" meet Life as it reaches you,with or without the things our Mind demand. Life can be a brilliant success." - స్వామి చిన్మయానంద
జీవితమంటే సంఘర్షణ. పరిశ్రమ చేయకుండానే సిద్ధించే పని ఏదీ ఈ లోకంలో లేదు. శక్తివంచన లేకుండా ప్రయత్నించడం ద్వారానే కార్యసిద్ధి కలుగుతుంది. నిజంగా మీరు జీవితంలో విజయమే కోరుకునేట్లయితే సర్వశక్తులు వినియోగించి ప్రయత్నించండి. ఏ కష్టాన్నిగాని, వ్యక్తినిగాని పట్టించుకోవద్దు. అమెరికా అధ్యక్షుడయిన ధియోడర్ రూజ్‌వెల్ట్ యొక్క విజయానికి ఇదే కారణం. ఆయన ఏది నిశ్చయించినా దానిని సాధించడం కొరకు తన సంపూర్ణవ్యక్తిత్వశక్తిని సంకల్పంతోపాటు కలిపేవాడు. ఆయన సగం మనస్సుతో ఏపని చేసేవాడుకాదు. అలా పూర్తి మనస్సుకు పనిలో నియోగించినవారికి మార్గం తనంతటతానే ఏర్పడుతుంది. ఎవరైతే కష్టాలగురించి ఆలోచిస్తారో వారినే అవి బాధపెడతాయి. వాటి భయంలో అతడు మార్గాన్ని విడిచిపెడతాడు. అటువంటివారు జీవితంలో ఎప్పుడూ సఫలులుకాలేరు. వారు పిరికి పందలు. కొద్ది కష్టం వచ్చిందంటే పారిపోతారు. నిజానికి జీవితంలో కష్టాలు ఎక్కడ మాత్రం లేవు? కాని ఏ వ్యక్తిఅయితే ఈ బాధలన్నింటినీ సహించి తన ఆదర్శం పూర్తిచేసుకుంటాడో అతడే మహాత్ము డౌతాడు. తపస్సు చేయనిదే సంసారంలో ఖ్యాతిపొందడం సాధ్యంకాదు. ఈ సంసారంలో ఎవరికి ఎంత ఎక్కువ ఖ్యాతి ఉందో వారు అంత ఎక్కువగా తపస్సు చేశారని తెలుసుకోండి. యుద్ధం చేయడంలో ఉంది గొప్పదనం. పారిపోవడంలో కాదు.
ప్రపంచంలో ఏదేశ చరిత్ర వెదికి చూసినా నాగరికత యొక్క వికాసం సంఘర్షణతో నిండిఉంది. ఆరోజు మన పెద్దలు స్వాతంత్య్రం కొరకు పోరాడకపోతే, మనవారంతా భార్య, పిల్లలు, సుఖభోగాలు త్యాగం చేసి ఆత్మార్పణ చేయకపోతే ఈరోజు మనకీ సుఖాలు లభించేవా? ఈరోజు కలోగంజో కాచుకు త్రాగుతూ పరుడిచెప్పు క్రిందపడి ఉండకుండా ఉన్నామంటే ఆ గొప్పతనం ఆరోజు సంఘర్షణది కాదా? ఆ మహాత్ముల తపస్సు ఫలితం కాదా? ఆరోజు మనవారు బ్రిటీష్ వారితో యుద్ధం చేయక పోతే అది సాధ్యమయ్యేదా? పిల్లవాడుకష్టాలకు భయపడితే ఏనాడూలేచి నిలబడలేడు, నడవలేడు,పరిగెత్తలేడు, స్వతంత్రుడై సంపాదించు కొని తినలేడు. సేన యొక్క రక్తం ప్రవహించినవాడే దేశం రక్షించ బడుతుంది.

కష్టాలకు భయపడవద్దు, వాటిని ఎదురొడ్డి నిలబడటం నేర్చుకోండి. ఆదర్శాల రక్షణ కొరకు కష్టాలతో యుద్ధం చేయక తప్పదు జీవితంలో ప్రతి అడుగులోను కష్టాలు ఎదురౌతాయి. మీ సాహసాన్నంతా వెచ్చించి వాటితో యుద్ధం చేయాలి. ఈ ప్రపంచంలో లోభులు, లాలసలు, మోస కారులు మొదలైన వారి సంఖ్య ఎక్కువగా ఉంది.ఈ విధంగా ఉండటంవల్ల వీరు సుఖంగా బ్రతకగలరు. సత్యాన్ని, ధర్మాన్ని, ఆదర్శాలను ముందుంచుకొని జీవించడం ఈ ప్రపంచంలో చాలా కష్టం. ధర్మమార్గంలో ఉన్న మిమ్మల్ని క్రిందకి, తోసివేయడానికి ఎన్నో రకాలుగా ప్రలోభ పరుద్దామని చూస్తారు. ఆ క్షణంలో మీరు బలహీనతకు లోనయ్యారా క్షణిక ఆనందం లభించినా, జీవితాంతం మనోగ్లాని మిగులుతుంది. ఆదర్శ మార్గంలో వెళ్ళి డబ్బు సంపాదించుకొంటున్న వారిని చూసి ఈర్ష్యపడకండి. డబ్బు ముఖ్యం అనుకుంటే మీరు కుడా అదే మార్గంలో వెళ్ళేవారు. మీరు దానికన్నా మనశ్శాంతి ముఖ్యం అనుకున్నారు. కనుకనే ఈ మార్గంలోఉన్నారు.
జీవితంలో ఒక లక్ష్యం ఏర్పరచుకోవాలి. తరువాత ఆ లక్ష్యం కోసం సర్వశక్తినీ వినియోగించి కృషిచేయాలి. - కార్లైల్.
జీవితంలో ఒక లక్ష్యం ఏర్పరచుకోవాలి. తరువాత ఆ లక్ష్యం కోసం సర్వశక్తినీ వినియోగించి కృషిచేయాలి. - కార్లైల్.

Post A Comment:
0 comments: