2015
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
ఇది ప్రతి మనిషిలొ ఉండే సమస్య అయినప్పటికి ప్రతీ వ్యక్తి వివిధ రకముల శరీరం కలిగి ఉండటం వల్ల, మనిషికి ఒకరికీ మరొకరికీ మద్య మార్పు ఉంటుంది.
శరీర దుర్వాసన, చెమట మరియు ఇతర చర్మ స్రవాలు వల్ల వస్తుంది.  ఇది మిమ్మల్ని స్నేహితుల లేదా ఇతర  సమావేశాల నుంచి దూరం చేస్తుంది. మీరు ఎలాంటి కోవకు  చెందిన వారైనను, ఈ చెడు వాసన మీతో ఉన్నవారినే కాదు మిమల్ని కూడా ఎంతో ఇబ్బందికి  గురిచేసి అసౌకర్యాన్ని కలిపిస్తుంది.

     ఈ దుర్వాసన మన శరీరంలో  “eccrine” మరియు “apocrine” అనే  గ్రంధుల వల్ల వ్యాపిస్తుంది.

మొదటిగా శరీరం అంతటా వ్యాపించి ఉన్ననూ ముఖ్యంగా చేతులు పై, చేతుల కింది భాగము, చంకలు, అరికాళ్ళు, నుదురు పై ప్రభావం చూపిస్తాయి. తరువాత తొడల మధ్య చేరి ఎంతో ఇబ్బందిని కలిగిస్తాయి.

మార్కెట్లో ఎన్నో రకముల వివిధ ఉత్పత్తులు ఉన్నను అవి  తాత్కాలిక రక్షణ మాత్రమే ఇస్తాయి, కానీ ఈ సమస్యకు శాస్వత పరిష్కారం ఎంతో అవసరం.

 Deodorants, perfumes ఈ దుర్వాసనను కొంతవరకు తగ్గించినా శాస్వత పరిష్కారం ఎంతో అవసరం. వ్యక్తి యొక్క మానసిక మరియు భావోద్వేగ  ఒత్తిడి వల్ల కూడా ఈ దుర్వాసన వ్యాపిస్తుంది

చెడు వాసనకు కారణం:

పరిశుభ్రత సమస్య: మనం నివసించే ప్రదేశం శుబ్రంగా లేకపోయినా,స్నానము సరిగా  చెయకపొయినా, పరిశుభ్రమైన బట్టలు వేసుకోకపోయిన, ఎంతో  చిన్నవిగా అనిపించే ఇవి మన శరీర దుర్వాసనకు కారణం అవుతాయి

చర్మం సమస్య: చెడు వాసనకు కారణములలొ మరొకటి చర్మ సమస్యలు,  “eczema” లేదా “psoriasis” అనే  అలెర్జీలు ఉంటే నిర్దారించుకుని డాక్టరు ని సంప్రదించడం ఎంతో అవసరం

నివారణ మార్గములు :
  •  కాటన్ దుస్తులు ధరించాలిముఖ్యముగా  లోదుస్తులు ఇవి మీ చర్మానికి గాలి తగిలేలా చేసి దుర్గందాన్ని దూరం చేస్తాయి.
  • ప్రతీ రోజు స్నానంలో క్రిమి సంహారిక సబ్బును ఉపయోగించాలి.
  • ఎప్పటికప్పుడు చెమట పట్టే మరియు దుర్వాసన కలిగించే శరీర భాగాలను సబ్బుతొ శుబ్రముగా కడుక్కోవాలి.
  • నేరుగా నాడీ వ్యవస్థను ప్రభావితం మరియు మరింత చెమట ఉత్పత్తికి దారి తీసే టీ,కాఫీ వంటివి ఎంత తగ్గిస్తే అంత మంచిది.
  • రక్త కణాల పై ప్రభావితం చూపి చెమటకు మరియు శరీర దుర్గందానికి కారణమయ్యే మద్యం కి దూరంగా ఉండడం ఎంతో అవసరం.
 మీ రోజు వారి మందులు అనగా  స్టెరాయిడ్ ఆస్త్మా మందులు వల్ల కూడా చెమట వ్యాపించే అవకాశం ఎక్కువ, వీటి పై శ్రద్ద చూపించి సరైన మోతాదులో తీస్కోవాలి .

చెడు వాసనతో పోరాడేందుకు సహజ నివారణలు:

  • మీ స్నానం నీటిలో ఒక టేబుల్ స్పూన్  పటికను జోడించి తీసుకుంటే, ఎంతో తాజా, దుర్వాసన రహితమైన చర్మాన్ని పొందవచ్చు.
  • మీ స్నానం తర్వాత చివరిగా ఒక టేబుల్ స్పూన్ తేనెను నీటిలో కలిపి స్నానం చేస్తే  ఇది మీ శరీర దుర్వాసనని నియంత్రిస్తుంది.
  • ఉడికించిన పుదీనా ఆకులు స్నానపు నీటిలొ కలిపి చేస్తే రోజంతా చర్మం ఎంతో తాజాగా ఉంటుంది.
  • సరైన ఆహారం తీసుకోవడం వల్ల కూడ శరీర దుర్వాసనను తగ్గించటానికి ఎంతో సహయపడుతుంది ముఖ్యముగా   మీ ఆహారం 20% మాంసకృత్తులు, 20% నూనెలు మరియు కొవ్వులు కలిగి ఉండి పండ్లు మరియు కూరగాయలు తో  తీసుకొవడం ఎంతో అవసరం.
  • మంచి  నీళ్ళు ఎక్కువగా తీసుకొవడం వలన కూడ ఎంతో అవసరం.
  • ఒక టేబుల్ స్పూన్  సొంపుగింజలను తీసుకొవడం ద్వారా మీ శరీర తాజాతనమునకు ఎంతో ఉపయోగ పడుతుంది .
  • మన జీవన శైలి మన చేతుల్లోనె ఉంటుంది,అదనపు అలసట మరియు ఒత్తిడి  మన మానసిక స్తితిని పాడుచేస్తుంది .
 దుర్వాసన అనేది  వ్యక్తిత్వానికి మంచిది కాదు, దీని నియంత్రణకు పైన సూచించిన విధముగా పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
సాధారణంగా మగవారి కన్నా ఆడవారికే చర్మం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయికొన్ని అధ్యాయనాల ప్రకారం మగవారి చర్మం ఆడవారి చర్మం కన్నా ఆలస్యంగా ముడతలు పడుతుందంట కాని, మగవారి జీవనశైలి, వారి అలవాట్లు, వారిని చర్మ సమస్యలలో ముందుకు తీసుకు వచ్చి,ఆడవారితో సమానం చేసేశాయి. అవి..


  • షేవింగ్ : సాధరణంగా మగవారు షేవింగ్ ఎక్కువగా చేసుకోవడం వల్ల చర్మ సమస్యలు అధికంగా ఉంటాయి,షేవింగ్ వల్ల చర్మం కఠినంగా అయిపొయి, చర్మంలోని తేమను తీసివేస్తుంది, అందువల్ల చర్మం పొడిగా మారి ముడతలకు దారి తీస్తుంది.  మీరు షేవింగ్ ను చల్లని నీటితో చేసుకుని,తరువాత మాయిశ్చరైజర్ఉపయోగిస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు.
  • ధూమపానం: ధూమపానం అనేది మగవారి యొక్క “Manliness”కి చిహ్నము లాంటిది. కాని దీని వల్లనే మగవారి వయస్సు వారి అసలు వయస్సుకన్నా ఎక్కువగా అనిపిస్తుంది,ధూమపానము మగవారి అసలు వయస్సుకి మరికొంత వయస్సు కలిపి, చర్మం ముడతలకు, పొడిబారిపోవడానికి కారణం అవుతుంది.
  • అల్కహాల్ : మగవారికి ముఖ్యమైన, ఎంతో ఉపయోగకరమైన చిట్కా ఏమిటంటే మద్యానికి దురంగా ఉండటం, ఎందుకంటే మద్యం వల్ల రక్త నాళాలు అవసరమైన దానికంటే ఎక్కువగా సాగి ఇబ్బందులు కలిగిస్తాయి.
  • వ్యాయామం: వృద్దాప్యంగా కనిపించడం అనేది చర్మం వల్లే కాదు కుంగిపోయిన కండరాలు కూడా కారణం అవుతాయి,అందుకే ప్రతీ రోజూ వ్యాయామం చేయడం వల్ల కండరాలు బలపడి చర్మం ముడతలు పడకుండా ఉంటుంది.
  • ద్రాక్ష రసం: మగ వారి చర్మ సౌందర్యానికి ద్రాక్ష రసం ఎంతో మంచిది, ప్రతీ రోజూ ఆహారంతో పాటు ద్రాక్ష రసాన్ని తీసుకుంటే, మీ చర్మంలోని Elasticity ను పెంచి, మీ చర్మాన్ని అందంగా, యవ్వనంగా ఉంచుతుంది.
  • మసాజ్: రోజూ మీ ముఖం పై మెల్లగా మసాజ్ చేయడంవల్ల రక్త  ప్రసరణ సజావుగా సాగి చర్మాన్ని తాజాగా, యవ్వనంగా ఉంచుతుంది.
  •  రోజూ పాలతో మీ ముఖాన్ని శుబ్రం చేసుకుంటే చర్మంలోని మలినాలు అన్నీ పోయి మంచి ఫలితం కనిపిస్తుంది.
  • ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడుకోవచ్చు.  ముఖ్యంగా బచ్చలికూర లేదా చిక్కుళ్ళు వంటి కూరగాయలలో చర్మం ముడతలు పడకుండా చూసుకోవచ్చు.
  • సూర్యుని కాంతి: మీ చర్మాన్ని అధికంగా సుర్యుని కాంతిలో ఉంచకండి, దాని వల్ల మీ చర్మం ముడతలు పడటానికి ఎక్కువ అవకాశం ఉంది.

     మంచి నీరు అధికంగా తీసుకోవడం వల్ల కూడా చర్మాన్ని ముడతల బారి నుంచి కాపాడుకోవచ్చు. రోజుకి కనీసం 8 గ్లాసులు, లేదా 2 లీటర్ల నీరు తీసుకుంటే చర్మ రక్షణలో ఎంతో ఉపయోగపడుతుంది.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
  • సాధారణంగా వేళకు భుజించకుండా వేళతప్పి తినడం ఒక ముఖ్య కారణం
  • అంతేకాక అరగని పదార్ధాలను, మాంసాహారలను అతిగా సేవించడం వల్ల జీర్ణక్రియ దెబ్బతిని తిన్న ఆహారం మురిగిపోయి కడుపులోని ఆ దుర్గంధమంతా పైకెగదన్ని నోటి నుండి దుర్వాసనగా వెలువడుతుంటుంది.
  •  మరికొంతమందికి భోజునం తరవాత మంచినీటితో పుక్కిలించే అలవాటు లేకపోవడంవల్ల పళ్ళసంధుల్లో ఇరుక్కున్న ఆహారపు తునకలు కొంతసేపటికి కుళ్ళిపోయి కంపుకొడుతూ నోట్లో దుర్వాసనను పుట్టిస్తుంటయ్.
తీసుకోవల్సిన జాగ్రత్తలు :
  • అలాంటి వారు తమ ఆహారం విషయంలో క్రమశిక్షణ పాటించటం ఎంతో అవసరం.
  • రోజూ ఉదయం 9 గంటలలోపు మొదటి భోజనం, రాత్రి 8 గంటలలోపు రెండవ భోజనం,మధ్యాహ్నం అల్పాహారం క్రమంతప్పకుండా సేవించడానికి అలవాటుపడాలి.
  • ఇలా ఎప్పటికప్పుడు ఆహారం తీసుకుంటుంటే వారి దంతాలు మరియూ చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండి నోటి ఆరోగ్యం ఎంతో మెరుగు పడుతుంది.
  • భోజనం చేసిన తరువాత మరచిపోకుండా పదిపన్నెండుసార్లు నోటినిండా నీళ్ళు పోసుకుని నిదానంగా బాగా పుక్కిలించి ఊసివేయాలి.
  • ఆ తరువాత ఒక్క లవంగాన్ని బుగ్గన పెట్టుకుని చప్పరిస్తుంటే దుర్వాసన హరించి నోరు సుగంధభరితమౌతుంది.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
 చికెన్: మాంసాహారంలో లీట్ మీట్ ను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది, అదనపు కొలెస్ట్రాల్ చేరదు . లీన్ మీట్ ప్రోటీనులను అందిస్తుంది. లీన్ మీట్ తినడం వల్ల పొట్ట ఫుల్ గా ఉన్నఅనుభూతిని కలిగిస్తుంది. ఎక్కువ సమయం ఆకలి కానివ్వదు.

సాల్మన్: చేపల్లో అన్ సాచురేటెడ్ (అసంతృప్త కొవ్వు )కలిగి ఉంటాయి. మరియు అత్యవసర ఖనిజలవణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వును కరిగించడానికి బాగా సహాయపడుతాయి. కాబట్టి మీ రెగ్యులర్ డైట్ లో సాల్మన్ మరియు మెకరేల్ వంటి ఆహారాలను మధ్యహ్నాభోజనంలో లేదా రాత్రి డిన్నర్ లో తీసుకోవడం వల్ల బరుబు తగ్గడానికి మరియు అధికంగా అధనంగా పేరుకొన్న కొవ్వును కరిగించుకోవచ్చు.

స్వీట్ పొటాటో: ఆరోగ్యదాయకం స్వీట్‌ పొటాటో.... శరీరానికి కావల్సిన పోషకపదార్థాలను అందించడంలోనే కాదు వివిధ రకాలుగా శరీరంలో చేరిన విషపదార్థాలను తొలగించడంలో చిలుగడ దుంపలకు ప్రత్యేక స్థానం ఉంది. అనేక ఖనిజ లవణాలతో పాటు దుంపలలో బరువు తగ్గించే లక్షణాలు కూడా తక్కువే

 చీజ్: లో ఫ్యాట్ కాటేజ్ చీజ్ రెగ్యులర్ గా తీసుకోవాలి . ఈ ఆహారం వల్ల మన శరీరానికి క్యాల్షియం మరియు ప్రోటీనులను అధికంగా అందివ్వొచ్చు . అయితే దీన్ని పరిమితంగా తీసుకోవాలి.

ఆపిల్స్: ప్రతిరోజూ యాపిల్‌ పళ్లు తింటే శరీరంలో పేరుకున్న కొవ్వు కణాలు తగ్గుముఖం పడతాయి. యాపిల్‌ తోలులో ఉండే పెక్టిన్‌ శరీర కణాలు కొవ్వును పీల్చుకోకుండా నియంత్రిస్తాయి.యాపిల్స్ లో ఉన్న పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్స్ మరియు పోషకాంశాలను అటుంచితే..యాపిల్స్ లో నీటితో కూడిన పెక్టిన్ అధికంగా ఉండటం వల్ల ఇవి ఫ్యాట్ సెల్స్ ను ఘననీయంగా తగ్గిస్తుంది.

 స్ట్రాబెర్రీస్: స్ట్రాబెర్రీస్ మరియు బ్లూ బెర్రీస్ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం. ఎందుకంటే వీటిలో యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్, మినిరల్స్ మరియు విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీలో అధిక క్యాలరీలను చేర్చవు కాబట్టి, రెగ్యులర్ గా వీటిని తీసుకోవచ్చు. స్ట్రాబెర్రీ శరీర బరువును తగ్గిస్తుంది. శరీరానికి కావల్సిన శక్తిని ఇచ్చి, ఎక్కువ సేపు ఆకలికాకుండా సహాయపడుతుంది. కొవ్వును కరిస్తుంది.

 బ్రౌన్ బ్రెడ్: త్రుణధాన్యాలతో తయారుచేసిన బ్రెడ్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం. శరీరంలో ఎక్కువ క్యాలరీలను తగ్గిస్తుంది . జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది . ఇవి మన శరీరానికి అవసరం అయ్యే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, క్యాల్షియం, విటమిన్స్, మినిరల్స్ మరియు ఫైబర్ ను అందిస్తుంది.

 టమోటోలు: కొవ్వు త్వరగా తగ్గాలంటే పచ్చి టమాటాలు తినండి. టమాట సలాడ్ కేన్సర్ కూడా నివారిస్తుంది. కనుక కొద్ది ఆకలి వేస్తే టమాటాలు తినండి.
 మిరియాలు: మెటబాలిజం రేటును అమాంతంగా పెంచుతుంది. శరీరంలో కొవ్వు త్వరగా కరిగేందుకు సహాయపడుతాయి. ఆకలి కోరికలను కంట్రోల్ చేస్తాయి . యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.



మస్టర్డ్(ఆవాలు) : బరువు తగ్గడానికి మీరు తీసుకొనే ఆహారంలో ఆవాలను లేదా ఆవనూనెను చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆవాల్లో ఫ్యాటీ యాసిడ్స్ (ఒలియిక్, యురిసిక్ మరియు లినోలెనిక్ ఆమ్లం)లో సాచ్యురేటెడ్ ఫ్యాట్ మరియు యాంటీఆక్సిడెంట్స్ ఉండి క్యాలొరీస్ ను బర్న్ చేస్తాయి. మరియు బరువు తగ్గిస్తాయి

 పాప్ కార్న్: పాప్ కార్న్ ను మీరు బయట రెడీమేడ్ తెచ్చుకోవడం కంటే, కార్న్స్ ను తీసుకొచ్చి, ఇంట్లో తయారుచేసుకోవడం ఆరోగ్యకరం . అవుట్ సైడ్ తయారుచేసే వాటితో శరీరంలో అదనపు క్యాలరీలు చేరుతాయి.


 పుచ్చకాయ: వేసవివచ్చిందే పుచ్చకాయలు ఎక్కువగా మనకు అందుబాటులో ఉంటాయి. వీటిలో క్యాలరీలు తక్కువ మరియు యాంటీయాక్సిడెంట్స్ మరయిు విటమిన్స్ ఎక్కువ.

 బ్రొకోలీ: రీన్ వెజిటేబుల్స్ లో ఇది ఒక బెస్ట్ వెజిటేబుల్. ఉడికించిన బ్రొకోలీని ఒక కప్పు తీసుకోవడం వల్ల మంచిది. బరువు తగ్గాలనుకొనే వారు ఈ హెల్తీ గ్రీన్ వెజిటేబుల్ ను డైలీ డైట్ చేర్చుకోవాలి. 95కాలరీలున్న ఈ గ్రీన్ వెజిటేబుల్ రెగ్యులర్ గా తీసుకుంటే అతి త్వరగా బరువు తగ్గవచ్చు. అంతే కాదు ఇందులో సూపర్ క్యాన్సర్ ఫైటింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. బ్రొకోలీని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆకలిని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇంకా ఇందులో ఉండే అనేక రకాల విటమిన్స్ వల్ల ఇది ఒక నేచులర్ ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్ లిస్ట్ లోకి చేరిపోయింది.

 డ్రై నట్స్ : స్నాక్స్ తినే సమయంలో లేదా ఎక్కువగా ఆకలిగా ఉన్న సమయంలో బేకరీ ఫుడ్స్ కు, స్నాక్స్ ను తినడం కంటే నట్స్(డ్రై ఫ్రూట్స్)ను తినడం వల్ల నోటికి రుచి మాత్రమే కాదు, శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తుంది. చాలా మందిలో నట్స్ తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారనో లేదా కొవ్వు అధికం అవుతుందనో చెడు అభిప్రాయం చాలా మందిలో ఉంది. అందువల్లే చాలా మంది వాల్ నట్స్ మరియు బాదాం వంటివి తినకుండా ఉంటారు. అయితే ఇది పూర్తి విరుద్దం. ఎందుకంటే నట్స్ లో డైటరీ ఫైబర్ తో పాటు కొవ్వును కరిగించే లక్షణాలు కూడా పుష్కలంగా ఉండంటం వల్ల వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల చెడు కొవ్వును నియంత్రించవచ్చు

 కిడ్నీ బీన్స్ : ప్రోటీనులు మరియు ఫైబర్ అధికంగా ఉండే కిడ్నీ బీన్స్ ను రెగ్యులర్ గా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది మరియు బరువును కూడా వేగంగా తగ్గిస్తుంది


 బ్రౌన్ రైస్ : రెగ్యులర్ గా తీసుకొనే వైట్ రైస్ కు చెక్ పెట్టి, బ్రౌన్ రైస్ తీసుకోవడానికి అలవాటు పడితే , వెంటనే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బ్రౌన్ రైస్ ఒక హోల్ గ్రెయిన్ ఫుడ్: ఇందులో విటమిన్ బి, విటమిన్ ఇ, మెగ్నీషియం, ఐరన్ మరియు ఫైబర్లు ఫుష్కలంగా ఉన్నాయి. ఇది బౌల్ ను రెగ్యులేట్ చేస్తుంది తర్వాత, ఆకలిని నియంత్రిస్తుంది. జీవక్రియలను మెరుగుపరుస్తుంది.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
బరువు తగ్గించే ఆహర పదార్ధలు
అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గించుకోవడం చాలా కష్టం అని భావిస్తుంటారు. దానికి తోడు ఉన్న బరువును తగ్గించుకోవడానికి బదులుగా బద్దకిస్తుంటారు . బరువు తగ్గించుకోడానికి సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోవడం వల్ల బరువు తగ్గించుకోవడం అంత కష్టమైనది కాదు.  అదనపు బరువుతో బాధపడే వారు, శరీరంలోని అదనపు కొవ్వును కరిగించుకోవడానికి కొన్ని ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ సహాయపడుతాయి. ఇవి క్యాలరీలను తగ్గించడం మాత్రమే కాదు, స్లిమ్ గా కూడా మార్చుతాయి. సరైన సమయంలో సరైన ఆహారంను తీసుకోవడం ద్వారా మీరు బరువు తగ్గాలనే లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. కొన్ని రోజుల పాటు ఈ ఆహారాలను తీసుకోవడంతో పాటు ఎఫెక్టివ్ వర్కౌట్స్ చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలను గమనించవచ్చు .  శరీరంలో చేరిన అదనపు కొవ్వును సులభంగా తగ్గించుకోవచ్చు. ఈక్రింద ఉదహరించిన ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. అయితే ఈ ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోకూడదు. బరువు తగ్గించుకొనే క్రమంలో పరిమితంగా మాత్రమే వీటిని తీసుకోవాలి. లేదంటే మీరు పొట్ట సమస్యలకు గురి అవుతారు.

  • వెల్లుల్లి: వెల్లుల్లిలో అల్లిసిన్(allicin)అనే అంశం కలిగి ఉండి యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉండి శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను నివారిస్తుంది.
  • గ్రీన్ టీ: గ్రీన్‌ టీ గ్రీన్‌ టీలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ మెటబాలిజమ్‌కు అనువైన పరిస్థితిని శరీరంలో కల్పిస్తాయి. అలాగే క్యాన్సర్‌ నిరోధక కారకాలు, కొవ్వు అదుపులో ఉంచే అంశాలు గ్రీన్‌ టీలో పుష్కలం.ఇది బరువు తగ్గించడంలో బాగా సహాయపడుతుంది మరియు శరీరంలో మెటబాలిజం రేటును పెంచుతుంది. అలాగే మరో ప్రయోజనం హార్ట్ రేటు పెంచుతుంది. మీ గుండె కొట్టుకోవడం పెంచుతుంది, దాంతో మరిన్ని క్యాలరీలను మీరు కరిగించుకోవచ్చు.
  • దాల్చిన చెక్క: మసాలాలో వాడే దాల్చిన చెక్క ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది తీయగా, ఘాటుగా ఉంటుంది. దాల్చిన చెక్క నుండి సేకరించే నూనెలో యాంటీ వైరల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలున్నాయి. అందుకే, వాటి నుండి సోకే ఏ వ్యాధులైనా సరే ఇట్టే మాయం అవుతాయి.
  • అల్లం: అల్లం శరీరంలోని జీవక్రియలను వేగవంతం చేస్తుందని ఆరోగ్యనిపుణులు నిర్ధారించారు . మరియు ఇది కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది . ఇంకా విటమిన్స్, మినిరల్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉంటుంది
  • నిమ్మరసం: భోజనం చేసిన తర్వాత నిమ్మరసం, నిమ్మజ్యూస్ తాగడం వల్ల శరీరానికి చాలా మంచిది. శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇందులోని సిట్రస్ ఆమ్లం బరువు పెరగనీయకుండా అడ్డుకుంటుంది.
  • ఉల్లిపాయ: జీవక్రియలను చురుకుగా ఉంచడంలో ఉల్లిపాయలు ప్రధాణ పాత్రను పోషిస్తాయి. అంతే కాదు, మనం వండే ఆహారాలకు మంచి రుచిని అందిస్తాయి. అందుకే పచ్చిగా కూడా సలాడ్స్ లో జోడించాలి.
  • ఓట్స్: ఓట్స్ తినడానికి మాత్రమే రుచిగా మాత్రమే కాదు ఇవి తిన్న తర్వాత కడుపు నిండుగా అనిపిస్తుంది. దాంతో అధికంగా తినాలనే కోరికను ఓట్స్ తగ్గిస్తాయి. ఓట్స్ లో ఫైబర్ అధికంగా ఉండి కొలెస్ట్రాల్ లెవల్స్ ను మరియు కొవ్వులు సమతుల్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది.
  •  పెరుగు: లోఫ్యాట్ పెరుగులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఆకలిని కంట్రోల్ చేస్తుంది మరియు ఎముకలు మరియు దంతాలను బలోపేతం చేస్తుంది. మరియు పెరుగులో అధిక శాతంలో ప్రోటీనులు మరియు విటమిన్ డి పుష్కలంగా ఉంది.ఇది మీశరీరానికి నిరంతరం ప్రసరిస్తుంటుంది. కాబట్టి లోఫ్యాట్ పెరుగుతో పాటు, లోఫ్యాట్ మిల్క్, చీజ్ వంటి వాటిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవచ్చు.
  • గుడ్డు: గ్రుడ్లు జింక్, విటమిన్ B, అయోడిన్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, మరియు ప్రోటీన్ కలిగి ఉన్నాయి. గుడ్లలో అధిక ప్రోటీనులు మరియ ఇతర ముఖ్యమైన ఖనిజాలు ఉండి అతి తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. మీ శరీరాన్ని, కండర పుష్టిని పెంచుకోవడానికి ఇది చాలా సహాయపడుతుంది. అధిక కొవ్వును నియంత్రించడానికి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచుకోవడానికి గుడ్లు బాగా సహాయపడుతాయి. గుడ్డు ఆరోగ్యం, పోషక విలువలు కల బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే శరీర కొవ్వు కరిగి ఎనర్జీ వస్తుంది. గుడ్డు పొట్ట నింపుతుంది. కొవ్వును కరిగించి ఎనర్జీగా మార్చి శరీరానికిస్తుంది.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
 యాక్నె (మొటిమల వలన ఏర్పడిన మచ్చలు) పోవాలంటే రోజుకు రెండుసారు ముఖంతోపాటు యాక్నె ఉన్న ప్రదేశవుంతా పన్నీటితో కడగాలి.  తాజా నిమ్మరసాన్ని కాచిన పాలలో కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత శుభ్రం చేయాలి. ఇలా రోజుకు రెండు - మూడు సార్లు చేస్తే యాక్నె త్వరగా పోతుంది.
  • రోజుకు రెండుసార్లు గోరువెచ్చటి నీటిలో ఉప్పు కలిపి ముఖం కడగాలి.  యూకలిప్టస్‌ ఆయిల్‌తో మర్దన చేస్తే యాక్నె సమస్య తగ్గుతుంది. 
  • గుప్పెడు తులసి ఆకులు నీళ్లు కలిపి గ్రైండ్‌ చేసి ఫ్రిజ్‌లో పెట్టి చల్లబడిన తర్వాత ముఖానికి పట్టించాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే మొటిమలు, వాటి మచ్చలుపోతాయి.
  • తాజా నిమ్మరసంతో రెండు - మూడు నిమిషాల పాటు మర్దన చేయాలి. రోజూ చేస్తుంటే యాక్నె క్రమంగా తగ్గుతుంది. 
  • యాక్నె పోవడానికి అన్నింటికంటే తక్కువ ఖర్చుతో చేసే ట్రీట్‌మెంట్‌ ఇది. టేబుల్‌ సాల్ట్‌లో రెండు చుక్కల నీళ్లు కలిపి ముఖానికి పట్టించి సున్నితంగా మర్దన చేసి ఆరినతర్వాత చన్నీటితో కడగాలి. ఉప్పుకు బదులుగా చక్కెర కూడ వాడవచ్చు.
  • మెంతి ఆకులను గ్రైండ్‌ చేసి రాత్రి పడుకోబోయే ముందు ముఖానికి పట్టించి ఉదయం గోరు వెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటుంటే క్రమంగా తగ్గుతుంది. యాక్నెతోపాటు బ్లాక్‌హెడ్స్‌ కూడ తగ్గుతాయి.
  • బార్లీ పొడి ఒక కప్పు, ఉప్పు నాలుగు టేబుల్‌ స్పూన్లు, పాలు ఒక కప్పు, స్ట్రాబెర్రీలు రెండు తీసుకుని అన్నింటినీ కలిపి గ్రైండ్‌ చేసి ముఖానికి యాక్నె ఉన్న చోట పట్టించి ఆరిన తర్వాత కడగాలి. ఇలా వారానికొకసారి చేస్తే పూర్తిగాతగ్గుతుంది.
  • యాక్నెను తగ్గించడంలో వెల్లుల్లిది ప్రముఖపాత్ర. రోజులో వీలయినన్ని సార్లు వెల్లుల్లిరసాన్ని పట్టించవచ్చు. చిదిమిన వెల్లుల్లితోముఖాన్ని మర్దన చేసినా కూడ మంచి ఫలితం ఉంటుంది.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
జుట్టు తెల్లపడుతుండా...
చాలా మందిలో ఇప్పుడు నెలకొని ఉన్న ప్రధాన సమస్య జుట్టు తెల్ల పడటం. ఒకటి తెల్లబడితే చాలు ఏదో కోల్పోయినట్టుగా బాధపడతారు.  మారుతున్న అహార అలవాట్లు, విశ్రాంతి, అలోచనలు ఇవన్ని మీ జుట్టుపై ప్రభావితం చేస్తాయని మీకు తెలుసా..20లు దాటకుండానే ఈ సమస్యకు అందరూ దగ్గరపడుతున్నారు. చిన్న వయసు వారే బ్యూటి స్పాల చుట్టూ తిరుగుతున్నారు. జుట్టు ఎందుకు తెల్లబడుతుందో  తెలుసుకుందామా..

వయసుతో పాటు వెంట్రుకలు తెల్లబడటం సహజమే. కాని చిన్నవయసులోనే తల నెరిసిపోవడం అసహజం. ఏ వయసులో అయినా సరే జుట్టు పండిపోవడానికి కారణం వయసుతో పాటు వర్ణకారక పదార్థాన్ని సరఫరా చేసే పొర బలహీనమై చర్యాశీలత తగ్గడమేనని వైద్యుల చెబుతున్నారు.
 వెంట్రుకలు త్వరగా నెరిసి పోవడానికి అనేక కారణాలున్నయి.

వెంట్రుకలు తెల్లబడటానికి కారణాలు:

మనం తినే ఆహారపు అలవాట్లూ, మన చేసే అశ్రద్ధ వల్ల లోపాలు, వ్యాధులు ముఖ్యంగా జీర్ణ సంబంధ వ్యాధుల తాకిడి వల్లే తల తొందరగా తెల్లబడుతుందని నిపుణులు చెబుతున్నారు.


  • వంశపారంపర్యంగా వచ్చే ఆల్బిజం వంటి వ్యాధుల వలన ఈ సమస్య రవచ్చు.


  • కొన్ని రకాల విషజ్వరాలతో బాధ పడేటప్పుడు కూడా తల నెరిసిపోవచ్చు.


  • శరీరంలోని పిట్యూటరీ గ్రంధి, థైరాయిడ్ గ్రంధి తగినంత హార్మోనులను ఉత్పత్తి చేయకపోతే చిన్నప్పుడే వెంట్రుకలు తెల్లబడతాయి.


  • ఇంకా సరైన పోషకాహారం తీసుకోనివారిలోను, వ్యాధులతో ముఖ్యంగా జీర్ణ సంబంధిత రుగ్మతలతో బాధపడేవారిలో తల తొందరగా తెల్లబడుతుంది.


  • ఇలాకాక సరైన పోషకాహారం తీసుకోనివారిలోను, వ్యాధులతో ముఖ్యంగా జీర్ణ సంబంధిత రుగ్మతలతో బాధపడేవారిలో తల తొందరగా తెల్లబడుతుంది.


జుట్టు తెల్లబడడం అంటూ ఒకసారి మొదలయిందంటే ఇక అది అలాగే ఉండిపోతుంది. వ్యాధి వల్ల జుట్టు నెరవడం జరిగితే సకాలంలో వ్యాధికి చికిత్స పొందిన సందర్భాల్లో మాత్రమే జుట్టు కొద్దిగా అయినా నల్లబడే అవకాశాలుంటాయి.

వెంట్రుకలు తెల్లబడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:


  • రోజూ తీసుకునే తిండిలో మల్టీ విటమినులు, బి కాంప్లెక్స్ విటమినులు తీసుకునే ఆహారం లో ఉండేట్టు చూసుకోవాలి.
  • తెల్లబడిన తల తిరిగి నల్లబడటానికి తగిన మందులు, చికిత్సా పద్ధతులు ప్రస్తుతానికి లేవు. మిగతా వెంట్రుకలు కూడా తెల్లబడకుండా ఉండాలంటే తినే తిండి విషయమై జాగ్రత్త తీసుకోవాలి.
  • తల బాగా నొప్పిగా ఉందనో ఉపశమనం కోసం సెలూన్లకు వెళ్ళో, స్పాలకు వెళ్ళో మర్దన పేరిట తల వెంట్రుకల కుదుళ్లను మరింత బలహీనం చేయడమే తప్ప ఏ ప్రయోజనం ఉండదు. రకరకాల తైలాలు వాడటం, ఏ చిట్కాలను ఆశ్రయించినా ఆశించినంత ఫలితం రాకపోగా మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయి.
  • ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, పాలు, పాల తయారీలు, మాంసం, గ్రుడ్లు ఎక్కువగా వాడాలి. ఆకుకూరలను ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. 
ఆరోగ్యం బాగుంటే తల నెరవటం జరుగదు, జుట్టు ఊడే పరిస్తితి మీకు రాదు. అరోగ్య సమతుల్యత సాధించాలంటే పోషకాహారాన్ని చక్కగా తినాలి. ఆలోచనలకు స్వస్తి పలకండి. ఎందుకంతే ఆలోచనలెక్కువ ఉన్నవారికి అందోళన కూడా సహజంగా ఉంటుంది.కాబట్టి ఆందోళనలకు టాటా చెప్పండి. నిగనిగలాడే జుట్టును సోంతం చేసుకొండి.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
మీ  శరీరాకృతిని జీవితాంతం ఉంచుకోవడానికి పరిష్కారం కాని అద్భుతమైన మందులు కాని ఎమిలేవు. ఇక్కడ చెప్పాలనుకునే మాట ఎమిటంటే, మీరు మీ  శరీరాకృతి కోసం ఎన్నో చేస్తూ ఉంటారు, రాత్రి పూట భోజనం మానేయడం, మధ్యాహ్నం అకలితో పని చేసుకోవడం, వారం అంతా  ట్రెడ్మిల్ యంత్రం పై పరుగులు తీయడం,ఇలా ఎన్నో చేస్తూ అసలు విషయం మరచిపొతూ ఉంటారు, మనం తెలుసుకోవలసింది, ఆరోగ్యం మరియు ఫిట్నెస్ పొందాలంటే, మన మానసిక ఆరోగ్యం ఎంతో ప్రశాంతంగా ఉంచుకోవాలి.ఆరోగ్యం మరియు ఫిట్‌నెస్ అనేవి ఎప్పటికప్పుడు మనం చేసే పనులను చుసే కోణంలో కుడా ఆదారపడి ఉంటుంది.


మెరుగైన అరోగ్యం, శరీరాక్రుతి  పొందాలంటే ఈ చిట్కాలు ఎంతో ఉపయోగకరం:

  • ఎక్కువ శాతం మంచి నీరు తీసుకోవడం ఎంతో అవసరం, రోజుకి కనీసం 6-8 oz నీరు అవసరం.
  • మీ రోజు వారి వ్యాయమంలో సరిసమాన బరువు కలిగి, ఎంతో ఉపయోగకరమైన పరికరాలతోనే  వ్యాయామం చేయడం చాల అవసరం,  రోజుకి 30 నిమిషాలు ప్రత్యేకమైన, ఎంతో  శక్తివంతమైన గుండెకు సంభందించిన వ్యాయం చేస్తే ఉపయోగపడని క్యాలరీలు కరిగి , శరీరంలోని కొవ్వు శాతం తగ్గి గుండెకు ఎంతో మంచిది.
  • సాద్యమైనంత వరకూ అధిక కొవ్వు, క్యాలరీలతో కూడిన ఆహారమును దూరంగా ఉంచండి.
  • పాల ఉత్పత్తులు , చాక్లెట్ బార్లు , వెన్న  వంటి పదార్దాలు లేని  ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం.
  • మీరు తీసుకునే భోజనంలో ఎంతో జాగ్రత్తలు తీసుకోవడం  అవసరం, సమాన్యంగా అన్నింటిలో కొవ్వు,క్యాలరీలు కలిగి ఉండటం వల్ల అవి తీసుకున్నచో మీరు లావుగా మారే ప్రమాదం ఉంది.
  • ఎక్కువగా మంచి ఆహారం తీసుకుంటే మీ శరీరాక్రుతిని కాపడుకోవచ్చు.
  • వ్యాయామం చేయడం చాలా అవసరం.



Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
zero size
కోరికలుండని మనిషుండరు. ఇక సౌందర్యోపాసన కోసం మాత్రం ఎంతకైనా మనిషి తెగిస్తాడనేది వాస్తవం. అయితే జీవితం లో ఫాషన్స్ సైక్లిక్ విధానంలో తిరుగాడుతుంటాయ్. ఆ విధానంలోనే ఒల్డ్ ఫాషన్స్ మాళ్ళీ మనకు తారసపడుతుంటాయ్. ఆ కోవాలోనికి ఈ రోజు సన్నగా నాజూకుగా ఉండే శరీరాకృతి కూడా వచ్చేసింది. అదేదో కాదు జీరో సైజ్ నడుము. ఈ నడుము గురించి ప్రస్తుతం అతివలంతా పడరాని పాట్లు పడుతున్నారు. జీరో సైజ్
విశేషాలేంటో తెలుసుకుందామా!

 సైజ్ జీరో:

  • అమ్మాయిలు అతి సన్నటి నడుముకోసం మక్కువ పెంచుకుని కృంగి కృశించిపోవడాన్నే అతిగా డైటింగ్ చేయడం, అతిగా వ్యాయామం చేయడం ద్వారా తమ శరీరాకృతిని అసాధారణ స్థితిలో కుదింపజేసుకుని స్లిమ్‌గా, నాజూకుగా, అందంగా కనిపించాలని మహిళలు పడుతున్న సరికొత్త పాటునే సైజ్ జీరో అంటున్నారు.
  • తమ శరీరం తమకే బరువుగా తయారయ్యే విపత్కర స్థితిని ఎవరూ కోరుకోరు. ప్రస్తుత కాలంలో స్త్రీపురుషులు ఇరువురూ కూడా సన్నబడటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ నాజూకుతనం కోసం ఆ ఆశ శృతి మించితే అందం కోసం పందెంలో శరీరం మోతాదుకు మించి చిక్కిపోతే సకల రోగాలకు శరీరం నిలయంగా మారుతోంది.

  • చివరకు మాతృత్వం కూడా స్త్రీకి దూరమయేలా సైజ్ జీరో ప్రభావం చూపుతోంది. ఇలా ఫిగర్ బాగుండాలని తపనతో అతి సన్నటి నడుమును కొని తెచ్చుకున్న యువతులకు బహిష్ఠు సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. అంతకు మించి చిన్నవయసులోనే నెలవారీ బహిష్ఠులు ఆగిపోవడం లేదా క్రమం తప్పడం జరుగుతోందట.

  • ఇక ఇలాంటి వారికి పెళ్లంటూ జరిగితే గర్భం దాల్చడం కూడా కష్టమయిపోతోందని వైద్యుల ఉవాచ. నాజూకు శరీరం కష్టపడి సాధించుకున్న వారికి పుట్టే పిల్లలు సైతం పోషకాహారం లోపించి బరువు తక్కువతనంతో పుడుతున్నారట.
  • సన్నబడిపోవాలనే కోరిక మదిలో రగులుతుండగా అతిగా డైటింగ్ మరియు వ్యాయామం చేసే అమ్మాయిలకు అసాధారణ బహిష్టుల సమస్య వస్తోందని వైద్యులంటున్నారు. ఇంకా ప్రమాదం ఏమిటంటే ఇలాంటి నాజూకు భామల ఎముకలు ముదివయస్సులో ఉన్న వారి ఎముకల లాగా బలహీనంగా తయారవుతున్నాయి.

అందమైన శరీరాకృతి ఉండవలసిందే. ఊబకాయం మన సమీపానికి రాకుండా జాగ్రత్త పడాల్సిందే. అయితే నాజూకు పేరుతో మాతృత్వానికి సైతం దూరమయ్యే స్థితిని మహిళలు కొని తెచ్చుకోవటం మాత్రం ఇబ్బందికర విషయమే.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
బ్యూటీ టిప్స్ ఫర్ మెన్
ఈ జెనరేషన్లో మగవారికి శరీర ధారుఢ్యం పైనే కాదు వారి అందం మీద కూడా శ్రధ్ధ పెరుగుతోంది. ప్రతి వారూ తామూ.. అందంగా ఉండాలని పార్లర్లకు పరిగెడుతున్నారు. అటువంటి వారి కోసం కొన్ని బ్యూటీ టిప్స్
సాధారణంగా చాలా మంది మగవారి చర్మం ఆయిల్ చర్మం కలిగి, జిడ్డుగా ఉంటుంది. అలాగే వారి ముఖంలో ఓపెన్ రంధ్రాలు కలిగి ఉంటాయి. మగవారు ఎక్కువ బయట తిరుగుతుంటారు కాబట్టి దుమ్ము, ధూళి ముఖ రంధ్రాల్లో చేరి ముఖంలో మొటిమలు, ముడతలు ఏర్పడటానికి దారితీస్తుంది. కాబట్టి మగవారి ముఖాన్నిశుభ్రపరుచుకోవడానికి కెమికల్ ఫ్రీ బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం మంచిది. ప్రతి రోజూ ఇంటికి తిరిగి రాగానే ముఖాన్ని మంచినీళ్ళతో శుభ్ర పరచుకొని క్లెన్సింగ్ అప్లై చేయడం చాలా మంచిది.



  • అతి తక్కువ రసాయనాలు కలిగిన ఫేస్ వాష్ ఉత్పత్తులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
  • రోజుకు కనీసం మూడు సార్లైన ఫేస్ వాష్ క్రీమ్ తో ఫేస్ వాష్ చేసుకోవాలి.
  • ముఖం మరీ గరుకుగా ఉన్నప్పుడు తప్పని సరిగా పార్లర్ కి వెళ్ళి ఒకటి రెండు సార్లు వారి సలహాలను, పద్దతులను పాటించాలి.
  • సోపు ఉత్పత్తులకు సంబంధించిన లేదా డియోడరెంట్స్ కు సంబంధించిన ఉత్పత్తులను ముఖానికి వాడకూడదు.
  • షేవింగ్ చేసిన తర్వాత అలోవెరా ఫేష్ వాష్ చేసుకొంటే షేవింగ్ సమయంలో చిన్న గాట్లు ఏర్పడ్డా ఏటువంటి మార్క్స్ లేకుండా చేస్తుంది.
  • ముఖ్యంగా పురుషు చర్మం రఫ్ గా ఉంటుంది కాబట్టి అందుకోసం విటమిన్ ఇ ప్రోడక్ట్స్ ను లేదా ఆలోవరా(కలబంద)లతో తయారైనటు వంటి ఫేష్ వాష్ లతో శుభ్రం చేసుకోవాలి.
  • వ్యాజ్ లైన్ ను తరచూ పెదవులకు రాస్తుండాలి.
  • చిన్ని చిన్న జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే ముఖంలో మొటిమలు, ముడతలు, రంద్రాలు పోగొట్టి ముఖ చర్మాన్ని ఆకర్షనీయంగా ఉంచుతుంది.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
రోజ్ వాటర్ (పన్నీరు) ఉపయోగాలు
స్త్రీలు వారి అందాన్ని కాపాడుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు, ఇప్పుడు ఎన్నో రకముల, చర్మ సౌందర్యాన్ని రక్షించే వస్తువులు మార్కెట్లో లభిస్తున్నాయి. కాని తర తరాలుగా, స్త్రీ యొక్క సౌందర్య సం రక్షణలో పన్నీరు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
ఒకప్పటి కాలంలో పన్నీరుని ఎక్కువగా అన్నింటిలో ఉపయొగించేవారు, కానీ ఇప్పుడు కొన్ని కొన్ని ఉత్పత్తులలో మాత్రమే దీనిని ఉపయోగిస్తున్నారు. ఈ పన్నీరు, మరియు “రోజ్ ఆయిల్ ” మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కలుపుకుంటే మీ మృదువైన చర్మాన్ని, చర్మ వ్యాధులు నుంచి కాపడుకోవచ్చు.


మీ చర్మం పై పన్నీరు చేసే అద్భుతాలు

మన ముఖంలో ఉన్న మంటపుట్టించే చర్మం, దద్దుర్లు, ముడతలు, మొటిమలు, వీటన్నిటిపై పోరాడే తత్వం కలిగి ఉండడం వల్ల, వీటి యొక్క నివారణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.


ఈ పన్నీరు మీ చర్మంలో ఉన్న రంద్రాలని శుబ్రం చేసి, చర్మంలోని జిడ్డుని తీసేస్తుంది, అంతే కాకుండా నల్ల మచ్చలు, మొటిమలను దూరం చేసి, మీ ముఖం పై ఉన్న దుమ్ము, ధూళిని తొలగిస్తుంది .

 దీనిని మీరు మీ “ఫేష్యల్” తర్వాత ఉపయోగిస్తే మీ చర్మంలోని ఓపెన్ రంధ్రాలను మూసివేసి, కణాలని ఆరొగ్యంగా ఉంచుతుంది, అంతే కాకుండా, దద్దుర్లూ, ఎర్రబడిన ప్రదేశాన్ని తగ్గించి, మంచి ప్రభావాన్ని  చూపిస్తుంది.

 ఈ పన్నీరులోని సుగంధ పరిమళాలు మీ యొక్క మనసిక స్థితిని పెంచి, భావోద్వేగంతో కూడిన ఆలోచనలని తగ్గించి ప్రశాంతత ఇస్తాయి. ఇది మీకు నిద్ర సరిగా పట్టడానికి మరియు లేచిన వెంటనే మనసంతా ఎంతో ప్రశాంతంగా, ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది.

చాల సులువైన, మార్గం ఏమిటంటే మీరు రాత్రి పూట నిదురించే ముందు ఇది రాసుకుని పడుకుంటే, మీ ముఖం లోని మలినాలను శుద్ది చేసి, మరుసటి రోజు ఎంతో కాంతివంతంగా మెరిసే చర్మాన్ని ఇస్తుంది.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
రమజాన్‌ నెల ఖుర్‌ ఆన్‌ అవతరించిన నెల. అందుకే విశ్వసించినవారు ఈ నెలను పూర్తిగా ఖుర్‌ ఆన్‌కే అంకితం చేస్తారు. ఖుర్‌ ఆన్‌ని పఠించడానికి, దాన్ని ఆకళింపు చేసుకొనడానికి తద్వారా జీవితాన్ని సౌభాగ్యవంతం, పునీతం చేసుకోవడానికి, ఆత్మల్ని ప్రక్షాళనం చేసుకోవడానికి యత్నిస్తారు. ఇలా ఖుర్‌ ఆన్‌ నేర్పే కరుణానుగ్రహాలను సొంతం చేసుకుంటారు. 

ఈ నెలలోనే జకాత్‌ని చెల్లించి తమ సంపదలో అగత్యపరులకు, ఉపేక్షితులకు దైవం నిర్ణయించిన వారి వాటాను అందజేస్తారు. అలా సంపదను పరిశుద్థపరచుకుంటారు. సుసంపన్నం చేసుకుంటారు. అందుకే ప్రవక్త మహనీయులు ఈ నెలను సహన సంయమనాల నెల, సానుభూతి నెల అన్నారు. నిజం చెప్పాలంటే ఈ రమజాన్‌ నెల ఖుర్‌ ఆన్‌ నెల! 

 అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్‌ పేరుతో ప్రారంభిస్తున్నాను : 1-3 

అల్లాహ్‌ మాత్రమే స్తుతింప దగినవాడు. ఆయన సకల లోకాలకు ప్రభువు. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ప్రతిఫలదినానికి స్వామి. 4-7 మేము నిన్నే ఆరాధిస్తాము. సహాయం కొరకు నిన్నే అర్థిస్తాము. మాకు రుజుమార్గం చూపించు- నీవు అనుగ్రహించినవారూ, నీ ఆగ్రహానికి గురికానివారూ, మార్గభ్రష్టులు కానివారూ అనుసరించిన మార్గము. 

1. అల్లాహ్‌ ఈ ‘ఫాతిహ’ సూరాను తన దాసులకు నేర్పాడు. వారు దానిని ఒక విన్నపం రూపంలో తమ ప్రభువు సాన్నిధ్యంలో సమర్పించుకునేందుకు. 

2. రబ్‌ (ప్రభువు)అనే పదం అరబ్బీ భాషలో మూడు అర్థా లలో వాడబడుతుంది. (1) స్వామి, యజమాని (2)పెంచేవాడు, పోషించేవాడూ, కాపాడేవాడు, కనిపెట్టి వుండేవాడూనూ. (3) చక్రవర్తి, పరిపాలకుడు, యుక్తిపరుడు, నిర్వాహకుడు, అల్లాహ్‌ ఈ అన్ని అర్థాలలో నూ సృష్టికి ప్రభువు. 

3. ఇబాదత్‌ అనే పదం కూడా అరబ్బీ భాషలో మూడు అర్థాలలో ఉపయోగించబడుతుంది. (1) ఆరాధన, ఉపాసన (2) విధేయత, ఆజ్ఞాపాలన (3)దాస్యం, బాని సత్వం 

4. దాసుని ఈ ప్రార్థనకు ఖురాను యావత్తూ జవాబు. దాసుడు తన ప్రభువును మార్గదర్శకత్వం కోసం ప్రార్థిస్తాడు. ప్రభువు దానికి సమాధానంగా ఈ ఖురానును అతనికి ప్రసాదిస్తాడు. అల్‌ ఫాతిహ ఆరువేల ఆరువందల పైచిలుకు వచనాలు, నూటపద్నాలుగు అధ్యాయాలు, దాదాపు వెయ్యి పుటల దివ్య ఖుర్‌ ఆనైఉ గ్రంథం విషయవైవిధ్యం రీత్యా అపురూపమయినది. అపారమైన సాహితీ సౌందర్యలు ఆ గ్రంథానికే ప్రత్యేకం. అనన్యమైన శైలి విషయ విస్తృతికి అమరిపోయిన ముత్యాలహారం, మానవజీవిత పుష్పం ఎంత వికసితమయిందో అంతే విశాలమయింది.
దివ్య ఖుర్‌ ఆన్ చర్చనీయాంశాల ఫలకం, గగన భువనాలలా సాగర సమీరంలా పరిమితులు, పరిధులు, ఎల్లలు, అవధులులేవు. అందులో ప్రస్తావించిన విషయాల జాబితా అనంతం, అనన్యసామాన్యం. తరగని నిధి అన్నింటినీ సమాధానపరుస్తుంది ఖుర్‌ ఆన్. అన్నింటికీ పరిష్కారాలు చూపెడుతుంది. అందుకే ప్రపంచంలో వెయ్యిన్నర సంవత్సరాల నుండి ప్రతిదినం, ప్రతిచోట, ప్రతి ముస్లిముల ఇంట, ప్రతి మసీద్‌లో, ప్రతి నమాజ్ లో అనుక్షణం ఎక్కడో తమ జీవితాన్ని ధన్యం చేసుకుంటూనే ఉంటారు. 
ఆ దివ్యగ్రంథాన్ని ఎన్నిసార్లు చదివినా, ఎన్నెన్ని విధాలుగా ఆకళింపు చేసుకున్నా, ఎన్నెన్ని కోణాలలో పరిశోధించినా, ఎంతకాలం తరచి తరచి చూసినా దాని శుభాలు తరగవు. అందుకే అది శుభాల సరోవరం. విశ్వాసాంశాలు అందులో ప్రతిపాదింన విశ్వాసాల్లో ఒక్కొక్క అంశమూ, అది అవతరించిన రోజుల్లో ఎలా సత్యమని దేదీప్యమానంగా రుజువయిందో, ఎలా నిత్య తను ఘంటపథంగా ప్రకటించిందో అలాగే నేటికీ, ఈ అత్యాధునిక కాలంలోనూ నిత్యనూతనంగా పచ్చపచ్చగా, రెపరెపలాడుతూ ఉంటుంది దాని నమ్మకాల బావుటా. అంతేకాదు, కాలం ముందుకు సాగినకొద్దీ ఆ విశ్వాసాల సత్యత, నిత్యత మరీ మరీ రూఢీ అవుతూ ఉంటుంది. 

దాని విశ్వాస ప్రాతిపది కలు ముఖ్యమయినవి మూడు. ఒకటి దేవుని ఏకత్వం, అజ్ఞానపు తెరలు తొలిగి మనిషి జ్ఞానపరిథి విస్తృతమయిన ప్రతిసారీ మూఢనమ్మకాల ఊబిలో నుంచి బయటపడి క్రమేణ దేవుని ఏకత్వపు స్వేచ్ఛాయుత రాచబాట వైపునకు హేతుబద్ధంగా అడుగుముందుకు వేస్తున్నాడు మనిషి. మానవులంతా ఒకేజాతి, మానవజాతి అయినప్పుడు, మానవునికీ ఈ సృష్టియావత్తుకూ కర్త ఒక్కడే అయినప్పుడు, విశ్వవ్యవస్థ పరిపాలనను కూడా ఒకేశక్తి నిర్వహిస్తున్నప్పుడు, మానవుని ఆరాధనకు, పూజకు, భక్తికీ అన్యులు ఎలా అర్హులవుతారు? ఈ సత్యాన్ని నేడు గ్రహించగలిగాడు ఆధునిక మనిషి, దేవుడు ఒక్కడే అన్న ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చాడు మనిషి. అలాగే రెండవ ప్రధాన విశ్వాసాంశం దైవ దౌత్యం. అదొక పరిమళం. వెలుగు, ఎంత వాడు కున్నా తరగని గని, ఎల్లలు లేని పరిధి. ఈ గజిబిజి ప్రాపంచిక జీవన వ్యవస్థలో మానవునికి సరయిన అనుసరణీయమయిన, ఆనందకరమైన, ఆహ్లాదకర మయిన మార్గమేదో, జీవితపు అనేక చిక్కుముడుల్ని విడదీసే మూలమంత్రమేదో, అసంఖ్యాక సమస్యల కీకారణ్యం నుండి బయటపడే పరిష్కార మేమిటో ఎవరు చెప్పాలి? మానవుని సకల ప్రశ్న లకు సహేతుక సమాధానం ఒక్కటే - అదే సృష్టికర్త, ప్రభువు పాలనాధికారం గల స్వామి దైవం మాత్రమే ఆ దారి చూపగలడు. నిజం! ఆ దేవుడే తన మార్గదర్శక గ్రంథాలను అందజేయవలసిందిగా సచ్ఛీలురయిన తన దాసులను నియమించారు. వారే తన ఆదేశాలను పాలించే ఆదర్శమూర్తులుగా ప్రకటించారు. అటువంటి మార్గబోధనల్లో కడపటి గ్రంథమే దివ్య ఖుర్‌ ఆన్. అటువంటి జ్ఞానబోధకుల్లో అంతిమ దైవసందేశహరుడే మహమ్మద్‌(సల్లల్లాహు అలైహి వసల్లం). ఖుర్‌ ఆనైఉ ప్రతిపాదించే మూడవ విశ్వాసం పరలోక జీవితం. ప్రపంచంలో జన్మింన ఒక్కొక్క మానవుడు నశిస్తూనే ఉన్నాడు. ఏ ఒక్కడూ మిగలటం లేదు. మానవలోకమూ నశిస్తుంది. ఇహలోకం, ఇహలోక జీవితం, ఈ విశ్వ వ్యవస్థ అంతానశ్వరమయినదే. ఒకనాడు అంతా అంతమయిపోవలసిందే. అది మానవునికి అనుభవైక సత్యం.అందుకే పుట్టుట, గిట్టుట కొరకే అన్న నానుడి పుట్టింది. అయితే ఈ జీవితం ఏమిటీ? ఈ మరణం ఏమిటీ? ఈ జీవితం అంతమయిన తరువాత జరిగే దేమిటీ? కేవలం వినోదం కొరకేనా ఈ జీవన కళ తొణికిసలాడేది? అనే ప్రశ్నలు మటుకు మిగులుతాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే ఖుర్‌ ఆన్. పరలోక జీవితం మరణంతో ముగియదు. ఒక దశ దాటి మరో దశలోకి ప్రవేశద్వారమే తప్ప మరణం మరేమి కాదు. అక్కడ ఆది నుండి అంతం వరకు ప్రభవించిన మానవులంతా ఈ ప్రపంచం దాటి మరో ప్రపంచంలోకి ప్రవేశిస్తారు. అక్కడి ప్రమా ణాలు వేరు. అక్కడి తులమానాలు వేరు. అక్కడ సత్యమే బరువు. సత్యానికే విలువ. సత్యానికి తప్ప అసత్యానికి శరణు గోరినవారు పరలోకంలో పరాజితులవుతారు. ఈ జీవితం కేవలం ఓ పరీక్షా వ్యవస్థ ఇక్కడ ప్రతి మనిషీ అనుక్షణం పరీక్షింపబడుతున్నాడు. పరీక్ష తరువాత ఫలితాల దశయే ప్రళయ ఛట్టం. పరీక్షలో నెగ్గాలంటే మానవులు, తమ స్వామి పంపిన మార్గదర్శకత్వాన్ని స్వీకరించాలి. దాన్నే అనుసరించాలి. అలా అనుసరింనవారు పరీక్షలో సఫలీకృతులవుతారు. అనంత సౌభాగ్యాలకునోచుకుంటారు. దైవప్రబోధాలను కాదన్న వారు నిష్ఫలురవుతారు. శాశ్వతంగా నష్టానికి లోనవుతారు. ముగియని నరకయాతనకూ గురవుతా రు. ఇదీ ఆ మూడు ప్రధాన విశ్వాసాల సారాంశం. దైవగ్రంథం- దైవధర్మం ఖుర్‌ ఆన్ బోధనలకు భూమిక ఇది. ఖుర్‌ ఆన్ మానవాళికి ఇచ్చే ప్రముఖ సందేశం కూడా ఇదే. దీని ఆధారంగా ఒక సంపూర్ణ జీవన వ్యవస్థను నిర్మిస్తుంది ఖుర్‌ ఆన్. అది మానవ జీవితాన్ని ఖండికలు ఖండికలుగా విభజించి వేర్వేరు మార్గాలను, వేర్వేరు విధానాలను ప్రతిపాదించదు. జీవితం ఒక సంపూర్ణమయిన సమగ్రమయిన ఏకాంకమన్న యధార్థాన్ని ఆధారంగా సముతమయిన సహేతుకమైన, సమంజసమైన ఒకే జీవన వ్యవస్థను ప్రతిపాదిస్తుంది. ప్రాపంక వ్యవహారాలు వేరు, పరమార్థిక వ్యవహారాలు వేరని సిద్ధాంతీకరించే వారితో ఏకీభవించదు. ప్రపంచం ద్వారానే పరమార్థాన్ని సాధించాలని సూచిస్తుంది. భౌతికతత్వానికి ఆధ్యాత్మికతత్వంతో తాదాత్మ్యం చేకూరే సమక్య జీవన తత్వాన్ని రూపొందిస్తుంది. ఇదే ఖుర్‌ ఆన్ ప్రబోధాల సారం. ఖుర్‌ ఆన్ రచించిన గ్రంథం కాదు. దాన్ని మానవాళికి అందజేసిన ప్రవక్త (స) రచింనదీ కాదు. తానే దాన్ని రచింనట్లు ఆయన కూడా ఎన్నడూ చెప్పలేదు. ఇది దైవగ్రంథం. అందువల్ల ఈ గ్రంథం ప్రతిపాదించే ధర్మం మానవకల్పిత ధర్మం కాదు. ఆ ధర్మం కూడా దైవం రూపొందించిన ధర్మమే. ఇది దైవగ్రంథమని, దీని ధర్మం దైవ ధర్మమని ఖుర్‌ ఆన్ స్వయంగానే ప్రకటించుకుంది. వచనాలు ఇది (ఖుర్‌ ఆన్) దైవగ్రంథం, ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. 

భయభక్తులు గలవారికి మార్గదర్శకం. (ఆల్ బకఱ్ :2) ఇది (ఖుర్‌ ఆన్) అసాంతం మానవులకు మార్గదర్శకం, అందులో విస్పష్టమైన బోధనలున్నాయి, అవి రుజుమార్గాన్ని చూపుతాయి.
 సత్యాసత్యాల వ్యత్యాసాన్ని విడమర్చి తెలుపుతాయి (ఆల్ బకఱ్ : 185) ఇది (ఖుర్‌ ఆనైఉ) జనులకు ఒక స్పష్టమైన, విశదమయిన హెచ్చరిక, దైవానికి భయపడేవారికి మార్గనిర్దేశన హితబోధన (అల్ ఇమ్రాణ్ : 138) మేమే ఈ (ఖుర్‌ అన్) గ్రంథాన్ని అవతరింపచేశాము. మేమే దీన్ని భద్రపరిచేవారము కూడా (ఆల్ హిరజ్ : 9) ప్రవక్త స్వయంగా ఈ గ్రంథం రచించాడని ఈ జనం అంటున్నారా? వారికి చెప్పు ‘‘సరే నిజమ యితే దీనిలాగే రచింన పది సూరాలు మీరు కూర్చి తీసుకురండి అల్లాహ్‌ తప్ప ఎవరెవరు (మీ ఆరాధ్యులుగా) ఉన్నారో (వారిని ఆరాధ్యులని భావించడంలో) మీరు సత్యవంతులే అయితే, వారిని సహాయానికి పిలుచుకోగలిగితే పిలుచుకోండి’’ (హూద్‌ : 13) మా దాసునికి మేము అవతరింపజేసిన ఈ గ్రంథం మేము పంపినదో కాదో అన్న సందేహం మీకు ఉన్నట్లయితే ఇలాంటి సూరా ఒక్కటి అయిన రచించి తీసుకురండి, సహాయం కొరకు మీ తోటివారందరినీ పిలిపించుకోవచ్చు. 

ఒక్క అల్లాహ్‌ తప్ప మరెవరి సహాయమయినా పొందవచ్చు. మీరు నిజాయితీపరులయితే ఇది చేసి చూపండి (బకఱ్ : 23) ప్రవక్త స్వయంగా దీనిని రచించుకున్నాడని వీరు అంటున్నారా? చెప్పు ‘‘ఈ ఆరోపణలో మీరు నిజాపయితీ పరులే అయితే ఒక్క సూరా ఇటు వంటిది రచించి తీసుకురండి, ఒక్క దైవాన్ని వదలి ఎవరెవరిని పిలుచుకోగలుగుతారో తోడుగా పిలుచుకోండి. (యూనుస్‌ : 38).
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
11-07-2015  సాయంత్రం సరిగ్గా 5 గంటలకు భారత జనాభా సంఖ్య 127, 42, 39, 769కి చేరింది. ప్రపంచ జనాభా
దినోత్సవం సందర్భంగా జాతీయ జనాభా కమీషన్, అమెరికా గణాంకాల సంస్థల సంయుక్త సమాచారం ఆధారంగా ‘జాతీయ జనాభా స్థిరీకరణ నిధి’ ఈ వివరాలను వెల్లడించింది. ఏటా భారత్లో 16 శాతం వృద్ధి నమోదవుతున్న కారణంగా 2015 సంవత్సరానికి చైనాను వెనక్కినెట్టి జనాభా పరంగా తొలి స్థానంలో నిలుస్తుందని తెలిపింది. కాగా, ఇప్పటికి ప్రపంచ జనాభాలో 17.25 శాతం జనాభా భారత్లోనే నివసిస్తున్నారు. కాగా, ప్రపంచ జనాభా సంఖ్యలో ఐదో స్థానంలో ఉన్న బ్రెజిల్ కంటే మన దేశంలోని ఉత్తరప్రదేశ్ జనాభా సంఖ్యే ఎక్కువ కావడం
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
కొత్త సత్యాలను ప్రతిపాదించడం కష్టంకాదు. పాత దురలవాట్లను తొలగించడమే దుర్లభం. మనుషులు స్వాభావికంగా కొత్తవాటికి స్వాగతం చెబుతారు. కానీ పాతవాటిని వదులుకోరు.''
విజ్ఞానం :
ఇది విజ్ఞాన విస్ఫోటనయుగం. సైన్స్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరం ఇది. ఒకప్పుడు గుఱ్ఱంమీద గంటకు 25 కి.మీ వేగంతో ప్రయాణించిన మానవుడు, ఇప్పుడు 30 వేల కి.మీ పైబడిన వేగంతో రోదసిలో ఉపగ్రహాలను తిప్పుతున్నాడు. వార్తను ఒక ప్రాంతం నుండివేరొక ప్రాంతానికి చేర్చడానికి కొన్ని నెలలు పట్టేరోజులు వెళ్ళిపోయి, భూమిమీద ఎక్కడో వేలమైళ్ళ దూరంలో జరిగే విషయాన్ని సెటలైట్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు చూసే రోజులు వచ్చాయి
ఘర్షణ :
వృద్ధులకు ఈ ప్రంచంలో విలువలన్నీ అడుగంటిపోతూ కనిపిస్తున్నాయి; మధ్యవయస్కులు కొత్తపాతల మధ్య ఊగిస లాడుతున్నారు.యువతరానికి తక్కిన వారు ఛాదస్తులు, అడవి మనుషులుగా కనిపిస్తున్నారు.
తలోదారి :
వృద్ధులు, మార్పులను ప్రతిఘటిస్తారు, యువకులు కొత్త మార్పుల కొరకు పరితపిస్తారు. వృద్ధులు ఉమ్మడి కుంటుంబ వ్యవస్థ శిధిలమైపోతోందని పరితపి స్తుంటే, యువకులు ఒంటరి తనం లభించడంలేదని బాధపడతారు. ఈ మార్పును జీర్ణించుకొని యువతరానికి దగ్గరవ్వాలో లేక సనాతన వ్యవస్థకు పట్టంగట్టి పై తరాన్ని గౌరవించాలో తెలియక నలిగిపోతారు మధ్య వయస్కులు.
సమన్వయం :
పల్లెలలో బ్రతికినవారు మహానగరాలలో ఉక్కిరిబిక్కిరవడం సహజం.వారి నర్ధం చేసుకొని మెలగడానికి యువతరం ప్రయత్నించాలి. తాము మారకపోయినా ఫరవాలేదు గాని యువతరానికి ప్రతిక్షణం అడ్డుపడుతూ, తాము బ్రతికినట్లే వారిని బ్రతకమనకుండా ఉండాలి పెద్దతరం.

మార్పులను అవసరాన్ని గుర్తించి,వాటి స్వభావాన్ని అర్ధం చేసుకొని, వాళ్ళ ఆలోచనలను, ప్రవర్తననూ ఆయా పరిస్థితులకు అనుగుణంగా సమన్వయం చేసుకోగలగాలి మధ్యతరం.
వ్యాపార సరళి :
కేవలం నమ్మినంత మాత్రాన ఇంతకు మునుపు చేయని పనులు కొత్తగా చేయడం కష్టమంటారు గానుగెద్దులాంటి మనుషులు. మారదలచుకున్నవాడు ముందు పాత అలవాట్లను వదులుకోవడానికి సిద్ధపడాలి. మనమంతా కొత్త జీవన సూత్రాలను వెతుకుతూ బయలుదేరుతామే గాని తెలిసినవాటిని ఆచరించడానికి ప్రయత్నించం. ఈ బలహీనతను ఆధారంగా చేసుకునే పాతసబ్బులు, పేస్టులకు కొత్తది (శ్రీలిగీ)అని వ్రాసి అమ్ముకుంటారు వ్యాపారవేత్తలు.

ఎలా నమ్మడం :
ఒకసారి ఒకవ్యక్తి కాలుజారి ఒక లోయలో పడిపోతూ చేతికి దొరికిన ఒక ఊడను పట్టుకున్నాడు. క్రిందికి చూస్తే అగాధం పైకి చూస్తే ఆకాశం. ఏం చేయాలో దిక్కుతోచకుండా ఉన్న అతడు ''ఎవరన్నా నన్ను రక్షించేవారున్నారా'' అన్నాడు. ఇంతలో ''నా పైన నీకు విశ్వాసం ఉంటే పట్టుకున్న ఆ ఊడను విడిచిపెట్టు'' అనే గంభీరమైన వాణి ఆ లోయలో ప్రతిధ్వనించింది. వెంటనే ఆ వ్యక్తి ''ఇంకెవరన్నా ఉన్నారా'' అన్నాడు.
సాగిపోండి :
అందుకే భూతకాలపు విలువలనే విశ్వసించాలా! లేక వర్తమానపు విలువపై ఆధారపడాలా? లేక కొత్త పాతలలో ఏది ఉత్తమం అనిగానీ ఆలోచించక ఎదుటి తరంస్థానంలో నిలిచి వారి స్థితిగతులను అర్ధం చేసుకొని ఏది అవసరమో, ఏది అనవసరమో గ్రహించి, అనవసరమైన దాన్ని విడిచిపెట్టి అవసరమైన దాన్ని స్వీకరిస్తూ అందరితో కలిసి బ్రతకవచ్చు.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
''తరువాత చేయబోయే కార్యమేమిటో తెలుసుకోవడమే వివేకం; దానిని సరిగా చేయడం నైపుణ్యం; దానికి పూర్తి చేయడం సద్గుణం''.

పని :
బరువైన ఒక బల్ల ఒక వ్యక్తి లేపగలడా? లేపలేడు అందుకు కనీసం నలుగురు కావాలి.మరి ఆ నలుగురు ఒకే పక్కన పట్టి లేపితే ఆ బల్ల లేస్తుందా?... లేవదు, నలుగురు నాలుగువైపులా పట్టాలి. నలుగురూ నాలుగువైపులా పట్టినప్పటికీ అంతా ఒకేసారి పట్టి లేపకపోతే అది లేస్తుందా? లేవదు. అంటే దీని వల్ల నలుగురు కలిసి ఒకేసారి నాలుగువైపులాపట్టి ఒకేసారి ఆ బల్లను అక్కడి నుండి లేపి అవసరమైన మరోచోటికి తీసుకువెళ్ళి పెట్టాలి అనే సంకల్పంతో పనిచేసినప్పుడే పని అవుతుందన్నమాట. నలుగురు కలిసి పనిచేయడాన్ని ''సహకారం' (Co-operation) అంటారు.
నలుగురు కలిసి పనిచేయాలనే ఆలోచన కలిగి ఉండటాన్ని ''భావ సహకారం'' (Thought Co-operation) అంటారు. నలుగురు కలిసి పనిచేయడానికి సిద్ధపడటాన్ని ''సామాజిక సహకారం'' (Social Co-operation) అంటారు.
నలుగురిని నాలుగువైపుల బల్ల లేపడానికి నియమించడాన్ని ''సమన్వయం'' అంటారు. నలుగురు నాలుగు వైపుల పట్టి లేపడాన్ని ''దేశ సమన్వయం'' (Spacial Co-ordination) అంటారు.నలుగురు నాలుగువైపుల పట్టి ఒకేసారి లేపడాన్ని ''కాలసమన్వయం' (Timely Co-ordination) అంటారు.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
అడ్లర్‌ వైయక్తిక మనోవిజ్ఞానం (Individual Psycology) అధికార వాంఛా ప్రధానమైనది. ఆయన మనుషులంతా హీనతా గ్రంధి (Inferiority Complex) కి లోనై ఉన్నారంటాడు. వ్యక్తి జీవితంలో ఎక్కడ, ఏవిధంగా, ఏస్థితిలో ఉన్నప్పటికీ నాకన్నా తక్కినవారు ఉన్నతంగా ఉన్నారని, ముందున్నారని, ఎక్కువగా కలిగి (ధనం, అందం, పేరు ప్రతిష్టలు మొ||) ఉన్నారనే మానసిక వ్యధ వారిని విడువకుండా ఉండటమే హీనతా లేదా న్యూనతా గ్రంధి అంటే.

ఉక్రోషం :
మనిషి తనలో ఉన్న లోపాన్ని సరిదిద్దుకోవడం, లేదా కప్పిపుచ్చుకోవడం కొరకు మహత్వ కాంక్షతో మునిగిపోతారని సిద్ధాంతీ కరించాడు అడ్లర్‌. చిన్నతనంలో ఏ పిల్లలయితే త్వరగా నడక నేర్చుకోరో వారే పరుగుపందాలలో గెలుపొందే గొప్ప ఆటగాళ్ళుగా వన్నెకెక్కుతారని, ఒంటి కన్నువారు మామూలుగా రెండు కండ్లు ఉన్నవారికన్నా తెలివిగలవారవుతారని అనేవాడాయన. అది రెండు కండ్లతో చేయగల పనిని ఒకే కన్నుతో సాధిద్దామని ప్రయత్నించడం వల్ల వచ్చిన కపటమని, అలాగే మేము ఇతరులలాగ నడవలేమన్నారు కదా చూడండి మేము అందరికన్నా వేగంగా పరిగెత్తగలం అని చెప్పిన ఉక్రోషమని అనేవాడాయన.


హీనత అనివార్యమా :
అయితే తమలోని లోపాల వల్ల హీనతాగ్రంథి, దీనివల్ల అధికారవాంఛ ప్రతివారికి అనివార్యమని, దీనివల్ల ప్రపంచంలోని అడుగడుగునా ప్రజల మధ్య పోటీ తప్పదని, స్పర్ధ తప్పదని దీనివల్లే ప్రజలలో కలహం సహజమని దీనిలో నుండి బైటపడటానికి అధికార వాంఛను కాస్త తగ్గించు కోవాలని ఆయన అంటారు. కానీ ఆ తగ్గించుకోవడం ఎక్కడివరకు? అనేది ప్రశ్న వాంఛఅనేది ఉన్నప్పుడు అది ఏస్థాయిలోనన్నా తృప్తిపడుతుందా? బౌద్ధికంగా ఈ విషయం అందరి అవగా హనకు వస్తే, అధికార వాంఛ అనే ఈ పరుగుపందెం ఆగిపోతుందన్నాడు అడ్లర్‌.
కానీ ఇంత విశ్లేషణ నిచ్చిన ఆయనే స్వయంగా ఈ పోటీనుండి తప్పుకోలేక పోయాడు. తాను గురువునవ్వాలి, మార్గదర్శకుణ్ణవ్వాలి అనే వాంఛతో తన గురువైన డా|| ఫ్రాయిడ్‌ నుండి తప్పుకొని, తన కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ పోటీలో నుండి బైటపడి అంతా కలిసి జీవించే విధానం ఒకటి ఉన్నదంటాడు ''లాఓత్సే'' అధికార వాంఛ  అనేది రోగం; అది
ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఉన్నట్లే గాని రోగరహితులుగా ఎవరూ లేరు. ఈ రోగం పోనంతవరకు అంతా స్పర్ధారహితంగా జీవించడం సాధ్యంకాదు. మరి ఇది ఎలా పోతుంది? మార్గమేమిటి?
''మహానదులు, సముద్రాలు కనుమలకు ఏవిధంగా స్వామిత్వం వహించగలిగాయి? తమను నీచస్థానంలో నిలుపుకోవడం వల్ల, క్రిందికి ఒరగడం వల్లే అవి కనుమలకు స్వామిత్వం వహించగలిగాయి. కనుక ప్రజలకు స్వామిగా మారదలచిన వాడు, వారిని అనుసరించేవాడిలాగా మాట్లాడాలి. వారి వెనుక నడవాలి. ఇలా ఉండటం వల్లే సాధువు అందరికన్నా ఉన్నత స్థానంలో ఉంటాడు; ప్రజలకు ఆయన బరువుకాడు. ఆయన అందరికన్నా ముందు నడుస్తాడు. ప్రజలు ఆయనకు హాని తలపెట్టరు''. అంటాడు లాఓత్సే ''తన తావో తెహకింగ్‌'' అనే గ్రంధంలో.
ముందా ! వెనుక? :
అహంకారం, ఘర్షణకు, ఘర్షణ పోటీకి దారితీస్తుంది. ఈ పోటీ కారణంగానే ప్రజలు కలిసి బ్రతకలేరు. అందరికన్నా ముందుకు వెళ్ళాలి అని ప్రయత్నించేవాడు ఏ నాటికైనా ఓడిపోతాడు. తాటిని తన్నే వాడుంటే వాడి తలదన్నే వాడుండటం కూడా సహజమే కదా! కనుక జీవితంలో ఈపిచ్చి పరుగు వ్యర్ధమని గ్రహించి వెనుక నిలబడేవాడు ఎప్పుడూ విజయుడిగానే ఉంటాడు.
ముందుకు వెళదామని ప్రయత్నించేవాడే నిమ్నుడుగా మిగిలిపోతాడు. పోటీలో పాల్గొనని వాడితో పోల్చడానికి ఎవరున్నారు? పోల్చబడనివాడు ఎప్పుడూ శ్రేష్ఠుడే; నువ్వు ఎలాగుంటే అలాగే శ్రేష్ఠుడివై పోతావు. నదులు నిమ్న స్థానానికి వెళ్ళడానికి, క్రిందికి ఒరగడానికి సిద్ధపడతాయి. కనుకే అవి గొప్పవైనాయి.
పిల్లలే నయం :
ఈ ఒరిగిపోగల కళలు పిల్లలు బాగా ఎరుగుదురు. వారి శరీరంలోని కండరాలు, ఎముకలు అన్నీ చాలా మెత్తగా ఉంటాయి. వృద్ధులు శరీరాలు పెళుసుబారిపోతాయి. నిజానికి అదే మృత్యువు యొక్క లక్షణం నది సముద్రం వైపుకు ఒరుగుతుంది. అందువల్లే అది నిరంతరం ప్రవహిస్తుంది. అలాగే వ్యక్తి ్బడా అహంకార రహితుడై వినయంగా ఒరగగలిగితే నదిలాగా ప్రవహిస్తూ (జీవిస్తూ) ఉండగలడు. ఇది కేవలం శారీరిక విషయమేకాదు మానసిక విషయం కూడా. మానసికంగా తమకు తాము నిమ్నస్థానంలో నిలుపుకోగలవారే పైస్థానం నుండి వచ్చే జ్ఞాన గంగను అందుకోగలరు. ఇలా మానసికంగా ఒరగడం రాని వృద్దులు (ఈ స్థాయిలో ఉన్నవారు ఏ వయసు వారైనా సరే వారు వృద్ధులే) నేర్చుకోవడానికి అసమర్ధులు. అహంకారులంతా చివరికి జీవితంలో విరిగి ముక్కలౌతారు.
ఓడటమే ఆనందం :
ఎవరైనా మిమ్మల్ని వంచడానికి వస్తే మీరు ముందే ఒరిగిపొండి. వంచేవారికి ఆ మాత్రం శ్రమ ్బడా లేకుండా చేయండి. చిన్న పిల్లవాడికి ఆడుకోవడానికి ఎవరూ లేకపోతే తండ్రితో కుస్తీ పడతాడు. తండ్రి వాడి ఆనందం కొరకు క్రింద పడిపోయి తాను ఓడినట్టుగా నటిస్తాడు. ఇలా అతడికి ఓడటంలోనే ఆనందం, గౌరవము ఉన్నాయి. లేదా పిల్లలతో పోటీ పడే సిగ్గు లేని వాడవుతాడు. గెలవదలుచున్న వారంతా మూర్ఖులే, అజ్ఞానులే, ఈ గెలుపు ఏ నాటికీ శాశ్వతం కాదని వారికి తెలియదు. కేవలం గెలుచుకున్న అహంకార సంతృప్తిలో బ్రతుకుతారు వీరు. ఆ పిల్లవాడు ఏ నాటికైనా పెద్దవాడవుతాడు (ఎదుగుతాడు) ఆనాడు ఓడింది తండ్రికాదు తానేనని తెలుసుకుంటాడు. వివేకవంతుడు ప్రకృతి ప్రవాహానికి ఎదురీదడు. ఆ ప్రవాహంలో తానూ ఒకడౌతాడు.

ముందూ - వెనుక :
మీరు అందరికన్నా ముందు నడుద్దామని ప్రయత్నిస్తే ప్రజలు మిమ్మల్ని వెనక్కు తోసేస్తారు. కానీ ఎవరైనా ఈ పిచ్చి పోటీలో పాల్గొనక ప్రశాంతంగా వెనుక నిలబడితే చాలు మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటారు. ముందు నడవమని బ్రతిమిలాడతారు. ఇక్కడ వారి అహంకారాలు దెబ్బతినవు గనుక వారు మీకుహాని తలపెట్టరు.రాజకీయాలలోనైతే సింహాసనంమీద ్బర్చునే వారిని తక్కిన వారంతా క్రిందికి లాగుదామని, హాని తలపెడదామని చూస్తారు. వారికి నువ్వు ప్రతిద్వంద్వివి కావు అనే విషయం తెలిసినప్పుడు వారు మీకు ఏ హానీ చేయరు.
కానీ ఒకవేళ అందరికన్నా ముందు ఉండటం కొరకే మీరు ప్రజల వెనుక నడుద్దామని చూస్తే మాత్రం అందరికన్నా శ్రేష్ఠుడిగా గుర్తింపబడాలనే అహంకా రంతో వెనుక నిలబడటం అనే సాధనను ఆశ్రయిస్తే మాత్రం వెనుకే ఉండిపో గలరు. తనలో తాను సంతుష్టుడై గుర్తింపు కోరక వెనుక నడిచిన వారికి మాత్రం శ్రేష్ఠత్వం పరిణామంగా సిద్ధిస్తుంది.
ఆదేశం-ఉపదేశం-సందేశం-స్వతేజం :
ఆదేశాలు, ఉపదేశాలు, సందేశాలు ఎవరికీ నచ్చవు. ప్రజలు మిమ్మల్ని శ్రేష్ఠులుగా ఒప్పుకుంటే కదా మీనుండి ఇవన్నీ స్వీకరించడానికి, ప్రతివ్యక్తి అహంకారం అనే బురద పూసుకొని తనే శ్రేష్ఠుడిని అనుకుంటాడు. కనుక కలిసి జీవించదలచినవాడు ఆదేశాలు, సందేశాలు, ఉపదేశాలు ఇవ్వడం మానాలి. మీలో తేజస్సు పెరిగిననాడు మీరు తమకన్నా శ్రేష్ఠులనే విషయం వారికి అర్ధం
కాగలదు. అప్పుడు వారే మిమ్మల్ని సందేశం ఇవ్వమని అడుగుతారు. కనుక పోటీ పడటం మాని తేజస్సును పెంచుకోవడం మొదలు పెట్టండి.
ప్రేమ - బరువు :
శ్రీ రామతీర్ధ స్వామి ఒకసారి ఒక అరణ్యంలోని పర్వతం ఎక్కుతున్నప్పుడు,ఆ కాలిబాటలోనే నాలుగేళ్ళ పిల్లవాణ్ణి వీపున ఎక్కించుకొని ముందుకు సాగిపోతున్న ఎనిమిది సంవత్సరాల పాప కనిపించింది. మామూలుగా ఒక వ్యక్తి ఆ కాలిబాటలో కొండనెక్కి వెళ్ళడమే కష్టమైతే, కేవలం ఎనిమిదేండ్ల వయసు గల ఆ పాప ఆ పిల్లవాణ్ణి ఎత్తుకొని కొండ ఎక్కడం ఆయనకు ఆశ్చర్యాని కలిగించింది. ''పాపా! ఆ పిల్లవాడు నీకు బరువు కావడం లేదా?'' అన్నాడు. ఆ పాప ''వీడు నా
తమ్ముడు, మరి నాకెలా బరువవుతాడు!''అన్నదట.   
తప్పని పరిస్థితిలో ఏదైనా వస్తువును నెత్తి నెత్తుకోవాల్సి వస్తే అది మనకు చాలా బరువవుతుంది. కానీ అదే మనం ఇష్టపడి ప్రేమతో ఆ బరువెత్తుకుంటే అది మనకు భారంకాదు. అలాగే మనంతట మనం ఎవరి నెత్తినన్నా ఎక్కి కూర్చుంటే వారికి బరువవుతాము. కానీ అదే వారు ప్రేమతో నెత్తి నెత్తుకుంటే (తమకన్నా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టుకుంటే) బరువయ్యే ప్రసక్తే లేదు. కనుక ప్రేమ పెంచుకోండి? ఎవరికీ బరువు కాకుండా అందరితో కలిసి బ్రతకవచ్చు.
నీడలు - ఘర్షణ :
"Then the people of the world are glad No one in the world can contend against him"

''ఆ తరువాత ప్రపంచ ప్రజలు ఆనందంగా ఉంటారు, ఆయనకు వ్యతిరేకంగా ఎవరూ సంఘర్షణ చేయలేరు''. - తావో తెహకింగ్‌
రిన్‌ ఘాయీ అనే జెన్‌ తత్వవేత్త నీడలనుగురించి ఒక పాట వ్రాశారు. ''మెట్ల మీది చెట్టు నీడ చిమ్ముతోంది. (ఊడుస్తోంది) అయినా దుమ్ము లేవడం లేదు; సరస్సు మీద కొంగలు ఎగురుతున్నాయి వాటికి తమ ప్రతిబింబం నీళ్ళలో కనిపించాలని లేదు; సరస్సుకు వాటికి ప్రతిబింబించాలని లేదు అయినప్పటికీ ప్రతిబింబాలు తయారవుతూ మళ్ళీ అంతమవుతూ ఉంటాయి''. ఇలా జీవించడం నేర్చుకోండి. ఆకాశంలో ఎగిరే పక్షికి పదచిహ్నాలు ముద్రించబడవు. అలాఎవరితోనూ ఘర్షించని నీడలలాగా వర్తించినప్పుడు, సూక్ష్మ మైన హింసా వృత్తులను కూడా విడిచి పెట్టినప్పుడు పోటీ ఉండదు అప్పుడు కలిసి జీవించడం సులభమౌతుంది.   
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
There are some things that are so serious that you have to laugh at them.

నవ్వుతూ తుళ్ళుతూ ఉండే వారంతా గుంపుగా ఒకచోటకనిపిస్తారు మీకు. అంటే! నవ్వు వ్యక్తులను దగ్గరికి తెస్తుందన్న మాట ఈప్రపంచంలో గంభీరమైనదంటూ ఏదీలేదు. చూడగల కండ్లు ఉన్నవాడికి ప్రతి దానిలోనూ హాస్యం కనిపిస్తుంది. కొందరికి మాటలను చిత్రంగా వాడటంలోనూ, వ్యక్తులను, సంఘటనలను వ్యంగ్యం, హాస్యం అనే కోణాలలో చూడటలోనూ సహజమైన ప్రజ్ఞ ఉంటుంది. అయితే మనమంతా ఆ దృక్కోణాల నుండి జీవితాన్ని చూడటం అభ్యసించవచ్చు.

శత్రువులు లేరు :
ఇలా నవ్వించేవారు అందరికి దగ్గరౌతారు. వారు అజాతశతృవులు (శతృవులు లేని వారు) అవుతారనడంలో సందేహం లేదు. అటువంటి వ్యక్తులను నేనెరుగుదును. ఎప్పుడూ గంభీరంగాను కోపమొచ్చినప్పుడు మండిపడుతు ఆఫీసులో స్టాఫ్‌నంతా గడగడ లాడించే యముడిలాంటి ఆఫీసర్లు, మేనేజర్లు, డైరెక్టర్లు సహితం తమ ఆఫీసులోనే క్లర్కుగా పనిచేసే ఆవ్యక్తిని క్లబ్‌కు తీసుకుని వెళ్ళడం, పిక్నిక్‌కు తీసుకెళ్ళడం, తమ ఇంట్లో తమ బంధువుల మధ్య జరిగే పార్టీలకు ఆహ్వానించడం జరిగేది. చిన్న పిల్లల దగ్గరి నుండి ముసలివారి వరకు అంతా ఎప్పుడూ ఆయన చుట్టూ గుంపుగా ఉండేవారు. ఇలా అందరినీ ఆకర్షించ గలగడానికి కారణమేమిటో ఆయన మాటలు కొన్ని మీకు చెబితే అర్ధమవుతుంది.
హాస్య విధానం :
మొదటి స్టెనో గ్రాఫర్‌ ఎవరో తెలుసా! ''గణపతి'' ''షార్ట్‌హాండ్‌కు ఆపేరు రావడానికి కారణం గణపతి చేతులు పొట్టిగా ఉండటమే''.
''లంకా విజయం తరువాత రాములవారు పుష్పక విమానాన్ని కిష్కింధలో దింపిన తరువాత, కిష్కింధలో ఆడవాళ్ళంతా సీతమ్మ వారిని చూడటానికి వచ్చారు. ఒకరాతి మీద ఆవిడ కూర్చొని ఉంటే ముందు ముఖాన్ని చూసి ఆవిడను చూసి బాధపడి వెళ్ళిపోతూ ఇంత అందంగా ఉంది వెనకాల ఒక తోక కూడా ఉంటే ఇంకెంత బాగుండేది అనుకున్నారట''.

 ''మొన్న పాకిస్థాన్‌ నుండి ఒక వ్యక్తి వచ్చి ఢిల్లీలో ఒక పండ్ల డాక్టరు దగ్గర పిప్పిపన్ను పీకించుకున్నాడట అప్పుడా డాక్టర్‌ ఏమయ్యా! మీకు అక్కడ పాకిస్థాన్‌లో పండ్ల డాక్టర్లు లేరా? అంటే అందుకా పేషెంట్‌ ''ఎందుకులేరు, ఉన్నారు- కానీ మాదేశంలో ఎవడూ నోరు తెరవకూడదు కదా! అన్నాడట''. ఇలా సాగుతాయి ఆయన వ్యాఖ్యానాలు.

సైడ్‌ ఎఫెక్ట్‌ :
అయితే ఈ ధోరణిలో సాగే వారికి కష్టాలు లేవనుకోబోకండి. అల్లోపతి మందులకు మల్లే దీనికి ్బడా సైడ్‌ఎఫెక్ట్‌ ఉంది. ఇలా నవ్వుతూ తుళ్ళుతూ ఉండే వ్యక్తి ఉన్నత స్థానానికి పనికిరాడని, గంభీరంగా ఉండేవారే కార్యదక్షులనే అపోహ ఒకటి ప్రజలలో ఉంది. కాబట్టి ఈ విధంగా మీరు ఉండదలిస్తే కొన్ని పదవులు, గొప్పవారనే గుర్తింపు పోగొట్టుకోవలసి రావచ్చు. మీరు నలుగురితో కలిసి జీవించడం ముఖ్యమా, లేక అహంకార పుష్టినిచ్చే పదవులు, గుర్తింపు ముఖ్యమా! మీరే ఎన్నుకోండి.
జాగ్రత్త :
మీ హాస్య, వ్యంగ్య సంభాషణల వల్ల మీరు మరొక సమస్యను కూడా ఎదుర్కోగలరు. మీ మాటలను ఎదుటివారు తప్పుగా అర్ధం చేసుకోవచ్చు. సున్నితమైన వారి భావాలు దెబ్బతినవచ్చు, మీరు వారిని విమర్శిస్తున్నారను కోవచ్చు. లేదా మరీ గంభీరంగా ఉండటం అలవాటయిన రాతిస్వరూపులకు మీ విధానంలో అసభ్యత కనిపించ వచ్చు. కనుక ముందు వ్యక్తుల స్వభావాలను అర్దం చేసుకుంటూ సభానుగుణంగా, వ్యక్తుల కనుగుణంగా మీ హాస్యసంభాషణను కొనసాగిస్తూ కలిసి జీవించండి.
నవ్వండి :
అలా చమత్కారంగా మాట్లాడగల పటిమ మీలో లేకపోయినా సరే కలిసి నవ్వడం మాత్రం నేర్చుకోండి. మీ ఇష్టాయిష్టాలను ప్రక్కకుబెట్టి మీశత్రువు నవ్వించినా నవ్వడానికి సిద్ధంగా ఉండండి. అప్పుడు కలిసి జీవించడం సులభమౌతుంది.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
నీవు నీవుగా ఉండిపో, మరో ముఖ్యమైన విషయం..... ఆప్యాయత నటించకు. – డెసిడెరాట్టా

ఏనుగు - ఎలక :
ఒకసారి ఒక ఏనుగు ఆకులు తింటూ ఉంటే దానికి దగ్గరలో అటూ ఇటూ తిరుగుతున్న ఎలక ఒకటి కనిపించింది. వెంటనే ఏనుగు ''ఏయ్‌! ఇక్కడ నుండి వెళ్ళిపో అర్భకపు ప్రాణి! నేను చూడక నీ మీద కాలు వేశానంటే నలిగిపోతావు'' అంది. ఎలక దిగులుగా ముఖంపెట్టి ''చిన్నప్పుడు నేను జబ్బు పడ్డాను లేదా నేను కూడా నీ అంత ఉండేదాన్ని'' అన్నది.
కపటం :
ఇలా ఉంటుంది ప్రజల రీతి. సత్యాన్ని ఒప్పుకొనే ధైర్యం లేదు. ప్రతివాడూ ఏదో ఒకటి అవుదామని చూసేవాడేగాని, తాను తానుగానే నిలిచిపోవడానికి గానీ. తననుతాను ఒప్పుకోవడానికిగానీ సిద్ధంగాలేడు. అంతా కపటంతో నటించే ఈ ప్రపంచంలో ఒకరిని ఒకరు మోసగించుకుందామని చూస్తూన్నారేగాని కలిసి ఉండలేక పోతున్నారు.

జీవితం అంటే ఒకర్ని మరొకరు నమ్మించి మోసగించడం, అందరూ అందర్నీ మోసగించడం అంటాడు షేక్ప్స్‌యర్‌.

విశ్వాసం :
వ్యక్తులు బజార్లో కనిపిస్తే చాలు కౌగిలించుకొని ఏడుస్తారు. కానీ మామూ లుగా చచ్చారో బ్రతికారో కూడా కనుక్కోరు. నలుగురు చూస్తున్నప్పుడు ఎక్కడలేని ఆపేక్ష చూపిస్తారు. చాటుగా వారి గొంతు నులమడానికైనా వెనుకాడరు. ఈ వర్తనంఆధ్యాత్మికత, భక్తి పేరుతో ఆశ్రమాల్లో చేరిన వారిలో కూడా కనిపిస్తూ ఉంటుంది. "We cannot teach old dog new tricks"  ఎరిగి ఈ కపట వర్తనంలో ఉన్న ముసలి జంతువులకు మనం కొత్తనీతులు నేర్పలేము. వారిని చూసి మనం ఈవిషయాలు నేర్చుకోకుండా ఉంటేచాలు. లేదా ప్రపంచంలో చాలామంది ఈ కపట వర్తనం లోనే గనుక ముణిగి ఉంటే అసలు ప్రేమ ఆప్యాయతలపైన ఎవరికీ విశ్వాసమే లేకుండా పోయి కలిసి జీవించడం అసంభవమౌతుంది.

మీరూ - లోపాలు :
అందుకే ..... "With all its shame" drudgery and broken dreams it is still a beautiful world be cheerful" లజ్జారహితమైన, హీనవృత్తులు కలిగిన, తీరని కోరికలతో నిండి ఉన్నదైనప్పటికీ ఇది ఒక రకంగా చాలా అందమైన ప్రపంచం. కనుక ఆనందంగా ఉండండి. అంటుంది డెసిడెరాటా.
ఈ సృష్టి నుండి తనను వేరుగా చూచిన వారికే ప్రపంచంలో లోపాలు కనిపిస్తాయి.ఏవ్యక్తీ తనలో తాను లోపాలు వెతకలేడు. తన కండ్లకు తానెప్పుడూ అందంగానే మంచివాడిగానే కనిపిస్తాడు. మరి ఈసృష్టి నుండి తాను వేరు కానప్పుడు దీనిలో ఎవరైనా లోపాలు చూడగలరా?

దుఃఖం :
అసలీ ప్రపంచంలో మోసం, దుఃఖం మొదలైనవి లేవు కేవలం అవి చూచే వారిలోనే ఉన్నాయి. మొత్తం సృష్టిలో అన్ని ప్రాణులు ఆనందంగా ఉన్నాయి. ఒక్క మనుష్యుడు తప్ప ఉన్నదున్నట్టుగా ఈ ప్రపంచం జీవరాసులన్నిటికీ ఒక వరం. తక్కిన ప్రాణులకు ఇక్కడ ఇలా ఉండటమే ఆనందం. శ్వాసించడమే ఆనందం. కానీ ఈ ప్రపంచాన్ని చూచే మానవుడిలో దుఃఖం ఉంది. సంస్కృతంలో దుఃఖాన్ని 'వేదన' అంటారు. వేదం అంటే జ్ఞానం. 'న' అంటే అది లేకపోవడం.
అంటే జ్ఞానం లేకపోవడమే దుఃఖం. సృష్టిలో ఇతర ప్రాణులకు ఎదుటి ప్రాణుల యొక్క జ్ఞానంలేదు; కేవలం తమకు తాముగా బ్రతుకుతాయవి. ఈ ప్రపంచంలో ప్రతివాడూ తన బ్రతుకు తాను బ్రతికితే దుఃఖమే లేదు; ఈ జ్ఞానం లేకపోవడమే దుఃఖానికి దారితీస్తుంది.
ఎలా మారిలి?
మన చుట్టూ ఉండే ప్రపంచం యొక్క జ్ఞానం మనకు మనోవృత్తి (ఆలోచన)రూపంలో ఉంటుంది. ఈ ఆలోచన కారణంగా తన చుట్టూ ఉన్న వ్యక్తులను, వస్తువులను అలాగే స్వీకరించలేడు. తనకు నచ్చిన విధంగా వాటిలో మార్పును కోరుకుంటాడు. ఇలా కోరుకోబడే ప్రతి వ్యక్తి కోరిక ఇతరుల కోరికకు వ్యతిరేకంగా ఉంటే ఏ కోరిక ననుసరించి ఈ ప్రపంచం మారాలి?
ఆలోచన :
అంతేకాదు ప్రతి ఆలోచన ఆలోచించబడే వ్యక్తికి, ఆలోచించేవారికి మధ్య అగాధాన్ని (దూరాన్ని) సృష్టిస్తుంది. దూరం లేకుండా ఆలోచించడం సాధ్యం కాదు. ఈ దూరం ఎంత తగ్గితే అంతగా ఆలోచనలు తగ్గుతాయి.
దూరం :
ఒక మెజిష్ట్రేట్‌ ముందుకు ముద్దాయిగా ఆయన కొడుకును తీసుకువస్తే న్యాయనిర్ణయం చేయడం చాలా కష్టమౌతుంది; వారి మధ్య దూరం తక్కువ, అందువల్ల ఆలోచనలు ఆగిపోతాయి. ఎంత పేరు మోసిన సర్జనయినా తన భార్యకు గానీ, కొడుకుకుగానీఆపరేషన్‌ చేయలేడు. అందుకు ఇంకొక డాక్టర్‌ అవసరమౌతాడు; వారి మధ్య్బడా దూరం తక్కువే.
ఇంకెవరన్నా దుఃఖంలోనూ కష్టాలలోనూ ఉంటే మనం సలహా చెప్పగలం కానీ స్వయంగా మనమే కష్టాలలో ఉంటే మనకేమీ తోచదు అక్కడ దూరం అసలే లేదు. అక్కడ మనస్సు పూర్తిగా శూన్యమై పోతుంది.
విడదీస్తుంది :
కనుక ఆలోచన మనను ముక్కలుగా చేసి, ప్రపంచం నుండి విడదీసి, ప్రపంచం జ్ఞానం కలిగేలా చేసి, అందులో లోపాలను చూసేలా చేస్తుంది. ఆలోచన, ఆనందాన్ని ఎరుగదు. కేవలం దుఃఖాన్నే ఎరుగును. ఈఆలోచనే ''వేదన' (దుఃఖం). స్వరూపజ్ఞానాన్ని తీసివేసి ప్రపంచ జ్ఞానాన్ని కలిగించి మోసం చేస్తుంది ఈ ఆలోచన.
కాబట్టి ఇది మీ ప్రపంచం అని గ్రహించి-ఆలోచించకుండా, తర్కించ కుండా- ఉన్నదున్నట్టుగా దీన్ని స్వీకరించడం నేర్చుకోండి. అప్పుడు కలిసి జీవించడం సాధ్యమౌతుంది.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
ఈ ప్రంపంచం అంతా తల్లక్రిందులుగా ఉన్నది అనే సంగతి ధ్యానం చేసిన వారికి తెలుస్తుంది. ఒకసారి అది గ్రహించిన వారు తమ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించినట్లు ప్రజలకు కనిపిస్తుంది. 

జీవితం - మృత్యువు :
జీవితాన్ని గురించి తెలుసుకోవాల్సిన పనిలేదు మృత్యువును గురించి తెలుసుకుంటే జీవితం అవగతమౌతుంది. మృత్యువు అంటే మార్పు; ప్రతిక్షణం అది ప్రపంచంలోనూ మన శరీరంలోనూ, మనస్సులోనూ, బుద్ధిలోనూ,  కలుగుతూనే ఉన్నది. దీన్ని జీవతానికి వ్యతిరేకంగా భావించక, స్వీకరించగలుగుతూ ఉంటే ప్రతిక్షణం ప్రతి మార్పు భూతకాలంలోకి జారిపోతూ కనిపిస్తుంది. అప్పుడు ప్రతిక్షణం మనకు మనమే నిత్య నూతనులముగా కనిపిస్తాము. ఈ ప్రతిక్షణం నిత్య నూతనత్వంలోనే జీవనం ఉట్టి పడుతుంది.
భయం లేదు :
జీవితంలో అంతా భద్రత కోరుకుంటారు. ఇదొక పిచ్చి ప్రపంచం. భద్రత కలిగిన జీవితంలో సారంలేదు. అందులోకి విసుగు ప్రవేశిస్తుంది. స్థిరమైన ఉద్యోగం, సొంత ఇల్లు, బ్యాంక్‌ బాలెన్స్‌ యాంత్రిక జీవనానికి, భావదాస్యానికి, మనోరుగ్మతలకు దారితీస్తాయి అభద్రతలో నిలిచినవాడు ప్రతిక్షణం జాగరూకుడై ఉండాలి. ఆకులాగా ఏ క్షణమునైనా గాలికి ఎగరగలిగిన వాణ్ణి కదిలించడానికి ప్రతివాడు భయపడతాడు.


స్పష్టంగా చెప్పండి :
ఈ తల్లక్రిందులు ప్రపంచంలో మరో విచిత్రం కనిపిస్తుంది. అదే... తన లోపాలను, తప్పులను దాచిపెట్టడం; కపటంతో తనకులేని గొప్పతనాన్ని ప్రకటించ ప్రయత్నించడం. దీనికి వ్యతిరేకంగా ప్రవర్తించి చూడండి. కేవలం అబద్ధాలే ప్రచారమయ్యే ఈ ప్రపంచంలో స్పష్టంగా తన నోటితోనే తన బలహీనతలు, లోపాలు, తప్పులు ఎవడన్నా చెప్పుకుంటాడంటే ఎవరూ నమ్మరు. నువ్వు
చెబుతున్నది జోక్‌ అయినా అయి ఉంటుంది. లేదా ఏదో ప్రయోజనాన్ని ఆశించి చెబుతున్న అసత్యమైనా అయిఉంటుంది అనుకుంటారు అంతా.
మోసం :
ప్రతివారూ ఈ జగత్తులో తాను మోసంగింప బడ్బడదని, వీలైతే ఇతరులను మోసగించాలని ప్రయత్నిస్తారు. మీరు ఇందుకు వ్యతిరేకంగా ప్రవర్తించడండి. ఫలానా వాడికి డబ్బులిస్తే తిరిగి రావని, వాడిచ్చే సరుకు కల్తీదని తెలిసి కూడా వాళ్ళకు ఈ మాటలు చెబుతూ డబ్బు ఇవ్వండి. సరుకు కొనండి.
మీకు అవకాశం వచ్చినా సరే ఇతరులను మోసం చేయబోకండి. విచిత్రమైన మీ పద్ధతికి ముందీ జగత్తు ఆశ్చర్యపోతుంది. క్రమంగా మీరే సరిగ్గా ఉన్నారని తామే తల్లక్రిందులని గ్రహిస్తుంది. (ఒకవేళ గ్రహించకపోయినా మీకు వచ్చే ఇబ్బందేమీ లేదు)
మధ్యలో :
" Man is not the end only the means"
మనిషి గమ్యం కాడు మార్గం మాత్రమే. అందుకే తన మీద తనకు తృప్తి లేదు. గమ్యం చేరిన వాడికి తృప్తి ఉంటుంది. లేదా ఇంకా ప్రయాణం ప్రారంభించని వాడికి శాంతి ఉంటుంది. తానే మార్గమైతే, అలసట, అశాంతి, విసుగు తప్ప మరేముంటాయి. అందుకే తనే తనకు అతీతంగా ఎదుగుదామని చూస్తాడు మనిషి అయితే తాను పైకన్నా ఎదగ గలుగుతాడు. లేదా క్రింద పడిపోతాడు.
క్రిందపడి జంతువులా బ్రతకగల్గిన వాడూ ఆనందంగా ఉండగలడు. పైకి ఎదగగలిగిన వాడు ్బడా ఆనందంగా ఉండగలడు.కానీ మధ్యలో నిలిచిన వాడికి మాత్రం దుఃఖం తప్పదు. ఈ తల్లక్రిందుల ప్రపంచంలో మనుషులంతా తల్లకిందులుగా చేతుల మీద నడుస్తుంటే, ఈ మార్గం నుండి ప్రక్కకు జరిగి తన కాళ్ళమీద నిలుచున్నవాడు అందరికీ దూరమైనట్లు కనిపించినా అందరితో కలిసి, అందరికీ మార్గదర్శనం చేయగలడు.   
నికి వాళ్ళు సరిగ్గానే వ్రవర్తిస్తారు కానీ తమకు వ్యతిరేకంగా ఉన్నవారి వ్యవహారం తల్లక్రిందులుగా కనిపిస్తుంది.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
''అందరితో కలిసి జీవించాలంటే అన్నిటికీ అవుననాలా? తప్పదా? అనేది ప్రశ్న. కాదు... అలా అవసరం లేదు. ''డెసిడెరాటా'' ఏమంటోందో వినండి....
"As far as possible without surrender, be on good terms with all persons. Speak your truth quietly and clearly; and listen to others, even to the dull and the ignorant; they too have their story Avoid loud and aggressive persons; they are vexations to the spirit"

సాధ్యమైనంత వరకు ఎవరికీ లొంగకుండా, అందరితో మంచి సంబంధాలు కలిగి ఉండండి. మీరెరిగిన సత్యాన్ని ప్రశాంతంగా, స్పష్టంగా చెప్పండి.  అజ్ఞానుల, మూర్ఖుల మాటలు కూడా వినండి. వారు చెప్పుకునే కథలు కూడా ఉంటాయి. పెద్ద గొంతుతో ఉద్రేకంగా వాదించేవారిని దూరంగా ఉంచండి. వారు మీ మనస్సును చెదరగొట్టగలరు.


సూటిగా సాగిపో :
వ్యక్తిత్వాలను పణంగా పెట్టి తానుసాగే పథాన్ని విడిచిపెట్టి, తాను నమ్మిన విధి విధానాన్ని బలిపెట్టి ఎదుటి వారి మాట వినకపోతే వారేం చేస్తారో అనే భయం చేతనో లేక, నేను వారి నుండి పొందుతున్న సౌకర్యాన్ని సేవను కోల్పోతానేమో అనే లోభం చేత వారికి లొంగిపోయే జీవన విధానం సరి అయినది కాదు. ప్రస్తుతం జీవితంలో ఈ విధానం వల్ల జీవితం  సుఖవంతమైనప్పటికీ అది సుదీర్ఘ కాలంలో బానిస బ్రతుకుగా మారి మానసికమైన అస్థిరత్వాన్ని
కలిగిస్తుంది. ''ధైర్యంగా ఉన్నవాడు ధనవంతుడు, ధైర్యంలేనివాడు బీదవాడు' అంటుంది
అమ్మ. ధనవంతులుగా బ్రతకండి.


నేర్చుకోండి :
చాలామంది నాకు నేర్పడానికే నా దగ్గరికి వస్తుంటారుగాని నేర్చుకోవడానికి కాదు. (పైకి మాత్రం నేర్చుకోవడానికే వస్తున్నట్లు చెబుతారనుకోండి). ఎంతో దూరంనుండి శ్రమకోర్చి, డబ్బు ఖర్చుపెట్టుకొని వచ్చి మనకు నేర్పేవారు ఎంత కరుణామయులు. వారు కూడా ఒక జీవితం గడిపారు. వారికీ అనుభవాలున్నాయి; వార అనుభవసారాన్ని చిన్న మాటల్లో మనకు అందించడానికి వచ్చారు. గాలి వెలుతురు కావాలి అని కోరుకునేవారు ఇంటికి తలుపులు కిటికీలు తెరిచి ఉంచాలి;  అలాగే నలుగురిలో కలిసి జీవించదలచిన వాడు ఇతరుల నుండి నేర్చుకోదలచిన వాడు, ఇతరులు చెప్పేది ఓపికగా వినడానికి సిద్ధంగా ఉండాలి.

తప్పుకోండి :
ఒక్కొక్కసారి ఆ చెప్పేవారి మాటలో వారి దంభాహంకార ప్రదర్శన, స్వసామర్ధ్య ప్రదర్శన మాత్రమే ఉండి పనికి వచ్చేది. ఏమీ లేకపోయినా లేక తలాతోక లేని వాగుడు ఉన్నా ్బడా, వారితో కలిసి జీవించదలచినవారు ఓపికగా వారి మాటను వినాలి. వారి గొంతు యొక్క స్థాయి, ఉద్రేకము పెరుగుతున్నాయి అనుకున్నప్పుడు మాత్రం మెల్లిగా అక్కడ నుండి లేచి వెళ్ళి పోవడం మంచిది. లేదా అలా వెళ్ళిపోవడం అనే కార్యం వారిని అవమానించి నట్లవుతుంది
అనుకున్నప్పుడు, మనస్సును అక్కడినుండి తప్పించి మరోవైపుకు మళ్ళించే కళ నేర్చుకోండి.

''ఎటువంటి ప్రజ్ఞ లేనివాడి ముఖ్య లక్షణం ఏమిటో తెలుసా?.... ప్రతి విషయాన్ని ఖండించడం'' అంటాడు ''బారోష్‌షోకాల్ట్‌''. వ్యక్తులు మాట్లాడేప్పుడు వారిని జాగ్రత్తగా పరీక్షించండి. వారు ఏస్థాయికి చెందినవారో వారినుండి మీరు ఏమి నేర్చుకోవచ్చో మీకు ఇట్టే తెలిసిపోతుంది.

జాగ్రత్త :
ఇన్నిటి మధ్య "Better to keep your mouth shut and appear stupid than to open it and remove all doubt"  నోరుమూసుకొని ్బర్చోవడం వల్ల మీరు మూర్ఖులుగా కనిపించినా సరేగాని,నోరు తెరిచి వారి సందేహాలన్నీ తీర్చకండి. కానీ పరిస్థితి మిమ్మల్ని బానిసత్వం వైపు నెట్టుకు వెళుతున్నప్పుడు లేదా ఎదుటి వారి వాగుడు, మూర్ఖత్వం తారస్థాయికి చేరుకుంటు న్నప్పుడు మాత్రం, ఉద్రేకపడకుండా వారిని పక్కకు తీసుకువెళ్ళి ప్రశాంతంగా స్పష్టంగా మీరెరిగిన సత్యాన్ని చెప్పండి. దానివల్ల అక్కడి సమస్య తీరిపోవడమే గాక, భవిష్యత్తులో కొనసాగవలసిన సత్సంబంధాలు దెబ్బతినవు.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
None but a fool thinks he is always right     - A poet

ఈ మధ్య ఒక పత్రికలో కొన్ని మంచి మాటలు చదివాను. మీరు కూడా చదవండి మరి...
ఒక తియ్యటి మాట ''దయచేసి'' (PLEASE)
రెండు తియ్యటి మాటలు ''మీకు ధన్యవాదాలు'' (THANK YOU)
మూడు తియ్యటి మాటలు ''నువ్వంటే నాకు ఇష్టం'' (I LIKE YOU)
నాలుగు తియ్యటి మాటలు ''బహుశ నీదే ఒప్పు కావచ్చు' (PERHAPS YOU ARE RIGHT)
అయిదు తియ్యటిమాటలు ''నిన్ను చూచి నేను గర్వపడుతున్నాను'' ( I AM PROUD OF YOU)
ఆరు తియ్యటి మాటలు ''నేను తప్పు చేశానని అంగీకరిస్తున్నాను'' (I ADMIT I MADE A MISTAKE)


శుభోదయం :
More common a person, the more familiar the person, the less noticeable he becomes.

ఒకే ఆఫీసులో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న వ్యక్తికి తనచుట్టూ ఉండే వ్యక్తులు కనిపించడం మానేస్తారు. అతి పరిచయం వల్లవ్యక్తిగానీ వస్తువుగానీ మాయమైపోవడం సహజమే. కనుక ఒకచోట పనిచేసే మనుషులంతా యంత్రాలుగా మారిపోతారు. తెల్లవారి పనికి వెళ్ళగానే పరస్పరం, ప్రేమగా, తియ్యగా పలకరించుకోవాలనే వారికి గుర్తుండదు. కానీ మీరు ఆఫీసు కెళ్ళగానే వరుసగా కనిపించిన వారందరితో ''శుభోదయం'' (Good Morning) అంటూ ముందుకు సాగిపోయారనుకోండి. మీరంటూ ఒక వ్యక్తి ఉన్నారని, ఇంకా బ్రతికే ఉన్నారని, ఉత్సాహంగా ఉన్నారని అంతా గుర్తిస్తారు. అంతేకాదు పొద్దున్నే తియ్యగా పలకరింపబడటాన్ని ఎవరు
మాత్రం ఇష్టపడరు?
అలాగే ఇంటికి వెళ్ళేప్పుడు కూడా తియ్యగా వీడ్కోలు చెప్పండి. మీరు యంత్రాలు కాదు మనుషులమని గుర్తించండి. యంత్రాలు వేటికవి పనిచేయగలవు గానీ మనుషులు మాత్రం ప్రేమతో కలిసి పనిచేయాలి. అందుకు తియ్యగా మాట్లాడాలి ఇలా మాట్లాడే వారే కోకిలలు.

కొత్త పదాలు :
ఒకవేళ మీరు ఉదయం ఆఫీసుకు రాగానే అందరినీ పలుకరించే అలవాటులో ఉన్నా ఆ పదం కూడా యాంత్రికంగా మారిపోయి ఉంటుంది. ఆ పదం వాడటం వల్ల ప్రజల నుండి ఎటువంటి స్పందన రాదు. కనుక ఆ స్థానంలో కొత్త పదాలు వాడటం మొదలుపెట్టండి. (ఆమ్లెట్‌ మార్నింగ్‌ అని లేదా వారు శాఖాహారులైతే చద్దన్నం మార్నింగ్‌ అని అనవచ్చు).

దయచేసి - ధన్యవాదాలు :
ఏదైనా పనిచేసి పెట్టమని కోరేప్పుడు స్త్రీ పురుష, వయో, సాంఘిక స్థాయీ భేదాలు లేకుండా ''దయచేసి ఈ పని చేసి పెట్టండి'' అని కోరండి. చేయబడిన పని ఎంత చిన్నదయినా సరే ధన్యవాదాలు తెలియజేయండి. ఈ విషయం మీ ఇంట్లో భార్యాపిల్లకు, ఆఫీసులో మీతో పనిచేసే వారికి కూడా వర్తిస్తుంది.

నా కిష్టం :
మీరు ఒక వ్యక్తిని ఇష్టపడినంత మాత్రాన సరిపోదు ఆ విషయం తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది. హృదయంతో హృదయం మాటల ద్వారానే ముడిపడుతుంది. తప్పు ఒప్పుకునే ధైర్యం - ఒప్పును స్వీకరించగల హృదయ వైశాల్యం;
 " It is said best men are moulded by their faults"
''ఉన్నత మానవులంతా వారి పొరపాట్ల వల్లే మలచబడ్డారు' మానవుడన్న ప్రతివాడూ పొరపాటు చేస్తాడు. కానీ గొప్పవాళ్ళకు తమ తప్పును ఒప్పుకునే ధైర్యం ఉంటుంది. ఎంత మంది ముందైనా సరే ''నేను తప్పు చేశానని అంగీకరిస్తున్నాను'' అనగలడతను.కేవలం అహంకారం చేత, ధైర్యంలేక తప్పు ఒప్పుకోక పోవడం వల్లనే మానవ సంబంధాలు చాలా వరకు దెబ్బతింటాయి.
తమవల్ల తప్పు జరగగానే మాటల ద్వారా దాన్ని కప్పిపుచ్చుదామని ప్రయత్నించడమో లేక సాక్ష్యాలు సృష్టించి దానిని ఒప్పుగా నిరూపించడమో,  లేదా ఆ పొరపాటు జరిగిన స్థలంలోనూ సమయంలోనూ తాను లేనని ఋజువు చేయడమో చేస్తారు కొందరు. "The alibi is just an attempt to prove that you weren't wrong" తాను తప్పు కానని నిరూపించడానికి చేసే ప్రయత్నమే 'ఎలిబీ' కాబట్టి తప్పించుకోవడానికి మనం వినియోగించే శక్తి యుక్తులను ''అసలు ఆ తప్పు ఎలా జరిగింది? దానికి దోహదపడిన పరిస్థితులు ఏమిటి?'' అనే విషయాలను విచారించడంలో వినియోగిస్తే, మరొకసారి ఆ తప్పు జరగకుండా ఆపవచ్చు.
సలహాలు, విమర్శలు స్వీకరిస్తున్నారా?
కాకులు కూడా ఉన్నాయి ఈ సమాజంలో. అవి ''కావు-కావు''- ''నీవు చేసేవి సరిఅయినవి కావు'' అంటూ విమర్శించడం వాటికి అలవాటు. వాటి అరుపులు కర్ణకఠోరంగా ఉంటాయి. అయినా వాటితో కూడా సమాజానికి పనిఉంది. సమాజాన్ని శుభ్రంగా ఉంచడానికి (పాకీ పనికి) కాకులు చాలా అవసరం. విమర్శించేవారే లేకపోతే ప్రతివారు తాము లోపరహితులమనే అనుకుంటారు. వారిలోపాలు (చెత్త) వారికి కనిపించవు. మీరు కోకిలలైనా సరే కాకులతో కలిసి జీవించక తప్పదు. లేదా దీనికి వ్యతిరేకంగా మీరు కాకులై ఎదుటివారు కోకిలలైనా కలిసి జీవించాల్సిందే.
సలహాలను, విమర్శలను మీరు ఓపిగ్గా వినగలిగితే మీరు మంచివారు; ఆ విమర్శను గురించి ప్రశ్నిస్తూ ఎదుటివారు దాన్ని ఇంకా వివరంగా చెప్పే అవకాశాన్ని మీరు కల్పిస్తే మీరు ఉత్తములు; మీకు లభించిన వారి సలహా లేదా విమర్శకు మీరు ధన్యవాదాలు తెలియజేస్తే మీకన్నా ఉత్తమోత్తములు ఈలోకంలోనే లేరు అనవచ్చు.
" Advice is an uncertain gift"
సలహా అనేది అందేది లేనిది తెలియని బహుమతి. కనుక వాటిని స్వీకరించడానికి ప్రయత్నించండి. ఒకవేళ అది ఉపయోగకరమైనదయితే, కేవలం నేను వెళ్ళే మార్గాన్నే అనుసరిస్తాను అనే మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి దీన్ని ఆచరించ ప్రయత్నిండండి. లేదా ఇతరులు మీకు చేసే సహాయాన్ని కాలదన్నుకున్నట్టే అవుతుంది. ఎవరికి తెలుసు! వారు చెప్పేదే ఒప్పు కావచ్చుకదా!


ఆత్మ విశ్వాసం :
చాలామంది ఆత్మ విశ్వాసం పేరుతో తాము చేసే తప్పులను ఒప్పుకోరు. ప్రతిక్షణం తాను తప్పు చేస్తున్నానేమో అని మధనపడే న్యూనతా భావం కన్నా ఆత్మవిశ్వాసం వెయ్యిరెట్లు గొప్పది అనడంలో సందేహం ఏమాత్రం లేదు; కానీ ఆత్మ విశ్వాసం పేరుతో విమర్శలను, సలహాలను స్వీకరించకపోవడం, కూడా లోపమే. సలహా స్వీకరించి ధన్యవాదాలు చెప్పండి. విమర్శల నుండి ఏం చేయాలో,  ఏం చేయగూడదో నేర్చుకోండి.


ఎవరిది బాధ్యత :
ఒక పనిని మనం కలిసి చేస్తున్నప్పుడు, ఎవరి ఆధీనంలోనన్నాపని చెడిపోతే     ఆవ్యక్తిని ''నువ్వు ఎక్కడ తప్పు చేస్తే ఇలాగయ్యింది!'' అని ప్రశ్నించకండి. ''మనం ఎక్కడ పొరపాటు పడటం వల్ల ఈ తప్పు జరిగింది? అని అడగండి. అందరూ కలిసి సాధించవలసిన పనిలో తప్పు జరిగితే, బాధ్యత అంతా కలిసి తీసుకోండి.  అప్పుడు వ్యక్తులు ధైర్యంగా ముందుకు సాగగలుగుతారు. అభిప్రాయాలు - ప్రశ్నల రూపంలో :
ఎవరైనా ఒక పనిని గురించి వివరించినప్పుడు సూటిగా....
''ఓ! దానికి చాలా సమయం పడుతుంది''
''కొన్ని వేల రూపాయలు ఖర్చవుతుంది''
''నీ ప్లానేమీ బాగాలేదు''.....
అనబోకండి
''ఈపని పూర్తికావడానికి ఎంత సమయం పడుతుందను కుంటున్నావు?''
 ''ఎంత ఖర్చవుతుందనుకుంటున్నావు?''   
''నీ ఆలోచన నీకు లోపరహితంగా కనిపిస్తోందా? మళ్ళీ ఒకసారి ఆలోచించు'' అనకండి. ఈ విధంగా అభిప్రాయాలు ప్రశ్నల రూపంలో అయితే బాగుంటాయి; ఎవరినీ బాధించవు.
నాకు కూడా ఎదురైంది :
ఎప్పుడూ ఇతరుల లోపాలు సూటిగా ఎత్తి చూపకండి. ఎవరైనాతాము ఎదుర్కొంటున్న సమస్య గురించి మీకు చెబితే ''నాకు ్బడా ఇటువంటి సమస్యే ఎదురైంది'' అంటూ ప్రారంభించండి. ''అప్పుడు నేను ఆ లోపాన్ని ఇలా గ్రహించాను; ఇలా దాన్ని సరిదిద్దుతున్నాను; ఇలా ఆ సమస్యను అధిగమించాను' అని చెప్పి ముగించండి. ఎవరూ ఉపదేశాలు వినడానికి సిద్ధంగా ఉండరు కానీ అవే ఇతరుల అనుభవాలుగా వినడానికి ప్రతివారూ సిద్ధపడతారు.

కుహూఁ - కుహూఁ - కావ్‌ - కావ్‌ :
ప్రారంభంలో చెప్పిన ఆరు తియ్యటి మాటలు నేర్చుకొని కోకిలలుగా మారండి. అయినా సరే కాకులతో కలిసి ఉండటానికి సిద్ధపడండి. వారి విమర్శలు, సలహాలు ఓపికగా వినండి. సలహాలకు ధన్యవాదాలు చెప్పండి. విమర్శల నుండి నేర్చుకోండి.