None but a fool thinks he is always right - A poet
ఈ మధ్య ఒక పత్రికలో కొన్ని మంచి మాటలు చదివాను. మీరు కూడా చదవండి మరి...
ఒక తియ్యటి మాట ''దయచేసి'' (PLEASE)
రెండు తియ్యటి మాటలు ''మీకు ధన్యవాదాలు'' (THANK YOU)
మూడు తియ్యటి మాటలు ''నువ్వంటే నాకు ఇష్టం'' (I LIKE YOU)
నాలుగు తియ్యటి మాటలు ''బహుశ నీదే ఒప్పు కావచ్చు' (PERHAPS YOU ARE RIGHT)
అయిదు తియ్యటిమాటలు ''నిన్ను చూచి నేను గర్వపడుతున్నాను'' ( I AM PROUD OF YOU)
ఆరు తియ్యటి మాటలు ''నేను తప్పు చేశానని అంగీకరిస్తున్నాను'' (I ADMIT I MADE A MISTAKE)
శుభోదయం :
More common a person, the more familiar the person, the less noticeable he becomes.
ఒకే ఆఫీసులో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న వ్యక్తికి తనచుట్టూ ఉండే వ్యక్తులు కనిపించడం మానేస్తారు. అతి పరిచయం వల్లవ్యక్తిగానీ వస్తువుగానీ మాయమైపోవడం సహజమే. కనుక ఒకచోట పనిచేసే మనుషులంతా యంత్రాలుగా మారిపోతారు. తెల్లవారి పనికి వెళ్ళగానే పరస్పరం, ప్రేమగా, తియ్యగా పలకరించుకోవాలనే వారికి గుర్తుండదు. కానీ మీరు ఆఫీసు కెళ్ళగానే వరుసగా కనిపించిన వారందరితో ''శుభోదయం'' (Good Morning) అంటూ ముందుకు సాగిపోయారనుకోండి. మీరంటూ ఒక వ్యక్తి ఉన్నారని, ఇంకా బ్రతికే ఉన్నారని, ఉత్సాహంగా ఉన్నారని అంతా గుర్తిస్తారు. అంతేకాదు పొద్దున్నే తియ్యగా పలకరింపబడటాన్ని ఎవరు
మాత్రం ఇష్టపడరు?
అలాగే ఇంటికి వెళ్ళేప్పుడు కూడా తియ్యగా వీడ్కోలు చెప్పండి. మీరు యంత్రాలు కాదు మనుషులమని గుర్తించండి. యంత్రాలు వేటికవి పనిచేయగలవు గానీ మనుషులు మాత్రం ప్రేమతో కలిసి పనిచేయాలి. అందుకు తియ్యగా మాట్లాడాలి ఇలా మాట్లాడే వారే కోకిలలు.
కొత్త పదాలు :
ఒకవేళ మీరు ఉదయం ఆఫీసుకు రాగానే అందరినీ పలుకరించే అలవాటులో ఉన్నా ఆ పదం కూడా యాంత్రికంగా మారిపోయి ఉంటుంది. ఆ పదం వాడటం వల్ల ప్రజల నుండి ఎటువంటి స్పందన రాదు. కనుక ఆ స్థానంలో కొత్త పదాలు వాడటం మొదలుపెట్టండి. (ఆమ్లెట్ మార్నింగ్ అని లేదా వారు శాఖాహారులైతే చద్దన్నం మార్నింగ్ అని అనవచ్చు).
దయచేసి - ధన్యవాదాలు :
ఏదైనా పనిచేసి పెట్టమని కోరేప్పుడు స్త్రీ పురుష, వయో, సాంఘిక స్థాయీ భేదాలు లేకుండా ''దయచేసి ఈ పని చేసి పెట్టండి'' అని కోరండి. చేయబడిన పని ఎంత చిన్నదయినా సరే ధన్యవాదాలు తెలియజేయండి. ఈ విషయం మీ ఇంట్లో భార్యాపిల్లకు, ఆఫీసులో మీతో పనిచేసే వారికి కూడా వర్తిస్తుంది.
నా కిష్టం :
మీరు ఒక వ్యక్తిని ఇష్టపడినంత మాత్రాన సరిపోదు ఆ విషయం తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది. హృదయంతో హృదయం మాటల ద్వారానే ముడిపడుతుంది. తప్పు ఒప్పుకునే ధైర్యం - ఒప్పును స్వీకరించగల హృదయ వైశాల్యం;
" It is said best men are moulded by their faults"
''ఉన్నత మానవులంతా వారి పొరపాట్ల వల్లే మలచబడ్డారు' మానవుడన్న ప్రతివాడూ పొరపాటు చేస్తాడు. కానీ గొప్పవాళ్ళకు తమ తప్పును ఒప్పుకునే ధైర్యం ఉంటుంది. ఎంత మంది ముందైనా సరే ''నేను తప్పు చేశానని అంగీకరిస్తున్నాను'' అనగలడతను.కేవలం అహంకారం చేత, ధైర్యంలేక తప్పు ఒప్పుకోక పోవడం వల్లనే మానవ సంబంధాలు చాలా వరకు దెబ్బతింటాయి.
తమవల్ల తప్పు జరగగానే మాటల ద్వారా దాన్ని కప్పిపుచ్చుదామని ప్రయత్నించడమో లేక సాక్ష్యాలు సృష్టించి దానిని ఒప్పుగా నిరూపించడమో, లేదా ఆ పొరపాటు జరిగిన స్థలంలోనూ సమయంలోనూ తాను లేనని ఋజువు చేయడమో చేస్తారు కొందరు. "The alibi is just an attempt to prove that you weren't wrong" తాను తప్పు కానని నిరూపించడానికి చేసే ప్రయత్నమే 'ఎలిబీ' కాబట్టి తప్పించుకోవడానికి మనం వినియోగించే శక్తి యుక్తులను ''అసలు ఆ తప్పు ఎలా జరిగింది? దానికి దోహదపడిన పరిస్థితులు ఏమిటి?'' అనే విషయాలను విచారించడంలో వినియోగిస్తే, మరొకసారి ఆ తప్పు జరగకుండా ఆపవచ్చు.
సలహాలు, విమర్శలు స్వీకరిస్తున్నారా?
కాకులు కూడా ఉన్నాయి ఈ సమాజంలో. అవి ''కావు-కావు''- ''నీవు చేసేవి సరిఅయినవి కావు'' అంటూ విమర్శించడం వాటికి అలవాటు. వాటి అరుపులు కర్ణకఠోరంగా ఉంటాయి. అయినా వాటితో కూడా సమాజానికి పనిఉంది. సమాజాన్ని శుభ్రంగా ఉంచడానికి (పాకీ పనికి) కాకులు చాలా అవసరం. విమర్శించేవారే లేకపోతే ప్రతివారు తాము లోపరహితులమనే అనుకుంటారు. వారిలోపాలు (చెత్త) వారికి కనిపించవు. మీరు కోకిలలైనా సరే కాకులతో కలిసి జీవించక తప్పదు. లేదా దీనికి వ్యతిరేకంగా మీరు కాకులై ఎదుటివారు కోకిలలైనా కలిసి జీవించాల్సిందే.
సలహాలను, విమర్శలను మీరు ఓపిగ్గా వినగలిగితే మీరు మంచివారు; ఆ విమర్శను గురించి ప్రశ్నిస్తూ ఎదుటివారు దాన్ని ఇంకా వివరంగా చెప్పే అవకాశాన్ని మీరు కల్పిస్తే మీరు ఉత్తములు; మీకు లభించిన వారి సలహా లేదా విమర్శకు మీరు ధన్యవాదాలు తెలియజేస్తే మీకన్నా ఉత్తమోత్తములు ఈలోకంలోనే లేరు అనవచ్చు.
" Advice is an uncertain gift"
సలహా అనేది అందేది లేనిది తెలియని బహుమతి. కనుక వాటిని స్వీకరించడానికి ప్రయత్నించండి. ఒకవేళ అది ఉపయోగకరమైనదయితే, కేవలం నేను వెళ్ళే మార్గాన్నే అనుసరిస్తాను అనే మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి దీన్ని ఆచరించ ప్రయత్నిండండి. లేదా ఇతరులు మీకు చేసే సహాయాన్ని కాలదన్నుకున్నట్టే అవుతుంది. ఎవరికి తెలుసు! వారు చెప్పేదే ఒప్పు కావచ్చుకదా!
ఆత్మ విశ్వాసం :
చాలామంది ఆత్మ విశ్వాసం పేరుతో తాము చేసే తప్పులను ఒప్పుకోరు. ప్రతిక్షణం తాను తప్పు చేస్తున్నానేమో అని మధనపడే న్యూనతా భావం కన్నా ఆత్మవిశ్వాసం వెయ్యిరెట్లు గొప్పది అనడంలో సందేహం ఏమాత్రం లేదు; కానీ ఆత్మ విశ్వాసం పేరుతో విమర్శలను, సలహాలను స్వీకరించకపోవడం, కూడా లోపమే. సలహా స్వీకరించి ధన్యవాదాలు చెప్పండి. విమర్శల నుండి ఏం చేయాలో, ఏం చేయగూడదో నేర్చుకోండి.
ఎవరిది బాధ్యత :
ఒక పనిని మనం కలిసి చేస్తున్నప్పుడు, ఎవరి ఆధీనంలోనన్నాపని చెడిపోతే ఆవ్యక్తిని ''నువ్వు ఎక్కడ తప్పు చేస్తే ఇలాగయ్యింది!'' అని ప్రశ్నించకండి. ''మనం ఎక్కడ పొరపాటు పడటం వల్ల ఈ తప్పు జరిగింది? అని అడగండి. అందరూ కలిసి సాధించవలసిన పనిలో తప్పు జరిగితే, బాధ్యత అంతా కలిసి తీసుకోండి. అప్పుడు వ్యక్తులు ధైర్యంగా ముందుకు సాగగలుగుతారు. అభిప్రాయాలు - ప్రశ్నల రూపంలో :
ఎవరైనా ఒక పనిని గురించి వివరించినప్పుడు సూటిగా....
''ఓ! దానికి చాలా సమయం పడుతుంది''
''కొన్ని వేల రూపాయలు ఖర్చవుతుంది''
''నీ ప్లానేమీ బాగాలేదు''.....
అనబోకండి
''ఈపని పూర్తికావడానికి ఎంత సమయం పడుతుందను కుంటున్నావు?''
''ఎంత ఖర్చవుతుందనుకుంటున్నావు?''
''నీ ఆలోచన నీకు లోపరహితంగా కనిపిస్తోందా? మళ్ళీ ఒకసారి ఆలోచించు'' అనకండి. ఈ విధంగా అభిప్రాయాలు ప్రశ్నల రూపంలో అయితే బాగుంటాయి; ఎవరినీ బాధించవు.
నాకు కూడా ఎదురైంది :
ఎప్పుడూ ఇతరుల లోపాలు సూటిగా ఎత్తి చూపకండి. ఎవరైనాతాము ఎదుర్కొంటున్న సమస్య గురించి మీకు చెబితే ''నాకు ్బడా ఇటువంటి సమస్యే ఎదురైంది'' అంటూ ప్రారంభించండి. ''అప్పుడు నేను ఆ లోపాన్ని ఇలా గ్రహించాను; ఇలా దాన్ని సరిదిద్దుతున్నాను; ఇలా ఆ సమస్యను అధిగమించాను' అని చెప్పి ముగించండి. ఎవరూ ఉపదేశాలు వినడానికి సిద్ధంగా ఉండరు కానీ అవే ఇతరుల అనుభవాలుగా వినడానికి ప్రతివారూ సిద్ధపడతారు.
కుహూఁ - కుహూఁ - కావ్ - కావ్ :
ప్రారంభంలో చెప్పిన ఆరు తియ్యటి మాటలు నేర్చుకొని కోకిలలుగా మారండి. అయినా సరే కాకులతో కలిసి ఉండటానికి సిద్ధపడండి. వారి విమర్శలు, సలహాలు ఓపికగా వినండి. సలహాలకు ధన్యవాదాలు చెప్పండి. విమర్శల నుండి నేర్చుకోండి.

Post A Comment:
0 comments: