![]() |
కొబ్బరిసద్ది |
కావలసినవి: అన్నం - మూడు కప్పులు; కొబ్బరి ముక్కలు - కప్పు; పచ్చిమిర్చి - 3 (మధ్యకు కట్ చేయాలి); ఎండుమిర్చి - 3; పల్లీలు - 2 టేబులైఉ స్పూన్లు; జీడిపప్పు - పది పలుకులు; ఆవాలు - టీ స్పూను; శనగపప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; కరివేపాకు - రెండు రెమ్మలు; నూనె – టేబుల్ స్పూను; ఉప్పు- తగినంత; నువ్వులపొడి - రెండు టేబుల్ స్పూన్లు.
తయారి: కొబ్బరిముక్కలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన ఉంచాలి. బాణలిలో టేబుల్ స్పూన్ నూనెవేడి చేసి, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు వేసివేయించాలి. జీడిపప్పు, పచ్చిమిర్చి తరుగు, ఎండు మిర్చి, కరివేపాకు జత చేసి రెండు నిముషాలు వేయించాలి. కొబ్బరిపేస్ట్ వేసి బాగా కలిపి, వేయించాలి.అన్నం, ఉప్పు వేసి కలపాలి. మంట తగ్గించి రెండునిముషాలు ఉంచి దించేయాలి.

Post A Comment:
0 comments: