యాయామం చేయాలి.

పుండ్లు ఎప్పుడు ఏర్పడతాయి ?

•  ఇంతకుముందు పాదానికి పుండు ఏర్పడితగ్గి పోయినప్పుడు.
•  ఇప్పటికే ఒక కాలు తీసివేసి ఉన్నవారిలోరెండో కాలికి ఏర్పడే అవకాశం ఎక్కువ.
•  ఆనెలు వంటివి ఏర్పడటం.
•  పాదాల నిర్మాణంలో తేడా ఉండడం. అంటే వంకర పాదంవేళ్లు వంకర.
•  పాదానికి రక్తప్రసరణ తగ్గడం.
•  పెరిఫరల్‌ నాడీవ్యవస్థ దెబ్బతిని నొప్పివేడిచల్లదనం వంటి జ్ఞానం తెలీకుండా మొద్దుబారడం.
•  చూపు కోల్పోయిన వారిలో.
•  మూత్రపిండాల పనితీరు మందగించిన వారిలో.
•  ఒంటరిగా ఉండే వృద్ధుల్లో.
• ఇవి గాక ధూమపానంమద్యపానంఅవగాహన లోపం వంటివి అదనంగా పుండ్లు ఏర్పడేందుకు దారితీస్తాయి.

కారణాలు ఏమిటి ?

  పాదాలకు రక్తప్రసరణ తగ్గిపోవడం.
  పాదాలకు సంబంధించిన నాడీవ్యవస్థ పనితీరు మందగించడం.
  ఇన్‌ఫెక్షన్‌

పై మూడు కారణాల వల్ల సంభవించే ప్రమాదకరమైన పాదాల సమస్యలకు చికిత్స కంటే పాదాల సమస్య రాకుండా నివారణే అత్యంత ముఖ్యం.
Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: