ప్రేమ విశ్వాసాలతో చేయండి ''స్వశక్తి పై విశ్వాసంలోనే బలం ఉంది'' - బోబీ

విశ్వాసమే బలం. తనకు తెలిసినంత వరకు తనపై తాను పూర్తి నమ్మకం పెట్టుకున్నవాడికి సంసారంలో అసంభవమైన విషయమే లేదు'' - అంటాడు    'జేమ్స్‌ ఎలన్‌'. విశ్వాసమే మూలశక్తి, ఎవరికైతే తన వ్యక్తిత్వంలో విశ్వాసం, శక్తిలో విశ్వాసం, విజయంలో విశ్వాసం, శీలంపై విశ్వాసం, తన సాధనపై విశ్వాసం ఉంటుందో, అతడిలోనే ఆత్మబలం ఉంటుంది. జీవితంపై ప్రేమ, సేవాభావంపై ప్రేమ, మానవతపై ప్రేమ, శీలంపై ప్రేమ, సద్వ ్యవహారంపై ప్రేమ ఉంటేనే మనం ఉదారులం, సహనశీలురం, శీలవంతులం కాగలుగుతాము. మన ఆశయాలపై మనకున్న ప్రేమే మన సచ్చరిత్రకు మూలం.

నార్వేకి చెందిన సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి సిగ్రిడ్‌అన్‌సెట్‌కు నోబుల్‌ బహుమతి లభించింది. ఎప్పుడైతే ఆవిడకు నోబుల్‌ బహుమతి లభించిందని ప్రకటించబడిందో ఆవిడను అభినందించడానికి అనేకమంది పాత్రికేయులు ఆవిడ ఇంటికి వచ్చారు. డ్రాయింగ్‌ రూములో కుర్చుని ఉన్నవారి వద్దకు ఆవిడ వచ్చి ఇలా అంది. ''ఈరాత్రి సమయంలో మీరు ఇక్కడికి రావడానికి కారణం నేను ఎరుగుదును. ఇప్పుడే టెలిగ్రామ్‌ ద్వారా నాకు నోబుల్‌ బహుమతి లభించిందని తెలిసింది. మీ అభిమానానికి కృతజ్ఞురాలిని. కాని ప్రస్తుతం నేను మీతో మాట్లాడ లేను. కనుక దయచేసి మీరు ఇంకొకసారి ఎప్పుడైనారండి''. వారంతా ఏక స్వరంతో 'ఇలా మమ్మల్ని మళ్ళీ రమ్మనడానికి కారణం తెలుసుకోవచ్చా!' అన్నారు. ఆవిడ అంది '' నాపిల్లలకు భోజనం పెట్టి ఇప్పుడే నిద్రబుచ్చుతున్నాను. ఇది వాళ్ళు నిద్రించే సమయం. నాకు నోబుల్‌ బహుమతి వచ్చిన విషయం ఆనందాన్ని కలిగించినా అంతకన్నా ఎక్కువ ఆనందం నా పిల్లల్ని లాలించడంలోనూ వాళ్ళ అవసరాలు చూడటంలోనూ నాకు కలుగుతుంది.''
ఇదే మాతృమూర్తికి బాధ్యతాయుతంగా తన పిల్లల యొక్క అవసరాలు చూడటంపై గల ప్రేమ.

డాక్టరుకు రోగియొక్క సేవలో ప్రేమ ఉండాలి. వకీలుకు న్యాయ విజయంపై ప్రేమ ఉండాలి. అధ్యాపకుడికి విద్యార్ధిని జ్ఞానవంతుడిగా తీర్చిదిద్దడంలో ప్రేమ ఉండాలి. అలా స్వీకృతవృత్తిపై ప్రేమ ఉన్నప్పుడే నిజంగా వ్యక్తి పరిశ్రమించగలడు.

మనం ఏ ధర్మాన్ని కర్తవ్యాన్ని లక్ష్యాన్ని, లేదా ప్రయోజనాన్ని నిశ్చయించు కుంటామో దానిని భగవంతుడిలా పవిత్రంగా ఎంచాలి. లక్ష్యం లో మనకు ప్రేమ దృఢమై ఉన్నంతవరకు ప్రపంచంలోని ఏ కఠిన పరిస్థితీ మనకు గమ్యం నుండి దూరంచేయలేదు. నిజమైన ప్రేమ, అచంచల విశ్వాసం, ఏకాగ్రచిత్తంలేనిదే జ్ఞానతృష్ణ సంతుష్టి చెందదు. ఎవరికైతే తమ ధర్మంలో విశ్వాసం ఉందో వాడే సుఖి. సుఖం విశ్వాసం నుండి లభిస్తుంది. తర్కంకొద్ది దూరమే మిమ్మల్ని తీసుకు వెళ్ళగలుగుతుంది. కానీ చేసేపనితో, దృఢత్వం కావాలంటే ధ్యేయంలో విశ్వాసం అనివార్యం.

ఎక్కడైతే ప్రేమ-విశ్వాసం ఉందో, ఎక్కడైతే మనస్సు లగ్నమౌతుందో అక్కడే శక్తి ఉంది. అక్కడే సఫలత నిశ్చితమై ఉంది. విజయం ధనం. వస్తువులు చేర్చడంవల్ల లభించదు. అది దృఢసంకల్ప శక్తిలోను, వ్యక్తియొక్క కర్మ తత్పరత లోను, అతని మానసిక ఏకాగ్రతలోను దాగివుంది. అక్కడే అతని శీలం మచ్చలేని దౌతుంది. నిజానికి అదే సఫలత. భగవంతుడిలో విశ్వాసం ఉంచినవాడు, ఇష్టదైవంలో నమ్మకముంచిన వాడు, సంకట పరిస్థితుల్లో ఇదంతా భగవంతుడి కృపగా భావించి దానిని భరిస్తాడు. వాడి విషయంలో అసలు దుఃఖమే లేదు. వాడిలో అలసటలేదు. కష్టంలేదు, నిరాశలేదు. 'భగవంతుడున్నాడు' అన్న విశ్వాసం అతని విపత్తులన్నింటిని దూరం చేస్తుంది. అతడికే జీవితంలోని పొడుపు కథలన్నింటికి జవాబు లభిస్తుంది. నీకు సుఖాలిచ్చే అధికారం ఆయనకు ఉన్నప్పుడు కష్టాలిచ్చే హక్కు మాత్రం లేదా? పిల్లవాడి పుండును తుడిచి మందువేసి కట్టుకడుతున్న తల్లి ఆ పసివాడికి్ బరురాలిగానూ, శత్రువులాగానూ, కనపడవచ్చునేమోగాని నిజానికి అదంతా వాడి మంచిని కోరే ఆ తల్లి చేసింది. ఆ విషయం మానసికంగా ఎదిగిన వారికే తెలుస్తుంది. వారినే భక్తులంటారు.

దేశం నీకేమి ఇచ్చిందని ఆలోచించకు దేశానికి నేనేమి ఇవ్వగలనని ఆలోచించు   - జాన్‌ ఎఫ్‌. కెనడీ
Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: