2013
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
ఉబ్బసము (Asthma) ఒక తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి. ఇది దీర్ఘకాలంగా మనిషికి ఊపిరి అందకుండా చేస్తుంది. ఇది పిల్లలలోను పెద్దవారిలోను కూడా కనిపిస్తుంది. అయితే ఇద్దరిలోనూ కారణాలు వేరువేరుగా ఉంటాయి. ఈ వ్యాధి ప్రధాన లక్షణం ఆయాసం.
ఉబ్బసం ఉపసమననికి వాడే ిఇన్యేలర్
ఈ వ్యాధి మూలంగా శ్వాస నాళాలు సంకోచించి వాపు మూలంగా శ్లేష్మం ఎక్కువగా తయారై ఊపిరికి అడ్డుకుంటాయి. అయితే ఇలా జరగడానికి సాధారణంగా వాతావరణంలోని ఎలర్జీ కలిగించే పదార్ధాలు కారణంగా చెప్పవచ్చును. పొగాకుచల్లని గాలిసుగంధాలుపెంపుడు జంతువుల ధూళివ్యాయామంమానసిక ఆందోళన మొదలైనవి ఇందుకు ప్రధాన కారణాలు. పిల్లలలో జలుబు వంటి వైరస్ వ్యాధులు ప్రధాన కారణము.
ఈ విధమైన శ్వాస నాళాల సంకోచం వలన పిల్లి కూతలుఆయాసంఛాతీ పట్టినట్లుగా ఉండడం మరియు దగ్గు వస్తాయి. శ్వాస నాళాల వ్యాకోచాన్ని కలిగించే మందులు సాధారణంగా మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. అయితే తగ్గినట్లుగానే తగ్గి మళ్ళీ తిరిగి వచ్చేయడం ఉబ్బసం యొక్క ప్రధానమైన లక్షణం. ఇందుమూలంగా వీరు మందులకు అలవాటు పడిపోయే ప్రమాదం ఉన్నది. కొంతమందిలో ఈ వ్యాధి ప్రాణాంతకం కూడా కావచ్చును. అభివృద్ధి చెందిన మరియు చెందుతున్న దేశాలలోని పట్టణ ప్రాంతాలలో ఉబ్బసం వ్యాధి ఎక్కువ అవుతుందని గుర్తించారు. దీని మూలంగా నలుగురిలో ఒకరు పిల్లలు ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందువలన పట్టణాలలోని వాతావరణ కాలుష్యం నియంత్రించేందుకు ప్రజల్ని జాగృతుల్ని చేయవలసి ఉన్నది.

కారణాలు

శ్వాసకోశాలుజీవితపు మనుగడకు అవసరమైన ప్రాణవాయువును శ్వాసప్రక్రియ ద్వారా అందిస్తాయి. ప్రతిరోజూ మన శ్వాసకోశాలుపలురకాల వాతావరణ పరిస్థితులుఎలర్జైన్లురసాయనాలుపొగదుమ్ముదూళి తదితర అంశాలకు లోనవుతుంటాయి. వీటివల్ల వివిధ రకాల దీర్ఘవ్యాధులు వస్తాయి. అలాంటి దీర్ఘకాలిక వ్యాధుల్లో ఆస్తమా ఒకటి. మన ముక్కులోకిఊపిరితిత్తుల్లోకిశరీరానికి సరిపడని సూక్ష్మపదార్థాలు (ఎలర్జైన్స్) గాలి ద్వారా లేదా ఆహారం ద్వారా ప్రవేశించినప్పుడు వాటికి ప్రతిచర్యగా శరీరం స్పందించి కొన్ని రకాల రసాయనాలను విడుదల చేస్తుంది. వీటి ప్రభావం వల్ల మన శ్వాసనాళాలు కుంచించుకుపోతాయి. ఫలితంగా శ్వాసతీసుకోవడం కష్టమవుతుంది. ఆస్తమా ఉన్న వారిలో తరుచూ ఆయాసం రావడంపిల్లికూతలుదగ్గుఛాతీ బరువుగా ఉండడంవ్యాయామం చేయలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటితో పాటు కొంత మందిలో తరుచూ తుమ్ములు రావడంముక్కునుంచి నీరు రావడంతరుచూ జలుబు చేయడం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. ఆస్తమా రావడానికి గల కారణాలు చాలానే ఉన్నప్పటికీ వాటిలో జన్యుసంబంధిత కారణాలు చాలా ప్రధానమైనవి. వీటితో పాటు వాతావరణ పరిస్థితులుఇంటిలోపలబయటా గల వివిధ కాలుష్య కారణాల వల్ల కూడా ఆస్తమా రావచ్చు. లేదా అప్పటికే ఆస్తమా ఉంటే ఈ కారణాలతో మరికాస్తా పెరగవచ్చు.

జాగ్రత్తలు

•             ఆస్తమా ఉన్న వారు సమస్య మరింత తీవ్రం కాకుండా ధూమనానానికి దూరంగా ఉండాలి.
•             దుమ్మూదూళికి దూరంగా ఉండాలి.
•             శీతల పానీయాలుఐస్‌క్రీములుఫ్రిజ్‌వాటర్ వంటి పడని పదార్థాలకు దూరంగా ఉండాలి.
•             ఇంట్లో బూజు దులపడం వంటివి ఆస్తమా ఉన్నవారు చేయకూడదు.

ఆస్తమాను పెంచే కారణాలు

చలికాలంపెంపుడు జంతువులువాటి ఉన్నిగాలిలోని రసాయనాలు, , ఘాటు వాసనలుఅతిగా చేసే శారీరక శ్రమపుప్పొడి రేణువులుఇవన్నీ ఆస్తమా తీవ్రత పెరగడానికి కారణమవుతాయి.

హోమియో చికిత్స

ఏదైతే ఒక వ్యాధికి కారణమవుతుందో అదే ఆ వ్యాధికి చికిత్సకు ఉపయోగపడుతుంది అనే ప్రకృతి సిద్ధాంతం పై హోమియో వైద్య విధానం ఆధారపడి ఉంది. దీన్నే లాటిన్ భాషలో 'సిమిలియా సిమిలిబస్ క్యూరెంటార్ అంటారు. ఇది ఇంచుమించు 'ఉష్ణం ఉష్ణేన శీతలంఅన్న సూత్రం లాంటిదే. ప్రకృతిని నిశితంగా పరిశీలించడంఅనుకరించడం ద్వారా అన్ని విజ్ఞాన శాస్త్రాల్లోనూ ఇలాంటి ఎన్నో గొప్ప విషయాలు కనుగొన్నారు. హోమియోపతి కూడా అలాంటి విజ్ఞాన శాస్త్రమే. ఆస్తమానుంచి పూర్తి ఉపశమనం కలిగించే మందులు హోమియోలో ఉన్నాయి. అయితే ఈ విధానం కేవలం ఆస్తమా లక్షణాలను తగ్గించడానికే పరిమితం కాకుండాఆ లక్షణాలను కలిగించే కారణాలను కూడా తొలగిస్తుంది. రోగి శరీర ధర్మాన్నే కాకుండా మానసిక తత్వాన్ని కూడా పూర్తిగా విశ్లేషించి హోమియో వైద్యులు మందులు సూచిస్తారు. అలాంటి మందుల్లో అకాలిఫా ఇండికాఎలియాంథస్ గాండ్యులోపాఅరాలియం రెసియోపాబ్లాటా ఓరియంటాలిస్బ్రోమియంఆర్సనికం ఆల్బంఆంటిమోనియం టార్టారికంకాలికార్బ్ఇపికాక్పల్సటిల్లా వంటి మందులు ప్రముఖమైనవి. అయితే నిపుణులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వీటిని వాడవలసి ఉంటుంది.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
ప్రపంచ వ్యాప్తంగా మధుమేహ వ్యాధి అత్యంత ఆందోళనకరమైన రీతిలో విస్తరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పది సెకన్లకు ఇద్దరు కొత్తగా మధుమేహ వ్యాధికి గురవుతున్నారు. ప్రస్తుతం 28.5 కోట్ల మంది మధుమేహ రోగుల్లో 5 కోట్ల 8 లక్షల మంది భారతదేశంలోనే ఉండడం గమనార్హం. మధుమేహ వ్యాధితో ఉన్న రోగి ఆసుపత్రిలో చేరడానికి దారితీస్తున్న అతిసాధారణ కారణం పాదాల సమస్య. చిన్న పుండుగా మొదలై పాదం తొలగింపునకు దారితీసే ప్రమాదకర పాదాల సమస్యను మధుమేహ రోగులు సరైన అవగాహనతో తగిన జాగ్రత్తలు పాటించి నివారించుకోవాలి. అందుకే మధుమేహ వ్యాధి ఉన్నవారు తమపాదాల సంరక్షణ గురించి సరైన అవగాహన కలిగి ఉండాలి. పాదాల సంరక్షణ గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం.

పాదాల సంరక్షణ 

ప్రత్యేక వైద్య విభాగం

మధుమేహ వ్యాధి ఉన్న వారిలో ప్రతి నలుగురిలో ఇద్దరికి పాదాలకు సంబంధించిన సమస్య ఉంది. సగటున ప్రతి 30 సెకన్లకు ఒక అంగచ్ఛేదం (అంప్యూటేషన్‌) మధుమేహం కారణంగా జరుగుతున్నది. మధుమేహ వ్యాధిలో పాదాలకు సమస్యలు రావడంవల్ల దీర్ఘకాలం ఆసుపత్రిలో ఉండాల్సిరావడంసంక్లిష్టమైన చికిత్సఒక్కోసారి అంగవైకల్యం ప్రాప్తించడం వంటి ఇబ్బందుల కారణంగా రోగులకే కాకుండా దేశానికి కూడా ఆర్థికభారమైఉత్పత్తి సామర్థ్యం కూడా దెబ్బ తింటున్నది. ఇంతగా ప్రాధాన్యత సంతరించుకున్న పాదాల సమస్యకు చికిత్స చేసేందుకు మధుమేహ వ్యాధిలోనే ప్రత్యేకంగా 'పొడియాట్రిఅన్న స్పెషాలిటీ ఆవిర్భవించింది. దీర్ఘకాలంగా మధుమేహం ఉన్నవారిలో 15 శాతం మందికి పాదాల సమస్య వచ్చే అవకాశం ఉన్నది. పాదాలపై ఏర్పడే పుండ్లుఎర్రని మచ్చలులోపలకుపెరిగిన గోళ్లుతీయడానికి కష్టంగా ఉన్న ఆనెలుచీము ఏర్పడడంఒక్కోసారి తీవ్రమైన కేసు. వేలు లేదా పాదం నల్లబడడం (గ్యాంగ్రీన్‌)ముదిరితే ఆ భాగం లేదా మొత్తం పాదం తీసివేయాల్సి రావడం జరుగుతుంది.

ఐదు అంచెలు

పాదాల పుండ్లను అంచనావేసి చికిత్స చేసేందుకు చాలా పద్దతులున్నప్పటికీ సాధారణంగా వేగర్స్‌ పద్ధతి ప్రకారం ఆరు గ్రేడులుగా విభజిస్తారు.
•  గ్రేడ్‌ 1 : పుండ్లు లేనప్పటికీ పుండ్లు ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
  గ్రేడ్‌ 2 : పుండు ఉపరితం వరకే పరిమితమై ఉంటుంది.
  గ్రేడ్‌ 3 : పుండు చర్మం కింద కండరంఎముకకీలు లోకి పాకి ఉంటుంది.
 గ్రేడ్‌ 4 : పుండు లోతుగా క్రిమి దోషం తో ఉంటుంది. ఆస్టియోమైలైటిస్‌ అంటే ఎముకకు కూడా క్రిమి దోషం ఉంటుంది.
•  గ్రేడ్‌ 5 : ఏదో ఒక భాగంలో కణజాలం కుళ్లిపోయి ఉంటుంది. దీనినే లోకలైజ్డ్‌ గాంగ్రీన్‌ అంటారు.
•  గ్రేడ్‌ 6 : ఈ దశలో గాంగ్రీన్‌ చాలా విస్త్రృతంగా వ్యాపించి ఉంటుంది. ఆ భాగం తొలగించాల్సి వస్తుంది.
పాదాల పుండ్లకు చికిత్స
   అవసరమైన మేరకు ఇన్సులిన్‌ ఇంజక్షన్‌తో మధుమేహాన్ని నియంత్రించాలి.
   చెడుచనిపోయిన కణజాలాన్ని తొలగించిగాయాన్ని శుభ్రపరచాలి.
   ఇన్‌ఫెక్షన్‌ నియంత్రించేందుకు సరైన యాంటిబయాటిక్స్‌ వాడాలి.
   పుండు మానేసేందుకు వీలుగా పాదంపై బరువు మోపకుండా చూడాలి.
   చర్మం ఎక్కువగా పోయిన సందర్భాల్లో మానని పుండుపై చర్మం అతికించడం చికిత్సలో భాగం.
 మొండిగా ఉన్న కేసుల్లో ఆ భాగాన్ని లేదా పాదాన్ని తొలగించి ప్రొస్తెటిక్‌ ఆంగాల్ని అమర్చడం మరో చికిత్స. పాదాల సంరక్షణ
   మధుమేహ రోగి ప్రతి రోజూ తన పాదాలను పరీక్షించుకోవాలి. ఏవైనా పుండ్లుకాలిన గుర్తులుబొబ్బలుచర్మం నల్లబడడంలేదా ఎర్రని ఆనెలువేళ్ల వంకరలోపలికి పెరుగుతున్న వేలిగోళ్లు వంటి మార్పులు గుర్తించాలి. పాదాల అడుగు భాగాన్ని కూడా పరీక్షించుకోవాలి.

తీసుకోవలసిన జాగ్రత్తలు :

  ప్రతి రోజూ మీ పాదాలను గోరువెచ్చని నీళ్లుసబ్బుతో శుభ్రపరుచుకోవాలి.
•  పాదాలను వేళ్ల మధ్య భాగంలో కూడా పొడిగా ఉండేలా తుడుచుకోవాలి.
  వేళ్ల గోళ్లను సమంగా కత్తిరించండి.
  పాదాల చర్మం పొడిగాఉంటే మాయిశ్చరైజర్‌ లోషన్‌ రాయండి. వేళ్ల మధ్య రాయకండి.
•  పాదాలకుఎక్కువ చెమట పడుతుంటేఏదైనా టాల్కమ్‌ పౌడర్‌ రాయండి.
•  ప్యూమైస్‌ రాయితో ఆనెలను లేదా గరుకు చర్మాన్ని అరిగేలా చేయండి.
•  మెత్తనిసరైన పాదరక్షలు ధరించండి. కాళ్లకు సరిపడే మేజోళ్లను వాడండి. కాస్త వదులుగా ఉంటే మంచిది.
•  పాదరక్షలు కొత్తవి కొన్నప్పుడు నిదానంగారాపిడి తగలకుండా అలవాటు చేసుకోండి. ఎంచుకునేటప్పుడు     వేళ్లవైపు వెడల్పుగా ఉండేలామడమ భాగం కూడా ఇరుకుగా లేకుండా చూసుకోండి.
•  రోజూ ధరించడానికి ముందు మట్టిచిన్న రాళ్లుమేకులు వంటి వాటికై పాదరక్షలు పరిశీలించాలి.
 కాళ్లల్లో రక్తప్రసారం మెరుగయ్యేందుకు రోజూ పాదాల్ని కిందకూపైకీపక్కలకూ కదుపుతూ వ్యాయామం చేయాలి.

పుండ్లు ఎప్పుడు ఏర్పడతాయి ?

•  ఇంతకుముందు పాదానికి పుండు ఏర్పడితగ్గి పోయినప్పుడు.
•  ఇప్పటికే ఒక కాలు తీసివేసి ఉన్నవారిలోరెండో కాలికి ఏర్పడే అవకాశం ఎక్కువ.
•  ఆనెలు వంటివి ఏర్పడటం.
•  పాదాల నిర్మాణంలో తేడా ఉండడం. అంటే వంకర పాదంవేళ్లు వంకర.
•  పాదానికి రక్తప్రసరణ తగ్గడం.
•  పెరిఫరల్‌ నాడీవ్యవస్థ దెబ్బతిని నొప్పివేడిచల్లదనం వంటి జ్ఞానం తెలీకుండా మొద్దుబారడం.
•  చూపు కోల్పోయిన వారిలో.
•  మూత్రపిండాల పనితీరు మందగించిన వారిలో.
•  ఒంటరిగా ఉండే వృద్ధుల్లో.
• ఇవి గాక ధూమపానంమద్యపానంఅవగాహన లోపం వంటివి అదనంగా పుండ్లు ఏర్పడేందుకు దారితీస్తాయి.

కారణాలు ఏమిటి ?

  పాదాలకు రక్తప్రసరణ తగ్గిపోవడం.
  పాదాలకు సంబంధించిన నాడీవ్యవస్థ పనితీరు మందగించడం.
  ఇన్‌ఫెక్షన్‌

పై మూడు కారణాల వల్ల సంభవించే ప్రమాదకరమైన పాదాల సమస్యలకు చికిత్స కంటే పాదాల సమస్య రాకుండా నివారణే అత్యంత ముఖ్యం.
no image
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
హెపటైటిస్‌-బి (Hepatitis B) అనేది కాలేయానికి సంబంధించిన వ్యాధి. హెపటైటిస్‌-బి వైరస్ ద్వారా ఈ వ్యాధి వస్తుంది. ఈ వైరస్ హెపడ్నావైరస్ (Hepadnaviridae) కుటుంబానికి చెందిన వందల రకాల వైరస్లలో ఒక రకం. దీనికి సీరం హెపటైటిస్ (serum hepatitis) అని ఇంకో పేరుంది. ఈ వ్యాధి ఆసియా మరియు ఆఫ్రికా ఖండాలలో చాలా చోట్ల ప్రబలంగా ఉంది. ఒంట్లో హెపటైటిస్‌-బి వైరస్‌ ఉన్నవాళ్లు మన దేశంలోమన ప్రాంతంలో చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. మొత్తం జనాభాలో వీరు 3-5% వరకూ ఉన్నట్టు అంచనాలు చెబుతున్నాయి. కాలేయానికి వాపు రావటంవాంతులుపచ్చ కామెర్లు ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి ముదిరితే కాలేయం గట్టిబడిపోయి (liver cirrhosis) లివర్ కాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

వ్యాధి లక్షణాలు

ఒకసారి హెపటైటిస్‌-బి వైరస్‌ ఒంట్లో ప్రవేశించిందంటే ఒంట్లో దాని సంఖ్య విపరీతంగా లక్షల్లో పెరిగిపోతూ అది లివర్‌ను దెబ్బతియ్యటం ఆరంభిస్తుంది. ఇక వాళ్ల రక్తంలోనూవీర్యంలోనూలాలాజలంలోనూఇతరత్రా శారీరక స్రావాలన్నింటిలోనూ ఈ వైరస్‌ ఉండొచ్చు. ఈ వైరస్ ఎక్కువగా శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. సెక్స్రక్తమార్పిడిసూదులుసిరంజిలు తల్లినుండి బిడ్డకు సంక్రమింస్తుంది.

తొలి దశ :

హెపటైటిస్‌-బి వైరస్‌ శరీరంలో ప్రవేశించిన తర్వాత సాధారణంగా చాలామందికి కొద్దిరోజుల్లో కామెర్లు వస్తాయి. దీన్ని 'అక్యూట్‌దశ అంటారు. కామెర్లతో పాటు వికారంఅన్నం సయించకపోవటంకొద్దిపాటి జ్వరం వంటి లక్షణాలూ ఉండొచ్చు. ఈ దశలో HBsAg పరీక్ష చేస్తే 'పాజిటివ్‌వస్తుంది.

 హెపటైటిస్‌-బి 'పాజిటివ్‌ఉన్న వారిలో నూటికి 99.5 మందికి ప్రాణాపాయం ఉండదు. ఈ దశలో మనం వీరికి మంచి ఆహారంపూర్తి విశ్రాంతి ఇస్తే చాలు. ముఖ్యంగా లివర్‌ను దెబ్బతీసే మందులు వాడకూడదు. పసర్లు తాగించటంచేతులు కాల్పించటం వంటివేమీ చెయ్యకూడదు.
 క్రమంగా కామెర్లు వాటంతట అవే తగ్గిపోతాయి. 95% మందికి ఆర్నెల్లలో హెపటైటిస్‌-బి వైరస్‌ శరీరం నుంచి పూర్తిగా తొలగిపోతుంది. ఆర్నెల్ల తర్వాత వీరికి మళ్లీ HBsAg పరీక్ష చేస్తే- 'నెగిటివ్‌వచ్చేస్తుంది.
 పెద్దల్లో కేవలం కొద్దిమందికి (5%) మాత్రం ఆర్నెల్ల తర్వాత కూడా హెపటైటిస్‌-బి వైరస్‌ ఒంట్లో ఉండిపోవచ్చు. అదే పిల్లల్లో అయితే 90 శాతం మందికి ఈ వైరస్‌ పూర్తిగా పోదుఅదలాగే శరీరంలో ఉండిపోతుంది.
 అంటే హెపటైటిస్‌-బి ఎంతోమందికి సోకినా కేవలం కొద్దిమందికి మాత్రమే అది ఒంట్లో నిల్వ ఉండిపోతుంది. ఇది దీర్ఘకాలిక సమస్యకు ఆరంభం!
 ఒకసారి హెపటైటిస్‌-బి ఉన్నట్టు తేలిందంటే వారి నుంచి అది ఇతరులకు సంక్రమించకుండా ఇంట్లోని వారంతా టీకాలు వేయించుకోవటం వంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. జీవిత భాగస్వాములకు ఈ జాగ్రత్తలు మరీ ముఖ్యం!

 వైరస్ మకాం

కామెర్లు తగ్గిన ఆర్నెల్ల తర్వాత కూడా HBsAg పరీక్ష పాజిటివ్‌ వస్తుంటే దాన్ని దీర్ఘకాలిక సమస్యగా క్రానిక్‌ హెపటైటిస్‌గా పరిగణిస్తారు. ఇలా హెపటైటిస్‌-బి ఒంట్లో ఉండిపోతున్నా కూడా వీరిలో 60 శాతం మంది జీవితాంతం అలాగే.. ఏ సమస్యలూ లేకుండా ఉండిపోవచ్చు. వీళ్లను అన్‌ఎఫెక్టెడ్‌ క్యారియర్స్‌ అంటారు. అంటే వైరస్‌ ఒంట్లో ఉన్నందువల్ల వీళ్లకే సమస్యా ఉండదు. ఏ లక్షణాలూఏ బాధలూ ఉండవు. చాలాసార్లు ఒంట్లో వైరస్‌ ఉన్న విషయం కూడా వీరికి తెలీదు. మామూలు హెల్త్ చెకప్‌లకు వెళ్లినప్పుడోరక్తదానం చేసినప్పుడోగర్భం దాల్చినప్పుడు సాధారణంగా చేసే పరీక్షల్లోనే ఈ విషయం బయటపడుతుంది. మరిన్ని పరీక్షలు చేస్తే వీరికి HBsAg- పాజిటివ్‌ ఉంటుందిగానీ SGPT నార్మల్‌గానే ఉంటుంది, HBeAg నెగిటివ్‌ ఉంటుంది. వైరల్‌లోడ్‌ కూడా తక్కువే ఉంటుంది. అంటే వీళ్ల ఒంట్లో వైరస్‌ ఉందిగానీ దానివల్ల లివర్‌ ప్రభావితం కావటం లేదని అర్థం. వైరస్‌ వల్ల వీరికే సమస్యా లేకపోయినా వీరి నుంచి వైరస్‌ ఇతరులకు సంక్రమించే అవకాశం మాత్రం ఉంటుంది.
 వీళ్లకు లివర్‌ సమస్యలు వచ్చే అవకాశం తక్కువే. అయినా వీళ్లు ఆర్నెల్లకోసారి వైద్యులను కలిసి ముఖ్యమైన పరీక్షలు ఒకటిరెండు చేయించుకోవటం ఉత్తమం. ఎందుకంటే ఇప్పటికి వైరస్‌ వల్ల ఏ ఇబ్బందీ లేకపోయినా జీవితాంతం ఇలాగే ఉంటుందని చెప్పలేం.
  కొందరు జీవితాంతం ఈ దశలోనే ఇలాగే ఏ ఇబ్బందీ లేకుండా గడిచిపోయేవారూ ఉంటారు.
 వీళ్లు ఎప్పుడూ రక్తదానం చెయ్యకూడదు. దేనికోసం వైద్యుల దగ్గరకు వెళ్లినా హెపటైటిస్‌-బి ఉన్న విషయం చెప్పాలి. మధ్యం ముట్టకూడదు. చక్కటి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వీరి నుంచి వైరస్‌ సంక్రమించకుండా సన్నిహితులంతా జాగ్రత్తలు తీసుకోవాలి.

భవిష్యత్తులో ప్రమాదం

ఒంట్లో వైరస్‌ నివాసం ఏర్పరచుకున్న క్రానిక్‌ హెపటైటిస్‌ బాధితుల్లో 60 శాతం మందికి ఏ ఇబ్బందీ లేకపోయినాఓ 40 శాతం మందికి మాత్రం భవిష్యత్తులో ఒక మోస్తరు నుంచి తీవ్రస్థాయి లివర్‌ వ్యాధులు మొదలయ్యే అవకాశం ఉంటుంది. వీరికి భవిష్యత్తులో సమస్య ఎలా ఉండొచ్చుఎంత తీవ్రంగా ఉండొచ్చన్నది ముందే చెప్పేందుకు పరీక్షలు ఉపకరిస్తాయి.
• పరీక్షల్లో- HBsAg పాజిటివ్‌గా ఉండటమే కాకుండా HBeAg కూడా పాజిటివ్‌ ఉండి, SGPT(కాలేయానికి సంబంధించిన ఎన్‌జైమ్‌) ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండి వైరల్‌ లోడ్‌ 5 లక్షల కంటే ఎక్కువ ఉందంటే అర్థం వీరికి భవిష్యత్తులో ఎప్పుడోకప్పుడు లివర్‌ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని!
•  దాన్ని నివారించుకోటానికి కావాల్సిన మందులు ఇప్పుడు మన అందుబాటులో ఉన్నాయి. వీరు తక్షణం పెగ్‌-ఇంటర్‌ఫెరాన్‌లెమోవిడిన్‌ఎడిఫోవిర్‌ఎంటకావిర్‌ వంటి యాంటీ వైరల్‌ మందులు తీసుకోవటం ద్వారా మున్ముందు కూడా అసలు లివర్‌ వ్యాధి రాకుండా నివారించుకునే అవకాశం ఉంది.
• సన్నిహితులకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యం ముట్టకుండాఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతుండాలి. తరచూ వైద్యులను సంప్రదిస్తుండాలి.

వైరస్ దాడి

కొంతకాలంగా హెపటైటిస్‌-బి వైరస్‌ ఒంట్లో ఉండి లివర్‌ ప్రభావితమైనా కూడా ఏ సమస్యా లేకుండా గడిపేవాళ్లు కొందరైతే కొందరికి ఎప్పుడైనా తీవ్రమైన లివర్‌ సమస్యలు ఆరంభం కావచ్చు. తీవ్రస్థాయి కామెర్లులేదా పొట్ట ఉబ్బరంజలోదరంసరైన స్పృహ లేకపోవటంరక్తపువాంతుల వంటి లక్షణాల్లో ఏవో ఒకటి మొదలవ్వచ్చు.కొందరికి అన్నీ రావచ్చు.
పరీక్షల్లో వీరికి HBs Ag పాజిటివ్‌ ఉంటుంది. ఇక HBe Ag పాజిటివ్‌ ఉండొచ్చునెగిటివ్‌ ఉండొచ్చు. అలాగే వైరల్‌ లోడ్‌ ఎక్కువ ఉండొచ్చుతక్కువ కూడా ఉండొచ్చు. ఎందుకంటే లివర్‌ మీద దుష్ప్రభావాలు వచ్చిన తర్వాత ఒంట్లో వైరల్‌ లోడ్‌ తగ్గిపోవచ్చు కూడా.
 ఆల్ట్రాసౌండ్‌ పరీక్షలో చూస్తే మెత్తగామృదువుగా ఉండాల్సిన లివర గట్టిబడుతూ చిన్నదవుతున్నట్టుగడ్డలుగడ్డలుగా తయారవుతున్నట్టు కనబడొచ్చు. ప్లీహం పెద్దదై కూడా ఉంటుంది. ఎండోస్కోపీలో అన్నవాహికలోని రక్తనాళాలు పెద్దవై కనబడతాయి.
దీనర్థం వైరస్‌ దీర్ఘకాలం ఒంట్లో ఉండటం వల్ల లివర్‌ దెబ్బతినటం ఆరంభమైంది. వైరస్‌ వల్ల అది గట్టిబడిపోవటం మొదలైంది. కొద్దికొద్దిగా గట్టిబడుతున్న తొలి దశను ఫైబ్రోసిస్‌ అనీమరీ ముదిరిన తర్వాతి దశను 'సిర్రోసిస్‌అనీ అంటారు. దీనికి కూడా యాంటీ వైరల్‌ మందులు ఆరంభిస్తే లివర్‌ ఆ స్థితి నుంచి మరింత దెబ్బతినకుండా ఉంటుంది. రక్తపువాంతుల వంటి సమస్యలకు కూడా చికిత్స చెయ్యొచ్చు. మొత్తం మీద ఇప్పుడున్న చికిత్సలతో- చాలాకాలం పాటు వీరి సాధారణ జీవితానికి సమస్యల్లేకుండా చూడొచ్చు.
 సిర్రోసిస్‌ మొదలైన తర్వాత కూడా కొన్ని దశాబ్దాల పాటు జీవించే వాళ్లు చాలామంది ఉంటారు. కాబట్టి నిర్వేదంలోకి జారిపోకుండా చికిత్స తీసుకోవటం ముఖ్యం.
• ఆల్కహాల్‌ ముట్టకూడదుతరచూ వైద్యుల పర్యవేక్షణ అవసరం.
 వైరస్‌ సన్నిహితులకు సంక్రమించకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి.

విపరీత పరిస్థితి

కొందరికి ఇతరత్రా లివర్‌ సమస్యలేమీ మొదలవ్వకపోయినా.. దీర్ఘకాలంగా ఒంట్లో హెపటైటిస్‌-బి వైరస్‌ ఉన్న కారణంగా లివర్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంటుంది. ఏ పరీక్ష ఏం చెబుతుంది?
• HBs Ag :   ఇది పాజిటివ్‌ ఉంటే హెపటైటిస్‌-బి వైరస్‌ ఒంట్లో ఉందనే అర్థం.
• SGPT : ఇది ఎక్కువుంటే ఒంట్లో వైరస్‌ బాగా చురుకుగా ఉండి తన సంఖ్యనూప్రాబల్యాన్నీ బాగా పెంచుకుంటోందని అర్థం.
• HBe Ag : ఇది పాజిటివ్‌ ఉంటే ఇప్పుడు లివర్‌ బాగానే ఉన్నా భవిష్యత్తులో దెబ్బతినే అవకాశం ఉందని అర్థం.
• డిఎన్‌ఏ వైరల్‌ లోడ్‌: దీనిలో వైరస్‌ సంఖ్య ఎంత ఉందో చూస్తారు. ఇది 5 లక్షలకు మించి ఉన్నట్టయితే లివర్‌ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇది కాస్త ఖరీదైన పరీక్ష.

ముందు జాగ్రత్త

ఇది సోకకుండా చూసుకోవాలంటే ముందస్తు జగ్రత్తలు కొన్ని తీసుకోవాలి
• హెపటైటిస్‌-బి సెక్స్‌ ద్వారా సంక్రమించే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి కండోమ్‌ వంటి సురక్షిత జాగ్రత్తలు తీసుకోకుండా సెక్స్‌లోపాల్గొనవద్దు.
•  ఒకరి టూత్‌బ్రష్షులురేజర్లునెయిల్‌కట్టర్ల వంటివి మరొకరు వాడొద్దు. బయట సెలూన్లలో కూడా కచ్చితంగా కొత్త బ్లేడు వాడేలా చూడాలి.
• ఇంజక్షన్‌ సూదుల వంటివి ఒకరికి వాడినవి మరొకరు ఉపయోగించవద్దు. డిస్పోజబుల్‌ సూదులుసిరంజీలు వాడటం ఉత్తమం.
• చెవులు కుట్టటంముక్కులు కుట్టటంపచ్చబొట్లు వేయించుకోవటం వీటికి ఒకరికి వాడిన పరికరాలు మీకు వాడకుండా చూసుకోవాలి.
• రక్తం ఎక్కించేటప్పుడురక్తమార్పిడి విషయంలో పూర్తి సురక్షితమైన పద్ధతులను అనుసరించటం.. చాలా అవసరం!

పెళ్ళి :

టీకాలునాయి కాబట్టి హెపటైటిస్‌-బి బాధితులు ఈ విషయం ముందుకానే అందరికీ తెలిపివారి అనుమతితో నిశ్చింతగా పెళ్లి చేసుకోవచ్చు. భాగస్వామికి తప్పకుండా హెపటైటిస్‌-బి టీకా మూడు డోసులు ఇప్పించాలి. మూడో డోసు కూడా పూర్తయిన రెండు నెలల తర్వాతే సాధారణ సెక్సు జీవితాన్ని ప్రారంభించాలి. కొన్ని సందర్భాల్లో సిరోసిస్‌ వచ్చినవాళ్లు తప్పించి మిగతా అందరూ పిల్లలను కూడా కనొచ్చు.

గర్భిణులు :

గర్భిణులంతా తప్పనిసరిగా HBsAg పరీక్ష చేయించుకోవాలి. హెపటైటిస్‌-బి ఉన్నా కూడా బిడ్డలను కనొచ్చు. గర్భస్రావాలు చేయించుకోవాల్సిన అవసరమే లేదు. కాకపోతే పుట్టగానే బిడ్డకు ఒక తొడకు HBIGఇమ్యూనోగ్లోబ్యులిన్ల ఇంజక్షన్‌మరో తొడకి హెపటైటిస్‌-బి టీకా రెండు తప్పకుండా ఇవ్వాలి. నెల రోజులకు మరో టీకాఆర్నెల్లకు మరో టీకా ఇప్పించాలి. దీంతో తల్లి నుంచి బిడ్డకు వైరస్‌ సంక్రమించకుండా 95% వరకూ నివారించవచ్చు.

టీకాలు

• ప్రపంచ ఆరోగ్య సంస్థతో సహా ఏ ప్రామాణిక సంస్థా కూడా ప్రజలంతా హెపటైటిస్‌-బి టీకా తప్పకుండా తీసుకోవాలని సిఫార్సు చెయ్యటం లేదు. కొంతమంది మాత్రం తప్పకుండా తీసుకోవాలి.
• చిన్న పిల్లలకూస్కూలు వయసు పిల్లలందరికీ తప్పకుండా టీకా ఇప్పించాలి.
• కుటుంబంలో ఎవరికన్నా హెపటైటిస్‌-బి ఉంటేఆ ఇంట్లోని వారంతా తప్పకుండా టీకా తీసుకోవాలి. వైద్య సిబ్బందితరచూ రక్తమార్పిడి అవసరమయ్యే రకరకాల వ్యాధిపీడితులకు కూడా టీకా తప్పనిసరి

• ఇవాళ మొదటి టీకా వేయించుకుంటే- మళ్లీ సరిగ్గా నెలకు ఒకటిఆర్నెల్లకు మరోటిమొత్తం మూడు టీకాలు తీసుకోవాలి.
no image
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language

రూ‍పాల సంగమేశ్వరం, కర్నూలు


క్రీస్తు శకం ఆరు నుండి తొమ్మిదవశతాబ్దం మధ్య కాలంలో బాదామి చాళుక్యులు తుంగభద్రా నది ఒడ్డున అలంపురం ఆలయ సముదాయాన్ని నిర్మించారు. ప్రస్తుతం బాదామి కర్ణాటక లోని చాగల్ కోట జిల్లాలో ఉన్నది. నిర్మాణాల కవసరమైన రాళ్ళను ఎడ్ల బండ్లపై తరలించే వారు. ఆ బళ్లు నదిలో ప్రయాణిస్తున్నందున వాటికి వేసిన కందెన నీటిలో కరిగి పోయేది. మళ్లీ కొత్తగా వేయాల్సి వచ్చేది. ఆ చక్రాలకు వేసే కందెన తయారీకి ఒక గ్రామం వెలసింది. అదే కందెన వోలు. కాలానుగుణంగా దాని పేరు కర్నూలు గా మారింది.

చారిత్రిక ప్రాశస్త్యం


దక్షిణా పథం లో శాతవాహనుల తర్వాత వర్థిల్లిన మొదటిరాజ్యం బాదామి చాళుక్యులది. ఈ వంశం నుండే అనేక చాళుక్య రాజ్యాలు ఏర్పడినాయి. కర్ణాటకలో కళ్యాణి, ఆంధ్రప్రదేశ్ లో వేంగి, వేములవాడ, ఎలమంచిలి, ముదిగొండ మొదలగునవి. బాదామి చాళుక్యుల కాలం నాటికి బౌద్ధ మరియు జైన మతాలు విస్తారంగా వ్యాప్తిలో ఉన్నాయి. వీరు మాత్రం వైదిక మతాన్ని అవలంబించారు. వీరి తొలి రాజధాని ఐహోలోను. తరువాతి కాలం నాటి రాజదాని బాదామి లో ఎన్నో ఆలయాలు, గుహాలయాలను నిర్మించారు. వీటిలో కొన్ని బౌద్ద , జైన ధర్మాలకు సంబంధించినవి ఉన్నాయి. వీరు కృష్ణానది ఉపనది మలప్రభానది ఉత్తర వాహినిగా ఉన్న పట్టాడకల్ లో పట్టాభిషేకాలు జరుపుకునే వారు, అక్కడ పాపనాథ, గులగనాథ, సంగమేశ్వర మొదలైన ఆలయాలను నిర్మించారు. వీరికి పల్లవులతో నిరంతర యుద్దాలు జరిగేవి. విజయానికి గుర్తుగా వారి రాజధాని కంచి లోని కైలాసనాథ అలయాన్ని పోలిన ఆలయాన్ని చాళుక్య రాజులు పట్టాడకల్ లో నిర్మించారు. వీరి రాజ్యంలో మలప్రభ - కృష్ణతో సంగమించే 'కూడలి' లో సంగమేశ్వరాలయం నిర్మించారు. ఇక్కడే కొన్ని శతాబ్దాల తర్వాత తొలి కన్నడ కవి, సంస్కర్త, వీర శైవ మత స్థాపకుడు, బసవన్న సమాధి అయ్యాడు. రాజ్య విస్తరణలో భాగంగా చాళుక్యులు మొలక సీమ లేక ఏరువసీమ లేక రెండేరుల నడిమి సీమగా పిలవబడే రస్తుత మాహబూబ్ నగర్ - కర్నూలు జిల్లాలలోని భూభాగాన్ని తమ ఏలుబడి కిందకు తెచ్చుకున్నారు. ఈ సీమలో తుంగభద్రానది కృష్ణతో కలిసే కూడలి లేక కూడవల్లిలో తాము పట్టాడకల్ లో నిర్మించిన ఆలయాలను నమూనాగా తీసుకుని, శిలాలకు మరింత కొత్త సొబగులను రంగరించి నిర్మించారు. పదడుగుల ఎత్తైన వేదిక పై చుట్టూ ఏనుగు తలలతో ఢిల్లీ లోని అక్షరధామ్ ఆలయానికి ఇది ప్రేరణా అన్నట్లు నిర్మించారు. వేదికపైన ఆలయ ద్వారం ప్రక్కగా శంఖనిధి, పద్మనిధి విగ్రహాలు, గంగ, యమున, అర్థనారీశ్వర , హరిహర, గజలక్ష్మి, అష్ట దిక్పాలకుల విగ్రహాలే కాక, ఎన్నో లతలను, హంసలను చెక్కారు. మొసలి పట్టుకున్న ఓ మనిషి ముఖంలో మూడు వైపుల నుంచి చూస్తే మూడు వివిధ దశలైన బాల్య, యౌవన, వృద్ధాప్య దశలు కనిపించేలా చెక్కిన శిలం అశ్చ్యరాన్ని గొల్పుతుంది.

కూడలి సంగమేశ్వరాలయ నిర్మాణానంతరం చాళుక్యులు ఇక్కడ మరిన్ని ఆలయాలను నిర్మించాలనుకున్నారు. కాని వరద సమయాల్లో ఆలయంలోనికి ఒండ్రు మట్టి చేరుతున్నందున మరో ప్రాంతంలో ఆలయాలు నిర్మించాలని అన్వేషించగా, అలంపురం అనువుగా కనిపించింది. తుంగభద్రానది ఉత్తర వాహిని కావడం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన జోగుళాంబ క్షేత్రం ఉండటం వల్ల, జమదగ్ని ఆశ్రమం ఉండటం వల్ల ఇక్కడ నవ గ్రహాల ఆలయాల సముదాయాన్ని నిర్మించారు. అవి పట్టాడకల్ లోని గలగనాథ, పాపనాథ, ఆలయాలను పోలి ఉంటాయి. కాలక్రమాన చాళుక్యుల ప్రాభవం తగ్గసాగింది. రాష్ట్రకూటుల ప్రాభవం పెరిగింది. వీరు పల్లవులతో సంబంధ, బాంధవ్యాలు నెరపి చాళుక్యులను జయించారు. ఆ విజయానికి గుర్తుగా ఎల్లోరా లో కొండను తొలిచి కైలాసనాథ ఆలయాన్ని నిర్మించారు. ఇక మొలక సీమ వైపు చూస్తే 'నివృత్తి సంగమం' కనిపిస్తుంది. అహోబిలం కొండల్లో పుట్టిన సెలయేరు భవనాశిని' నదిగా రూపాంతరం చెంది కృష్ణలో కలిసే స్థలమది. ఈ నది కృష్ణలో కలిసే ఏడవ నది అయినందున దీనిని సప్తమ నదీ సంగమమని సప్తనదీ సంగమేశ్వరమనీ వ్వవహరిస్తారు. ప్రజల పాపా ప్రక్షాళన చేసిన గంగాదేవికి జనుల పాప ప్రక్షాళన చేసిన గంగా దేవికి కాకి రూపం రాగా, ఈ సంగమంలో స్నానం చేసి హంసగా మారిందని, ఆమె పాపాలు నివృత్తి అయినందున దీనికి నివృత్తి సంగమేశ్వరం అని పేరొచ్చిందని ఒక కథనం. ఆరణ్య వాస సమయంలో ఇక్కడ ధర్మరాజు లింగ ప్రతిష్ఠ చేయాలని సంకల్పించి, లింగాల కోసం భీముడిని కాశికి పంపగా, సమయానికి తిరిగి రానందున వేప మొద్దును శివలింగంగా ప్రతిష్ఠించాడని ఒక కథ ప్రచారంలో ఉన్నది. కోస్తా తీర ప్రాంతంలో పంచారామాలుండగా ఇక్కడ మల్లేశ్వరం, అమరేశ్వరం, సిద్ధేశ్వరం, కపిలేశ్వరం, సంగమేశ్వరం పేర్ల తో పంచేశ్వరాలు ఏర్పడ్డాయని , ఇవన్నీ భీముడు తెచ్చిన లింగాలపై వెలిశాయని మరొక కథనం.

నివృత్తి సంగమేశ్వరంలో రాష్ట్ర కూటులు నిర్మించిన ఆలయాలకు రూపాల సంగమేశ్వరమని పేరు. వారు తమ నిర్మాణాల్లో చాళుక్యుల మౌలికాంశాలను, తమ బాంధవ్యాల వల్ల పల్లవుల అలంకారాన్ని జోడించారు. సంగమేశ్వరాలయం, దాని ప్రక్కన భుజంగేశ్వరాలయాలు మహబలిపురంలో రాతి రధాలను పోలి ఉండేవి. ఆలయం వెలుపల నటరాజ మూర్తులు, పైకప్పులో ఆనంద తాండవం చేస్తున్న శివుని శిల్పాలు ఉన్నాయి. అంతేకాక ఒకే రాతిపై గంగ, యమున, పార్వతుల మూర్తులను మలిచారు. తర్వాతి కాలంలోని కళ్యాణి చాళుక్యులు అలంపురం సమీపంలో పాపనాశని ఆలయాల పేరుతో ఆలయ సముదాయాన్ని నిర్మించారు.



శ్రీశైల జలాశయం నిర్మించాక ఈ సంగమేశ్వర, అలంపుర ఆలయాలన్నీ ముంపుకు గురయ్యే ప్రమాదం ఏర్పడే పరిస్థితి రాగా..... పురావస్తు శాఖవారు సంగమేశ్వరాలయాలను విడదీసి వేర్వేరు ప్రాంతాలలో పునర్నిర్మించారు. కూడలి సంగమేశ్వరాలయాన్ని , పాపనాశన ఆలయాలను అలంపురం వెళ్లే దారిలోనే పున: ప్రతిష్ఠించారు. అలంపురం నవ గ్రహాలయాలకు అడ్డుగా ఓ పెద్ద గోడను నిర్మించారు. రూపాల సంగమేశ్వరాలయాన్ని కర్నూలు సమీపంలోని జగన్నాధ గట్టు పై కట్టారు. కాని ఈ జోడు రథాల్లాంటి ఆలయాల్లో మరొకటైన భుజంగేశ్వరాలయాన్ని నంది కొట్కూరు సమీపంలోని జూపాడు బంగ్లా వద్ద నిర్మించారు. త్రివేణి సంగమ శిల్పం మాతం హైదరాబాదు లోని పురావస్తు శాఖ వారి ప్రదర్శన శాలలో ఉన్నది. ఇది పబ్లిక్ గార్డెన్ లో ఉన్నది. నివృత్తి సంగమేశ్వరాలయం అలాగే నీటిలోనే మునిగి ఉన్నది. ప్రతి ఏటా వేసవిలో శ్రీశైలం జలాశయం లోని నీటి మట్టం తగ్గినప్పుడు ఆలయం బయట పడుతుంది. అలా బయట పడే నాలుగు నెలలు అనగా మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో భక్తులు ఆలయానికి వెళ్లి పూజలు చేస్తుంటారు. ఈ ఆలయాలన్నీ చూడాలంటే కర్నూలు కేంద్రం చేసుకొని చూడొచ్చు. అదే అనుకూలం. 
no image
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
శ్రీ కూర్మనాథ క్షేత్రం శ్రీకాకుళం పట్టణానికి 13 కిలోమీటర్ల దూరంలోను, మండల కేంద్రమైన 'గార' నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నది. రవాణా సౌకర్యం బాగా ఉన్నది. శ్రీ కూర్మం లో తిరుమల- తిరుపతి దేవస్థానం వారి సత్రం ఉన్నది. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం ఆరసవెల్లి ఇక్కడకు పది కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది.

పురాణేతిహాసం 

"పూర్వం దేవ దానవులు అమృతం కొరకు క్షీర సాగరాన్ని మధించడానికి యత్నించి, మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకున్నారు. క్రింద ఆధారం లేనందున మందర పర్వతం నిలవలేదు. దాంతో దేవతలు శ్రీ మహా విష్ణువుని ప్రార్థించగా, విష్ణువు తాబేలు అవతారమెత్తి మందర పర్వతానికి ఆధారంగా నిలిచాడు" అని కూర్మ పురాణం చెపుతున్నది. ఆ రూపాన్ని బ్రహ్మదేవుడే స్వయంగా శ్రీ కూర్మంలో ప్రతిష్టించాడని చెపుతారు. ఈ క్షేత్ర ప్రస్తావన పద్మ పురాణం లోను, బ్రహ్మాండ పురాణాం లోను కనిపిస్తుంది. అత్యంత సుందరమైన శిల్పసంపద కలిగిన ఈ క్షేత్రాన్ని శ్రీరాముని కుమారులు లవ కుశులు కూడ దర్శించారని పురాణ కథనం. ఆలయ పైభాగం అష్టదళ పద్మాకారంలో ఉన్నది. తూర్పు, దక్షిణ ద్వారాలపై చక్కని శిల్పాలు కను విందు చేస్తాయి. ఆస్థాన మండపంలోని నల్లరాతి స్థంభాల పై రామాయణ, మహాభారత ఇతిహాస ఘట్టాలు చెక్కి ఉన్నాయి. ఈ ఆలయ ఉపరిత భాగాన్ని గంధర్వులు నిర్మించారని, అందుకు దానిపేరు గంధర్వ విమానమని అంటారని ఒక కథనం. గాలి గోపురం ఎదురుగా సుధా కుండం ఉన్నది. దీనిని శ్వేత కుండం అని, శ్వేత పుష్కరిణి అని కూడా అంటారు.

ఆలయ విశిష్టత

ఏ ఆలయానికైనా ఒకే ధ్వజ స్థంభం ఉటుంది. కాని ఇక్కడ రెండు ధ్వజస్థంభాలుండడం విశేషం. అవి తూర్పు, పశ్చిమ దిశలలో ఉన్నాయి. ఆలయ మూల విరాట్ పశ్చిమాభిముఖంగా ఉన్నది. ఇక్కడ ఉత్తరాన భగవద్రామానుజులు, నైరృతిలో వేణుగోపాలస్వామి, వాయువ్యాన వైష్ణవి దుర్గ, లక్ష్మి సన్నిధి ఉంది. ఆలయ ప్రాంగణంలో సుమారు వందకు పైగా తాబేళ్లతో ఏర్పాటు చేసిన పార్కు కూడ ఉన్నది. జేష్ట బహుళ ద్వాదశి నాడు ఈ స్వామి వారి జయంతి. జయంతి నాడు ఉదయం 5 గంటలకు స్వామికి క్షీరాభిషేకం చేసి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language

శక్తిపీఠాలు 


హిందువులు పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాధల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు (Shakthi Peethas) అంటారు. ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు. 


పురాణ కధ


ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని సతీదేవి, శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది గాని, అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు. కాని సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్ధనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని(శివుని)తోడుగా దర్శనమిస్తుంది.


18 శక్తిపీఠాలు 

అష్టాదశ శక్తిపీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్ధనా శ్లోకం:


లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే
అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా
ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే
హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా
వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్
సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్

ఈ శ్లోకంలో ఉన్న వివిధ స్థలాలను గుర్తించడంలో కొన్ని భేదాభిప్రాయాలున్నాయి. ఒక వివరణ ప్రకారం ఈ స్థలాలు ఇలా ఉన్నాయి

1.శాంకరి - శ్రీలంక - ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు. కాని ఒక వివరణ ప్రకారం ఇది శ్రీలంక తూర్పుతీరంలో ట్రిన్‌కోమలీలో ఉండవచ్చు అని అంచన. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమయ్యిందంటారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రం ఉంది. దగ్గరలో 'త్రికోణేశహవర స్వామి' అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది. ట్రిన్‌కోమలీ నగరంలో కాళీమందిరం ప్రసిద్ధమైనది.




2.కామాక్షి - కాంచీపురం, తమిళనాడు - మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.







3.శృంఖల - ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్ - ఇది కొలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు. అయితే కొలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది.






4.చాముండి - క్రౌంచ పట్టణము, మైసూరు, కర్ణాటక - అమ్మవారు చాముండేశ్వరీ దేవి.









5.జోగులాంబ - ఆలంపూర్, ఆంధ్రప్రదేశ్ - కర్నూలు నుండి 27 కిలోమీటర్ల దూరంలో 'తుంగ', 'భద్ర' నదులు తుంగభద్రా నదిగా కలిసే స్థలంలో ఉన్నది.










6.భ్రమరాంబిక - శ్రీశైలం, ఆంధ్ర ప్రదేశ్ - కృష్ణా నదీ తీరాన అమ్మవారు మల్లిఖార్జున స్వామి సమేతులై ఉంది. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో కుడా ఒకటి.






7.మహాలక్ష్మి - కొల్హాపూర్, మహారాష్ట్ర - ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది. అమ్మవారి తలపైన ఐదు తలల శేషుని ఛత్రం ఉంది. ప్రతి సంవత్సరం మూడు మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది.




8.ఏకవీరిక - మాహుర్యం లేదా మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర - ఇక్కడి అమ్మవారిని 'రేణుకా మాత'గా కొలుస్తారు. షిరిడీ నుండి ఈ మాతను దర్శించుకొనవచ్చును.









9.మహాకాళి - ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ - ఇదే ఒకప్పుడు అవంతీ నగరం అనబడేది. ఇది క్షిప్రా నది తీరాన ఉన్నది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే.









10. పురుహూతిక - పీఠిక్య లేదా పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ - కుకుటేశ్వర స్వామి సమేతయై ఉన్న అమ్మవారు.






11.గిరిజ - ఓఢ్య, జాజ్‌పూర్ నుండి 20 కిలోమీటర్లు, ఒరిస్సా - వైతరిణీ నది తీరాన ఉన్నది







12.మాణిక్యాంబ - దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్ - కాకినాడనుండి 20 కిలోమీటర్ల దూరంలో.ఉంది.











13.కామరూప - హరిక్షేత్రం, గౌహతి నుండి 18 కిలోమీటర్లు, అసోం - బ్రహ్మపుత్రా నది తీరంలో. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమా
సంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది.











14.మాధవేశ్వరి - ప్రయాగ (అలహాబాదు), ఉత్తర ప్రదేశ్, త్రివేణీ సంగమం సమీపంలో - ఈ అమ్మవారిని అలోపీ దేవి అని కూడా అంటారు.






15.వైష్ణవి - జ్వాలాక్షేత్రం,  కాంగ్రా వద్ద, హిమాచల్ ప్రదేశ్ - ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడు జ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి.




16.మంగళ గౌరి - గయ, బీహారు - పాట్నా నుండి 74 కిలోమీటర్లు.






17.విశాలాక్షి - వారాణసి, ఉత్తర ప్రదేశ్.









18.సరస్వతి - జమ్ము, కాష్మీరు - అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు.పాక్ ఆక్రమిత కాశ్మీరు లో ముజఫరాబాద్ కు 150 కి.మీ.ల దూరంలోఉందంటారు.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language

బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రము. 



బాసర, (Basara) పుణ్యక్షేత్రం ఆదిలాబాదు జిల్లాలోని ముధోల్ మండలంలో వుంది.  ఇది Nizamabad పట్టణానికి 35 కి.మీ దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది. హైదరాబాదుకు సుమారు 200 కి.మీ. దూరం.
బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువు తీరి ఉన్నారు. ఇక్కడి మందిరం చాళుక్యులకాలంలో నిర్మింపబడింది. ఈ మందిరం సాదా సీదాగా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నది. ఈ ఆలయంలోని ప్రధాన దేవత సరస్వతి అమ్మవారు. భారత దేశంలో గల రేండే రెండు సరస్వతీ దేవాలయాల్లో ఒకటి కాశ్మీరులో ఉండగా, రెండవది ఇదే.   హిందూ మతం ప్రకారం జ్ఞానంను ప్రసాదించు దేవత సరస్వతి. పెద్దలు తమ పిల్లలకు మొదటిసారి అక్షరాలను నేర్పించే కార్యక్రమాన్ని ఒక వేడుకలాగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని అక్షరాభ్యాసం అంటారు. అక్షర జ్ఞానాన్ని ప్రసాదించే దేవత సరస్వతి కాబట్టి కొంతమంది తమ పిల్లలకు బాసరలో ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం నందు అక్షరాభ్యాస కార్యక్రమ వేడుకను జరుపుకుంటారు.

పురాణగాధ


బాసర క్షేత్రాన్ని వేదవ్యాసుడు ప్రతిష్టించినట్లు చెప్పుచుందురు. కురుక్షేత్ర యుద్ధానంతరం వేదవ్యాసుడు మనశ్శాంతి కోరి తన కుమారుడైన శుకునితో దండకారణ్యానికి వచ్చి ఇక్కడ గోదావరి తీరాన ఉన్న ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడై ఇక్కడ కుటీరం నిర్మించి తపస్సు చేయడం ప్రారంభించాడు. వేదవ్యాస మహర్షికి జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది. వ్యాసుడు నదిలోంచి మూడు గుప్పెళ్ళు ఇసుక తెచ్చి ముగ్గురు దేవతలమూర్తులు ప్రతిష్టించాడు. వ్యాసుడు ఇక్కడ చెప్పతగింత కాలము నివసించాడు కనుక అప్పటినుండి ఈ ఊరు వ్యాసపురి , వ్యాసర అనబడి, తరువాత ఇక్కడ ఉన్న మహారాష్ట్ర ప్రజల ప్రభావం వలన 'బాసర' గా నామాంతరాన్ని సంతసించుకున్నది. ఇక్కడ వ్యాస నిర్మితమైన ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ఈ పసుపును ఒక్క రవ్వంత తినినా అత్యంత విజ్ఞానం, జ్ఞానము లభిస్తుందని ఘాడంగా విశ్వసిస్తారు. ఆది కవి వాల్మికి ఇక్కడ సరస్వతీ దేవిని ప్రతిష్టించి రామాయణం వ్రాసాడని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది. ఈ గుడికి సమీపంలో వాల్మికి మహర్షి సమాధి మార్బుల్ శిల ఉన్నాయి. మంజీరా మరియు గోదావరి తీరాన అష్ట్రకూటుల చేత నిర్మించబడిన మూడు దేవాలయాలలో ఇది ఒకటని విశ్వసించబడుతుంది.ఆరవ శతాబ్ధంలో నందగిరి ప్రాంతాంలో నందేడుని రాజధానిగా చేసుకుని పరిపాలించిన బిజలుడు అను రాజు బాసరలోని ఈ ఆలయమును నిర్మించాడన్న కధనం ప్రచారంలో ఉన్నది.

ఆలయ విశేషాలు 

బాసర సరస్వతీ ఆలయం దేశంలోని ప్రఖ్యాత సరస్వతీ ఆలయాలలో ఒకటి. ఇక్కడ సరస్వతీ ఆలయంలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ ఉన్న త్రిదేవీ మూర్తులు వ్యాస ప్రతిష్టితం కనుక ఈ ప్రత్యేకత. అక్షరాభ్యాసానికి ప్రత్యేక ఋసుము ఉంటుంది. ప్రజలు బంధు మిత్రులతో వచ్చి పిల్లలకు అక్షరాభ్యాసము చేస్తారు. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక మందిరంలో అక్షరాభ్యాసం జరిపిస్తారు. ఆలయ ప్రాంగణంలోని జ్ఞాప్రసూనాంబ చేతిలో ఉన్న అఖంద జ్యోతికి నూనె వంచడానికి భక్తులు ఆసక్తి ప్రదర్శిస్తారు. నూనె ఇక్కడ ఖరీదుకు లభిస్తుంది. అమ్మవారికి సమర్పించిన చీరలు ఆసక్తి కల భక్తులు కొనుగోలు చేసి పొంద వచ్చు. వెలుపలి కౌంటర్ వద్ద భక్తులు ప్రసాదములు కొనుక్కునే వసతి కూడా ఉంది.

దేవాలయం


సుమారు 200 సంవత్సరాల క్రితం విధ్వంస కాండకు పాల్పడుతున్న కొందరు దుండగులను తరిమివేసి మక్కాజీ పటేల్ అనే వ్యక్తి మరి కొందరి సహాయంతో ఆలయం పునర్నిర్మాణం చేయించాడు.


ఎలా వెళ్ళాలి


హైదరాబాదు-మన్మాడ్ మార్గంలో బాసర స్టేషన్ ఉన్నది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి, మరికొన్ని సమీప పట్టణాలనుండి (నిర్మల్, నిజామాబాద్ మరియు భైంసా) బస్సు సౌకర్యం ఉన్నది. నిజామాబాద్ నుండి బాసరకు 40 కి.మీ. దూరం. నిర్మల్ పట్టణానికి 35 కి.మీ. హైదరాబాదుకు సుమారు 205 కి.మీ. దూరం. హైదరాబాద్ - మన్మాడ్ మార్గంలో బాసర స్టేషన్ ఉంది.

చూడదగిన స్థలాలు


ప్రధాన దేవాలయానికి తూర్పు భాగమున ఔదుంబర వృక్షఛాయలో దత్త మందిరం, దత్త పాదుకలు ఉన్నాయి. మహాకాళీ దేవాలయం పశ్చిమ భాగమున నిత్యార్చనలతో చూడ ముచ్చటగా ఉంటుంది. శ్రీ వ్యాస మందిరం దక్షిణ దిశలో ఉంది. ఇందులో వ్యాస భగవానుని విగ్రహము, వ్యాస లింగము ఉన్నాయి.
మందిరానికి దగ్గరలో ఒక గుహ ఉంది. ఇది నరహరి మాలుకుడు తపస్సుచేసిన స్థలమంటారు. అక్కడ "వేదవతి" (ధనపు గుండు) అనే శిలపై తడితే ఒకోప్రక్క ఒకో శబ్దం వస్తుంది. అందులో సీతమ్మవారి నగలున్నాయంటారు. ఇక్కడికి దగ్గరలో 8 పుష్కరిణులున్నాయి. వాటి పేర్లు - ఇంద్రతీర్ధం, సూర్యతీర్ధం, వ్యాసతీర్ధం, వాల్మీకి తీర్ధం, విష్ణుతీర్ధం, గణేషతీర్ధం, పుత్రతీర్ధం, శివతీర్ధం. గోదావరి సమీపంలో ఒక శివాలయం కుడా ఉంది.

పూజా విశేషాలు


ప్రతి నిత్యం ఉదయం 5 గంటలకు సరస్వతీ మూర్తికి వైదిక మంత్రోపేతంగా పూజ జరుపుతారు. సాయంకాలం ఆరు గంటలకు పూజ జరుగుతుంది. ఈ ఆలయానికి ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా. మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాలనుండి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ముఖ్యముగా విద్యా ప్రాప్తికై ఇక్కడ విద్యైఆర్ధులతో అక్షరాభ్యాసము చేయించి దేవికి పలక, బలపము, కాగితము, కలము వంటి కానికలు సమర్పించే ఆచారము ఉన్నది. కేశ ఖండనము, ఉపనయనము, వివాహాలు, భజనలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి.
 దర్శన వేళలు :- ఉదయము 4 గంటలకు ఆలయద్వారాలు తెరచి 4 గంటల నుండి 4.3 గంటల వరకు అభిషేకము టిక్కెట్లను ఇస్తారు. 4 గంటల నుండి 7.3 గంటల వరకు అభిషేకము, అలంకారము, హారతి, నైవేద్యము చేసి ప్రసాద వితరణ చేస్తారు. 7.3 గంటల నుండి 12.3 గంటల వరకు అర్చన, సర్వదర్శనం ఇతర పూజలు చేస్తారు. 12.3 గంటలకు నివేదన చేసి ఆలయము 2 గంటవరకు మూసి ఉంచుతారు. 2 గంటల నుండి 6.3 గంటల వరకు అర్చన సర్వదర్శనం చేస్తారు. 6.3 గంటల నుండి 7 గంటల వరకు ప్రదోష పూజ నిర్వహిస్తారు. 7 గంటల నుండి 8.3 గంటల వరకు మహా హారతి దర్శనం తరువాత ఆలయము మూసి వేస్తారు.

ముఖ్యమైన ఉత్సవాలు


మహా శివరాత్రి, వసంత పంచమి, అక్షరాభ్యాసం, దేవీ నవరాత్రులు, వ్యాస పూర్ణిమ ఇక్కడ విశేషంగా జరుపబడే ఉత్సవాలు. ప్రధానంగా ప్రతి సంవత్సరం మూడు ఉత్సవాలు జరుగుతాయి.

నవరాత్రులు


ఆశ్విని శుద్ధ పాఢ్యమి మొదలు నవమి వరకు జరుగుతాయి. ఉదయము, సాయంకాలము 64 ఉపచారములతో వైదిక విధానంలో అమ్మవారికి వైభవంగా పూజలు జరుగుతాయి. శ్రీదేవీ భాగవతము, దుర్గా సప్తశతి పారాయణాలు జరుగుతాయి. మహర్నవమి రోజున చండీ హోమము చేయబడుతుంది. విజయదశమి నాడు వైదిక మంత్రాలతో మహాభిషేకము, సుందరమైన అలంకారము, సాయంకాలము పల్లకీ సేవ, శమీపూజ జరుగుతాయి. ఈ ఉత్సవాలలో భక్తులు, ఉపాసకులు తమ తమ అభిష్టానుసారం పూజలు చేసుకొంటారు. ఇంకా ధార్మిక చర్చలు, ఉపన్యాసములు, హరికధలు, పురాణ పఠనం నిర్వహిస్తారు. యాత్రికులకు నిరతాన్నదానం సమర్పిస్తారు.

శ్రీ పంచమి మాఘ శుద్ధ పంచమినాడు సరస్వతీ జన్మదినోత్సవం జరుపుకొంటారు. మహాభిషేకం తరువాత వివిధ పుష్పాలతో వాగ్దేవిని నయనానందకరంగా అలంకరిస్తారు. జగద్రక్షణకై, భక్త పోషణకై అవతరరించిన కామితార్ధ ప్రదాయినిగా బాసర జ్ఞాన సరస్వతి ఈనాడు విశేష పూజలందుకొంటుంది. వసంత పంచమికి 15 రోజుల ముందు నుండి ప్రారంభం అయ్యే ఈ ఉత్సవాలు వసంత పంచమికి మూడు రోజుల వరకు జరుగుతాయి. ఆ సమయంలో దేవికి ప్రత్యేక పూజలు ఆరాధనలు జరుపుతారు.

మహా శివరాత్రి


మహా శివరాత్రి పర్వదినం మొదలుకొని మూడు రోజులు పెద్ద జాతర సాగుతుంది. వేలాది భక్తులు పవిత్ర గోదావరి నదిలో స్నానం ఆచరించి వాగ్దేవికి ప్రదక్షిణాలు ఆచరిస్తారు.

మాధుకరము


ఈ వూరిలో ఇది ఒక ముఖ్యమైన సంప్రదాయం. మధుకర వృత్తి (యాచించుట) ద్వారా లభించే భిక్షకు మాధుకరము అని పేరు. శ్రీదేవి అనుగ్రహము కోరేవారు నియమ నిష్టలతో 11 లేదా 21 లేదా 41 రోజులు దీక్షతో గురూపదేశ మంత్రము అనుష్టానం చేస్తారు. ఆ కాలంలో వారు మధ్యాహ్నం వూరిలోనికి పోయి భిక్షను స్వీకరించి, సరస్వతీ దేవికి నమస్కరించి, ఆ భిక్షను భుజిస్తారు.

వసతులు


ఇదివరకు తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే నిర్మింపబడిన అతిధి గృహం, వేములవాడ దేవస్థానం వారిచే నిర్మింపబడిన అతిధిగృహం మాత్రమే ముఖ్య వసతులు. ప్రస్తుతం అనేక లాడ్జీలు నడుపబడుతున్నాయి. ఎపి టూరిజమ్ బస్ టిక్కెట్స్ వద్ద టిక్కెట్ల వివరాలు తెలుసుకోవచ్చు. ఛాయాచిత్రాలను చూడ వచ్చు. వసతి గృహములు :- లగ్జరీ అకామిడేషన్, ఫ్యామిలీ గెస్ట్ హౌస్, బెస్ట్ ఎకనమీ అకామిడేషన్ లాంటి వసతి గృహాలు భక్తులకు ఇక్కడ ఉండడానికి తగిన వసతులు కల్పిస్తున్నాయి.

హైదరాబాదు-మన్మాడ్ మార్గంలో బాసర స్టేషన్ ఉన్నది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి, మరికొన్ని సమీప పట్టణాలనుండి (నిర్మల్, నిజామాబాద్ మరియు భైంసా) నుండి ప్రతి అరగంటకు ఒక బస్సు సౌకర్యం లభిస్తూ ఉన్నది. నిజామాబాద్ నుండి బాసరకు 35 కి.మీ. దూరం.


కొన్ని ప్రార్ధనలు

విహిత నమస్కార శరణ్యాం సుఖప్రదామ్
ఓంకార పూరిత నామార్చనాం శుభ ప్రదామ్
పురస్కార సహిత దర్శనాం ఫలప్రదామ్
బాసర క్షేత్రదేవీం భజ సరస్వతీ మాతరమ్
నమోస్తు వేదవ్యాస నిర్మిత ప్రతిష్టితాయై
నమోస్తు మహాలక్ష్మీ మహాకాళీ సమేతాయై
నమోస్తు అష్ట తీర్థజల మహిమాన్వితాయై
నమోస్తు బాసర క్షేత్రే విలసితాయై
యా దేవీ సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితా


నమస్తస్మై నమస్తస్మై నమస్తస్మై నమోనమః
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language

శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రము.

మెలికలు తిరుగుతూ, లోయలు దాటుతూ దట్టమైన అరణ్యాల మధ్య భక్తజనులను బ్రోచేందుకు వెలసిన పరమేశ్వరుని దివ్యధామం అయిన శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటి. చరిత్ర ఇక్ష్వాకులు, పల్లవులు, విస్ణుకుండినులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు, శివాజీ లాంటి ఎందరో సేవలు చేసిన మహాక్షేత్రం. పాండవులు, శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు పూజలు చేసిన శ్రీమల్లికార్జునుని పవిత్రధామం. శ్రీశైల దేవస్థానమునకు రక్షణ కొరకు కొందరు రాజులు చుట్టూ కోట లాంటి పటిష్ట కట్టడము నిర్మించారు. నాలుగు వైపులా నాలుగు పెద్ద ద్వారములు, సుదూరానికి సైతం కానవచ్చే బ్రహ్మాండమైన నాలుగు గోపురాలు,అత్యద్భుతమైన కట్టడాలుగా దేవాలయాలు నిర్మించారు. శ్రీశైలం-దర్శనీయ ప్రదేశాలు శ్రీశైలం చుట్టు ప్రక్కల దాదాపు అయిదు వందల వరకూ శివలింగాలు ఉంటాయంటారు. పరిసర ప్రాంతాలలో చూడదగిన ప్రదేశాలు, దేవాలయాలు,మఠాలు, మండపాలు, చారిత్రక స్థలాలు అనేకాలు కలవు.


చూపులకు కానరానంతగా విస్తరించుకొన్న శ్రీశైలము క్షేత్రములోని దర్శనీయ ప్రదేశాలను ముఖ్యముగా నాలుగు భాగాలుగా విభజించవచ్చు. అవి
 1. శ్రీశైల దేవాలయ ప్రాంతము.
 2. సున్నిపెంట ప్రాంతము
 3. మండపాలు, పంచమఠాల ప్రాంతము
 4. అడవిలో గల పర్యాటక ప్రాంతములు

 చారిత్రక ప్రదేశాలు

          ఆలయవిశిష్టత శ్రీశైలంలో దేవాలయాలలో భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవాలయం ప్రసిద్ధి చెందినది. దీనిలో శివ పార్వతుల విగ్రహాలు వుంటాయి. ఇక్కడ మల్లికార్జున స్వామిని శివుడుగా మరియు, మాత పార్వతి దేవిని భ్రమరాంబగా పూజిస్తారు. శివ భగవానుడికి గల 12 జ్యోతిర్ లింగాలలో శ్రీశైలం ఒకటి కావున, హిందువులు ఈ దేవాలయానికి చాల ప్రాముఖ్యతనిచ్చి దర్శనం చేసుకొంటారు. ఇక్కడ కల మల్లెల తీర్థం అనే జలపాతాల లో స్నానాలు ఆచరిస్తారు. ఈ నీటి లో స్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని మోక్షం వస్తుందని భావిస్తారు. శ్రీశైల దేవాలయ ప్రాంతము
శ్రీమల్లికార్జునుని దేవాలయము: అభేద్యమైన ప్రాకారము లోపల నాలుగు మండపములతో అపూర్వమైన శిల్ప సంపదతో అలరారే అందమైన దేవాలయము. ప్రధాన గర్భాలయము మాత్రము ఎటువంటి శిల్పాలు లేకుండా సాధారణ నిర్మాణముగా ముష్కరుల నుండి రక్షణ కొరకు కట్టినట్టుగా ఉంటుంది. • భ్రమరాంబిక అమ్మవారి గుడి.: భ్రమరాంబికా అమ్మవారి దేవాలయము అద్భుతమైన శిల్పకళతో అందమైన శిల్పతోరణాలతో కూడిన స్థంబాలతోనూ అత్యద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయము ఆంధ్రదేశములోనే అత్యంత విశిష్టమైన శిల్ప కళ కలిగిన దేవాలయముగా వినుతికెక్కినది. ఈ దేవాలయము నందు గర్భాలయ వెనుక భాగమున గోడకు చెవి ఆన్చి వింటే ఝమ్మనే బ్రమరనాధం వినిపిస్తుంది

మనోహర గుండము: శ్రీశైలములో తప్పకుండా చూడవలసిన వాటిలో ఇది ఒకటి. దీనిలో గొప్పతనము ఏమిటంటే చాలా స్వచ్ఛమైన నీరు ఈ గుండములో ఉంటుంది. శ్రీశైలము చాలా ఎత్తైన ప్రదేశములో ఉన్నది. అంత ఎత్తులో కూడా ఆ రాళ్ళలో ఇంత చక్కని నీరు ఉండటం నిజంగా చూడవలసినదే. మహానంది లోని కోనేటి నీటిలో క్రింద రూపాయ వేస్తే పైకి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ చిన్ని గుండంలో కూడా కనిపిస్తుంది.

 నాగ ప్రతిమలు:

 పంచ పాండవులు దేవాలయాలు: పాండవులు మల్లికార్జునుని దర్శించుకొని వారి పేరున అయిదు దేవాలయాలను ప్రధాన దేవాలయ వెనుక భాగమున నిర్మించి శివలింగములను ప్రతిష్టించిరి

 అద్దాల మండపము:

 వృద్ద మల్లికార్జున లింగము: ఇది ముడతలు పడిన ముఖంలా ఉన్న శివ లింగం. ఇది చూస్తే అంత అందముగా ఉండదు. బహుశా ముసలితనాన్ని గుర్తు చేస్తుంది!

 మండపాలు, పంచమఠాల ప్రాంతము

 పంచమఠాలు అని పిలువబడే మఠాలు ఇక్కడ ఉన్నాయి.

 సారంగధర మఠం:  మిగిలిన మఠాలలో నిర్వహణలో, అభివృద్దిలో ప్రసిద్దమైనది సారంగధర మఠం. రుద్రాక్షమఠం: ఇక్కడి మఠంలో శివలింగము రుద్రాక్ష రూపంలో ఉండటం ఇక్కడి ప్రత్యేకత.

 విశ్వామిత్రమఠం
 నంది మఠం మొదలైనవి. 

అడవిలో గల పర్యాటక ప్రాంతములు, చారిత్రక ప్రదేశాలు


 పాతాళ గంగ.

 శ్రీశైలం ప్రక్కనే కృష్ణానది ప్రవహిస్తుంది. కాకపోతే శ్రీశైలము చాలా ఎత్తులో ఉన్నది, నది మాత్రము క్రింద లోయలో ప్రవహిస్తుంది. అందుకే శ్రీశైలము నుండి చాలా మెట్లు దిగి కృష్ణానదిలో స్నానం చెయ్యాలి. ఈ కృష్ణానదినే ఇక్కడ పాతాళగంగ అనే సార్థక నామధేయముతో వ్యవహరిస్తారు. ఆ మెట్లు అన్నీ దిగి కృష్ణలో మునిగి తిరిగి ఎక్కినపుడు పాతాళగంగ అనునది ఎంత సార్థక నామధేయమో తెలుస్తుంది. పాతాళ గంగ వద్ద నీరు నీలంగా కాక పచ్చగా ఉంటుంది నీటి క్రింద బండలపై నాచు నిలచి సూర్య కిరణాల వెలుగు వలన పచ్చగా కానవస్తుంది. అయితే అందరూ నీటి క్రిందగల దీనిని పచ్చల బండ అని వ్యవహరిస్తారు. 2004 లొ పాతాళగంగ కు వెళ్ళుటకు రోప్ వే ఏర్పాటు చేయబడినది. ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు ఇది అందుబాటులో ఉంటుంది. త్రేతాయుగ కాలం నాటి ఆంజనేయ స్వామి గుడి తప్పనిసరిగా చూడవలసిన వాటిలో ఒకటి.

 సాక్షి గణపతి ఆలయము

 ఇది ముఖ్యాలయానికి కొద్ది దూరంలో ఉంటుంది. ఈ గణపతి ఆలయము ప్రత్యేకత ఏమిటంటే మనము శ్రీశైలములో శివుడిని దర్శించినంత మాత్రముననే కైలాస ప్రవేశానికి అనుమతి లభిస్తుంది. అప్పుడు మనకు ఈ సాక్షి గణపతే సాక్ష్యము చెపుతాడు, మనము శ్రీశైలము వచ్చినాము అని.ఇతనిని సాక్షి గణపతి అంటారు.

 శిఖరేశ్వరం

శ్రీశైలం మొత్తం లో ప్రత్యేకమైనది, ఈ శిఖరేశ్వరం. శ్రీశైలములో శిఖరదర్శనము చేసుకొంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శిఖరదర్శనము అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడటం కాదు; దూరంగా ఉన్న ఈ ఎత్తైనకొండ శిఖరేశ్వరం పై నుండి దూరంగా ఉన్న ఆలయ శిఖరాన్ని చూడాలి. అలా చూస్తే, శిఖరం కనిపిస్తే పునర్జన్మ నుండి విముక్తులవుతారు.

 పాలధార, పంచధారలు

 శిఖరేశ్వరమునకు, సాక్షిగణపతి గుడికి మధ్యగా హటికేశ్వరము నకు సమీపాన అందమయిన లోయలో ప్రశాంత ప్రదేశంలో జగద్గురు శంకరాచార్య తపమాచరించిన ప్రదేశము ఉన్నది. ఇక్కడి శిలపై శంకరుని పాదముద్రలు ఉన్నాయి. కొండపగులులనుండి పంచధార(ఐదుధార) లతో ఉరికివచ్చే జలాలు చల్లగా ఏ కాలంలోనైనా ఒకే మాదిరిగా ప్రవహిస్తూ ఒక్కొక్కధార ఒక్కొక్క రుచితో నుండుట ఇక్కడి ప్రత్యేకత. ఒకధార నుండి జలము సేవించి ప్రక్కమరొక దాని నుండి సేవిస్తే మార్పు తెలుస్తుంది. 

ఆది శంకరాచార్యుడు తపస్సు చేసిన ప్రదేశం

 దేశం రాజకీయంగా అల్లకల్లోల పరిస్థితులలో ఉన్నప్పుడు, వివిద దార్శనికులు,మతప్రచారకులు అశాంతికి దోహదంచేస్తున్న సమయంలో,భారతీయ సంప్రదాయానికి ఆధారమైన వైదిక వాజ్మయాన్ని సరిగా అధ్యయనం చేసేవారుగాని, వాఖ్యానించగలిగేవారుగాని చాలా అరుదుగా ఉన్న సమయంలొ జన్మించిన శ్రీశంకరులు పరిస్థితులను చక్కదిద్ది ప్రజలలో వైదికధర్మస్ఫూర్తిని వ్యాప్తి చేస్తూ దేశంనలుమూలలా నాలుగు ప్రప్రసిద్ధ పీఠాలను స్థాపించి విసృతంగా పర్యటిస్తూ ఉండేవారు. అలా పర్యటించే సమయంలోచాలా కాలం శ్రీశైల పరిసరములందు తపమాచరించారు. ఈయన తపమాచరించిన ఈ ప్రదేశమునకు ఒక మంచి కథనము కలదు
 శంకరులు ఇక్కడ తపస్సు చేసుకొంటూ ఈపరిసరాలలో అద్వైతమత వ్యాప్తి చేయుచున్నకాలమందు, శంకరులు చేయు కార్యములు నచ్చని కొందరు ఆయనను అంతమొందించు యత్నముతో ఆపరిసరాలయందు భీభత్సము సృష్టించుచున్న ఒకపెద్ద దొంగలముఠానాయకుని రెచ్చగొట్టి, కొంత సొమ్మిచ్చి పంపించారు.అతడు ఇదే ప్రదేశమున పెద్ద కత్తితో మాటువేసి తపమాచరించుకొనుచున్న శంకరుని వెనుకగా ఒకేవేటున తలఎగరగొట్టు ప్రయత్నమున ముందుకురికెను.ఇక్కడ ఇది జరుగుచున్న సమయమున శంకరుని ప్రధాన శిష్యుడైన పద్మపాదుడు మల్లికార్జునుని దేవాలయమున ఈశ్వరుని ధ్యానించుచూ కూర్చొని ఉండెను. ఈశ్వరునే మనసున ఉంచి ధ్యానిస్తున్న అతనికి హటాత్తుగా ఈ దృశ్యము కనిపించెను.వెంటనే అతడు మహోగ్రుడైన శ్రీలక్షీనరసింహుని వేడనారంభించెను. ఇక్కడ శంకరుని వధించుటకు ఉరికిన ఆ దొంగలనాయకునిపై ఎటునుండో హటాత్తుగా ఒక సింహము దాడి చేసి, అతడి శరీరాన్ని ముక్కలుముక్కలుగా చీల్చివేసి ఎట్లు వచ్చినదో అట్లే మాయమయినది.ఈ విషయము శంకరులకు ధ్యానమునుండి బయటకు వచ్చిన తరువాత తెలియజేసారు. అంతవరకూ ఆయనకు జరిగినది తెలియదు.అధిక కాలము ఈప్రాంతమందు తపమాచరించిన గుర్తుగా ఇక్కడ ఉన్న పెద్ద బండపై శంకరుని యొక్క పాదముద్రలు కలవు. 

శివాజీ సాంస్కృతిక,స్మారక భవనము 

 శివాజీ గొప్ప దుర్గా భక్తుడు. శ్రీశైల దేవాలయమును ఎన్నోసార్లు దండయాత్రలనుండి కాపాడి శ్రీశైలంలో భ్రమరాంబికా అమ్మవారి స్వహస్తాలతో వీరఖడ్గం అందుకొన్న ఘనుడు.అతని పేరున ఇక్కడ ఇంకనూ తుదిమెరుగులు దిద్దుకొనుచూ రెండు అంతస్తులుగా నిర్మింపబడిన శివాజీ సాంస్కృతిక,స్మారక భవనము లో- అతడి జీవిత విశేషాల కథనం మరియు చిత్రాల ప్రదర్శన కొరకు మొదటి అంతస్తునూ, శివాజీ కాంశ్యవిగ్రహము కొరకు రెండవ అంతస్తునూ కేటాయించారు.మూడు రూపాయల నామమాత్రపు రుసుముతో సందర్శకులను అనుమతించుచున్నారు. హటకేశ్వరం హటకేశ్వరం, కర్నూలు జిల్లా, శ్రీశైలం మండలానికి చెందిన గ్రామము. శ్రీశైలమల్లిఖార్జున దేవస్థానమునకు మూడు కిలోమీటర్ల దూరములో కల మరొక పుణ్యక్షేత్రం

 హటకేశ్వరం

ఇక్కడ హటకేశ్వరాలయము కలదు. ఈ పరిశరాలలోనే శ్రీ ఆది శంకరాచార్యులవారు నివశించారు. పరమశివుడు అటిక (ఉట్టి, కుండ పెంకు)లో వెలియడంతో ఈ ఆలయంలోని ఈశ్వరుని అటికేశ్వరుడు అనేవారు రానురాను అదేమెల్లగా హటికేశ్వరస్వామిగా మారిపోయింది. హటకేశ్వర నామంతో ఆప్రాంతానికి రాకపోకలు సాగించే భక్తుల మాటగా హటకేశ్వరంగా పిలువ బడుతోంది. ఇక్కడ చెంచులు అదివాశీలు నివసిస్తున్నారు. ఈ దేవాలయ పరిశరాలలో పలు ఆశ్రమములు, మఠములు కలవు. ఇక్కడికి వచ్చెందుకు శ్రీశైలం దేవస్థానము నుండి ప్రతి అర గంటకు బస్సులు కలవు.

 శిఖరం

 శ్రీశైలం మొత్తంలో ప్రత్యేకమైనది, ఈ శిఖరేశ్వరం. శ్రీశైలములో శిఖరదర్శనము చేసుకొంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శిఖరదర్శనము అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడటం కాదు,అక్కడ ఉన్న నందిని రోలుమాదిరిగా నున్న దానిలో నవధాన్యాలు వేసి ఈశ్వరుని స్మరించి అటూ ఇటూ వీలుగా త్రిప్పుకొనుచూ సుదూరంగా ఉన్న శ్రీమల్లిఖార్జుని ఆలయపు విమానంపైనున్న శిఖరాన్ని చూడుటకు ప్రయత్నించాలి.అలా చూసే క్రమంలో ఆవ్యక్తికి గనుక శిఖరం కనిపిస్తే కొద్ది దినాలలో చనిపోతారు మరియు పునర్జన్మ నుండి విముక్తులవుతారు.

 కదళీవనము

 శ్రీ దత్తాత్రేయ స్వామి అవతార పరంపరలో 3వ అవతార పురుషుడైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహారాష్ట్రలోని కరంజా నగరంలొ జన్మించి నర్సోబవాడాలోను, కర్ణాటకలోని గాణాగాపురంలొనూ తపమాచరించి చివరకు కదళీవనంలో అంతర్ధానమయ్యారు. వీరశైవ సంప్రదాయానికి చెందిన అక్క మహాదేవి కూడా ఇక్కడే అవతార సమాప్తి గావించారని ప్రతీతి.

 శ్రీశైలం-రవాణా సౌకర్యాలు 

హైదరాబాదు నుండి శ్రీశైలం 212 కి.మీ. దూరంలో ఉంది.ఈ రోడ్డు అటవీ ప్రాంతం గుండా పోతుంది. అటవీశాఖ వారు రాత్రి వేళల్లో ఈ ప్రాంతం గుండా ప్రయాణించటానికి అనుమతించరు కనుక పగటి వేళ మాత్రమే ప్రయాణించాలి.

గుంటూరు నుండి శ్రీశైలం 225 కి.మీ. దూరంలో ఉంది.గుంటూరు నుండి నరసరావుపేట, వినుకొండ మీదుగా వచ్చే ఈ మార్గం దోర్నాల వద్ద కర్నూలు రోడ్డుతో కలుస్తుంది. అక్కడి నుండి శ్రీశైలంకు కొండ మార్గంలో ప్రయాణం (53 కి.మీ.) కొండల మధ్యగా చాలా బాగుంటుంది.

 రైలు మార్గములు 

 భారతదేశములో ఏవైపునుండి అయినా గుంటూరు మీదుగా నరసరావుపేట వరకూ రైలు సౌకర్యములు కలవు.

విమాన మార్గములు 

హైదరాబాద్ నుండి విజయవాడ లేదా గుంటూరు వరకూ మైనర్ ఎయిర్ పోర్టులద్వారా చేరుకొని అటుపై బస్సు ద్వారా చేరవచ్చు.