![]() |
| సజ్జ ముద్దలు |
కావలసినవి: సజ్జపిండి - 2 క ప్పులు; బెల్లం తురుము - కప్పు; నీరు - తగినంత; ఏలకులపొడి - చిటికెడు; డ్రై ఫూట్స్- (బాదం,జీడిపప్పు, కిస్మిస్) - 2 టీ స్పూన్లు; నెయ్యి- 2 టేబుల్ స్పూన్లు
తయారి: తగినన్ని నీరు మరిగించాలి. ఒక గిన్నెలో సజ్జపిండి వేసి, వేడినీరు కొద్దికొద్దిగా పోస్తూ కలిపి ముద్ద చేయాలి. కావలసిన పరిమాణంలో ముద్ద తీసుకొని, కొద్దికొద్దిగా నీరు చిలకరిస్తూ, రొట్టె చేసి, పెనం మీద వేసి రెండువైపులా కాల్చాలి. వేడిగా ఉన్నప్పుడే సజ్జ రొట్టెలకు నీళ్లు అద్దుకుంటూ చేత్తో ముక్కలు ముక్కలు చేసి, రోట్లో వేసి దంచాలి. స్టౌ మీద బాణలి ఉంచి అందులో నెయ్యి, బెల్లం, ఏలకులపొడి, సజ్జరొట్టె ముక్కల పొడి వేసి
కొద్దిగా వేయించి దించాలి ? కావలసిన పరిమాణంలో ఈ పొడిని తీసుకొని బాదం, జీడిపప్పులు, కిస్మిస్లు అద్దుకుంటూ ముద్దలు చేయాలి.

Post A Comment:
0 comments: