''మౌనమే ఉత్తమ సంభాషణ కానీ మాట్లాడ్డం అవసరమైతే తప్పక మాట్లాడు. అయితే వీలైనంత తక్కువ. ఒక శబ్ధం అవసరమైన చోట రెండు వాడకు'' - మహాత్మాగాంధీ
అనగనగా ఒక ఊళ్ళోఒక పెద్దమనిషి ఉండేవాడు. అతడు ఒట్టి వాగుడు గాయ. ఎవరెన్ని రకాలుగా నచ్చజెప్పినా వాగుడు మాత్రం మానేవాడుకాదు. ప్రతి విషయం తనకు తెలుసనేవాడు. తెగ గొప్పలు చెప్పేవాడు. తాను చేయలేని పని లేదనేవాడు.
ఒకసారి అతడి నేస్తమొకడు. ''నువ్వు అన్నీ చేయగలవేమో కాని మన గొర్రెల గోపన్న లాగా, రాతిమీద నుండి రాతిమీదికి చెంగు చెంగున లేడి పిల్లలా దూకుతూ మన ఊరి కొండెక్కలేవు'' అన్నాడు. ఆ వాగుడకాయ పెద్దమనిషికి చాలాకోపం వచ్చింది. ఆయన ''అదేమీ లేదు! కావాలంటే పందెం కాయి నేను కుడా గోపన్నలాగే పర్వతం ఎక్కగలను అన్నాడు. అతడు పందెంలో ఓడిపోతే అతిగా మాట్లాడటం మానాలని లేదా అతడు కొండెక్కగలిగితే అతనికి 1000
రూపాయల నగదు ఇవ్వాలని నిర్ణయించారు.
అందరూ చూస్తుండగా గోపన్న వాగుడుగాయీ కొండెక్కడం మొదలెట్టారు. ఆయనగారు తన సహజధోరణిలో తన చిన్నప్పుడు ఎలా కొండలెక్కే వాడో ఏమేమి సాహసకృత్యాలు చేశాడో చెబుతూ ఎక్కుతున్నాడు. గోపన్న చిరునవ్వు నవ్వుతూ ముందుకు సాగాడు. ఒక 10 నిమిషాలు ఎక్కేసరికి మనవాడి పని అయిపోయింది. ఆయాసంతో ఇకతాను ఒక్కఅడుగు కూడ ముందుకు వేయలేనంటూ చతికిలబడి పోయాడు. గోపన్న నవ్వుతూ, ''మామూలుగా ఎక్కితే మీరూ ఎక్కగలిగే వారండి. మాట్లాడుతూ ఎక్కడం ఎవరికీ సాధ్యంకాదు'' అన్నాడు.
మన వాగుడుగాయ కాసేపు ఆలోచించి ఇలా అన్నాడు. ''నిజమే ఎక్కువగా వాగడంవల్ల చిన్నకొండే ఎక్కలేకపోయానే. మరి జీవితంలో విజయం అనే శిఖరాన్ని వాగుతూ చేరడం ఇంకెంత కష్టం!''
ప్రపంచంలోని అన్ని పోట్లాటలకు అనుచిత భాషణమే కారణం. విశ్వశాంతిని మనం మన అసంతులిత వాణితో భంగం చేస్తున్నాము. మన కుటుంబ సభ్యులతో, మిత్రులతో, వ్యాపార వ్యవహారాలలో చక్కగా మాట్లాడటంవల్ల పని సాన్బులమవడం, వెగటుగా మాట్లాడటంవల్ల వ్యవహారం చెడటం రెండూ జరుగుతాయి.
మీరు మీజీవితాన్ని ఒక్కసారి సింహావలోకనం చేసుకోండి. ఎక్కడయితే జీవితంలో మీరు అపజయం పొందారో, అవన్నీ ఒక లిస్టుగా వ్రాసుకోండి. అన్ని సంఘటనలలోనూ దాదాపు కఠోరవాణే దూరిందని తెలుస్తుంది. ఇతరుల స్వాభిమానాన్ని మీరు దెబ్బకొట్టినప్పుడు ఇతరుల యొక్క బలహీనతలను మీరు అవహేళన చేసినప్పుడు, ఇతరుల యొక్క భావనలను మీరు నిరాదరించినప్పుడు, ఇతరులను మీరు అవమానించినప్పుడు, ఇతరుల యొక్క అవకాశం, పరిస్థితిని పట్టించుకోకుండా వారిని దోషులుగా నిలబెట్టినప్పుడు లేదా ఆసక్తి, క్రోధం, లోభం మొదలైన వాటికి మీరులోనై, మీ మాట పై, మీరు అదుపును కోల్పోయినప్పుడు తప్పక మీరు ఇతరులను శతృవులుగా మార్చుకుంటారు.
ఆచార్య రామచంద్రశుక్ల మితభాషి. ఒకసారి ఆయన శిష్యులిద్దరు ఈ విషయంపై పందెం వేసుకున్నారు. ఒకడన్నాడు ''నేను గురువుగారి నోటివెంట ఒక్కసారి ఐదు మాటలు వెలువడేట్టు చేస్తాను'' ఇంకొక శిష్యుడన్నాడు. ఇది సాధ్యం కాదన్నాడు.
వారిద్దరూ ఆచార్యుల వద్దకు వచ్చారు. మొదటివాడు ''గురుదేవ్ నేను మీతో ఐదు మాటలు మాట్లాడిస్తానని వీడితో పందెం వేశాను, దయచేసి ఐదు మాటలు మాట్టాడండి'' అన్నాడు.
ఆచార్య నవ్వుతూ ''నీవు.. ఓడిపోయావు'' అన్నారు.

మాట అన్నిటికన్నా గొప్ప సాధన. మీ ఆలోచనలను వ్యక్తం చేయాలన్నా, భావనలను ప్రకటించాలన్నా వాణి మార్గం. కనుక మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆగండి. కండ్లు మూసుకుని ఆలోచించండి. మనసులోని ఉద్రేక వేగాలకుఆనకట్ట వేయండి. అవసరమైనంతే వాణి ద్వారా ప్రకటించండి. విజయం మీదౌతుంది. లక్ష ఆలోచించినా ఉపయోగంలేదు. వేయిచెప్పినా ఫలితంరాదు. ఏదో విధంగా నూరు పనులు చేసినా కూడా ఫలితం శూన్యం.
శాస్త్రీయమైన ఆలోచనతో కూడిన ఆచరణతో ఒకమంచి పనిచేసి ప్రయోజనం పొందితే అది అన్నిటికన్నా మిన్న. - ఒక సూక్తి

Post A Comment:
0 comments: