కంప్యూటర్ వేగం తగ్గిపోవడమనే సమస్య ఎప్పుడో ఒకసారి ఎదురవుతూనే ఉంటుంది. ఫైల్స్‌ను ఓపెన్ చేయడం, నెట్ బ్రౌజింగ్, గేమ్స్ ఆడటం, కొన్ని రకాల వైరస్‌లు వంటి కారణాల వల్ల సిస్టమ్ వేగం తగ్గిపోతుంది. అయితే కొన్ని యుటిలిటీస్‌ని ఉపయోగించుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి సులువుగా బయటపడవచ్చు.
అవసరం లేని ఫైల్స్ డిలిట్ చేయడం
ముందుగా స్టార్ట్ బటన్ క్లిక్ చేసి తరువాత ప్రొగ్రామ్స్, యాక్సెసరీస్, సిస్టమ్‌టూల్స్, డిస్క్ క్లీనప్‌లోకి వెళ్లాలి. ఒకవేళ డ్రైవ్స్ ఎక్కువగా ఉంటే ఏ డ్రైవ్ క్లీన్ చేయాలో స్పెసిఫై చేయాలి. డిస్క్ క్లీనప్ డైలాగ్‌బాక్స్‌లో డిలీట్ చేయాల్సిన ఫైల్స్ లిస్ట్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత ఓకె బటన్ క్లిక్ చేయాలి. కన్‌ఫామ్ ఫైల్ డిలీట్ అని అడుగుతుంది. యస్ బటన్‌పై క్లిక్ చేయాలి. కొన్ని నిమిషాల తరువాత ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. డిస్క్ క్లీనప్ డైలాగ్ బాక్స్ క్లోజ్ అవుతుంది. విండోస్ ఎక్స్‌పీ, 7, విస్టా... ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగిస్తున్నా దీన్ని ఫాలో అయిపోవచ్చు.
అవసరం లేనివి తొలగించండి.
ఒకప్రొగ్రామ్‌ను ఇన్‌స్టాల్ చేసినపుడు అది ఆపరేటింగ్ సిస్టమ్‌తోనూ, ప్రొగ్రామ్స్‌తోనూ కనెక్ట్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ ప్రొగ్రామ్స్‌ను ఉపయోగించకపోయినా సిస్టమ్ స్లో అవుతుంది. అందుకే ఉపయోగించని ప్రొగ్రామ్స్‌ను డిస్క్ నుంచి తొలగించండి. దీంతో కంప్యూటర్ స్పీడప్ అవుతుంది. అవసరం లేని, ఎక్కువ స్పేస్‌ను ఆక్రమిస్తోన్న ఫైల్స్‌ను గుర్తించి డిలీట్ చేయడం ద్వారా హార్డ్‌డిస్క్‌లో ఫ్రీ స్పేస్‌ను పెంచడానికి డిస్క్ క్లీనప్ టూల్ బాగా ఉపయోగపడుతుంది.
స్కాన్ యువర్ విండోస్ సిస్టమ్
ఆపరేటింగ్ సిస్టమ్‌లో వివిధ రకాల పనులు నిర్వర్తించే ఫైల్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఈ ఫైల్స్ కరెప్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ అలాజరిగితే సిస్టమ్ వేగం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు 'సిస్టమ్ ఫైల్ చెకింగ్ ' ఆప్షన్‌ను ఉపయోగించుకుని ఫైల్స్‌ను చెక్ చేసి సమస్య ఉన్నట్లయితే పరిష్కరించవచ్చు. దీనివల్ల సిస్టమ్ వేగం మెరుగుపడుతుంది.
స్కాన్ ఫర్ వైరస్, స్పైవేర్, అడ్‌వేర్
తమ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం కంపెనీలు కస్టమర్ల సమాచారం తెలుసుకోవడానికి స్పైవేర్, అడ్‌వేర్ ప్రొగ్రామ్స్‌ను తయారు చేస్తుంటాయి. ఈ ప్రొగ్రామ్‌లు కంప్యూటర్ మెమొరీలోకి చేరినపుడు సిస్టమ్ స్లో అవుతుంది. వీటిని తొలగించుకోవాలంటే రెగ్యులర్‌గా స్కాన్ చేస్తూ వైరస్, స్పైవేర్, అడ్‌వేర్‌ను రిమూవ్ చేస్తుండాలి. దీని కోసం మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ ఎసెన్షియల్స్ చక్కగా ఉపయోగపడుతుంది. ఇది స్పైవేర్ రిమూవల్ టూల్‌గా పనిచేయడమే కాకుండా అటోమెటిక్ అప్‌డేట్స్‌తో కంప్యూటర్‌ను కాపాడుతుంది. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వైరస్, స్పైవేర్, అడ్‌వేర్‌ల బారి నుంచి ఇది రక్షిస్తుంది.
డిస్క్ ఫ్రాగ్మెంటేషన్
డిస్క్ ఫ్రాగ్మెంటేషన్ వల్ల కంప్యూటర్ స్లో అవుతుంది. ఫైల్స్ కోసం హార్డ్‌డి స్క్ మొత్తం సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో డిస్క్ డిఫ్రాగ్మెంటర్ ఆప్షన్ చక్కగా ఉపయోగపడుతుంది. ముందుగా స్టార్ట్ బటన్ క్లిక్ చేసి తరువాత ప్రొగ్రామ్స్‌లోకి వెళ్లండి. తరువాత యాక్సెసరీస్‌పై క్లిక్ చేసి సిస్టమ్‌టూల్స్‌ని ఎంచుకోండి. ఆ తరువాత డిస్క్ డిఫ్రాగ్మెంటర్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు ఒక డైలాగ్ బాక్స్ ప్రత్యక్షమవుతుంది. అందులో కన్ఫిగర్ షెడ్యూల్ బటన్‌ను సెలక్ట్ చేయాలి. తరువాత డీఫ్రాగ్మెంట్ చేయాలనుకుంటున్న డ్రైవ్స్‌ని ఎంచుకోవాలి. తరువాత ఎనలైజ్ డిస్క్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మరో బాక్స్ ప్రత్యక్షమవుతుంది. అనలైజ్‌డ్ డ్రైవ్స్‌ని డిఫ్రాగ్మెంట్ చేయాలా అని అడుగుతుంది. వెంటనే డిఫ్రాగ్మెంట్‌డిస్క్ బటన్‌పై క్లిక్ చేయండి. డి ఫ్రాగ్మెంట్ పూర్తయిన తరువాత రిజల్ట్ ప్రత్యక్షమవుతుంది. వ్యూ రిపోర్ట్‌పై క్లిక్ చేస్తే పూర్తి సమాచారం వస్తుంది. మాన్యువల్‌గా చేయడమే కాకుండా అటోమెటిక్‌గా డిస్క్ డిఫ్రాగ్మెంటర్ రన్ అయ్యేలా కూడా సెట్ చేసుకోవచ్చు. షెడ్యూల్డ్ డిఫ్రాగ్మెంటేషన్ ఆన్ చేసినపుడు టైమ్ ఆఫ్ డే, ఫ్రీక్వెన్సీ ఆఫ్ డిఫ్రాగ్మెంటేషన్ అని కనిపిస్తుంది. ఆ ఆప్షన్లను సెట్ చేసుకుంటే అటోమెటిక్‌గా ఫ్రాగ్మెంటేషన్ పూర్తవుతుంది.
డిటెక్ట్ ఎర్రర్స్
డిస్క్ క్లీనప్, డిస్క్ డిఫ్రాగ్మెంటర్‌లను ఉపయోగించినా కంప్యూటర్ వేగం పెరగలేదంటే హార్డ్‌డిస్క్‌లో స్టోర్ అయిన ఫైల్స్ ఇంటెగ్రిటీని ఎర్రర్ చెకింగ్ యుటిలిటీ సహాయంతో చెక్ చేయండి. హార్డ్‌డ్రైవ్‌లో బ్యాడ్ సెక్టర్స్ డెవలప్ కావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. బ్యాడ్ సెక్టర్స్ హార్డ్‌డిస్క్ పనితీరు మందగించేలా చేస్తాయి. కొన్నిసార్లు ఫైల్ సేవ్ చేయడంలో సమస్యలు ఎదురవుతాయి. ఎర్రర్ చెకింగ్ యుటిలిటీ హార్డ్‌డ్రైవ్‌లో ఉన్న బ్యాడ్‌సెక్టర్స్‌ను గుర్తించవచ్చు.కంప్యూటర్‌ను రోజూ ఉపయోగించే వారు వారంలో ఒకసారి ఈ యుటిలిటీని ఎంచుకోవడం ద్వారా డాటాను రక్షించుకోవచ్చు.
వేగం పెరగడం ఖాయం
మీరు విండోస్ విస్టా ఉపయోగిస్తుటే మీ పీసీ వేగం పెరగడానికి రెడీబూస్ట్ట్ ఉపయోగపడుతుంది. కంప్యూటర్ వేగం పెంచుకోవడానికి రామ్ సామర్థ్యం పెంచడం చేస్తుంటారు. కానీ ఇందుకు అయ్యే ఖర్చు ఎక్కువే. అయితే ఇలాంటివేమీ లేకుండా రెడీబూస్ట్ ఫీచర్‌ను ఉపయోగించుకోవడం ద్వారా సిస్టమ్ స్పీడ్‌ను పెంచుకోవచ్చు. యూఎస్‌బి ఫ్లాష్ డ్రైవ్‌ను సిస్టమ్‌కు అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. సిస్టం వేగం పెరుగుతుంది.
రీ ఇన్‌స్టాల్
ఒకవేళ పైవన్నీ చేసినా కూడా సిస్టమ్ ఇంకా పనితీరు స్లోగానే ఉందంటే ఆపరేటింగ్ సిస్టమ్‌ను రీ ఇన్‌స్టాల్ చేయండి. ప్రొగ్రామ్స్ అన్నింటిని తీసివేసి రీఇన్‌స్టాల్ చేసుకోవడం వల్ల ఎర్రర్స్ అన్నీపోయి సిస్టమ్ స్పీడ్ పెరుగుతుంది.
Post A Comment:
0 comments: