''ఒక ప్రత్యేక కార్యసాఫల్యం కొరకు, కావలసిన శక్తి యుక్తులను కలిగి పుట్టడమే గొప్ప సంపద. ఆ గమ్యం చేరుకోవడంలోనే మనిషికి ఆనందం'' మీరేమి కోరుకుంటున్నారు? ఏమౌదా మనుకుంటున్నారు? ఏపని చేపడితే మీరు ఇతరుల కన్నా బాగా చేయగలరు? ఏ వృత్తి మీకు వర్తిస్తుంది? ఏ ఉత్తరదాయిత్వం మీ కొరకు ఏదురు చూస్తున్నది? ముందు ఈ విషయాలు తెలుసుకోండి. ఏ పనిలో మీరు మీయొక్క వ్యక్తిత్వాన్ని శక్తియుక్తులను సంపూర్ణంగా వినియోగించ గలరు? ఏపనిలో మీమనస్సు బాగా రమిస్తుంది? దేనిద్వారా మీరు మీ వికాసాన్ని చూడటమే కాక సమాజానికి కుడా ఉపకరిస్తారు? ఈ లక్షణాలన్నీ ఉన్నపనే, మీ జీవిత లక్ష్యానికి తోడ్పడుతుందని గ్రహించండి.
లక్ష్యాన్ని నిశ్చయించుకుంటే చాలు. అది మిమ్మల్ని తనవైపు లాక్కోగలుగుతుంది. లక్ష్యంలో ఆ శక్తి వుంది. మీ మనస్సు మీ లక్ష్యం పైన ఉంటే చాలు మీ పురోగమనం తథ్యం.
లక్ష్యమే మనిషికి ప్రాణం, అదే జీవనం, అక్కడి నుండే మనిషికి ప్రేరణ లభిస్తుంది. కష్టాలను ఎదుర్కొనే సాహసం, బలం కుడా అక్కడి నుండే లభిస్తుంది.మీ దృష్టి మీ లక్ష్యం పైనే ఉంటుంది. దానిని పొందటంపైనే ఉంటుంది. కనుక మీరు నిరంతరం దానివైపు ప్రయాణిస్తారు. ఇక అప్పుడు మీ జీవితం ఉత్సాహ ఉల్లాసాలతో నిండిపోతుంది. మీరు లక్ష్య ప్రాప్తి యొక్క ఆశలో నిరంతరం ప్రసన్నులై ఉంటారు.
లక్ష్యాన్ని నిర్ణయించే ముందు అది సమాజ సేవాపూరిత మయ్యేదిగా ఉండేటట్లు చూసుకొండి. పరమార్ధ దృష్టితో చేసే కర్మ, కేవలం స్వార్ధదృష్టితో చేసే కర్మకన్నా ఎన్నోరెట్లు అధిక శాంతినిస్తుంది. సేవాక్షేత్రం అత్యంత విశాలం, దానిలో సంకీర్ణత లేదు. దానికి అంతంలేదు. అది ఒక ఆదర్శం. దాని ప్రాప్తి కోసం మీ జీవితాలు ఉత్సాహంతో నిండి ఉండాలి. అన్నీ మరిచి సేవలో రమించే వాడే సదాసుఖి. లక్ష్యం ఎంత గొప్పదయితే అంతగా సాధన అవసరం. దేనిలోనైతే అధిక శ్రమ అవసరమో, దాని ప్రాప్తిలో కుడా అంతే ఆనందం లభిస్తుంది. మీ ముందు చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకున్నారా? ఇకమీరు బద్ధకస్తులు కాగలరు. మీ గమ్యం ఎంత గొప్పదయితే అంత దూరంలో ఉంటుంది. అదిఎంత దూరంలో ఉంటే మీరు అంత సావధానులు (Alert) అవుతారు.
గొప్ప లక్ష్యం, ఉద్దేశ్యం లేదా ఆదర్శం యొక్క ప్రాప్తిలో చిన్నచిన్న విషయాలను కుడా పట్టించుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ ఆ మహా లక్ష్యాన్ని పొందటానికి మెట్లు. ఒకవేళ మీ లక్ష్యం మీకు అనుకుల మైతే, నిశ్చయంగా మీరు ఉన్నత సౌధాలను, చేరుకోగలరు. ప్రస్తుతం సంసారంలో మీపై ఉన్న వ్యక్తిత్వ ముద్రను కడిగివేసుకోగలరు. కానీ ప్రస్తుతం యువతలో ఒక విచిత్రమైన స్థితి కనిపిస్తున్నది. వారి గమ్యమేమిటో వారికే తెలియదు. మొదటి మేక ఎటు పోతే దాని వెనుక మేకలు కుడా అటే వెళ్లినట్లు గొఱ్ఱెదాటుగా ఎక్కువ మంది ఏ విషయం వైపు పరిగెడుతుంటే యువత కుడా అలాగే పరిగెడుతున్నారు. ప్రస్తుతం అంతా కంప్యూటరైజేషన్ అంటున్నారు. కనుక వారు కుడా ఆయా కోర్సులలో చేరుతున్నారు. లేదా దేనిలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయో చూసి వాటిలో చేరుతున్నారు. లేదా తల్లిదండ్రులకు తమ కుమారుడిని ఒక డాక్టరుగానో లేక ఒక ఇంజనీరుగానో చూడ దలచుకున్నారు. గనుక వారు తనయుణ్ణి అలా ఆజ్ఞాపిస్తున్నారు.
మీకు ఇష్టంలేని పదార్ధం ఎంత గొప్పదయితే మాత్రం మీరు తినగలరా? సంగీత సంస్కారం ఉన్నవ్యక్తిని బలవంతంగా డాక్టరును చేస్తే, స్టెతస్కోపును గుండెలమీద పెడతాడా లేక ఒక బల్లపై తబలా కొట్టడానికి ఉపయోగిస్తాడా? ప్రకృతి సౌందర్యంలో తనువు పులకరించి దానిని చిత్రాలలో బంధించ డానికి ఉవ్విళ్ళూరేవాడు. కప్పలను, ఎలకలను కోయగలడా? నటకుడు రాజకీయ నాయకుడైతే అలవాటు చొప్పున నటిస్తాడే కాని ప్రజాసేవ చేయగలడా?
ఇక కొందరు లక్ష్యంలో రుచి ఉన్నా అనుసరించలేమేమో అనుకొని భయపడేవారు కుడా ఉంటారు. డాక్టరునైతే ప్రాక్టీసు చేయాల్సివస్తుందని, టీచరునైతే చెప్పడమే కనుక అది సులభమని భావించి, టీచర్లయ్యే వారిని ఏమనాలి?
ఏదైనా పరిశ్రమ లేనిదే పొందలేము.
Post A Comment:
0 comments: