ఈ ప్రంపంచం అంతా తల్లక్రిందులుగా ఉన్నది అనే సంగతి ధ్యానం చేసిన వారికి తెలుస్తుంది. ఒకసారి అది గ్రహించిన వారు తమ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించినట్లు ప్రజలకు కనిపిస్తుంది.
జీవితం - మృత్యువు :
జీవితాన్ని గురించి తెలుసుకోవాల్సిన పనిలేదు మృత్యువును గురించి తెలుసుకుంటే జీవితం అవగతమౌతుంది. మృత్యువు అంటే మార్పు; ప్రతిక్షణం అది ప్రపంచంలోనూ మన శరీరంలోనూ, మనస్సులోనూ, బుద్ధిలోనూ, కలుగుతూనే ఉన్నది. దీన్ని జీవతానికి వ్యతిరేకంగా భావించక, స్వీకరించగలుగుతూ ఉంటే ప్రతిక్షణం ప్రతి మార్పు భూతకాలంలోకి జారిపోతూ కనిపిస్తుంది. అప్పుడు ప్రతిక్షణం మనకు మనమే నిత్య నూతనులముగా కనిపిస్తాము. ఈ ప్రతిక్షణం నిత్య నూతనత్వంలోనే జీవనం ఉట్టి పడుతుంది.
భయం లేదు :
జీవితంలో అంతా భద్రత కోరుకుంటారు. ఇదొక పిచ్చి ప్రపంచం. భద్రత కలిగిన జీవితంలో సారంలేదు. అందులోకి విసుగు ప్రవేశిస్తుంది. స్థిరమైన ఉద్యోగం, సొంత ఇల్లు, బ్యాంక్ బాలెన్స్ యాంత్రిక జీవనానికి, భావదాస్యానికి, మనోరుగ్మతలకు దారితీస్తాయి అభద్రతలో నిలిచినవాడు ప్రతిక్షణం జాగరూకుడై ఉండాలి. ఆకులాగా ఏ క్షణమునైనా గాలికి ఎగరగలిగిన వాణ్ణి కదిలించడానికి ప్రతివాడు భయపడతాడు.
స్పష్టంగా చెప్పండి :
ఈ తల్లక్రిందులు ప్రపంచంలో మరో విచిత్రం కనిపిస్తుంది. అదే... తన లోపాలను, తప్పులను దాచిపెట్టడం; కపటంతో తనకులేని గొప్పతనాన్ని ప్రకటించ ప్రయత్నించడం. దీనికి వ్యతిరేకంగా ప్రవర్తించి చూడండి. కేవలం అబద్ధాలే ప్రచారమయ్యే ఈ ప్రపంచంలో స్పష్టంగా తన నోటితోనే తన బలహీనతలు, లోపాలు, తప్పులు ఎవడన్నా చెప్పుకుంటాడంటే ఎవరూ నమ్మరు. నువ్వు
చెబుతున్నది జోక్ అయినా అయి ఉంటుంది. లేదా ఏదో ప్రయోజనాన్ని ఆశించి చెబుతున్న అసత్యమైనా అయిఉంటుంది అనుకుంటారు అంతా.
మోసం :
ప్రతివారూ ఈ జగత్తులో తాను మోసంగింప బడ్బడదని, వీలైతే ఇతరులను మోసగించాలని ప్రయత్నిస్తారు. మీరు ఇందుకు వ్యతిరేకంగా ప్రవర్తించడండి. ఫలానా వాడికి డబ్బులిస్తే తిరిగి రావని, వాడిచ్చే సరుకు కల్తీదని తెలిసి కూడా వాళ్ళకు ఈ మాటలు చెబుతూ డబ్బు ఇవ్వండి. సరుకు కొనండి.
మీకు అవకాశం వచ్చినా సరే ఇతరులను మోసం చేయబోకండి. విచిత్రమైన మీ పద్ధతికి ముందీ జగత్తు ఆశ్చర్యపోతుంది. క్రమంగా మీరే సరిగ్గా ఉన్నారని తామే తల్లక్రిందులని గ్రహిస్తుంది. (ఒకవేళ గ్రహించకపోయినా మీకు వచ్చే ఇబ్బందేమీ లేదు)
మధ్యలో :
" Man is not the end only the means"
మనిషి గమ్యం కాడు మార్గం మాత్రమే. అందుకే తన మీద తనకు తృప్తి లేదు. గమ్యం చేరిన వాడికి తృప్తి ఉంటుంది. లేదా ఇంకా ప్రయాణం ప్రారంభించని వాడికి శాంతి ఉంటుంది. తానే మార్గమైతే, అలసట, అశాంతి, విసుగు తప్ప మరేముంటాయి. అందుకే తనే తనకు అతీతంగా ఎదుగుదామని చూస్తాడు మనిషి అయితే తాను పైకన్నా ఎదగ గలుగుతాడు. లేదా క్రింద పడిపోతాడు.
క్రిందపడి జంతువులా బ్రతకగల్గిన వాడూ ఆనందంగా ఉండగలడు. పైకి ఎదగగలిగిన వాడు ్బడా ఆనందంగా ఉండగలడు.కానీ మధ్యలో నిలిచిన వాడికి మాత్రం దుఃఖం తప్పదు. ఈ తల్లక్రిందుల ప్రపంచంలో మనుషులంతా తల్లకిందులుగా చేతుల మీద నడుస్తుంటే, ఈ మార్గం నుండి ప్రక్కకు జరిగి తన కాళ్ళమీద నిలుచున్నవాడు అందరికీ దూరమైనట్లు కనిపించినా అందరితో కలిసి, అందరికీ మార్గదర్శనం చేయగలడు.
నికి వాళ్ళు సరిగ్గానే వ్రవర్తిస్తారు కానీ తమకు వ్యతిరేకంగా ఉన్నవారి వ్యవహారం తల్లక్రిందులుగా కనిపిస్తుంది.జీవితాన్ని గురించి తెలుసుకోవాల్సిన పనిలేదు మృత్యువును గురించి తెలుసుకుంటే జీవితం అవగతమౌతుంది. మృత్యువు అంటే మార్పు; ప్రతిక్షణం అది ప్రపంచంలోనూ మన శరీరంలోనూ, మనస్సులోనూ, బుద్ధిలోనూ, కలుగుతూనే ఉన్నది. దీన్ని జీవతానికి వ్యతిరేకంగా భావించక, స్వీకరించగలుగుతూ ఉంటే ప్రతిక్షణం ప్రతి మార్పు భూతకాలంలోకి జారిపోతూ కనిపిస్తుంది. అప్పుడు ప్రతిక్షణం మనకు మనమే నిత్య నూతనులముగా కనిపిస్తాము. ఈ ప్రతిక్షణం నిత్య నూతనత్వంలోనే జీవనం ఉట్టి పడుతుంది.
భయం లేదు :
జీవితంలో అంతా భద్రత కోరుకుంటారు. ఇదొక పిచ్చి ప్రపంచం. భద్రత కలిగిన జీవితంలో సారంలేదు. అందులోకి విసుగు ప్రవేశిస్తుంది. స్థిరమైన ఉద్యోగం, సొంత ఇల్లు, బ్యాంక్ బాలెన్స్ యాంత్రిక జీవనానికి, భావదాస్యానికి, మనోరుగ్మతలకు దారితీస్తాయి అభద్రతలో నిలిచినవాడు ప్రతిక్షణం జాగరూకుడై ఉండాలి. ఆకులాగా ఏ క్షణమునైనా గాలికి ఎగరగలిగిన వాణ్ణి కదిలించడానికి ప్రతివాడు భయపడతాడు.
స్పష్టంగా చెప్పండి :
ఈ తల్లక్రిందులు ప్రపంచంలో మరో విచిత్రం కనిపిస్తుంది. అదే... తన లోపాలను, తప్పులను దాచిపెట్టడం; కపటంతో తనకులేని గొప్పతనాన్ని ప్రకటించ ప్రయత్నించడం. దీనికి వ్యతిరేకంగా ప్రవర్తించి చూడండి. కేవలం అబద్ధాలే ప్రచారమయ్యే ఈ ప్రపంచంలో స్పష్టంగా తన నోటితోనే తన బలహీనతలు, లోపాలు, తప్పులు ఎవడన్నా చెప్పుకుంటాడంటే ఎవరూ నమ్మరు. నువ్వు
చెబుతున్నది జోక్ అయినా అయి ఉంటుంది. లేదా ఏదో ప్రయోజనాన్ని ఆశించి చెబుతున్న అసత్యమైనా అయిఉంటుంది అనుకుంటారు అంతా.
మోసం :
ప్రతివారూ ఈ జగత్తులో తాను మోసంగింప బడ్బడదని, వీలైతే ఇతరులను మోసగించాలని ప్రయత్నిస్తారు. మీరు ఇందుకు వ్యతిరేకంగా ప్రవర్తించడండి. ఫలానా వాడికి డబ్బులిస్తే తిరిగి రావని, వాడిచ్చే సరుకు కల్తీదని తెలిసి కూడా వాళ్ళకు ఈ మాటలు చెబుతూ డబ్బు ఇవ్వండి. సరుకు కొనండి.
మీకు అవకాశం వచ్చినా సరే ఇతరులను మోసం చేయబోకండి. విచిత్రమైన మీ పద్ధతికి ముందీ జగత్తు ఆశ్చర్యపోతుంది. క్రమంగా మీరే సరిగ్గా ఉన్నారని తామే తల్లక్రిందులని గ్రహిస్తుంది. (ఒకవేళ గ్రహించకపోయినా మీకు వచ్చే ఇబ్బందేమీ లేదు)
మధ్యలో :
" Man is not the end only the means"
మనిషి గమ్యం కాడు మార్గం మాత్రమే. అందుకే తన మీద తనకు తృప్తి లేదు. గమ్యం చేరిన వాడికి తృప్తి ఉంటుంది. లేదా ఇంకా ప్రయాణం ప్రారంభించని వాడికి శాంతి ఉంటుంది. తానే మార్గమైతే, అలసట, అశాంతి, విసుగు తప్ప మరేముంటాయి. అందుకే తనే తనకు అతీతంగా ఎదుగుదామని చూస్తాడు మనిషి అయితే తాను పైకన్నా ఎదగ గలుగుతాడు. లేదా క్రింద పడిపోతాడు.
క్రిందపడి జంతువులా బ్రతకగల్గిన వాడూ ఆనందంగా ఉండగలడు. పైకి ఎదగగలిగిన వాడు ్బడా ఆనందంగా ఉండగలడు.కానీ మధ్యలో నిలిచిన వాడికి మాత్రం దుఃఖం తప్పదు. ఈ తల్లక్రిందుల ప్రపంచంలో మనుషులంతా తల్లకిందులుగా చేతుల మీద నడుస్తుంటే, ఈ మార్గం నుండి ప్రక్కకు జరిగి తన కాళ్ళమీద నిలుచున్నవాడు అందరికీ దూరమైనట్లు కనిపించినా అందరితో కలిసి, అందరికీ మార్గదర్శనం చేయగలడు.
Post A Comment:
0 comments: