cell phone usage, students cell phone, cell phone effect on studies, apurupa, teluglu blog, apurup
సెల్‌ఫోన్‌లో మితిమీరి మాట్లాడితే నష్టమెంత? ఈ విషయం మీద పూర్తిస్థాయి నిర్ధరణ అయితే జరగలేదు కాని.. అడపాదడపా వస్తున్న పరిశోధనలైతే నష్టమే ఎక్కువ అని తీర్మానిస్తున్నాయి. అలాంటిదే

మరొక పరిశోధన, అమెరికాలోని కెంట్ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు చేసి, సెల్‌ఫోన్‌ ఎక్కువగా వాడే విద్యార్థుల మీద లోతైన అధ్యయనం చేశారు. సెల్‌ఫోన్‌లో గంటల తరబడి మాట్లాడే విద్యార్థుల మానసిక పరిస్థితి, పరీక్షల్లో చూపుతున్న ప్రతిభను పరిశీలించారు. మాములు విద్యార్ధుల కన్నా సెల్‌కు బానిసలైన వారు మాత్రం తీవ్ర మానసిక ఆందోళన (యాంగ్జెయిటీ)తో బాధపడుతున్నట్లు గుర్తించారు. వీరందరూ మార్కుల గ్రేడింగ్‌లో కూడా వెనుకబడి పోయినట్లు పేర్కొన్నారు. ఒత్తిడి, ఆందోళనలతో పాటు జ్ఞాపకశక్తిని కోల్పోవడం, చదువు మీద ఏకాగ్రతను నిలపలేక పోవడం, సృజనాత్మకత సన్నగిల్లడం.. వంటి సమస్యలతో కుంగిపోతున్నట్లు పరిశోధన చెబుతోంది. కాబట్టి విద్యార్థులు సెల్‌కు అలవాటు పడకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది.
Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: