లక్ష్యాన్ని నిశ్చయించుకున్న తర్వాత దాని ప్రాప్తి కొరకు చిత్తాన్ని ఏకాగ్రం చేయాలి. అన్నీ మరచిపోయి లక్ష్య సిద్ధి కొరకు ప్రయత్నించాలి. ఏ మహాకార్యమూ ఒక్కరోజులో పూర్తికాలేదు. ''రోమ్‌ నగరం ఒక్కరోజులో కట్టబడలేదు'' అన్న సామెత మీకు తెలుసుకదా! సమస్త అన్వేషణలు, పరిశోధనలు, ఏకాగ్రత యొక్క ఫలితాలే. చరిత్ర, భూగోళం, విజ్ఞానం, విశాల సాహిత్యం అన్నీ కుడా మనుష్యుడి యొక్క అనవరత పరిశ్రమ యొక్క ఫలితమే గుర్తుంచుకోండి.....  

ఒకే చిత్తవృత్తిని నిలపండి. మీ మార్గంలోనె నడవండి. పనిలో నీచాలు ఉన్నతాలనేవి లేవు. ప్రతి పనిలోనూ గొప్పతనం దాగి వున్నది. ప్రతిపనిలోనూ మనం ఉన్నతిని పొందవచ్చు. టయ్ లెట్ లు శుభ్రంచేసి గాంధీ మహాత్ముడు కాలేదా? కనుక మీరు ఏకార్యం చేపట్టినా, మనస్ఫూర్తిగా స్వీకరించండి. దీనిని నేను సాధ్యమైనంత అందంగా తీర్చిదిద్దుతాను అని నిశ్చయించుకొని ఆ పనిని మొదలు పెట్టండి. లక్ష్యాన్ని నిశ్చయించుకోవడం సులభం, కానీ దానిని నిరంతరం స్మరిస్తూ దాని ప్రాప్తికొరకు ప్రయత్నించడం కఠినం. మీరు మార్గంలో నడవడం మొదలు పెట్టినప్పుడే అది ఎంత కఠినమో అర్ధమౌతుంది. కానీ, మీరు కఠినతల ముందు తలవొగ్గవద్దు, ఓటమిని ఒప్పుకోవద్దు. ఆ కఠినతను పట్టించుకోవద్దు. అప్పుడే మీరు ముందుకు పురోగమించగలరు.

ఎక్కడైతే కఠినత ఉందో అక్కడే పౌరుషం అవసరం. ఎక్కడ పౌరుషం ఉందో అక్కడే విజయం ఉంది. విజయం సాధించాలనే వారికే అంతా సులభమే. పరిశ్రమే విజయానికి మూలం. గుఱ్ఱంలా పనిచేయడం సాధువులా జీవించడం నేర్చుకో. మరణించనిదే ఎవడూ స్వర్గం చూడలేడు. ఏ వ్యక్తి అయితే రాత్రింబవళ్ళు తన కర్తవ్య కర్మలో నిలిచి ఉంటాడో వాడే ముందుకు పురోగమించ గలడు. జీవితంలో సాఫల్యాన్ని పొందిన ఏ మహాత్ముడి యొక్క జీవితాన్ని తరచి చూచినా కనిపించేదొకటే. అతడు తన జీవితంలోని ప్రతిక్షణాన్ని సదుపయోగం చేశాడు. విజయంకొరకు కఠిన పరిశ్రమను మించిన మార్గం ఏదిలేదు. చేసే కర్మపైని గౌరవమే అన్ని అపజయము దూరం చేస్తుంది.


నిరంతర పరిశ్రమ అంటే అర్ధం ఏమిటంటే, వైఫల్యం ఎదురైనా నిరాశ చెందక పోవడం, మళ్ళీ మళ్ళీ విజయం కొరకు ప్రయత్నించడం. నిరంతర పరిశ్రమే నా విజయాలకు కారణం అంటాడు ఎడిసన్‌. నిరాశ నిస్స్పహ అన్న పదాలకు అర్ధం తెలియనినాడే తన లక్ష్యాన్ని చేరగలుగుతాడు. నిజానికి లక్ష్యం వైపు ప్రయాణించే వ్యక్తికి నిరాశ కలిగే ప్రసక్తేలేదు. ఎందుకంటే అతడి దృష్టి సాధించిన దానిపై లేదా పోగొట్టుకున్న దానిపై ఉండదు. అతడి ధ్యానం అంతా కర్తవ్యపాలనపై ఉంటుంది.

ప్రజలంతా బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటున్నప్పుడు కర్మశీలుడు పనిలో ఉంటాడు.

''యానిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ''
సాధారణ పురుషుడికి ఏదైతే రాత్రో సంయమి (కర్మయోగి)కి అదే కర్తవ్యకర్మకు అనుకులమైన కాలం.
తన కర్తవ్యంలో మనస్సుని లీనం చేసినవాడు ప్రసన్నుడౌతాడు. ఎందుకంటే అన్నిటికంటే ఎక్కువ ప్రసన్నత కార్యం సంపన్నమైనప్పుడే కలుగుతుంది. ఏదో కొంత చేసేవాడికే ప్రసన్నత.
ఉత్తమ గుణ వికాసము, మనుష్య వ్యక్తిత్వ వికాసము,అనేవి నిరంతర పరిశ్రమ సంభవం. సమాజంలో మనస్థాయి పలాయనం పైన ఆధారపడి ఉండదు. కర్మనిరతిపైనే ఆధారపడి ఉంటుంది. కర్మచేసేవాడి ముందుకే వ్యవహారిక సమస్యలు వస్తాయి. సమస్యలు ఎదురైనప్పుడే వాటికి సమాధానాలు వెతకడం జరుగుతుంది.
ఒక జాతిని అదివున్న స్థితినుంచి అది ఉండవలసిన స్థితికి మార్చగలిగిన వాడే నిజమైన రాజనీతిజ్ఞుడు -డబ్యూ. ఆర్‌. ఆల్జర్‌
Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: