''మనస్సులో క్రోధం ఉత్తేజం కలుగగా దానిని శాంతివైపు మళ్ళించిన వాడిని నేను సారధి అంటాను. మనుష్యుడు క్రోధంపై ఆక్రోధంతోను, అసాధుతపై సాధుత్వం తోను, లోభంపై ఉదారతతోను, అసత్యంపై సత్యంతోను విజయాన్ని పొందగలడు''. – గౌతమబుద్ధుడు
డాక్టర్ ఇక్‌బాల్ గొప్ప దేశభక్తుడు. ఉర్ధూ, సాహిత్యంలో గొప్ప షాయర్‌గా (కవి) కూడా ప్రసిద్ధుడు. స్వాతంత్య్రానికి ముందు ఆయన వ్రాసిన దేశభక్తి కవితలు ఎందరో యువకులకు ఉత్తేజాన్ని ఇచ్చాయి. ''సారే జహాసే అచ్ఛా, హిందుస్తాన్ హమారా''... అనే ఆయన గీతం హిందీ మాతృభాషగా కలిగిన ఉత్తరాదిలోనే కాదు. దానిఅర్ధం తెలియని దక్షిణాదిన కూడా అది ఎంతోమంది నోట నలిగింది.
డా|| ఇక్‌బాల్ ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఉండేవాడు. అందుకే ఆయన కవితలు అందరినీ సంతోషపెట్టగలిగాయి. ఒకసారి ఆయనను కలవడానికి ఒక మౌల్వీ వచ్చాడు. మాటల సందర్భంలో సంగీతం విషయం వచ్చింది.ఆ మౌల్వీ స్త్రీలు పాటలు పాడడాన్ని ఎంతో నిరసించాడు. ఆయన ఇక్‌బాల్‌తో స్త్రీలు పాడిన పాటలు వినడం వల్ల కామోద్రేకం కలుగుతుంది. అంతేకాదు వారిని చూస్తూ వారి పాట విన్నామంటే చాలు ఇక, కాముకత మరీ విపరీతమౌతుంది.'' అన్నాడు.
డా|| ఇక్‌బాల్ నవ్వుతూ ఇలా అన్నాడు. ''ఐతే ఒక పనిచేయండి. స్త్రీల కచేరీలకు వెళ్ళినప్పుడు లంగోటీ బలంగా లాగి కట్టుకోండి. కండ్లకు గంతలు కూడా కట్టుకు వెళ్ళండి. అప్పుడు వారి పాటలు విని ఆనందించగలరు. దానివల్ల మీకు హాని కూడా ఏమీ ఉండదు''.
ఆ మౌల్వీసిగ్గుతో తలవంచుకున్నాడు
మనస్సు మార్గాన్ని మళ్ళించడంలోనే విజయం ఉంది. ప్రస్తుతం మనస్సు యొక్క గతి ఎటువున్నది? నేనుదాన్ని ఎటుతీసుకువెళ్ళదలచుకున్నాను, అనే విషయం ఎప్పుడూ స్మ ృతిపథం నుండి జారనివ్వవద్దు. మీ ఆదర్శం (లక్ష్యం) వైపే మీ మనస్సు వెళ్ళాలి. వ్యర్ధస్థానాల నుండి మీ మనస్సు తిరిగివచ్చి కాసేపైనా మీరు ఆజ్ఞాపించిన చోట తిరిగి కూర్చోగలుగుతుంటే మీరు తప్పక గమ్యం చేరుకోగలరని తెలుసుకోండి. మనస్సును అదుపులో పెట్టుకోవడంమంటే దానిని తొక్కిపట్టడం కాదు. లేదా దానికి భయపడటం అంతకన్నా కాదు. సుప్రసిద్ధ హిందీ కవియిత్రి మహీయన్ మహాదేవివర్మ యొక్క జీవిత సంఘటన ఒకటి యున్నది. ఆవిడ బౌద్ధభిక్షువు అవుతూ ఆగిపోయింది. ఆవిడ స్వయంగా ఆ విషయం ఇలా చెప్పుకున్నది.
''అప్పుడు నేను ప్రీవియస్‌లో చదువుతున్నాను.ఆ రోజుల్లో బౌద్దభిక్షువు నవ్వాలని నాకెంతో అనిపించింది.అప్పుడు సిలోన్‌లోని బౌద్ధ సంఘానికి భిక్షువు నవదలచుకున్నాను, దీక్ష తీసికోవడానికి నన్ను రమ్మంటారా లేక మీరే భారత దేశానికి వస్తారా?' అని వ్రాశాను. వారు దానికి జవాబుగా ''మేము భారతదేశానికి వస్తున్నాము. నైనితాల్‌లో మా విడిది ఉంటుంది అక్కడికి వచ్చి కలవండి'' అని వ్రాశారు. నేను భిక్షిణి కావాలని నిశ్చయించుకొని నా సంపత్తినంతా దానం చేశాను. నైనితాల్ వెళ్ళితే అక్కడ ఇంగ్లీషు దొరలకన్నా భోగాలెక్కువగా కనిపించాయి. వీరు భిక్షువులా? భిక్షువులే కాదలచుకుంటేఈ సంపత్తి అంతా ఎందుకు? అనుకున్నాను. సింహాసనంపై గురువుగారు కూర్చొని వున్నారు. ముఖాన్ని విసనకర్రతో కప్పుకున్నారు. నేను ఇంకోవైపునుండి అయన్ను చూడటానికి ప్రయత్నిస్తే వారి ముఖం తిప్పేసుకున్నారు. బయటకి వచ్చాక మంత్రి మహోదయుణ్ని అడిగితే 'మహాస్థవీరులు'' స్త్రీ ముఖాన్ని వీక్షించరు అన్నాడు.
అంటే ఆయనపై ఆయనకే నమ్మకం లేదన్నమాట. అటువంటి బలహీనుడి నుండి నాకు దీక్ష తీసుకోవాలనిపించలేదు. ఆ తరువాత వారెన్నో ఉత్తరాలు వ్రాశారు. కానీ నేను జవాబు నివ్వలేదు. ఈ మనస్సు అంత తొందరగా మాట వినదు.అన్నిచోట్లకు తిరిగి రావడం దాని యొక్క స్వభావం. మరి ఇది ఎలా అదుపులోకి వస్తుంది? దీనికి జవాబు గీతాచార్యుడు చెబుతున్నాడు.
''అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే''
అభ్యాసం వల్ల వైరాగ్యం వల్ల మనస్సు అదుపు చేయబడుతుంది. మనస్సు దేనిని ప్రేమిస్తుందో, అన్నిటినీ వదిలి అది అక్కడికి వెళుతుంది. అలాంటి మానసిక వత్తిడినే వైరాగ్యం అంటారు. అంతే కాని బలవంతంగా వస్తువులను విడిచిపెట్టడం వైరాగ్యం కాదు.
''హంసాపామే మానససరోవర్ తాల్ తలమ్యా క్యోండోలే'' అంటాడు కబీర్‌దాస్. మానవ సరోవరాన్ని చేరిన రాజహంస చెరువులు, కుంటలకు వస్తుందా? కనుక మీకు దేనిపైనైతే ప్రేమ ఉందో దానినే లక్ష్యంగా చేసుకోండి. అప్పుడు సహజంగానే మనస్సు తక్కినవాటి నన్నిటినీ వదిలి
ఆ లక్ష్యం వైపుకు వెళుతుంది. రెండవది అభ్యాసం. మనసు ప్రత్యేక వస్తువు పైన ఉన్నా అలవాటు కానంతవర్బ అటూ ఇటూ పరిగెత్తవచ్చు. కనుక అభ్యాసం నిరంతరం పరిశ్రమ కూడా మనస్సుకు అవసరం.
ఈర్ష్యా, ద్వేషం, చింత, అశాంతుల యొక్క తల్లి అయిన భయాన్ని సమూలంగా నాశనం చేయండి, లేదా మనస్సులో ఉత్సాహం హర్షం ఉత్పన్నం కాదు. చిత్తం ఏకాగ్రం కాదు. ఏ కార్యంలోనూ పూర్తి శక్తిని వినియోగించలేరు. కనుక మనస్సును కాస్త అదుపు చేసుకొని సఫలత పొందండి.
పని చేయనివాడే సోమరిపోతుకాడు పనిబాగా చేయని వాడు కూడా సోమరిపోతే. - సోక్రటీస్

Post A Comment:
0 comments: