online tips, social network usage tips, girls online, apurup, teluglul blog, apurupa,
ఇప్పుడు చాలమంది అమ్మాయిలు ఆన్ లైన్ స్నేహాల మీద అమితమైన ఆసక్తి చూపిస్తూ.. ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. సామాజిక వైబ్ సైట్ లలో స్నేహితుల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే అన్ని లైక్స్‌, కామెంట్స్‌ వచ్చి పాపులర్‌ అవుతామని భావిస్తారు కొందరమ్మాయిలు. అదే ఒక గొప్ప స్టేటస్ గా భావిస్తారు కూడా. అందుకే ఫ్రెండ్ రిక్వేస్ట్ రాగానే పంపిన వ్యక్తి తెలుసో, లేదో అన్నది చూసుకోకుండా ఓకే చేసేస్తారు. కానీ, ఇది అస్సలు సరైన పద్ధతి కాదు. ఎందుకంటే తెలిసిన వ్యక్తులే ఎప్పుడు, ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తారో వూహించడం కష్టమవుతున్నఈ రోజుల్లో తెలియని వ్యక్తులను ఫ్రెండ్స్ గా చేర్చుకుని సొంత విషయాలు వాళ్లతో పంచుకోవడం సమంజసం కాదు. ఒకవేళ అలా చేస్తే కష్టాలకు మీరే స్వయంగా స్వాగతం చెప్పినట్లు అవుతుంది. అందుకే ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.

ఇక, ఆన్ లైన్ స్నేహాలు పక్కదారి పట్టడానికి మరొక ముఖ్యమైన కారణం ప్రొఫైల్‌ ఫొటోలు.. కొంతమంది అమ్మాయిలు హీరోయిన్ ఫొటోలను పెట్టుకుంటే; మరికొందరు మాత్రం వాళ్ల ఫొటోలే అవతలి వాళ్లని రెచ్చగొట్టే విధంగా ఉన్నవి పెట్టుకుంటూ ఉంటారు. వాటిని ఉపయోగించి అపరిచితులు ఎప్పుడు, ఎలా మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తారో చెప్పలేం. అంటే ఒక రకంగా మీరే దొంగ చేతికి తాళం చెవి ఇస్తునట్లు అవుతుంది. అందుకే ఇలాంటి సంఘనలు ఎదురవకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి.
 సోషల్‌ వైబ్ సైట్ లో సమాజానికి ఉపయోగపడే సేవాకార్యక్రమాల గురించి మాట్లాడితే ఫర్వాలేదు. కానీ, వ్యక్తిగత విషయాలు పూసగుచ్చినట్లు ఎప్పటికప్పుడు పోస్ట్ చేసే అమ్మాయిలు కూడా ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిందే! సోషల్‌ వైబ్ సైట్ లో విహరించే మిగతాళ్లతో పోలిస్తే ఇలాంటి అమ్మాయిలకు ప్రమాదం ఎక్కువగా పొంచి ఉంటుంది.. అందరూ అని కాకపోయినా కొంతమంది వైబ్ సైట్ లలో అమ్మాయిలను వేధించడమే పనిగా పెట్టుకున్నావారు కూడా ఉంటారు. అలాంటి వాళ్ల చేతికి చిక్కారా... ఇక అంతే. తర్వాత ఏం జరుగుతుంది? ఎలాంటి పరిణమాలకు దారి తీస్తుందనేది వూహించడం కూడా చాల కష్టం. మీ మానసిక ప్రశాంతతని చెడగొట్టి మిమ్మల్ని కుదురుగా ఉండనీయరు.

వీన్నింటికీ పరిష్కారం ఒక్కటే. ఎవరి హద్దుల్లో వారిని ఉంచాలి. 
  • తెలియని వ్యక్తుల నుంచి వచ్చే రిక్వేస్ట్ లను వెంటనే ఓకే చేయకుండా కాస్త ముందూ వెనుకా ఆలోచించాలి..
  • అన్నిటికీ మించి ఆన్ లైన్ లో చిగురించే స్నేహాలు నెట్‌ వరకే పరిమితం అనే మాట ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.
  • అవతలి వ్యక్తి మన నుంచి ఏం ఆశిస్తున్నారన్నది మనకి తెలీదు, కాబట్టి అప్రమత్తంగా వ్యవహరించాలి.

సోషల్‌ వైబ్ సైట్ లలో స్నేహం చేయడం తప్పు కాదు. కానీ తెలియని వ్యక్తులతో మరీ సన్నిహితంగా మెలగడం, వాళ్ల గురించి తెలుసుకోకుండా మన రహస్యాలు వాళ్లకు చెప్పడం మాత్రం సబబు కాదు.. వ్యక్తిగత విషయాలు పంచుకోకపోతే ఎలాంటి సమస్యలు రావు.
  • అసలు పర్సనల్‌‌స షేర్‌ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు.
  • ఎవరి నుంచైనా మీకు ఇబ్బందులు ఎదురైతే వేంటనే వారిని బ్లాక్‌ చేయడం ఉత్తమం.

చాలమంది సోషల్‌ వైబ్ సైట్ లలో అకౌంట్స్‌ లేవు. ఎందుకంటే అవి అవసరం అని చాలమంది భావించడం లేదు.ఎదురుగా ఉన్న స్నేహితులతో గడిపితే వచ్చే ఆనందం ఆన్ లైన్ దొరకదని చాలమంది అభిప్రాయం. కానీ, సామాజిక సేవా కార్యక్రమాలకు సోషల్‌ వైబ్ సైట్ లు చక్కటి వేదికగా ఉపయోగపడతాయి. ఆ విధంగా వాటిని సద్వినియోగం చేసుకోవడం మంచిది.
.
ప్రస్తుతం యూత్‌లో ఆస్లైస్ స్నేహాలు బాగా ఎక్కువయ్యాయి. ఎవరికైనా అకౌంట్‌ లేదూ అంటే వారిని చిన్నచూపు చూస్తున్నారు. నెట్‌వర్క్‌తో స్నేహం పెంచుకోవడం ముఖ్యమే! కానీ, అవతలి వ్యక్తిపై అవగాహన ఏర్పడే అవకాశాలు ఆన్ లైన్ చాల తక్కువగా ఉంటాయి. వాళ్లు చెప్పేవన్నీ నిజాలేనని ఏంటి నమ్మకం ? అలా అమాయకంగా వాళ్లన్నీ నిజాలే చెబుతున్నారనుకొని సొంత విషయాలన్నీ చెప్పేస్తే అవి మన బలహీనతలుగా మారిపోతాయి. అందుకే ఆన్ లైన్ స్నేహాలు హద్దుల్లో ఉంటేనే మంచిది.. ప్రపంచజ్ఞానం తెలుసుకోవడానికి ఆన్ లైన్ స్నేహాతుల్ని ఉపయోగించుకున్నా విచక్షణతో ఆలోచించి, పరిణతి చూపించడం చాల ముఖ్యం

సామాజిక వైబ్ సైట్ లలో విహరించడం తప్పు కాదు. కానీ, అపరిచితులతో స్నేహం మాత్రం ప్రమాదమే. ఈ విషయం గుర్తుపెట్టుకుని జాగత్రగా ఉండడం మంచిదేగా....
Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: