![]() |
| గుమ్మడి హల్వా |
కావలసినవి: తీపిగుమ్మడికాయ తురుము - 2 కప్పులు; పాలు - 2 కప్పులు; పంచదార - కప్పు; నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు; బాదంపప్పులు - 15; ఏలకులపొడి – అర టీ స్పూను.
తయారి: బాణలిలో నెయ్యి వేసి కరిగాక బాదంపప్పుల తరుగు వేసి వేయించి, తీసి పక్కన ఉంచాలి. అదే బాణలిలో గుమ్మడి కాయ తురుము వేసి పచ్చివాసన పోయేవరకు సుమారు ఐదు నిముషాలు వేయించాలి. రెండు కప్పుల పాలు పోసి బాగా కలిపి, పాలు ఇగిరిపోయేవరకు ఉడికించాలి. పంచ దార వేసి కలపాలి. అన్నీ బాగా ఉడికిన తరవాత దించేయాలి. ఏలకులపొడి, బాదంపప్పు ముక్కలు వేసి కలిపి సర్వ్ చేయాలి.

Post A Comment:
0 comments: