''పృధివ్యా సర్వభత్రూణాం కఠోర తమ ఈశ్వరః |
నాననహం జానామి అత్యంతం యుష్మాన్పరీక్షతే||''
ఈశ్వరుడే సంసారంలో అందరికన్నా కఠిన హృదయుడు. నిన్ను పరీక్షించడం కొరకు ఇంతగా కష్టాలుపాలుచేసే స్వామినెవరిని నేను చూడలేదు.
నాననహం జానామి అత్యంతం యుష్మాన్పరీక్షతే||''
ఈశ్వరుడే సంసారంలో అందరికన్నా కఠిన హృదయుడు. నిన్ను పరీక్షించడం కొరకు ఇంతగా కష్టాలుపాలుచేసే స్వామినెవరిని నేను చూడలేదు.
ఆశావాదిగా! కష్టాలు పరీక్షలేకాని నీ జీవితానికి అంతాలు కావు. బంగారం బాగా కాగితేనే స్వచ్ఛంగా తయారయ్యేది. రాయి ఉలిదెబ్బలు తింటేనే అందమైన విగ్రహంగా మారేది. వడ్లు రోకటి దెబ్బలు తింటేనే బియ్యంగా మారేది.
1914లో ధామస్ ఎడిసన్ యొక్క లేబరేటరీ (ప్రయోగశాల) అగ్ని ప్రమాదానికి లోనయ్యింది. విలువగల యంత్రాలు, రసాయన పదార్ధాలు వస్తుసామగ్రి అగ్నికి ఆహుతియైనాయి. ఆయన జీవితంలో కనుగొన్న ఎన్నో రహస్యాలకు సంబంధించిన కాగితాలు తగలబడి పోయియి. ఈ దుర్ఘటన గురించి విన్న ఎడిసన్ కుమారుడు ఛార్లెస్ ఆయనను వెతుకుతూవచ్చి తగులబడుతున్న ఈ ప్రయోగశాల ప్రక్కన నిలబడి ఎగసిబడుతున్న జ్వాలలను ఆనందంగా చూస్తున్న తండ్రిని చూచాడు. తన కుమారుడిని చూసి ''మీ అమ్మ ఎక్కడరా? వెంటనే వెళ్ళి ఆవిడను తీసుకురా? మళ్ళీ ఇటువంటి సంఘటన ఆవిడ జీవితంలో చూద్దామను కున్నాకనిపించదు'' అన్నాడు.
ఆ రెండువరోజు బూడిదకుప్పల మధ్య నడుస్తున్న ఆ అరవైఏడు సంవత్సరాల వృద్ద శాస్త్రజ్ఞుడుఅన్నాడు. నాపొరపాట్లన్నీ తుడిచివేశా కరుణామయా! సర్వనాశన రూపంలో ఇక్కడ ప్రవేశించి మళ్ళీ క్రొత్తగా నన్ను మొదలు పెట్టమని ఆజ్ఞాపిస్తున్నావా పరమాత్మా! అలాగే నీఆజ్ఞను శిరసావహిస్తాను''. పరమాత్మ యొక్క కృప అనంతం ఏ రూపంలోనైనా రావచ్చు. దానిని చూసి గుర్తించగల కండ్లు నీకు ఉండాలి అంతే.
''జోచన్‌హై బర్కేచమన్ సాజ్‌కో తో జిద్‌హీసహీ హమ్ ఆజ్ అపనా నశేమన్ బనాకే దేఖేంగే''
పిడుగులు పడతాయని నిర్ణయించుకున్నా ఫరవాలేదు. అయినా సరే మేము మాఇల్లు కట్టుకొని తీరుతాము. తుఫానులు వచ్చినా సరే మేముమాత్రం మా మార్గంలో పురోగమిస్తాము. ఇవన్నీ పరీక్షలు.
జీవితాన్ని ప్రాణహీనంగానూ, నిస్సారంగాను మార్చేది నిరాశ. అందుకే నిరాశను అంధకారంతోన, ఆశను ప్రకాశంతోను పోల్చారు. ఈ సత్యాన్ని అందరూ ఎరుగుదురు. కాని నిరాశ అందరినీ వెంటాడుతోంది. నిరాశనే మీరు ఎందుకు విశ్వసిస్తున్నారు? ఏవిధంగా వెలుతురులేని తనాన్ని చీకటి అంటారో అలాగే ఆశ విశ్వాసం లేని స్థితిని నిరాశ అంటారు. కనుక నిరాశకు ఎప్పటికీ అస్థిత్వంలేదు.
ఈ నిరాశ మన యొక్క నిర్బలత్వం నుండి ఉత్పన్నమౌతుంది. ఉత్సాహం నిండిన మనస్సులోకి నిరాశ ప్రవేశించలేదు. భూతకాలపు అనుభవాలే వర్తమానంలో మనలను నిరాశకు లోను చేస్తుంటాయి.
("Time demolishes the steps we climb to reach the present there is no going back only going forward is possible") కాలం మనం ఎక్కివచ్చిన మెట్లను నాశనం చేసింది. మనం వెనక్కు వెళ్ళడానికి వీలులేదు. మార్గమెప్పుడూ ముందుకే తీసుకువెళుతుంది. కనుక భూతకాలమనే శవాన్ని భుజాలనుండి దించి ఆనందంగా ముందుకుసాగండి.
"Not only a seed is a seed, man is also a seed, not only seeds bloom man also blooms" బీజాలే బీజాలు కావు. మనుషులు కుడా బీజాలే. ఏదోనాటికి వారు ్బడా పూలలా వికసించగలరు.

సూఫీ సంప్రదాయంలో అబ్ధుల్లా అనే మహాత్ముడి కథలు కనిపిస్తాయి. ఆయన ఉదయం లేవగానే మంచంమీద లేచి కూర్చోని ''అబ్ధుల్లా ఇది నీ జీవితం. మరి ఈరోజు ఆనందంలో గడపదలుచుకున్నావా? దుఃఖంలోనా?'' అని తనకు తాను ప్రశ్నించుకునేవాడు. వెంటనే లోపలి నుండి ఆనందంగా గడప దల్చుకున్నాను'' అని జవాబు వచ్చేది. ''కనుక ఏ పరిస్థితులు ఎలా మారినా ఎంత కష్టదాయకమైన సంఘటనలు ఎదురైనా ఎటువంటి దుర్వార్తలు విన్నా సరే నువ్వు మాత్రం ఆనందంగా ఉండు' అనేవాడు. మీరు సుఖంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఉండదలచుకుంటే దుఃఖాన్ని పట్టించుకోబోకండి. కష్టదాయక పరిస్థితులే మీకు ఎదురవవచ్చు. కానీ మీరు అనుమతించనిదే దుఃఖం మాత్రం మీలో ప్రవేశించలేదు.
నిరాశ అన్నిటికన్నా పెద్దరోగం. ఒకసారి ఈ రోగం మీకు సోకిందా ఇక జీవితమంతా చింతా, అశాంతి మిగులుతుంది. అందుకే దానిని దగ్గరికి రానివ్వకండి. నిరాశా క్షణాలలో దాని శత్రువైన ఆశను స్మరించండి. మనస్సును విచలితం కావద్దని ఆదేశించండి. జీవితమన్నాక ఎత్తుపల్లాలు ఉండకపోవు. ప్రయత్న శీలుడు అపజయ పొందలేడు. కాకపోతే ఆయన జీవితం సంకటపూర్ణమై తీరుతుంది. సంకట పరిస్థితులు లేకపోతే సంఘర్షణే లేదు. సంఘర్షణ లేని జీవితలో మనోహరత అంతమై పోతుంది. జీవితంలో సమృద్ధి వైరాగ్యం వల్లగానీ ఉదాశీనత వల్లగానీ లభించదు. ప్రవృత్తివల్లే లభిస్తుంది. ప్రవృత్తి రుచితో సంబంధం కలిగి ఉంటుంది. మన మనస్సులో ఏదైనా వస్తువును పొందాలన్న ఆకాంక్ష ఉన్నప్పుడే రుచి ఆవిర్భ విస్తుంది. ఆకాంక్ష ఎప్పుడు ఆశాయుక్తమై ఉంటుంది కేవలం ఆశ, ఆకాంక్ష మనస్సులో నిలుపుకున్నంత మాత్రాన, వస్తుప్రాప్తి లేదా ఇష్టప్రాప్తి కలుగదు.
మాటలలో అంధకారం అంతం కాదు. దీపం వెలిగించవలసిందే. సఫలత పొందిన వ్యక్తులందరి జీవనరహస్యం ఒక్కటే వారెప్పుడూ తమ జీవితంలో నిరాశకు చోటివ్వలేదు.
సర్ జగదీశ్ చంద్రబోస్ ఆధునిక భారతానికి ప్రథమ వైజ్ఞానికుడు. చెట్లకు, మొక్కలకు (వృక్షజలాలన్నిటికి) ప్రాణం ఉంటుందనే సంగతి పరిశోధించి ఆయన ప్రపంచాన్నంతా ఆశ్చర్య పరిచాడు. ''అన్య జీవధారలలాగే సుఖదుఃఖాలను, ప్రకాశాంధకారాలను, శీతోష్ణతలను, ధ్వని, వాతావరణ వాయు, జల కాలుష్యాలను ఇతర అన్య ఉత్తేజాలను చెట్లు కూడ అనుభవిస్తాయి'' అని చెప్పాడు.
ఈ మహా విజ్ఞానికి స్వాభిమానం మెండు. కలకత్తా విశ్వవిద్యాలయంలో అధ్యయనం ముగిసిన తరువాత 1884 మే నెలలో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పుచ్చుకొని భారతదేశం తిరిగివచ్చాడు. ప్రెసిడెన్సీ కాలేజీలో భౌతికశాస్త్ర అధ్యాపకుడిగా ఆయన నియోగించబడ్డాడు. అది బ్రిటీషువారు మన దేశాన్ని పరిపాలిస్తున్న రోజులు. వారు భారతీయులను న్యూనతా భావంతో చూసేవారు. ఒక యూరోపియన్ ప్రొఫెసర్‌కు ఇచ్చేజీతంలో భారతీయ ప్రొఫెసర్‌కు మూడులో రెండవవంతు మాత్రమే ఇచ్చేవారు. పైగా బోస్ ఆస్థాయి (Temporary) కావడం వల్ల ఆయనకు యూరోపియన్ ప్రొఫెసర్ వేతనంలో సగమే లభించేది. దీనితో కోపగించిన బోస్ ''సమానమైన కార్యానికి సమాన వేతనమే లభించాలి. మీరు నాకు సమాన వేతనం ఇవ్వకపోతే నేనసలు వేతనమే తీసుకోను'' అన్నాడు ఈ విధంగా ఆయన మూడు సంవత్సరములు వరకు హటంబట్టి ఉండి పోయాడు. కలకత్తా నగర ఖర్చులకు తట్టుకోలేక ఖరీదైన అద్దె ఇంటిని విడిచి పట్టణానికి దూరంగా ఒక సాధారణమైన ఇంట్లో తక్కువ అద్దెకు నివసించడం మొదలుపెట్టాడు.
ఊళ్ళోకి ఉద్యోగానికి రావడానికి పత్ని సహాయపడగా పడవ మీద హుగ్లీ నది దాటేవాడు. మళ్ళీ ఖాళీ పడవను ఆయన భార్య వెనక్కు తీసుకువెళ్ళేది. మళ్ళీ సాయంకాలం ఆయన కొరకు పడవ తీసుకువచ్చేది. ఆవిడ ఎంతో సహనం కలిగినదయినా సరే ఈ కష్టాలు తట్టుకోలేక ఎన్నోసార్లు ఏడుస్తూ ఆయనను, ''బ్రిటీషు వారు వచ్చినంతే తీసుకోరాదంటండి' అని బ్రతిమలాడేది. బోస్ ఆవిడను ఓదారుస్తూ ధైర్యాన్ని నూరిపోసేవాడు. కానీ తన స్వాభిమానాన్ని మాత్రం ఆయన ఏనాడు వదలలేదు. ధైర్యాన్ని విడువలేడు. చివరికి బ్రిటీషువారు ఓటమిని ఒప్పుకోక తప్పలేదు. యూరోపియన్ ప్రొఫెసర్లతో సమానంగా జీతం ఇవ్వక వారికి తప్పలేదు.
నిరాశను దగ్గరకు రానివ్వకపోవడం అంటే ఇది. నిరాశ ఎందుకు? ఏం మీపై మీకు విశ్వాసం లేదా? లేవండి! లేచి నిలబడండి! నిరాశను విదిలించండి. ఈ మీ నిరాశ సంక్రామకం (Contigies).
మీలోని ఈ నిరాశను అందరికీ మీరు మీకు తెలియకుండానే పంచుతున్నారు. చివరికిది మొత్తం సమాజాన్నే ఇది ముంచగలదు. కనుక సమిష్టి క్షేమాన్ని దృష్టిలో ఉంచుకునైనా నిరాశ విడవండి.

Post A Comment:
0 comments: