ఎవ్వరు ఏన్ని చెప్పిన నేను చివరికి నేను చెప్పేదొకటే? చివరిక్షణం వరకు ఆత్మవిశ్వాసం విడువవద్దు.
ఒక మహాత్ముడు తన సఫలత యొక్క మూల సూత్రాన్ని వివరిస్తూ ఇలా వ్రాస్తాడు. నేను ఉదయం లేవగానే ''నేను చేయగలను చేస్తాను'' అనే మంత్రాన్ని జపిస్తాను.

విశ్వాసమే ఆత్మ బలానికి అంతంకాని ధార. నదిని ఈదేవాడు మధ్యలో తాను ఆవలి తీరానికి చేరగలననే ధైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడా ఇక అతడి మరణం తథ్యం. విమానం నడిపే పైలట్ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతే అతడు తనతో బాటు విమానంలో ఉన్నవారి నందరినీ ఆ పై లోకాలకు తీసుకువెళ్ళగలడు.
రైలు కొండ ఎక్కేటప్పుడు " I think, I will, I think I will" అంటుంది. (నేను ఎక్కగల ననుకుంటాను) అంటాడో కవి. కొండ దిగేటప్పుడు వేగం పెరగగా "I thought I could, I thought I could" (నేను ఎక్కగలనని అనుకున్నాను ఎక్కాను) అంటున్నట్టుగా వినిపిస్తుందని అంటాడా కవి.
ఒక స్కూల్‌లో చరిత్రకు సంబంధించిన పాఠం ఒకటి విద్యార్ధులను వ్రాయమని ఆజ్ఞాపించాడు. అధ్యాపకుడు. కొద్ది సేపటికి ఒక విద్యార్ధి వ్రాయడం లేదనిగ్రహించి, ఆ పిల్లవాణ్ని నిలుచోబెట్టి ఎందుకు వ్రాయడం లేదో చెప్పమని గద్దించి అడిగాడు. ఆ పిల్లవాడు ''సార్ మీరు చెప్పిన ప్రతి అక్షరం నాకు గుర్తున్నది. మరి మళ్ళీ అది నేను ఎందుకు వ్రాయాలి'' అన్నాడు. అధ్యాపకుడు కోపంగా నిజంగానే నువ్వు పాఠాన్ని అక్షరం పొల్లుపోకుండా వప్ప చెప్పగలిగావో ఫరవాలేదు, నిన్నేమీ అనను. కాని చెప్పలేక పోయావంటే మాత్రం దండిస్తాను'' అన్నాడు. కాని అందరూ ఆశ్చర్యపోయేట్లుగా ఆ పిల్లవాడు పాఠం వప్పచెప్పాడు.
ఇంకోసారిక్లాసు రూములో పడ్డ వేరుశనగక్కాయ పొట్టుచూసి ఉగ్రుడై ఆ టీచరు పిల్లలందరినీ దండించడం మొదలు పెట్టాడు. ఆ పిల్లవాడి వద్దకు వచ్చేసరికి ''సార్ నన్ను కొట్టకండి, నేను తప్పు చేయనప్పుడు ఎందుకు శిక్ష ననుభవించాలి?' అన్నాడు. టీచర్ ఆ పిల్లవాణ్ణి విడిచి పెట్టి తక్కిన పిల్లవాళ్ళను దండించాడు. ఆ పిల్లవాడెవరో కాదు, లోకమాన్య బిరుదాంకితుడైన బాల గంగాధర తిలక్. అవి ఆయన విద్యార్ధి జీవితంలో జరిగిన సంఘటనలు. ఆత్మ విశ్వాసానికి నిధియైన ఈ మహాత్ముడు స్వతంత్రసంగ్రామంలో ''స్వాతంత్య్రం నా జన్మహక్కు'' అని గర్జించాడు. ఏదోఒకరోజు నాదేశం శృంఖలాలు తెగుతాయి అనే విశ్వాసంతోటే ఆయన ముందుకుసాగాడు. మరణాసన్న సమయంలో కుడా ఆయన ఆ విశ్వాసం విడవలేదు. ఆత్మ విశ్వాసంలోనుంచే ఆశ, ఆశలోనుండే ఉత్సాహం ఉత్పన్నమౌతు న్నాయి.ఉత్సాహమున్నచోటే విజయం ఉంటుంది. సాహసియైన వ్యక్తి ఒకసారి ఓడి పోయినా హతాశుడుకాడు. తిరిగిమరింత ఉత్సాహంతో పనిచేయనారంభిస్తాడు.
మిల్టన్ వాక్యాలు వినండి...
''యుద్ధంలో ఓడిపోతే ఏం? సర్వస్వం పోగొట్టుకోలేదు కదా?''
మిల్టన్ వాక్యాలు వినండి...
''యుద్ధంలో ఓడిపోతే ఏం? సర్వస్వం పోగొట్టుకోలేదు కదా?''
బ్రవునింగ్ మాటలు ఆలకించండి....
''నేనెప్పుడూ పోట్లగిత్తనే, ఇంకో పోట్లాటకు కూడా సిద్ధమే. దానిని కుడా ప్రాణాలతో సమానంగా కొనసాగిస్తాను.
పండిట్ మదనమోహన్ మాలవీయ, కాశీ విశ్వవిద్యాలయ స్థాపనకు కావలసిన నిథిని సేకరిస్తూ హైద్రాబాద్ వచ్చి నైజాం నవాబును కుడా యాచించాడు. నవాబ్ మాత్రం నిర్కొహమాటంగా నిధి ససేమిరా ఇవ్వనన్నాడు. ఆత్మవిశ్వాసం గల మాలవీయ నిరాశ పడలేదు. మంచి అవకాశం కొరకు ఎదురు చూడటం మొదలు పెట్టాడు. అదే సమయంలో ఒక ధనవంతుడు మరణించాడు. అతడి శవయాత్ర సాగిపోతున్నది. అతని బంధువులు గుప్పెళ్ళతో డబ్బు విసిరేస్తుంటే ప్రజలు కోలాహలంగా ఏరుకుంటున్నారు. కాసేపు ఆలోచించిన మాలవీయ తాను కుడా వెళ్ళి డబ్బులు ఏరుకోవడం మొదలుబెట్టాడు. ఆయనను ఎరిగిన వారంత ఆశ్చర్యంగా ''మాలవీయాజీ ఇదేమిటి? ఇలా చేస్తున్నారు? అని అడిగారు. ఆయన నవ్వుతూ ''ఏం చేయను నేను బెనారస్, వెళ్ళగానే హైదరాబాద్ నుండి నిధి తెస్తానని వెళ్ళారుకదా ఏవి అని అడిగితే ఏం చేయను. బ్రతికున్న నవాబేమో ఇవ్వనన్నాడు. అందుకనే హైదరాబాద్‌లో శవాల నుండయినా డబ్బు వసూలు జేసుకువెళదామని'' ఈ విషయం ఆనోటినుండి, ఆనోటికి వెళ్ళి చివరికి నవాబును చేరింది. నిజామ్ సిగ్గుపడి తానే స్వయముగా మాలవీయ వద్దకు వచ్చి క్షమాపణలడిగి గొప్ప నిధిని దానం చేశాడు. కనుక ఆత్మవిశ్వాసాన్ని విడవకండి సఫలత మీదౌతుది.

Post A Comment:
0 comments: