ఆగస్టు 2014
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
ఊపిరి తిత్తుల సమస్య వలన ఉబ్బసం వ్యాధి వస్తుంది. కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అలర్జీ కలగడం వల్ల కూడా ఈ ఇబ్బంది ఎదురవుతుంది. అయితే ఈ అలర్జీలు అందరిలోనూ ఓకే లా ఉండవు.
కొంతమంది కి నిమ్మ జాతి పండ్లు, మరికొంత మందికి పాలు, కోడిగుడ్డు, గోధుమలు, వేరుశనగలు, చేపలు, పిండి పదార్థాలు, ఇలా ఒక్కొక్కరికి ఒక్కో వస్తువు తింటే అలర్జీ రావచ్చు. శరీరంలో చెక్కర శాతం తగ్గినా ఈ సమస్య లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్లు ముఖ్యంగా ప్రాసెర్డ్ ఫుడ్, ప్యాక్ డ్ ఫుడ్స్ తీసుకోవడం తగ్గించాల్సి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల వాటిలోని సల్ఫేట్ లు, బెంజైట్ ల వల్ల ఆస్తమా లక్షణాలు మరింత పెరగొచ్చు. అందుకని శీతల పానీయాలు, చిప్స్, సాస్, నిల్వ చేసిన ఆహారపదార్థాలు, పళ్ళ రసాలు తగిస్తే సమస్య కొంత వరకు అదుపులో ఉంటుంది. ముందే చెప్పుకున్నట్లు ఒకే ఆహారం తీసుకోవడం వల్ల ఆస్త్మా రాకపోవచ్చు. ఫుడ్ డైరీ ఒకటి పెట్టుకొని ఏయే పదార్థాలు తింటే అలర్జీ వస్తోందే ఎప్పటికప్పుడు రాసుకుంటే మీకు ఓ అవగాహన ఏర్పడుతుంది.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
పీసీఓడీ అనగా ఇమ్మెచ్యూర్ ఫాలికల్ (సరిగా ఎదగని అండం) గర్భాశయానికి రెండు వైపులా ఉన్న అండాశయాలపై నీటిబుడగల వలె ఉండటాన్ని పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అంటారు. దీని బారిన పడిన చాలామంది స్త్రీలు సాధారణ ఆహార అలవాట్లు పాటిస్తున్నప్పటికీ అధిక బరువు, వెంట్రుకలు రాలిపోవడం, మొటిమలు, ముఖం మీద మగవారిలా వెంట్రుకలు రావడం, నెలసరి సరిగ్గా ఉన్నప్పటికీ సంతాన లేమితో బాధపడుతూ ఉంటారు. దీనిని అదుపులో ఉంచుకోవడానికి ఈ సలహాలు పాటించి చూడండి...

హార్మోన్ల అసమతౌల్యం వల్ల ఎదురయ్యే పీసీఓడీతో బాధపడేవారికి సాధారణంగా, ఆకలి, జీవక్రియలకు సంబంధించిన సమస్యలు, శరీరంలో కొవ్వు పేరుకుపోవడం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. తక్కువ క్యాలరీల ఆహారం తీసుకోవడం మొదలు పెట్టడం వల్ల అది తలనొప్పి, నీరసం, కళ్లు తిరగడానికి దారి తీసింది. అయితే మీరు తగినంత బరువు ఉన్నారా ? లేదా? అన్న విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది. మీ బరువు తగ్గిన విషయం తెలుసుకోవడానికి మీ నడుం భాగం, భుజాలు కొలుచు కొని చూడండి. ఇక కళ్లు తిరగడం, తలనొప్పి వంటి వాటిని దూరం చేసుకోవాలంటే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. పాలిష్ చేసిన బియ్యానికి బదులుగా బ్రౌన్ రైస్, బొంబాయి రవ్వకు బదులు గోధుమ నూక వాడడం, ఇలాంటి మార్పులను మీ ఆహారంలో చేసుకోండి. ముడి ఆహారానికి, తృణధాన్యాలకు ఎక్కువగా ప్రాధాన్యాన్ని ఇవ్వండి. అన్ని వేళల మీరు తీసుకునే ఆహారంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ప్రొటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇంకో ఉపయోగమేంటంటే దీని వల్ల ఆకలి కూడా అదుపులో ఉంటుంది. సాధ్యమైనంత వరకు శాకాహారానికి ప్రాధాన్యం ఇవ్వండి. ముఖ్యంగా సోయా ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోండి. అప్పుడప్పుడు ఉడికించిన కోడిగుడ్డులోని తెల్లసొన, చేపలు తీసుకుంటూ ఉండండి. ఈ విధంగా ఆహారంలో మార్పులు చేసుకున్నా, పెద్దగా మార్పు లేకపోతే, ఒకసారి డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language

ఆల్కహాల్ 

ఒకటి లేదా రెండు గ్లాసుల రెడ్ వైస్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే కావచ్చు. కానీ అంతకు మించిందంటే మాత్రం లైంగిక చర్యకు ముప్పే. ఎందుకంటే ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల డిప్రెషన్ కు గురవుతారు. తద్వారా లైంగిక హార్మోన్ల విడుదల మందగిస్తుంది. కాబట్టి ఆల్కహాల్ కు దూరంగా ఉండం మంచిది.

చీజ్ 
మార్కెట్లో దొరికే చీజ్ ను ఆవు పాలతో తయారు చేస్తారు. ఇవి సహజమైన పాలైతే ఇబ్బంది ఉండదు, కానీ ఆవులకు ఆర్టిఫిషియల్ హార్మోన్లు ఇంజెక్ట్ చేసి తీసిన పాలతో చీజ్ తయారు చేయడం ఈ మధ్య ఎక్కువైంది. ప్రాసెస్డ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల క్జెనీసోజెస్ అనే హార్మోను ఎక్కువగా విడుదలవుతుంది. దీని వల్ల కోరికలు తగ్గే అవకాశాలు ఉంటాయి. అందుకే చీజ్ తక్కువగా తీసుకోవడం మంచిది.

సోయా ఉత్పత్తులు 
సోయా ఉత్పత్తులు మన ఆరోగ్యానికి చాల మంచివి. దీని వల్ల మంచి జరుగుతుంది కాదని వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు చాల మంది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే సోయా ఉత్పత్తులన్నీ ఎక్కువగా ప్రాసెస్ చేసి తయారు చేస్తారు. ఇలా చేయడం వల్ల వాటిలోని మంచి గుణాలన్నీ తొలగిపోతాయి. అంతే కాదు, సోయాలో ఉండే ఫైటోఈస్టొజెస్ లైంగిక పటుత్వాన్ని తగ్గిస్తుంది.

కూల్ డ్రింక్స్ 
కూల్ డ్రింక్స్  వల్ల ఒబేసిటీ, డీహైడ్రేషస్ వంటి సమస్యలు ఉత్పన్నమవడమే కాదు, లైంగిక కోరికలు కూడా తగ్గిపోతాయి.

ఆర్టిఫిషియల్ స్వీట్ నర్స్ 
ఆర్టిఫిషియల్ స్వీట్ నర్స్ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంచుకుంటున్నారా. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల లైంగిక వాంఛలు తగ్గిపోతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. పైగా తలనొప్పి, డిప్రెషన్ లాంటి సమస్యలు కూడా వేధిస్తాయి

పాకేజ్డ్ ఫుడ్ 
ప్యాక్ చేసిన ఆహారం తినడం వల్ల మన ఆరోగ్యానికి అన్ని రకాలుగా ఇబ్బందులే ఎదురవుతాయి. అది మన బరువు ను పెంచుతుంది. బీపీని పెంచుతుంది. దాంతో పాటు లైంగికారోగ్యం పైన కూడా ప్రభావం చూపిస్తుంది. వీటిలో ఉండే సోడియం లైంగిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే వీలైనంత తక్కువగా వీటిని తీసుకోవడం మంచిది.

సాధారణంగా మనకు పడని, మన ఆరోగ్యానికి మంచిది కాదు అనుకున్న పదార్థాలను అవి మనకు ఎంత ఇష్టమైన సరే.. కష్టపడి మానేస్తాం కదా.. ఇవీ అంతే.. దాంపత్య జీవితంలోని ఆనందమయ క్షణాలను దూరం చేస్తాయనుకున్నప్పుడు వాటిని వీలైనంత తక్కువగా తీసుకోవడం మంచిది. 
అందుకే వాటిని వినియోగించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. అవసరమైతే వైద్య నిపుణుల సలహా తీసుకోండి.

Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
ప్రతిరోజు సైకిల్ వాడడం వలన కలిగే లాభాలు

మునుపటి రోజుల్లో జనాలకు సైకిల్  నడిపే అలవాటు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు సైకిల్ తొక్కే అలవాటు చాలావరకు తగ్గిపోయింది. సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్య రీత్యా చాలా లాభాలు వున్నాయనే విషయం  మనం తెలుసుకోవాలి. అవి ఏటంటే...
  • సైకిలు తొక్కడం వల్ల కండరాలు దృఢంగా, శక్తిమంతంగా తయారవుతాయి.
  • కాళ్లు, భుజాలు, చేతులు, వెన్ను, పొట్ట కండరాలలోకి రక్తప్రసరణ మెరుగు అయి ఆ భాగాల కండరాలు పటిష్టం అవుతాయి.
  • శ్వాసక్రియ మెరుగుపడుతుంది.
  • రెగ్యులర్గా సైకిల్ తొక్కే అలవాటు చేసుకుంటే శరీరంలో వున్న కొవ్వు వినియోగమై ఒబేసిటీ (స్థూలకాయం) ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది.
  • సైకిలు ఒక క్రమపద్ధతిలో తొక్కుతున్నప్పుడు శ్వాసకోశాలలోకి నిరంతరంగా గాలిని పీల్చుకోవలసివస్తుంది. దీనివల్ల ఆక్సిజన్తో కూడిన రక్తం ధమనుల ద్వారా కండరాలకు ప్రసరిస్తుంది. 
  • కండరాలు ఆక్సిజన్ ను ఎక్కువగా గ్రహిస్తే కణజాలం నుండి వ్యర్థపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఫలితంగా శరీరం కొత్త శక్తిని పొందుతుంది.
సో... ఇకనైనా మోటార్ వెహికల్ వాడి పర్యావరణానికి హాని కలిగించే బదులు దగ్గర దూరాలు ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు సైకిల్ వాడడం బెటర్.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
కొందరికి టీ కాఫీలు మంచి నీళ్ల ప్రాయం. అలా తాగడం వల్ల ఒనగూరే లాభాలు, నష్టాలు తెలియకపోయినా అదేపనిగా వాటిని తాగేస్తుంటారు. నాలుగు కప్పులకు మించకుండా తాగే టీ... కనీసం 20 శాతం పక్షవాతాలను నివారిస్తుంది. చాక్లెట్ల తీరూ అంతే. కానీ మూడు కప్పులు మించిన కాఫీతో మాత్రం ఇబ్బందులు తప్పవు.. టీ త్రాగడం వల్ల మెదడు పై ప్రభావాలు ఎలా ఉంటాయంటే...

 గ్రీన్ టీ - బ్లాక్ టీ ల ప్రభావాలు:
 టీ గురించి పూర్వం నుంచే తెలుసు. ప్రధానంగా చైనా వారికి టీ గురించి 4,700 సంవత్సరాల క్రితం నుంచీ అవగాహన ఉంది. మంచి నీళ్ల తర్వాత మానవాళి అత్యధికంగా తాగేది టీనే. ఇందులోనూ అనేక రకాలున్నాయి. అయితే మనం తీసుకునే టీ ఎంతోకొంత పులిసే తత్వం ఉన్న పానీయం. కానీ గ్రీన్ టీలో పులిసే తత్వం లేదు. ఇక అన్నిరకాల టీలలో కాటేచిన్స్, ఫ్లేవనారుడ్స్ అనే జీవరసాయనాలు ప్రధానంగా ఉంటాయి. ఇవి రెండూ ప్రభావపూర్వకమైన యాంటీ ఆక్సిడెంట్స్. అయితే టీలో... ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, కొవ్వు పదార్థాలు... వంటివేవీ ఉండవు. టీ తాగగానే అందులోని ఫ్లేవనాయిడ్స్ హానికరమైన కొలెస్ట్రాల్ అయిన ఎల్డీఎల్ను, కొవ్వు పదార్ధలైన ట్రైగ్లిజరాయిడ్స్ను సైతం తగ్గిస్తాయి. కానీ శరీరానికి మేలు చేసే మంచి కొలెస్ట్రాల్ (హెచ్డీఎల్) ను మాత్రం పెంచలేవు. టీ తాగడం వల్ల కొవ్వు పేరుకునే ప్రక్రియకు కాస్త అడ్డుకట్ట పడుతుంది. అయితే ఈ సుగుణం ఉంది కదా అని మోతాదుకు మించకుండా పరిమితంగా మాత్రమే తాగాలి. అంటే రోజుకు నాలుగు కప్పులకు మించనివ్వ కూడదు.
ఇలా పరిమితంగా టీ తాగడం పక్షవాతాన్ని నివారిస్తుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకొని రక్తప్రవాహాన్ని అడ్డు కోవడం వల్ల వచ్చే ఇస్కిమిక్ స్ట్రోక్, రక్తనాళాలు చిట్లడం వల్ల వచ్చే హేమరేజిక్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ల నివారణకు తోడ్పడతాయి. ఇలా స్ట్రోక్ను నివారించే గుణం సాధారణ టీ కంటే గ్రీన్ టీ లో ఎక్కువగా ఉంది. వివిధరకాల పక్షవాతాల్లో కనీసం 20 శాతం పక్షవాతాలను టీ నివారిస్తుంది. తాగిన వెంటనే శరీరంలో కొలెస్ట్రాల్ పాళ్లను తగ్గించడం, నైట్రిక్ఆక్సైడ్ పాళ్లను పెంచడం వంటి గుణాలు ఉన్నందున ఈ ప్రయోజనం చేకూరుతుంది. రక్తనాళాల్లోని లోపలి పొర అయిన ఎండోథీలియం... రక్తాన్ని సాఫీగా ప్రవహించేలా చేస్తుంది. ఈ గుణాన్ని టీ మరింత మెరుగుపరుస్తుందని పరిశోధనల్లో తేలింది. టీలోనూ కొంత మేరకు కెఫిన్ పాళ్లు టీలో ఉన్నప్పటికీ వాటి ప్రభావం చాలా తక్కువ. 
ఆరోగ్యానికి మేలు చేకూరేలా టీ తాగడం ఎలా: 
టీలో కాచెటిన్, ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అప్పటికప్పుడు కాచిన టీలోనే అవి ఎక్కువగా లభిస్తాయి. అందుకే టీని ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తయారు చేసుకుని తాగాలి. ఇన్స్ స్టెంట్ టీ/ఐస్ టీలలో కాచెటిన్, ఫ్లేవనాయిడ్స్ పాళ్లు చాలా తక్కువ.
టీ లో ప్రతికూల అంశాలు... 
మేలు గుణాలతో పాటు, టీ లో కొన్ని ప్రతికూల గుణాలూ ఉన్నాయి. ఉదాహరణకు మనం తీసుకున్న ఆహారం, పండ్లు, కూరగాయల నుంచి శరీరానికి అందాల్సిన ఐరన్ను టీ శరీరంలోకి ఇంకకుండా నిరోధిస్తుంది. అందుకే ఆహారం తీసుకునే సమయంలో టీని పూర్తిగా దూరంగా ఉంచాలి. తినే ముందు, తిన్న తర్వాత కూడా చాలాసేపటి వరకు టీ తాగకూడదు. అలాగే టీ ఎక్కువగా తాగే అలవాటు (అంటే రోజుకు ఒక లీటర్ కంటే ఎక్కువగా తాగుతూ, అలా ఏళ్ల తరబడి తాగేవారికి) దీర్ఘకాలంలో ఫ్లోరోసిస్ కు దారితీసే ప్రమాదం ఉంది. పైన పేర్కొన్న అధ్యయనాలతో తేలిన విషయం ఏమిటంటే... గ్రీన్ టీ లేదా సాధారణ టీ తాగే అలవాటును కొనసాగించవచ్చు. 
కాకపోతే రోజుకు నాలుగు కప్పులకు మించి తాగవద్దు. ఆ పరిమితుల్లో టీ తాగడం వల్ల భవిష్యత్తులో పక్షవాతాన్ని చాలావరకు, గుండెజబ్బులను కొద్ది మేరకు నివారించుకోవచ్చు. ఇక చాక్లెట్ కూడా ఒకటికి మించి తినవద్దు. అయితే కాఫీ అలవాటు ఉన్నవారు మాత్రం రోజుకు రెండు కప్పులకు మించి తాగకూడదు. ఆ మోతాదు మించితే అది హానికరమని గ్రహించండి. కాఫీ, టీలలో వేసుకునే చక్కెర పాళ్లను గణనీయంగా తగ్గించాలని గుర్తుపెట్టుకోండి. పరిమితికి మించిన చక్కెర వేసుకుంటుంటే అది క్రమంగా రక్తంలో చక్కెర పాళ్లను పెంచడం, బరువును పెంచి స్థూలకాయం వచ్చేలా చేయడం జరుగుతుందని మర్చిపోకూడదు.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language




మనకు సంబంధించినంత వరకు కాఫీ చూడటానికి ఆకర్షణీయంగా, చిక్కటి రంగుతో, పొగలుకక్కుతూ, రుచికరమైన సువాసనను వెలువరుస్తూ చూడగానే తాగాలనిపిస్తుంది. అంతవరకే మనకు తెలిసింది. కానీ అదెంతో సంక్లిష్టమైన పానీయం. ఒక కప్పు కాఫీలో వందల కొద్దీ జీవసంబంధ మైన పదార్థాలున్నాయి. అందులో కొన్ని చురుకైనవి. ఉదాహరణకు కెఫిన్, డైటర్పిన్స్, డైఫీనాల్స్ వంటివి. ఒక కప్పు కాఫీ తాగగానే హృదయ స్పందనల విషయంలో దాని ప్రభావం ఉంటుంది. అయితే ఆ ప్రభావం ఏమేరకు అన్నది,వ్యక్తిగతంగా తాగేవారికి ఉన్న కొన్ని వ్యాధులు, లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. అలాగే కాఫీ ఎలా తయారు చేశారు అనే అంశంపై కూడా ఆధారపడి ఉంటుంది. అంటే... అది ఫిల్టర్ కాఫీయా లేక సాధారణ కాఫీయా అన్న అంశంపైన అన్నమాట.


కెఫిన్ ప్రభావం:
 కాఫీలో ఉండే కెఫిన్ చాలా ప్రధానమైన ఉత్ప్రేరకం. మనం కాఫీ తాగగానే ఏమవుతుందంటే : కాఫీ ఒంట్లోకి ఇంక గానే దాని ప్రభావం శరీరంపై, ఆరోగ్యంపై కనిపిస్తుంది. కాఫీ తాగిన కాసేపట్లో రక్తపోటు (ప్రధానంగా సిస్టోల్ బ్లడ్ ప్రెషర్) పెరుగుతుంది. బీపీని కొలిచే సాధనంతో చూస్తే, అది సాధారణం కంటే 8 ఎంఎం/హెచ్జీ ఎక్కువవుతుంది. డయాస్టోలిక్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. అయితే అది 6 ఎంఎం/హెచ్జీ పెరుగుతుంది. ఈ రెండు పెరుగుదలలూ కాఫీ తాగిన తర్వాత సుమారు గంట నుంచి మూడు గంటల పాటు అలాగే ఉంటాయి. ఈ కొలతల్లో పెరుగుదల అన్నది సాధారణ వ్యక్తుల కంటే రక్తపోటుతో బాధపడేవారిలో ఎక్కువ. అందుకే హైబీపీతో బాధపడేవారు కాఫీ తాగే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. అంతగా తాగాలనిపిస్తే కొద్ది మోతాదులో మాత్రమే తమ జిహ్వను సంతృప్తి పరచడానికి తీసుకోవాలి. ఎందుకంటే... 
 ఇలా కాఫీ ఎక్కువగా తాగుతూ బీపీని పెంచుకోవడం వల్ల దీర్ఘకాలికంగా దాని దుష్ర్పభావాలు ఉంటాయి. ఎందుకంటే కాఫీ తాగిన ప్రతిసారీ కెఫిన్ విషయంలో కొంత నిరోధకత (టాలరెన్స్) పెరుగుతూ ఉంటుంది. అంటే మొదటిసారి కాఫీ తాగినప్పుడు కలిగే ఉత్తేజం, రెండో కాఫీకి తగ్గుతుందన్న మాట. అందుకే రెండోసారి కూడా అంత ఉత్తేజం పొందాలనుకుంటే రెండోసారి కాస్త ఎక్కువ తాగాలన్నమాట. ఇలా కాఫీ ఇచ్చే ఉత్తేజానికి అలవాటు పడ్డప్పుడు క్రమంగా మోతాదును పెంచుకుంటారు. ప్రధానంగా పరీక్షల కోసం చదివే పిల్లలు రాత్రుళ్లు చురుగ్గా ఉండటం కోసం, నిద్రమత్తును దూరం చేసుకోవడం కోసం దీనిపై ఆధారపడతారు.
 కాఫీని కేవలం పానీయంగానే పరిగణించకూడదు. ఎందుకంటే ఇందులో మైగ్రేన్ తల నొప్పిని తగ్గించే యాంటీ మైగ్రేన్ఔషధం ఉంటుంది. అందుకే ఒకసారి ఒక కప్పు కాఫీ తాగాక రెండో దానికి వ్యవధి ఇవ్వాలి. లేకపోతే అవసరం లేని మందును/మాత్రను వేసుకుని దాని సైడ్ ఎఫెక్ట్స్ను పొందడమేనని గుర్తుంచుకోవాలి. అలాగే కాఫీ... యాంగ్జైటీని పెంచుతుంది. కొందరిలో వణుకును కూడా పెంచుతుంది. అందుకే యాంగ్జైటీతో బాధపడేవారు కాఫీని తాగకపోవడమే మంచిది. ఇక ఎస్ప్రెస్సో కాఫీతో ఆరోగ్యానికి జరిగే హాని అంతా ఇంతా కాదు. డైటర్ పీన్ ప్రభావం: కాఫీలో ఉండే డైటర్ పీన్ ప్రభావం ఆరోగ్యంపై ఎలా ఉంటుందో చూద్దాం. కాఫీలో ఉండే ఈ జీవరసాయనం శరీరంలోకి ప్రవేశించ గానే అది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) పాళ్లను, హానికరమైన ట్రైగ్లిజరైడ్స్ పాళ్లను అకస్మాత్తుగా పెంచేస్తుంది. ఇక ఫిల్టర్ కాఫీలో డైటర్పీన్స్ పెద్దగా ఉండవు. ఎందుకంటే వడపోత ప్రక్రియలో ఇవి కాఫీలోకి వెళ్ల కుండా, ఫిల్టర్ కాగితంపైనే ఉండిపోతాయి. కానీ ఫిల్టర్ చేయని కాఫీలో మాత్రం డైటర్పీన్ పాళ్లు అధికంగా ఉంటాయి. అందుకే కేవలం హైపర్టెన్షన్ ఉన్నవాళ్లు మాత్రమే గాక... శరీరంలో కొవ్వు పాళ్లు ఎక్కువగా ఉన్నవారు కాఫీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరు మామూలు కాఫీకి బదులుగా ఫిల్టర్ కాఫీని ఒక కప్పు మాత్రం తీసుకోవచ్చు.
మంచి గుణాలు లేవా?  కాఫీ ఎప్పుడూ హానికరమేనా?
ఇందులో మంచి గుణాలు లేవా? కాఫీ ప్రియులు అంతగా నిరాశ పడనక్కర్లేదు. ఎందుకంటే కాఫీని పరిమిత మోతాదులో తీసుకుంటే అది పక్షవాతాన్ని (స్ట్రోక్ని) నివారిస్తుంది. కాఫీలోని డైఫినాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఈ పని చేస్తుంది. ఐదు లక్షల మంది కాఫీ ప్రియులపై విస్తృతంగా చేసిన అధ్యయనాలలో ఈ విషయం తెలిసింది. అయితే ఈ ప్రయోజనాన్ని పొందడానికి కాఫీని కేవలం రోజుకు రెండు కప్పులకు మాత్రమే పరిమితం చేసుకోవాలి.

Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
సాధారణంగా వయసు పైనబడిన వారిలో రక్తంలో క్యాల్షియం, విటమిన్-డి తక్కువగా ఉండం వల్ల ఒంటి నొప్పులు, ఎముకలు, కండరాలకు సంబంధించిన సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి సమస్య మధుమేహుల్లో కొద్దిగా ఎక్కువగానే కనిపిస్తుంటుంది. కాబట్టి మధుమేహులు విటమిన్-డి, క్యాల్షియం కోసం డాక్టర్ సలహాతో మందుల్ని ఎక్కువ కాలమే వేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల సమస్య ఏమీ ఉండదు.
ఎలా గుర్తించాలి? 
ఇతరత్రా ఏమైనా కారణాలతో ఛాతీ, కీళ్లు, తుంటికి సంబంధించిన ఎక్స్-రే తీసినప్పుడు ఎముకలు అరిగిపోయే, విరిగిపోయే లక్షణాలు కనిపిస్తాయి. ఎముకలు మామూలుగా ఉండాల్సిన దాని కన్నా పలుచగా, సన్నగా, పెళుసు గా కనిపిస్తే ఆస్టియో పొరోసిస్ గా అనుమానించాలి. శరీరంలో క్యాల్షియం, విటమిన్-డి తగ్గం వల్ల ఇలాంటి సమస్య వస్తుంది. ఇలాంటి వన్ని మధుమేహ బాధితుల్లో ఎక్కువగా జరిగే అవకాశం వుంది. అందుకనే, వైద్యులు ఇలాంటి మందుల్ని ముందు జాగ్రత్తగా సూచిస్తారు. ఆస్టియో పొరోసిస్ సమస్య ఉండేవారిలో 65 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కడైనా జారిపడితే తుంటి ఎముక విరిగి పోయే ప్రమాదం ఉంది కాబట్టి, ముందస్తుగానే ఎక్స్-రే ద్వారా ఆస్టియోపొరోసిస్ తలెత్తే అవకాశం ఉన్నట్లు గుర్తించి, మందులు వాడితే మంచిది. ఇక పోతే.. మధుమేహం ఉన్నవారు, రక్తంలో షుగర్ స్థాయి పరీక్షించుకుంటూ, దానిని నియంత్రణలో ఉంచుకోవటానికి వైద్యుల సలహాతో ప్రత్యేకించి మందులు వాడడం కూడా అవసరమే.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
గర్భిణులకు మధుమేహం వస్తే కాన్పు తర్వాత  తగ్గిపోవచ్చు. అయితే, కాన్పు తర్వాత అయిదేళ్లు లోపు కనీసం సగం మందిలో మధుమేహం శాశ్వతంగా వచ్చేస్తుంది. ఒకసారి గర్భంతో ఉన్నప్పుడు మధుమేహం వచ్చిందంటే, తర్వాతి అయిదేళ్లలో డయాబెటిస్ వచ్చే అవకాశం 50 శాతం ఉంటుంది. ఇతరత్రా మధుమేహుల మాదిరిగానే ఆహార నియమాలు, వ్యాయామాలు వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భిణుల్లో మధుమేహం వచ్చినప్పుడు, కాన్పు తర్వాత ప్రతి నెల రక్తపరీక్ష చేయించు కుంటుండాలి. అయిదేళ్లలో వస్తుందిలే అనే నిర్లక్ష్యం పనికి రాదు. ఏ నెలల్లో రక్తంలో గ్లూకోజ్ ఎక్కువవుతుందో తెలియదు కాబట్టి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండడమే శ్రేయస్కరం.

గర్భధారణలో వచ్చిన మధుమేహం అలాగే ఉండిపోయింది. అందుకని, ఆహార, వ్యాయామాల నియమాలు పాటిస్తూనే, మందులూ వాడడం శ్రేయస్కరం. ప్రస్తుత కాలంలో నిరంతరం మందులు వాడుతుండాల్సిందే. కొంతకాలం పాటు మానేసి చూద్దామనే ధోరణి ఎంతమాత్రం సరికాదు. ప్రస్తుతం వైద్య నిపుణులంతా సూచిస్తున్నదేమింటే, డయాబెటిస్ ను నియంత్రించే మందుల్ని ఎంత త్వరగా మొదలు పెడితే అంత మంచిది. 25 ఏళ్లు లోపు మధుమేహం వచ్చిన గర్భవతుల్లో ఇన్సులిన్ తోనే నియంత్రించాల్సిన అవసరం ఉంటుంది. 25 ఏళ్లు దాటిన తర్వాత గర్భం దాల్చిన వారిలో మధుమేహం ఉంటే గర్భిణిగా ఉన్నప్పుడు ఇన్సులిస్ తీసుకున్నా, కాన్పు తర్వాత మాత్రలతో నియంత్రించుకునే అవకాశం ఉంది. కానీ, 25 ఏళ్లు లోపే వచ్చి ఉంటే మాత్రం ఇన్సులిన్ తో మెట్ఫార్మిస్ వంటి మందులూ వాడుతూ ఆ తర్వాత రక్తంలోని స్ధాయిన్నిబట్టి ఇన్సులిస్ నిలిపి వేసే అవకాశాన్ని పరిశీలించవచ్చు. తర్వాత తర్వాత రెండుమూడు నెలల వరకూ రక్తంలో గ్లూకోజ్ తగ్గుతుంటే ఇన్సులిస్ ఆపేసి మందులు మాత్రమే వాడొచ్చు. గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంటే మాత్రం ఇన్సులిన్ ను కొనసాగించాలి.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
పదేళ్లకు పైగా మధుమేహం బారిన పడిన వారు గ్యాంగ్రిస్ విషయంలో ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. గ్యాంగ్రిస్ ఏర్పాడ్డాక జాగ్రత్తలు తీసుకుందాం, ముందు నుంచీ ఎందుకనే ధోరణి మధుమేహులకు పనికిరాదు. మధుమేహులు సూది మొన గుచ్చుకున్నా, గాజు పెంకు కోసుకున్నా, మట్టి పెడ్డ నొక్కుకున్నా, ఇలాంటి ప్రతి చిన్న గాయమూ గ్యాంగ్రిన్ కు దారితీసే అవకాశం ఉంటుందన్న అతి జాగ్రత్తతోనే ఉండాలి. ఎంత చిన్న గాయం తగిలినా, గ్యాంగ్రిస్ అవుతుందా, లేదా? అని ఆలోచిస్తూ ఎదురు చూడడం కన్నా గ్యాంగ్రిస్ అవుతుందనే
భావించి ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

గ్యాంగ్రిస్ లక్షణాలు
గాయం/పుండు గ్యాంగ్రిన్ గా మారుతోందనటానికి సంకేతం.. అక్కడ నలుపు రంగు వస్తుండడమే. అంటే.. గాయమైన చోట ఉండే కణాలన్నీ మరణిస్తున్నాయని అర్థం. మిగతా గాయాల్లో అక్కడ ఉండే కణాలు చనిపోయినా చీము రూపంలో బయటికి వచ్చేస్తూ, కొత్త కణాలు ఏర్పడుతుంటాయి. గాయాల్లో ఎరుపు, పసుపు రంగు కనిపిస్తుంటుంది. నల్లగా మారదు. అదే గ్యాంగ్రిన్ లో నలుపు రంగు వస్తుంటుంది. అయితే, ఇక్కడ మీరు గుర్తించుకోవలసినది ‘‘గాయం ఒకసారి నలుపు రంగులో కనిపించిందంటే, అప్పుడు చికిత్సగా పెద్దగా చేసేదేమీ ఉండదు’’. నల్లగా మారిన ప్రాంతాన్నంతా తొలగించాల్సి ఉంటుంది. అది మామూలుగా మారే అవకాశం ఉండదు. అందుకని, ఏ చిన్న గాయమైనా నలుపు రంగులోకి మారక ముందే జాగ్రత్త పడాలి. ప్రతి చిన్న గాయమూ గ్యాంగ్రిన్ అవుతుందేమోనని అనుమానించి, గాయం తగిలిన వెంటనే జాగ్రత్త పడుతూ చికిత్స తీసుకోవాలి.

కాబట్టి డయాబెటీస్ ఉన్నవారిలో అరికాలికి కలిగిన గాయం గ్యాంగ్రిన్ మారే అవకాశాలే ఎక్కువ. అంతే కాకుండా, మధుమేహ చికిత్సలో బాగంగా మందులు వాడినంత మాత్రాన గ్యాంగ్రిస్ తగ్గుతుందనేదేమీ లేదు. దీనికి ప్రత్యేక చికిత్స తీసుకోవాలి. ఏదైనా గాయం గ్యాంగ్రిన్ గా మారుతుందనే అనుమానం ఉంటే, మధుమేహానికి మాత్రలకన్నా ఇన్సులిన్ తీసుకోవడం మంచిది. మధుమేహుల్లో ఒకకాలికి గాయమై, పుండు పడిందంటే, అక్కడ రక్తప్రసరణ జరగడం లేదని గుర్తించాలి. అలాంటి వారిలో శక్తిమంతమైన యాంటీ బయాటిక్స్ మందులు నోటిద్వారా తీసుకున్నా వాటి ప్రభావం గాయం వరకూ చేరదు. అందుకని ఇంజక్షన్ రూపంలోనే తీసుకోవడం మంచిది. ఇంజక్షన్ తీసుకున్నంత కాలమే గాయమైన చో ఇస్ఫెక్షస్ రాకుండా అడ్డుకోవడం సాధ్యమతుంది. అందుకని, దీర్ఘకాలం పాటు  తీసుకోవాల్సి ఉంటుంది. గాయం దగ్గరి చీమును కల్చర్ పరీక్ష చేసి దాని ప్రకారం యాంటిబయాటిక్స్ మందుల్ని డాక్టర్ సలహాతో తరచూ మార్చాల్సిన అవసరమూ ఉంటుంది. కాలికి కట్టు కట్టినప్పుడు రోజూ రుద్దడం, నల్లబడిన చోట సొంతంగా కోయటానికి ప్రయత్నించం వంటివి చేయకూడదు. ఇది సర్జన్లు మాత్రమే చేయాలి. స్పిరిట్, హైడ్రోజన్ పెరాక్సైడ్, బోరిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ ఆసిడ్ వంటివి వేయకూడదు.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
మధుమేహం ఉన్నారు రక్తదానం చేయడంలో తప్పే మీ లేదు. మధుమేహం ఉన్నవారిలో రక్తహీనత వంటి లక్షణాలు ఉంటే మాత్రం రక్తదానం చేయకూడదు. డయాబెటిస్ ఉన్నంత మాత్రాన రక్తదానం చేయకూడదనేదేమీ లేదు. మధుమేహులకు రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నంత మాత్రాన, ఆ గ్లూకోజ్ తో కలిసిన రక్తాన్ని మరో వ్యక్తికి ఎక్కించినప్పుడు వారికి మధుమేహం రావడం గానీ, ఇతరత్రా ఇబ్బందులు రావడం గానీ జరగదు
 
. అదేవిధంగా మధుమేహం ఉన్నారు రక్తదానం చేస్తే, వారికీ ఎలాంటి నష్టం ఉండదు. ఇది అసలు సమస్యే కాదు.
మామూలుగా రక్తదానం చేసినప్పుడు 300-500 మి.లీ. వరకూ రక్తం సేకరిస్తారు. మన శరీరంలో ఉండే 5-6 లీటర్ల రక్తంలో మనం మధుమేహ నియంత్రణ కోసం వేసుకునే మందులు కొన్ని స్వల్ప మిల్లీ గ్రాముల పరిమాణంలోనే ఉంటాయి. ఇలా అతితక్కువ పరిమాణాల్లో ఉండే మాత్రలు, ఇన్సులిన్ రక్తంలో కలిసి, మరింత పలుచగా మారిపోతాయి. అందువల్ల రక్త గ్రహీతల్లో వీటి ప్రభావం ఎంతమాత్రం ఉండదు. కాబట్టి మధుమేహ నియంత్రణ కోసం రోజూ మందులు, ఇన్సులిస్ తీసుకుంటున్న వారుకూడా నిరభ్యంతరంగా రక్తదానం చేయవచ్చు.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
పెళ్ళయిన కొత్తలో రోజు సెక్స్ లో పాల్గొనే వారు 35-40 ఏళ్ళు వచ్చేసరికి  అసక్తి ఉన్న కూడా వారానికి  రోజుకు ఒకసారి మాత్రమే చేయగలుగుతున్నారు. దీనికి కారణం...

సాధారణంగా సెక్స్కోరికలు 20 నుంచి 30 ఏళ్ల మధ్య చాలా ఉద్ధృతంగా ఉంటాయి. సెక్స్విషయంలో పెళ్ళయిన కొత్తలో ఉన్నంత ఉత్సాహం తర్వాత ఉండకపోవడం సహజం. షుగర్‌, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్లలో, ముఖ్యంగా ఒకేచోట కూర్చుని పనిచేసే వాళ్లలో (సెకండరీ లైఫ్స్టైల్ఉన్నవాళ్లలో) సెక్స్సామర్థ్యం కాస్తంత తగ్గుతుంది. దీనికి తోడు బాధ్యతల వల్ల వచ్చే మానసిక సమస్యల మూలంగా కూడా కొంత సెక్స్సామర్థ్య లోపం ఏర్పడుతుంది
దీనిని చాలావరకు కౌన్సెలింగ్ ద్వారా నయం చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో మందులతో నార్మల్సెక్స్ను పొందేలా చేయవచ్చు. బ్లడ్షుగర్ను నియంత్రణలో పెట్టుకుని, ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ, మానసికంగా ఉల్లాసంగా ఉండటం ద్వారా సామర్థ్య లోపాన్ని నివారించుకోవచ్చు.
కానుక ఎటువంటి మానసిక సమస్యలు లేకుండా ప్రతిరోజు వ్యాయామం వంటివి చేయడం ద్వారా 60 ఏళ్ళు వరకు కూడా ప్రతిరోజు సెక్స్ జీవితాన్ని ఎంజాయ్ చేయవచ్చు.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
ఎక్సర్సైజ్లు చేస్తున్నవారిలో సెక్స్ బలహీనత వస్తుందన్న అపోహ కొందరిలో ఉంటుంది. కానీ ఇది నిజం కాదు. వ్యాయామం చేయడం వల్ల శరీర దారుఢ్యం బాగుండి సెక్స్ సామర్థ్యం మరింత పెరుగుతుందే తప్ప తగ్గదు. అయితే ఒక్కోసారి విపరీతంగా వ్యాయామం చేయడం వల్ల శరీరం అలసిపోయి నొప్పుల వల్ల సెక్స్ చేయలేకపోవచ్చు. కాని, ఇది అలసట ఉన్నంత సేపు ఉండే తాత్కాలిక ప్రభావం మాత్రమే. 
ఎప్పుడూ జిమ్ ఎక్సర్ సైజ్లు మాత్రమే గాక ఏరోబిక్ ఎక్సర్సైజ్లు (సైక్లింగ్, వాకింగ్,జాగింగ్ వంటివి) చేయడం వల్ల ఆరోగ్యం మరింత బాగుంటుంది. సెక్స్ కు ఎక్సర్సైజ్ మరింత మేలు చేస్తుంది. కాబట్టి ఫెండ్స్ చెప్పే మాటలు విని అనవసర అపోహలు పెట్టుకోకండి. ప్రతిరోజు ఎక్సర్ సైజ్ చేసి సిక్స్ ప్యాక్ బాడీ తయారు చేసుకోండి. దీని వల్ల మీ సెక్స్ జీవితానికి ఏ విధమైన అపాయం లేదు.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
తమ వయసుకు తగినట్లుగా ఎత్తు పెరగకపోవడం అన్నది చాలామందికి మనస్తాపం కలిగించే అంశమే. అది వాళ్లలో అత్మన్యూనతను పెంచుతుంది కూడా. మన జనాభాలో 3-5 శాతం మంది ఈ ఎత్తు పెరగకపోవడం అనే సమస్యతో బాధపడుతుంటారు. ముఖ్యంగా ఎదిగే వయసులోని పిల్లలు, యుక్తవయస్కులను ఈ సమస్య ఎక్కువగా బాధపెడుతుంటుంది. నిజానికి ఎత్తు తక్కువగా ఉండటం ఒక వ్యాధి కాదు. సాధారణంగా తల్లిదండ్రులు తక్కువ ఎత్తు ఉంటే, జన్యుపరమైన కారణాలతో వాళ్ల పిల్లలూ తక్కువ ఎత్తే పెరుగుతారు. అయితే ఒక్కోసారి ఏదైనా వ్యాధి కారణంగా కూడా ఎత్తు పెరగకపోవడం జరగవచ్చు. అలాంటప్పుడు దానికి చికిత్స చేయవచ్చు. తద్వారా ఎత్తు పెరిగేలా చూడవచ్చు.

ఎత్తు పెరగకపోవడానికి కారణాలు...

  • ఎకాండ్రోప్లేసియా (జన్యుపరంగా వచ్చే సమస్యతో ఎత్తుపెరగకపోవడం)
  • దీర్ఘకాలిక వ్యాధులు, పుట్టుకతో వచ్చే గుండె సమస్యలు, మూత్రసంబంధ వ్యాధులు, సికిల్ సెల్ అనీమియా, థలసీమియా, యుక్తవయసులో వచ్చే కీళ్ల నొప్పులు (జువెనైల్ డయాబెటిక్ ఆర్థరైటిస్), మధుమేహం (డయా బెటిస్) వంటి వ్యాధుల వల్ల
  • పెరుగుదల నెమ్మదిగా ఉండటం (కాన్స్టిట్యూషనల్ గ్రోత్ డిలే)
  •  కుషింగ్స్ డిసీజ్
  •  యుక్తవయుసు ఆలస్యంగా రావడం
  • డౌన్స్ సిండ్రోమ్
  •  హైపోథైరాయిడిజం పుట్టుకతోనే ఉండటం
  • పేగులో వాపు
  •  పేగులో పుండు
  •  పౌష్టికాహారలోపం
  • నూనాన్ సిండ్రోమ్
  •  పెరుగుదల హర్మోన్ తగ్గుదల
  • యుక్తవయసు ముందుగానే రావడం
  • రికెట్స్
ఎత్తు అన్నది తల్లిదండ్రుల నుంచి వంశపారంపర్యంగా పిల్లలకు సంక్రమించే అంశం. కాబట్టి దీని గురించి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు.
అయితే ఏదైనా వ్యాధి కారణంగా ఎత్తు పెరగకపోవడం జరిగితే, దాని కోసం చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పిల్లలు తమ వయసు వారితో పోల్చినప్పుడు మరీ తక్కువ ఎత్తుగా ఉన్నా లేదా పెరుగు దల ఆగిపోయినట్లు అనిపించినా వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. అప్పుడు వైద్యులు తగిన పరీక్షలు (రక్తపరీక్ష, ఎలక్ట్రొలైట్ లెవెల్స్, ఎక్స్-రే వంటివి) చేస్తారు. జన్యుపరమైన లోపాలు (ఉదాహరణకు టర్నర్స్ సిండ్రోమ్) వంటివి ఏవైనా ఉన్నాయేమోనని పరీక్షిస్తారు. తల్లిదండ్రుల ఎత్తును, కుటుంబ వైద్య చరిత్ర వంటివి పరిశీలిస్తారు. పుట్టిన తేదీ, ఆహారనియ మావళి, యుక్తవయసు ఎప్పుడు మొదలైంది, ఇతరత్రా వ్యాధులు ఏమైనా ఉన్నాయా అనే అంశాలను తెలుసుకుంటారు.
తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు పిల్లల బరువును, ఎత్తును రికార్డు చేస్తూ ఉంటే వారి పెరుగుదల క్రమంలో ఏవైనా మార్పులు ఉన్నాయేమో తెలుసుకోవడం సాధ్యమవుతుంది.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
పీసీఓడీ అనగా ఇమ్మెచ్యూర్ ఫాలికల్ (అండం) గర్భాశయానికి రెండువైపులా ఉన్న అండాశయాలపై నీటిబుడగల వలె ఉండటాన్ని పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అంటారు.
సాధారణ ఋతుచక్రం ఉన్న మహిళల్లో నెలసరి అయిన 11-14 రోజుల మధ్య రెండు అండాశయాలలో ఒక అండాశయం నుండి విడుదల అవుతుంది. ఈ విధంగా ప్రతినెలా ఎడమ లేదా కుడివైపు ఉన్న అండాశయం నుండి ఒక అండం విడుదలవుతుంది. ఫలదీకరణకు సిద్ధంగాఉంటుంది. కాని ఎవరిలో అయితే ఈ పీసీఓడీ ఉంటుందో వారి అండాశయం నుండి అండం విడుదల కాకుండా అపరిపక్వత అండాలు నీటి బుడగల వలె అండాశయపు గోడల మీద ఉండిపోతాయి. ఇది చూడడానికి ముత్యాల వలె అండాశయ గోడల మీద కనిపిస్తాయి. రెండు వైపులా ఉంటే దీనిని బై ఆట్రల్ పీసీఓడీ అంటారు.
దీని బారిన పడిన చాలామంది స్ర్తీలు సాధారణ ఆహార అలవాట్లు పాటిస్తున్నప్పటికీ అధిక బరువు, వెంట్రుకలు రాలిపోవడం, మొటిమలు, ముఖం మీద మగవారిలా వెంట్రుకలు రావడం, నెలసరి సరిగ్గా ఉన్నప్పటికీ సంతానలేమితో బాధపడుతూ ఉంటారు.
దీనికి కారణాలు
  • ఈస్ట్రోజెన్, టెస్టోస్టిరాన్ హార్మోన్ల సమతుల్య లోపం వలన ఈ సమస్య వస్తుంది.
  • సరైన జీవనశైలి లేకపోవడం అంటే, ఎక్కువ ఒత్తిడికి లోనవడం,
  • తక్కువ శారీరక వ్యాయామం వల్ల, పిండిపదార్థాలు, కొవ్వుపదార్థాలు అతిగా తినడం మూలంగా ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
  • జన్యుపరమైన కారణాలు కూడా పీసీఓడీకి ఒక ముఖ్యకారణం.
  • హార్మోన్ల చక్రంలో మార్పులు, అధిక ఒత్తిడి, సరియైన వ్యాయామం లేకపోవడం, సరియైన ఆహార నియమాలు పాటించకపోవడం,అధిక కొవ్వు, కార్బోహైడ్రేట్ పదార్థాలు తినడం వలన ఇది సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
లక్షణాలు
  • నెలసరి సరిగా రాకపోవడం
  • నెలసరి సరిగా వచ్చినా కూడా అండాశయం నుండి అండం విడుదల కాకపోవడం, నెలసరిలో 4-5 రోజులు కావలసిన రక్తస్రావం ఎక్కువ మోతాదులో ఎక్కువకాలంకొనసాగడం
  • నెలసరి ఆగి ఆగి రావడం, రెండు ఋతుక్రమాల మధ్యకాలంలో రక్తస్రావం కావడం  నెలసరి వచ్చే సమయంలో కడుపులో బాగా నొప్పి రావడం
  • నెలసరి రాకపోవడం
  • బరువు పెరగటం
  • ముఖం, వీపు, శరీరంపైన మొటిమలు రావడం. ముఖం, ఛాతీ పైన మగవారిలోలా వెంట్రుకలు రావడం. టెస్టోస్టిరాన్ హార్మోన్ మోతాదు పెరగటం వలన ఈ లక్షణాలు కనిపిస్తాయి
తీసుకోవలసిన జాగ్రత్తలు

  • జీవనవిధానంలో మార్పు చేసుకొని ఒత్తిడిని తగ్గించుకోవడం
  • సరియైన వ్యాయామం చేయడం వలన హార్మోన్ల సమతుల్యతను కాపాడటం
  •  అధిక కొవ్వు, కార్బోహైడ్రేట్ పదార్థాలను తగ్గించి, సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. 
ఇలా చేయడం ద్వారా ఈ సమస్య బారిన పడకుండా ఉండవచ్చు.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
దుర్వార్చన (గరిక)

కౌండిన్య మహాముని వినాయకుని భక్తుడు ఆయన ప్రతి దినము గరికతో 108 సార్లు అష్టోత్తరము చేసిన తర్వాతే దిన చర్యలో పాల్గొనును. ఋషిభార్య ప్రతి దినము అర్చనకు కావలసిన గరికిని సమకూర్చి పతికి ఇచ్చును. ఒకనాడు రాజు ఋషి దంపతులను అందరి పిలిపించి సన్మానము చేసెను. కౌండిన్య మహాముని భార్య వద్ద తోటి ఋషి పత్నుడు రాజమందిరానికి వెళ్ళుచున్నాము నీవు వస్తావా అని పిలచెను. అప్పుడు ఆమె భర్త వద్దకు పోయి మనము కూడా రాజ మందిరానికి వెళదాము అని పిలచెను. అప్పు ఆయన పూజ అయిన పిదప వెళదాము అనిచెప్పెను. ఇంతలో రాజు వద్ద నుండి స్వర్ణ పట్టు పీతాంబరం తీసుకొని, తోటి ఋషిపత్నియుడు కౌండిన్య మహాముని భార్యను చూపిం చెను. అప్పుడు ఆమె పూజ పూర్తికానిదే నేను  రాను, రాలేను అని సమాదానము ఇచ్చెను. అంత పూజ పూర్తి అయిన పిదప కౌండిన్య మహాముని భార్యను చూసి మనకు బంగారము రాలేదని భాదపడుతున్నావా అని అడిగెను. అప్పుడు ఆయన స్వామి వారికి అర్పించినటువంటి 2 గరికలను తీసి తన భార్యకు ఇచ్చి నీవు ఇంద్రలోకమునకు పోయి, ఇంద్రుని వద్ద ఈ గరికకు సమానమైన బంగారాన్ని తీసుకురా అని చెప్పెను. ఆమె ఇంద్రలోకానికి వెళ్ళెను. దేవేంద్రుడు ఆమెను చూసి సగర్వంగా ఆహ్వానించెను. పిదప దేవేంద్రుడు అమ్మా మీరు ఇంతదూరం వచ్చినారు మీకు ఏంకావాలి. మీ కోరిక చెప్పండి అనెను. ఆమె సంకోచించుతూ ఉండెను. అంతదేవేంద్రుడు సంకోచించకుండా మీకు కావాల్సింది చెప్పమ్మా అనెను. అప్పుడు ఆమె తన పతి ఇచ్చినటువంటి 2 గరికలను చూపించి దానికి సమానమైన బంగారము ఇవ్వమని అడిగెను. దేవేంద్రుడు ఆమెను చూసి నావద్ద ధనము అనేకము ఉన్నది, ధనాధిపతి కుబేరుడు నా వద్ద ఉన్నాడు. మీకు ఎంత కావాలో అంత తీసుకువెళ్ళండి. అంతేకాని గడ్డిని చూపినన్ను అవమానించకండి అనెను. అందుకు ఆమె నేను పతిమాటను జవదాటను. ఈ గరికకు సమానమైన బంగారము ఇస్తేచాలు అనెను. అప్పుడు దేవేంద్రుడు కుభేరుని పిలిపించి తులాభారము వేయించెను ఒకప్రక్క ఆమె తెచ్చిన గరికను ఉంచి, మరోప్రక్క తనవ్రేలికి ఉన్న ఉంగరాన్ని వేసెను తులాభారము సరితూగలేదు. చివరకు దేవాలోకమందు ఉన్న ధనమంతయు తులాభారంలో వేసెను. అప్పటికి సరితూగలేదు చివరకు, దేవతులు దేవేంద్రునితో సహా తులాభారంపై ఎక్కెను అప్పటికిని సరితూగలేదు, చివరకు గత్యంతరం లేక దేవేంద్రుడు దేవతలతో కూడి కౌండిన్య మహాముని ఆశ్రయం యొద్దకు వచ్చెను. దేవేంద్రుడు మహర్షిని చూసి మీరు ఇచ్చిపంపిన గరిక సామాన్యమైనది కాదని తెలుసుకోలేక పోతిని ఇప్పుడు దేవతలందరూ మీ దాసోహము అన్ని చెప్పెను. అప్పుడు కౌండిన్య మహాముని తన భార్యనుచూసి దేవత లందరూ నీ దాసోహం మయ్యారు, ఇంకా నీకు ఏమి కావాలెనని అడిగినారు, అంతట ఆమె వినాయకుని అర్చించిన గరిక మహిమ తెలియక పోయినందుకు నన్ను క్షమించండి అని వేడుకొనెను. అప్పుడు మహర్షిదేవేంద్రుని చూసి ఇది అంతయు వినాయకుడుకి గరికతో అర్చన చేయడం వల్ల మాకు ఈ భాగ్యం కలిగినని చెప్పి దేవేంద్రుని ఇంద్రలోకానికి పంపిచెను. కాబట్టి గరికతో అర్చన చేయడం విశేషం.

Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
బరువు తగ్గాలని మనలో చాల మందికి ఉండే కోరిక. దాని కోసం చాల కష్టపడుతూ ఉంటాం. ఎంత కష్టపడ్డా ఫలితం రాదు. ఎందుకంటే బరువు తగ్గాలని డైటింగ్, ఎక్సర్ సైజ్ చేస్తున్నా తగ్గకపోవడానికి కారణం మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులే. బరువు తగ్గాలనుకునే వాళ్లందరూ సమాన్యంగా చేసే పని తిండి తగ్గించడం. అయితే పూర్తిగా తిండి తగ్గించడం వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదు. దాని బదులు మనం ఎన్ని క్యాలరీల ఆహారాన్ని తీసుకోవాలో అంతే మొత్తం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం మంచి పద్ధతి.

బరువు తగ్గాలాను కొనేవారి కోసం కొన్ని సలహాలు, సూచనలు


డైట్
మనలో చాలమంది. తొందరగా బరువు తగ్గాలని క్రాష్ డైట్ ల మీద ఆధార పడతారు. ఇలాంటప్పుడు తీసుకునే డైట్ శరీర అవసరాలకు అస్సలు సరిపోక పోవచ్చు.. ఉదాహరణకు రోజు మొత్తానికి కలిపి ఏదో ఒక సూప్,  పళ్లు మాత్రమే తీసుకునే డైట్ వల్ల మనకు కావాల్సిన పోషకాలన్నీ అందుతాయా. దీని వల్ల బరువు తొందరగా తగ్గుతాం.. రోజువారీ మనం తీసుకోవాల్సిన క్యాలరీలను తగ్గించడం వల్ల మన శరీరంలోని కొవ్వు కూడా కరుగుతుంది కాదనడం లేదు. కానీ దీని వల్ల మన మెటబలిజం (జీవ క్రియ) పూర్తిగా మారిపోతుంది. శరీర క్రియలన్నీ నెమ్మదిగా జరుగుతాయి. ఈ డైట్ ప్లాన్ పూర్తయిన తర్వాత మీరు తీసుకునే క్యాలరీలను మీ శరీరం ఎక్కువగా కరిగించలేదు. ఎందుకంటే మీ మెటబలిజం స్లోగా మారింది కాబట్టి. అలా మీరు తిరిగి బరువు పెరుగుతారు.

బ్రేక్ ఫాస్ట్ మానద్దు
ఇది మనలో చాల మంది చేసే అతి పెద్ద తప్పు.
బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోవడం వల్ల దాన్నుంచి వచ్చే క్యాలరీలను మనం తగ్గించుకోగలిగాం అంటూ సంతోషిస్తారు. కానీ నిజానికి దీని వల్ల బ్రేక్ ఫాస్ట్ కంటే ఎక్కువ క్యాలరీలనే మనం తీసేసుకుంటాం. ఎలాగంటరా? ఉదయం మీరు టిఫిస్ చేయకుండా ఆఫీసుకు వెళ్లిపోతారు. కాసేపటికి ఆకలి మీ పనిని డిస్టర్బ్ చేస్తూ ఉంటే, ఏదో ఒక స్నాక్ తినేస్తారు. లేదా హెవీ క్యాలరీ డ్రింక్ తాగుతారు. దీని వల్ల క్యాలరీలు పెరిగినట్టేగా. ఒకవేళ క్యాలరీలు తగ్గించాలని మీరు రూల్ పెట్టుకొని వీన్నింటినీ మానేసినా, లంచ్ ఎక్కువగా తీసుకునే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేక్ ఫాస్ట్ మానేయకూడదు. రాత్రంతా గ్యాప్ వచ్చిన క్రమంలో పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల రోజంతా యాక్టవ్ గా ఉండగలుగుతాం. దీని వల్ల క్యాలరీలు ఎక్కువగా కరుగుతాయి. లేకపోతే కడుపు ఖాళీగా ఉండి మన బాడీ మెటబలిజం మందగించే అవకాశాలు ఉంటాయి.

క్యాలరీ చార్ట్ ఫాలో అవ్వండి  
సీరియస్ గా అన్ని రూల్స్ పాటిస్తూ డైటింగ్ చేస్తూ ఉండొచ్చు. రోజూ కొన్ని క్యాలరీల ఆహారం మాత్రమే తీసుకుంటూ ఉండొచ్చు. కానీ ఇక్కడ సాధారణంగా చేసే తప్పొకటి ఉంది. మనం తినే ప్రతి పదార్థం నుంచి వచ్చే క్యాలరీలను కూడా కౌంట్ చేసుకోవాలి. ఉదాహరణకు ఫ్రెండ్స్ ఏదో శుభవార్త అనో లేక, బర్త్డే అనో అంటూ ఇచ్చిన కేక్ లేదా స్వీట్ని తినేస్తాం. ఏమీ తినం అంటూనే ఫ్రెండ్ తో పాటు క్యాంటన్ కు వెళ్లి, తన ప్లేట్లోంచి రెండు మూడు బజ్జీలో, లేక  పిజ్జానో  తినేస్తాం. ఇలా లెక్క పెట్టకుండా మనం రోజూ తినే ఆహారం ఎంత ఉంటుందో గమనించండి. అన్నింటినీ రాసుకోండి. ఇలా కనిపించకుండా, లెక్కలోకి రాకుండా తినే పదార్థాల వల్ల కూడా బరువు తగ్గకుండా ఉండే అవకాశాలు ఎక్కువ.

మధ్య మధ్యలో ఎదైన తింటూ ఉండాలి.
కేవలం బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ మాత్రమే చేస్తే సరిపోదు. మధ్య మధ్యలో ఏదో ఒకటి తింటూ ఉండాలి. దీని వల్లే మన జీవక్రియలు యాక్టీవ్ గా కొనసాగుతాయి. అందుకే ప్రతి మూడు గంటలకోసారి ఏదో ఒకటి తినాలనేది. స్నాక్స్ తింటే లావయిపోతున్నామంటూ చాల మంది మధ్యలో ఏం తినకుండా అలాగే ఉంటారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. హెల్దీ స్నాక్స్ ను తీసుకోవడం వల్ల కూడా మీరు బరువు త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది.

పాలపదార్థాలూ ఓకే.
చాలమంది పాలు, పాల పదార్థాల నుంచి ఎక్కువ క్యాలరీలు వస్తున్నాయంటూ వాటికి దూరంగా ఉంటూ ఉంటారు. కానీ ఇవి మన శరీరానికి అవసరమైన పోషకాలు అందించడంలో చాల ముఖ్యమైన పాత్రను వహిస్తాయి. అందుకే కొవ్వు శాతం తక్కువగా ఉండే పాల ఉత్పత్తులను ఉపయోగించాలి. ఐస్ క్రీమ్,  స్వీట్స్ వంటివి పూర్తిగా మానేసినా ఫర్వాలేదు.

నీళ్లు ఎక్కువగా తాగాలి.
నీళ్లు బరువు తగ్గడానికి చాల ముఖ్యమైన ఆయుధం. నీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. పండ్ల రసాలు తాగుతున్నాం, అందులో నీళ్ళుంటాయి కదా అని నీటిని తీసుకోవడం తగ్గించ కూడదు. ఎంత ఎక్కువగా నీటిని తీసుకుంటే అంత మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. నీళ్ల బదులుగా ఆల్కహాలు, కూల్ డ్రింక్స్, పండ్ల రసాలు తాగడం కూడా సరికాదు. నీటిని తీసుకోవడం వల్ల అదనంగా ఒక్క క్యాలరీ కూడా చేరదు. కానీ మిగిలిన వాటి వల్ల ఎక్కువ క్యాలరీలు లభిస్తాయి. అలాగే ఫ్యాన్సీ కాఫీలు, ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా మానేస్తే మంచిది. వీటి నుంచి కనీసం 500 క్యాలరీలు ఈజీగా అందుతాయి. అందుకే ఇలాంటి వాటన్నింటికీ దూరంగా ఉండాలి.

లో-ఫ్యాట్- పదార్ధలైన వద్దు.
బరువు తగ్గాలనుకునే వాళ్లంతా లోఫ్యాట్ పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.. మీరు కూడా అలాగే చేస్తున్నారా? సాధారణంగా తక్కువ క్యాలరీలు లభించే ఆహారం తీసుకుంటే మంచిది అనుకుంటాం... కానీ ఇక్కడే చిన్న తేడా ఉంది. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి.. లోఫ్యాట్ పదార్థాలన్నింటిలో తక్కువ క్యాలరీలు ఉంటాయని చెప్పలేం. వాటిలో ఉన్న కార్బోహైడ్రేట్స్, ప్రొటన్స్ నుంచి మనకు క్యాలరీలు అందుతాయి. ఇవి ఎక్కువగానే ఉండొచ్చు. లో క్యాలరీ ఫుడ్ తీసుకోవాలని మనం ప్రారంభించినా ఎలాగో లోక్యాలరీలే కదా. అంటూ మనం సాధారణంగా తినే మొత్తం కంటే ఎక్కువగా తినేసే అవకాశం ఉంది.

బయటి తిండి వద్దు
చాలమంది ఆఫీసు నుంచి అలసిపోయి వస్తున్నాం. మధ్యలో ఏదో ఒకటి తిందాం అంటూ ఆగుతారు. ముందు హెల్దీ ఫుడ్ తిందామనుకున్నా, అక్కడకు వెళ్లిన తర్వాత మనసు వూరుకుంటూందా? బజ్జీలో, పకోడీలో, పిజ్జానో, బర్గర్ నో నోరూరించే తిరుతుంది. ఈరోజు ఒక్కరోజే, అనుకుంటూ లాగించేస్తాం. వారానికి రెండు సార్లు ఇలా బయట తినే వాళ్లు తినని వాళ్లతో పోలిస్తే నెమ్మదిగా బరువు తగ్గుతారు. అందుకే ఈ అలవాటు మానేస్తే మంచిది.. ఒకవేళ మానలేం అనుకుంటే నూనె కలవని ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోవడం మంచిది.

బరువు చెక్ చేసుకోవలసిన అవసరం లేదు.
చాలమంది డైట్ ప్లాన్ ప్రారంభించిన రోజు నుంచి ప్రతి రోజూ బరువు చెక్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఒక రోజులో పెద్దగా మారిపోయేదేమీ ఉండదని మనం గమనించాలి. కనీసం పదిహేను రోజులకోసారి బరువు చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి బరువు చెక్ చేసుకొని, తర్వాత 15 రోజుల్లో ఎంత మేరకు బరువు తగ్గాలనుకుంలున్నారో సెట్ చేసుకుంటే దానికి అనుగుణంగా వర్కవుట్ ప్లాన్ చేసుకోవచ్చు.

ఒకేసారి కాకుండా ముందుగా చిన్న లక్ష్యం పెట్టు కోవడం మంచిది
ఇక్కడ గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు పెట్టుకునే గోల్ మీరు చేరుకునే విధంగా ఉండాలి. వారం రోజుల్లో రెండు, మూడు కేజీలు తగ్గాలనుకుంటే అది అత్యాశ అవుతుంది. అందుకే చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకొని వాటిని చేరుకోగలుగుతున్నామా? లేదా? అన్న విషయాన్ని గమనించాలి. ఒకవేళ చేరుకోగలుగుతుంటే దాన్ని కొనసాగించొచ్చు. లేకపోతే ఎక్కడ లోపం ఉందో తెలుసుకోవాల్సి ఉంటుంది.

వ్యాయామం తప్పదు
డైటింగ్ చేస్తూ వ్యాయామం చేయడం వల్ల బరువు త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎక్సర్ సైజ్ చేయకపోతే మీ బరువు తగ్గించే పని పూర్తిగా డైట్ ద్వారానే చేయాల్సి ఉంటుంది. యోగా, వ్యాయామం వల్ల రెండు లాభాలుంటాయి. దీని వల్ల మీ బరువు తగ్గడంతో పాటు రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు. అందుకే వాకింగ్, స్విమ్మింగ్, మొదలైన వాటితో పాటు డ్యాన్స్, యోగా వంటివీ ప్రయత్నించవచ్చు.

ఈ విధంగా తీసుకునే ప్రతి క్యాలరీని లెక్క పెటుకుంటూ, మనం ఖర్చుచేసే క్యాలరీల మీద కూడా దృష్టి సారిస్తే ఇంకా మనం ఎన్ని క్యాలరీలు కరిగించాల్సి ఉంటుందో మనేక తెలుస్తుంది. దాన్ని బట్టి ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా తక్కువ క్యాలరీలు తీసుకుంటూ, మిగిలిన వాటిని వ్యాయామం ద్వారా కరిగించు కోవడం వల్ల త్వరగా బరువు తగ్గగలుగుతాం.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
భార్యాభర్తల బంధం దృఢ పడటానికి ప్రేమ ఎంత ముఖ్యమో; లైంగిక చర్య కూడా అంతే ముఖ్యం. ఆలుమగలిద్దరూ పూర్తి ఇష్టంతో, సౌఖ్యంగా కలయికలో పాల్గొంటేనే అది సంపూర్ణం కావడంతో పాటు, ఇద్దరికీ సంతృప్తి కలుగుతుంది. కానీ, ఇటువంటి కీలక సమయంలో కొన్ని పొరపాట్లు చేయడం వల్ల దంపతులిద్దరికీ లైంగిక పరంగా అసంతృప్తి కలుగుతుంది. మరి, అలా జరగకుండా ఉండాలంటే...

చాల మంది పెళ్లి కుదిరి నప్పటి నుండే వైవాహిక జీవితం గురించి ఎన్నెన్నో కలలు కనేస్తూ ఉంటారు. కానీ, ఆ కలలన్నీ నిజమయ్యే సమయం వచ్చేసరికి మాత్రం ఎక్కడ లేని భయం, సందేహాలు. అన్నీ ఒకేసారి చుట్టి ముట్టి మనసుని ఉక్కిరిబిక్కిరి చేసేస్తాయి. అందుకే శారీరక కలయికని కొంతమంది ఎంజాయ్ చేస్తే, మరికొందరు మాత్రం భయం వల్ల, లేక ఇష్టం లేకపోవడం వల్ల, ఇలా ఏదో ఒక కారణంతో కలయికకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. మరి, అలా దూరంగా ఉండకుండా, కలయికను మీరూ పూర్తిగా ఎంజాయ్ చేయాలనుకుంటే ఆలోచనల్లో కొన్ని మార్పులు రావాలి.

ఊరిస్తూ.. ప్రేరేపిస్తూ..

లైంగిక చర్యని కేవలం ఒక పనిగా ఎప్పుడూ భావించకూడదు. అలా భావిస్తే.. అందులో ఎంతమాత్రం తృప్తి ఉండదు. మీ ప్రతి స్పర్శ భాగస్వామిపై మీకున్న ప్రేమని తెలుపుతుందని గుర్తుంచుకోండి. అలా ప్రేమగా, ఇష్టంగా, ఆలుమగలిద్దరూ కోరుకున్న విధంగా లైంగిక చర్యని ఆస్వాదించగలిగితేనే అందులోని ఆనందాన్ని పొందగలుగుతారు. మహిళలకు మామూలుగానే సిగ్గు ఎక్కువ. అయితే కలయికలో పాల్గొనేప్పుడు మాత్రం ఈ సిగ్గును కొంచెం సేపు వదులు చేయాల్సిందే! లేదంటే భార్యాభర్తల్లో ఎవరో ఒకరు ఇబ్బంది పడవలసి వస్తుంది.
సిగ్గు, బిడియంతో సైలెంట్ గా ఉండిపోకుండా, కూడా కాస్త యాక్టివ్ ఉంటూ మీ చిలిపి పనులతో భాగస్వామిని రెచ్చగొట్టే ప్రయత్నం చేయండి. ఆ సమయంలో చిన్న చిన్న చిలిపి పనులు చేస్తూ ఉత్సాహంగా పాల్గొంటే ఇద్దరూ ఆనందపు సాగరంలో తేలిపోవాల్సిందే!

మీ భార్య/భర్త పూర్తి గా సహకరించండి!

సాధారణంగా కలయిక సమయంలో భార్యాభర్తలిద్దరూ ఉత్సాహంగా ఉండాలి. ఒకరు యాక్టివ్ గా ఉన్నప్పుడు, ఇంకొకరు పూర్తి సహకారం అందించాల్సి ఉంటుంది. మీ వైపు నుంచి సహకారం లేకపోయినా, అయిష్టత వ్యక్తం చేసినా, మీ భాగస్వామి అసంతృప్తి చెందే అవకాశం వుంది. అందుకే లైంగిక చర్యలో పాల్గొనేప్పుడు పూర్తిగా స్పందన లేకపోవడం లేదా చాల తక్కువగా స్పందించడం, ఈ రెండూ పనికి రావు. వీలైనంత వరకు ప్రతి చర్యలకూ స్పందిస్తూ, మీరు పొందుతున్న లైంగికానందాన్ని మీ భార్య/భర్తకు ఇవ్వడానికి ప్రయత్నించండి.

ఎక్కువగా మాట్లాడకండి

లైంగిక చర్యలో పాల్గొనే సమయంలో మాటలకు ప్రాధాన్యం ఇవ్వకండి. అంటే షాపింగ్, నిత్యావసరాలు, ఇంట్లో ఉన్న సమస్యలు.. మొదలై నవన్నీ బెడ్ రూమ్ వరకు చేరకపోవడం మంచిది. అవి మీ ఆసక్తిని ప్రభావితం చేసే అవకాశం వుంది. కాబట్టి ఆ సమయంలో మీరు మాట్లాడే మాటలు మీ ఇరువురి ఆనందాన్ని రెట్టింపు చేస్తేనే మాట్లాడండి.

వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వండి.

లైంగిక చర్యలో పాల్గొనే ముందు లేదా తర్వాత వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం చాల ముఖ్యం. అప్పుడే ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ఉంటాయి. చాల మంది ఈ విషయంలో అజాగ్రత్త వహిస్తూ ఉంటారు. కానీ, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంలో అస్సలు రాజీపడకూడదు. అది మీ వైవాహిక జీవితానికే కాదు, ఆరోగ్యానికి కూడా చాల శ్రేయస్కరం.