హలో సర్. రెండేళ్లుగా ఒకతన్ని ప్రేమిస్తున్నాను. అతను ఇంటర్మీ డియెట్ చేసి జాబ్ చేస్తున్నాడు. నాకు నా లైఫ్ గురించి చాలా కలలున్నాయి. తనకి కూడా చాలా గోల్స్ ఉన్నాయి. కాని మా ఇంట్లో వాళ్లు ఒప్పు కోరు. నా తల్లిదండ్రులను మోసం చేసి అతనితో వెళ్లలేను. అతను ఈమధ్య నా మొబైల్కి ఏమైనా కొత్త నెంబర్ల నుంచి కాల్స్ వచ్చాయా అని రోజూ అడుగుతున్నాడు. నా మెయిల్ రోజూ చెక్ చేస్తాడు. మా బంధువుల్లో ఒకతను నన్ను ఇష్టపడుతున్నాడు. ఈ విషయం అతనికి ముందే చెప్పాను. ఈ మధ్య నేను మాటి మాటికి ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడుతున్నానని అసలు ఫోన్ చెయ్యద్దన్నాడు. రెండు రోజులు కాల్ చేయలేదు. ‘మీ బంధువుల అతన్నే పెళ్లి చేసుకో. వాడే నీ కోరికలు తీరుస్తాడు. వాడు వచ్చాడని నన్ను వదిలేస్తున్నావ్’ అని నాకు చాలా బ్యాడ్గా మెసేజ్ ఇచ్చాడు. తనతో మాట్లాడ కుండా ఉండలేను. ఈ టెన్షన్ని భరించలేకపోతున్నాను. అతను మారుతాడా? మేం హ్యాపీగా ప్లెజంట్గా ఉండగలమా? మా తల్లిదండ్రులను ఒప్పించగలనా? నా నెక్ట్స్ స్టెప్ ఏంటి? తను ఎలా ప్రయోజకుడవుతాడు? నేనేం చేయాలి? దయచేసి నాకు సరైన పరిష్కారం చెప్పండి?

వాడ్డూయూ వాంట్ ఇన్ యువర్ లైఫ్.  మీ మనసులో మొదటగా ఏది మెదిలితే దానికే ప్రాధాన్యం ఇవ్వండి. మనలో చాలామందికి జీవితంలో ఏం కావాలో తెలియదు. ఆ సమయానికి ఏది అంది వస్తే దానితో సర్దుకుపోతుంటారు. ఆ క్రమంలో ఎదురయ్యే సమస్యలతో సర్దుకుపోలేక అసంతృప్తితో నలిగిపోతుంటారు. జీవితాన్ని దుఖమయం చేసుకుంటారు. అందుకే మొదట మీకేం కావాలో తెలుసుకోండి. 
మీ తల్లిదండ్రుల మాట వినడం ముఖ్యమా?
మీ కలలు నెరవేర్చుకోవడం ముఖ్యమా?
బాయ్ ఫ్రేండ్ ని ప్రేమించడం ముఖ్యమా?
మీకేం కావాలి? తేల్చుకోండి. కష్టంగా ఉందా? అయితే ఒక పేపర్ తీసుకుని మీ బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుందో, పెళ్లి చేసుకోకపోతే ఏం జరుగుతుందో విడివిడిగా పాయింట్లుగా రాయండి. వాటిలో ఒక్కో పాయింట్కు 10కి ఎన్ని మార్కులిస్తారో ఇవ్వండి. మొత్తాన్ని కూడితే మీకేది మేలు చేస్తుందో మీకే తెలుస్తుంది.
ప్రేమంటే ఇలా లెక్కలు వేసుకోవడం కాదనుకోవచ్చు. కాని నిర్ణయం తీసుకోవడం కష్టమైన ప్పుడు తప్పుకాదు. ఇక మీరు ప్రేమించిన వ్యక్తి గురించి... పెళ్లికి ముందే ఇన్ని నిబంధనలు పెట్టినవాడు, ఇన్ని అనుమానాలున్నవాడు, ఇంతగా అవమానిస్తూ మాట్లాడినవాడు, పెళ్లయ్యాక మిమ్మల్ని, మీ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను గౌరవిస్తాడని నమ్మకమేముంది? రెండేళ్లుగా మీ గురించి, మీ ప్రేమ గురించి తెలిసినా రెండు రోజులు మాట్లాడకపోతేనే మరెవరితోనే సంబంధం అంటగట్టేవాడితో మీరు సుఖంగా ఉండగలరా? అతను మిమ్మల్ని బాగా చూసుకుంటాడనే నమ్మకం మీకుందా? ఆలోచించండి. 
ఇక ఎవరిని ఎవరూ పూర్తిగా మార్చలేరు. అది సాధ్యం కూడా కాదు. సో ఆలోచించి తెలివైన నిర్ణయం తీసుకోండి. కష్టమనిపిస్తే ఒక ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ను కలవడానికి సంశయించవద్దు. ప్రేమకన్నా జీవితం చాలా విలువైంది.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: