చిలకలూరిపేట పట్టణంలోని ప్రముఖ లీలావతి హాస్పిటల్స్‌లో ప్రముఖ వైద్యురాలు డాక్టర్ లావు సుష్మ ఆధ్వర్యంలో గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. శస్త్రచికిత్సల కంటే సహజ ప్రసవాలకు (నార్మల్ డెలివరీ) ప్రాధాన్యతనిస్తూ, ఆమె అందిస్తున్న సేవలు గర్భిణులు మరియు వారి కుటుంబ సభ్యుల్లో ఎంతో నమ్మకాన్ని కలిగిస్తున్నాయి.

విజయవంతంగా సాధారణ ప్రసవం..

డాక్టర్ లావు సుష్మ సమక్షంలో లీలావతి హాస్పిటల్స్‌లో మరో సాధారణ ప్రసవం విజయవంతంగా జరిగింది. డాక్టర్ సుష్మ ప్రత్యేక పర్యవేక్షణ, నైపుణ్యంతో కూడిన చికిత్స ద్వారా తల్లి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖ ప్రసవం పొందింది.

తల్లీబిడ్డ క్షేమం – 2.8 కేజీల బాలుడి జననం..

ఈ ప్రసవంలో తల్లి 2.8 కేజీల బరువున్న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంతో క్షేమంగా ఉన్నారని వైద్య బృందం తెలిపింది.

వైద్యురాలికి కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు..

సాధారణ ప్రసవాన్ని విజయవంతంగా పూర్తి చేసి, తల్లీబిడ్డల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ చూపిన డాక్టర్ లావు సుష్మకు మరియు లీలావతి హాస్పిటల్స్ సిబ్బందికి బాలుడి కుటుంబ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
Next
This is the most recent post.
Previous
పాత పోస్ట్
Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: