ఏప్రిల్ 2015
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
కొత్త సత్యాలను ప్రతిపాదించడం కష్టంకాదు. పాత దురలవాట్లను తొలగించడమే దుర్లభం. మనుషులు స్వాభావికంగా కొత్తవాటికి స్వాగతం చెబుతారు. కానీ పాతవాటిని వదులుకోరు.''
విజ్ఞానం :
ఇది విజ్ఞాన విస్ఫోటనయుగం. సైన్స్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరం ఇది. ఒకప్పుడు గుఱ్ఱంమీద గంటకు 25 కి.మీ వేగంతో ప్రయాణించిన మానవుడు, ఇప్పుడు 30 వేల కి.మీ పైబడిన వేగంతో రోదసిలో ఉపగ్రహాలను తిప్పుతున్నాడు. వార్తను ఒక ప్రాంతం నుండివేరొక ప్రాంతానికి చేర్చడానికి కొన్ని నెలలు పట్టేరోజులు వెళ్ళిపోయి, భూమిమీద ఎక్కడో వేలమైళ్ళ దూరంలో జరిగే విషయాన్ని సెటలైట్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు చూసే రోజులు వచ్చాయి
ఘర్షణ :
వృద్ధులకు ఈ ప్రంచంలో విలువలన్నీ అడుగంటిపోతూ కనిపిస్తున్నాయి; మధ్యవయస్కులు కొత్తపాతల మధ్య ఊగిస లాడుతున్నారు.యువతరానికి తక్కిన వారు ఛాదస్తులు, అడవి మనుషులుగా కనిపిస్తున్నారు.
తలోదారి :
వృద్ధులు, మార్పులను ప్రతిఘటిస్తారు, యువకులు కొత్త మార్పుల కొరకు పరితపిస్తారు. వృద్ధులు ఉమ్మడి కుంటుంబ వ్యవస్థ శిధిలమైపోతోందని పరితపి స్తుంటే, యువకులు ఒంటరి తనం లభించడంలేదని బాధపడతారు. ఈ మార్పును జీర్ణించుకొని యువతరానికి దగ్గరవ్వాలో లేక సనాతన వ్యవస్థకు పట్టంగట్టి పై తరాన్ని గౌరవించాలో తెలియక నలిగిపోతారు మధ్య వయస్కులు.
సమన్వయం :
పల్లెలలో బ్రతికినవారు మహానగరాలలో ఉక్కిరిబిక్కిరవడం సహజం.వారి నర్ధం చేసుకొని మెలగడానికి యువతరం ప్రయత్నించాలి. తాము మారకపోయినా ఫరవాలేదు గాని యువతరానికి ప్రతిక్షణం అడ్డుపడుతూ, తాము బ్రతికినట్లే వారిని బ్రతకమనకుండా ఉండాలి పెద్దతరం.

మార్పులను అవసరాన్ని గుర్తించి,వాటి స్వభావాన్ని అర్ధం చేసుకొని, వాళ్ళ ఆలోచనలను, ప్రవర్తననూ ఆయా పరిస్థితులకు అనుగుణంగా సమన్వయం చేసుకోగలగాలి మధ్యతరం.
వ్యాపార సరళి :
కేవలం నమ్మినంత మాత్రాన ఇంతకు మునుపు చేయని పనులు కొత్తగా చేయడం కష్టమంటారు గానుగెద్దులాంటి మనుషులు. మారదలచుకున్నవాడు ముందు పాత అలవాట్లను వదులుకోవడానికి సిద్ధపడాలి. మనమంతా కొత్త జీవన సూత్రాలను వెతుకుతూ బయలుదేరుతామే గాని తెలిసినవాటిని ఆచరించడానికి ప్రయత్నించం. ఈ బలహీనతను ఆధారంగా చేసుకునే పాతసబ్బులు, పేస్టులకు కొత్తది (శ్రీలిగీ)అని వ్రాసి అమ్ముకుంటారు వ్యాపారవేత్తలు.

ఎలా నమ్మడం :
ఒకసారి ఒకవ్యక్తి కాలుజారి ఒక లోయలో పడిపోతూ చేతికి దొరికిన ఒక ఊడను పట్టుకున్నాడు. క్రిందికి చూస్తే అగాధం పైకి చూస్తే ఆకాశం. ఏం చేయాలో దిక్కుతోచకుండా ఉన్న అతడు ''ఎవరన్నా నన్ను రక్షించేవారున్నారా'' అన్నాడు. ఇంతలో ''నా పైన నీకు విశ్వాసం ఉంటే పట్టుకున్న ఆ ఊడను విడిచిపెట్టు'' అనే గంభీరమైన వాణి ఆ లోయలో ప్రతిధ్వనించింది. వెంటనే ఆ వ్యక్తి ''ఇంకెవరన్నా ఉన్నారా'' అన్నాడు.
సాగిపోండి :
అందుకే భూతకాలపు విలువలనే విశ్వసించాలా! లేక వర్తమానపు విలువపై ఆధారపడాలా? లేక కొత్త పాతలలో ఏది ఉత్తమం అనిగానీ ఆలోచించక ఎదుటి తరంస్థానంలో నిలిచి వారి స్థితిగతులను అర్ధం చేసుకొని ఏది అవసరమో, ఏది అనవసరమో గ్రహించి, అనవసరమైన దాన్ని విడిచిపెట్టి అవసరమైన దాన్ని స్వీకరిస్తూ అందరితో కలిసి బ్రతకవచ్చు.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
''తరువాత చేయబోయే కార్యమేమిటో తెలుసుకోవడమే వివేకం; దానిని సరిగా చేయడం నైపుణ్యం; దానికి పూర్తి చేయడం సద్గుణం''.

పని :
బరువైన ఒక బల్ల ఒక వ్యక్తి లేపగలడా? లేపలేడు అందుకు కనీసం నలుగురు కావాలి.మరి ఆ నలుగురు ఒకే పక్కన పట్టి లేపితే ఆ బల్ల లేస్తుందా?... లేవదు, నలుగురు నాలుగువైపులా పట్టాలి. నలుగురూ నాలుగువైపులా పట్టినప్పటికీ అంతా ఒకేసారి పట్టి లేపకపోతే అది లేస్తుందా? లేవదు. అంటే దీని వల్ల నలుగురు కలిసి ఒకేసారి నాలుగువైపులాపట్టి ఒకేసారి ఆ బల్లను అక్కడి నుండి లేపి అవసరమైన మరోచోటికి తీసుకువెళ్ళి పెట్టాలి అనే సంకల్పంతో పనిచేసినప్పుడే పని అవుతుందన్నమాట. నలుగురు కలిసి పనిచేయడాన్ని ''సహకారం' (Co-operation) అంటారు.
నలుగురు కలిసి పనిచేయాలనే ఆలోచన కలిగి ఉండటాన్ని ''భావ సహకారం'' (Thought Co-operation) అంటారు. నలుగురు కలిసి పనిచేయడానికి సిద్ధపడటాన్ని ''సామాజిక సహకారం'' (Social Co-operation) అంటారు.
నలుగురిని నాలుగువైపుల బల్ల లేపడానికి నియమించడాన్ని ''సమన్వయం'' అంటారు. నలుగురు నాలుగు వైపుల పట్టి లేపడాన్ని ''దేశ సమన్వయం'' (Spacial Co-ordination) అంటారు.నలుగురు నాలుగువైపుల పట్టి ఒకేసారి లేపడాన్ని ''కాలసమన్వయం' (Timely Co-ordination) అంటారు.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
అడ్లర్‌ వైయక్తిక మనోవిజ్ఞానం (Individual Psycology) అధికార వాంఛా ప్రధానమైనది. ఆయన మనుషులంతా హీనతా గ్రంధి (Inferiority Complex) కి లోనై ఉన్నారంటాడు. వ్యక్తి జీవితంలో ఎక్కడ, ఏవిధంగా, ఏస్థితిలో ఉన్నప్పటికీ నాకన్నా తక్కినవారు ఉన్నతంగా ఉన్నారని, ముందున్నారని, ఎక్కువగా కలిగి (ధనం, అందం, పేరు ప్రతిష్టలు మొ||) ఉన్నారనే మానసిక వ్యధ వారిని విడువకుండా ఉండటమే హీనతా లేదా న్యూనతా గ్రంధి అంటే.

ఉక్రోషం :
మనిషి తనలో ఉన్న లోపాన్ని సరిదిద్దుకోవడం, లేదా కప్పిపుచ్చుకోవడం కొరకు మహత్వ కాంక్షతో మునిగిపోతారని సిద్ధాంతీ కరించాడు అడ్లర్‌. చిన్నతనంలో ఏ పిల్లలయితే త్వరగా నడక నేర్చుకోరో వారే పరుగుపందాలలో గెలుపొందే గొప్ప ఆటగాళ్ళుగా వన్నెకెక్కుతారని, ఒంటి కన్నువారు మామూలుగా రెండు కండ్లు ఉన్నవారికన్నా తెలివిగలవారవుతారని అనేవాడాయన. అది రెండు కండ్లతో చేయగల పనిని ఒకే కన్నుతో సాధిద్దామని ప్రయత్నించడం వల్ల వచ్చిన కపటమని, అలాగే మేము ఇతరులలాగ నడవలేమన్నారు కదా చూడండి మేము అందరికన్నా వేగంగా పరిగెత్తగలం అని చెప్పిన ఉక్రోషమని అనేవాడాయన.


హీనత అనివార్యమా :
అయితే తమలోని లోపాల వల్ల హీనతాగ్రంథి, దీనివల్ల అధికారవాంఛ ప్రతివారికి అనివార్యమని, దీనివల్ల ప్రపంచంలోని అడుగడుగునా ప్రజల మధ్య పోటీ తప్పదని, స్పర్ధ తప్పదని దీనివల్లే ప్రజలలో కలహం సహజమని దీనిలో నుండి బైటపడటానికి అధికార వాంఛను కాస్త తగ్గించు కోవాలని ఆయన అంటారు. కానీ ఆ తగ్గించుకోవడం ఎక్కడివరకు? అనేది ప్రశ్న వాంఛఅనేది ఉన్నప్పుడు అది ఏస్థాయిలోనన్నా తృప్తిపడుతుందా? బౌద్ధికంగా ఈ విషయం అందరి అవగా హనకు వస్తే, అధికార వాంఛ అనే ఈ పరుగుపందెం ఆగిపోతుందన్నాడు అడ్లర్‌.
కానీ ఇంత విశ్లేషణ నిచ్చిన ఆయనే స్వయంగా ఈ పోటీనుండి తప్పుకోలేక పోయాడు. తాను గురువునవ్వాలి, మార్గదర్శకుణ్ణవ్వాలి అనే వాంఛతో తన గురువైన డా|| ఫ్రాయిడ్‌ నుండి తప్పుకొని, తన కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ పోటీలో నుండి బైటపడి అంతా కలిసి జీవించే విధానం ఒకటి ఉన్నదంటాడు ''లాఓత్సే'' అధికార వాంఛ  అనేది రోగం; అది
ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఉన్నట్లే గాని రోగరహితులుగా ఎవరూ లేరు. ఈ రోగం పోనంతవరకు అంతా స్పర్ధారహితంగా జీవించడం సాధ్యంకాదు. మరి ఇది ఎలా పోతుంది? మార్గమేమిటి?
''మహానదులు, సముద్రాలు కనుమలకు ఏవిధంగా స్వామిత్వం వహించగలిగాయి? తమను నీచస్థానంలో నిలుపుకోవడం వల్ల, క్రిందికి ఒరగడం వల్లే అవి కనుమలకు స్వామిత్వం వహించగలిగాయి. కనుక ప్రజలకు స్వామిగా మారదలచిన వాడు, వారిని అనుసరించేవాడిలాగా మాట్లాడాలి. వారి వెనుక నడవాలి. ఇలా ఉండటం వల్లే సాధువు అందరికన్నా ఉన్నత స్థానంలో ఉంటాడు; ప్రజలకు ఆయన బరువుకాడు. ఆయన అందరికన్నా ముందు నడుస్తాడు. ప్రజలు ఆయనకు హాని తలపెట్టరు''. అంటాడు లాఓత్సే ''తన తావో తెహకింగ్‌'' అనే గ్రంధంలో.
ముందా ! వెనుక? :
అహంకారం, ఘర్షణకు, ఘర్షణ పోటీకి దారితీస్తుంది. ఈ పోటీ కారణంగానే ప్రజలు కలిసి బ్రతకలేరు. అందరికన్నా ముందుకు వెళ్ళాలి అని ప్రయత్నించేవాడు ఏ నాటికైనా ఓడిపోతాడు. తాటిని తన్నే వాడుంటే వాడి తలదన్నే వాడుండటం కూడా సహజమే కదా! కనుక జీవితంలో ఈపిచ్చి పరుగు వ్యర్ధమని గ్రహించి వెనుక నిలబడేవాడు ఎప్పుడూ విజయుడిగానే ఉంటాడు.
ముందుకు వెళదామని ప్రయత్నించేవాడే నిమ్నుడుగా మిగిలిపోతాడు. పోటీలో పాల్గొనని వాడితో పోల్చడానికి ఎవరున్నారు? పోల్చబడనివాడు ఎప్పుడూ శ్రేష్ఠుడే; నువ్వు ఎలాగుంటే అలాగే శ్రేష్ఠుడివై పోతావు. నదులు నిమ్న స్థానానికి వెళ్ళడానికి, క్రిందికి ఒరగడానికి సిద్ధపడతాయి. కనుకే అవి గొప్పవైనాయి.
పిల్లలే నయం :
ఈ ఒరిగిపోగల కళలు పిల్లలు బాగా ఎరుగుదురు. వారి శరీరంలోని కండరాలు, ఎముకలు అన్నీ చాలా మెత్తగా ఉంటాయి. వృద్ధులు శరీరాలు పెళుసుబారిపోతాయి. నిజానికి అదే మృత్యువు యొక్క లక్షణం నది సముద్రం వైపుకు ఒరుగుతుంది. అందువల్లే అది నిరంతరం ప్రవహిస్తుంది. అలాగే వ్యక్తి ్బడా అహంకార రహితుడై వినయంగా ఒరగగలిగితే నదిలాగా ప్రవహిస్తూ (జీవిస్తూ) ఉండగలడు. ఇది కేవలం శారీరిక విషయమేకాదు మానసిక విషయం కూడా. మానసికంగా తమకు తాము నిమ్నస్థానంలో నిలుపుకోగలవారే పైస్థానం నుండి వచ్చే జ్ఞాన గంగను అందుకోగలరు. ఇలా మానసికంగా ఒరగడం రాని వృద్దులు (ఈ స్థాయిలో ఉన్నవారు ఏ వయసు వారైనా సరే వారు వృద్ధులే) నేర్చుకోవడానికి అసమర్ధులు. అహంకారులంతా చివరికి జీవితంలో విరిగి ముక్కలౌతారు.
ఓడటమే ఆనందం :
ఎవరైనా మిమ్మల్ని వంచడానికి వస్తే మీరు ముందే ఒరిగిపొండి. వంచేవారికి ఆ మాత్రం శ్రమ ్బడా లేకుండా చేయండి. చిన్న పిల్లవాడికి ఆడుకోవడానికి ఎవరూ లేకపోతే తండ్రితో కుస్తీ పడతాడు. తండ్రి వాడి ఆనందం కొరకు క్రింద పడిపోయి తాను ఓడినట్టుగా నటిస్తాడు. ఇలా అతడికి ఓడటంలోనే ఆనందం, గౌరవము ఉన్నాయి. లేదా పిల్లలతో పోటీ పడే సిగ్గు లేని వాడవుతాడు. గెలవదలుచున్న వారంతా మూర్ఖులే, అజ్ఞానులే, ఈ గెలుపు ఏ నాటికీ శాశ్వతం కాదని వారికి తెలియదు. కేవలం గెలుచుకున్న అహంకార సంతృప్తిలో బ్రతుకుతారు వీరు. ఆ పిల్లవాడు ఏ నాటికైనా పెద్దవాడవుతాడు (ఎదుగుతాడు) ఆనాడు ఓడింది తండ్రికాదు తానేనని తెలుసుకుంటాడు. వివేకవంతుడు ప్రకృతి ప్రవాహానికి ఎదురీదడు. ఆ ప్రవాహంలో తానూ ఒకడౌతాడు.

ముందూ - వెనుక :
మీరు అందరికన్నా ముందు నడుద్దామని ప్రయత్నిస్తే ప్రజలు మిమ్మల్ని వెనక్కు తోసేస్తారు. కానీ ఎవరైనా ఈ పిచ్చి పోటీలో పాల్గొనక ప్రశాంతంగా వెనుక నిలబడితే చాలు మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటారు. ముందు నడవమని బ్రతిమిలాడతారు. ఇక్కడ వారి అహంకారాలు దెబ్బతినవు గనుక వారు మీకుహాని తలపెట్టరు.రాజకీయాలలోనైతే సింహాసనంమీద ్బర్చునే వారిని తక్కిన వారంతా క్రిందికి లాగుదామని, హాని తలపెడదామని చూస్తారు. వారికి నువ్వు ప్రతిద్వంద్వివి కావు అనే విషయం తెలిసినప్పుడు వారు మీకు ఏ హానీ చేయరు.
కానీ ఒకవేళ అందరికన్నా ముందు ఉండటం కొరకే మీరు ప్రజల వెనుక నడుద్దామని చూస్తే మాత్రం అందరికన్నా శ్రేష్ఠుడిగా గుర్తింపబడాలనే అహంకా రంతో వెనుక నిలబడటం అనే సాధనను ఆశ్రయిస్తే మాత్రం వెనుకే ఉండిపో గలరు. తనలో తాను సంతుష్టుడై గుర్తింపు కోరక వెనుక నడిచిన వారికి మాత్రం శ్రేష్ఠత్వం పరిణామంగా సిద్ధిస్తుంది.
ఆదేశం-ఉపదేశం-సందేశం-స్వతేజం :
ఆదేశాలు, ఉపదేశాలు, సందేశాలు ఎవరికీ నచ్చవు. ప్రజలు మిమ్మల్ని శ్రేష్ఠులుగా ఒప్పుకుంటే కదా మీనుండి ఇవన్నీ స్వీకరించడానికి, ప్రతివ్యక్తి అహంకారం అనే బురద పూసుకొని తనే శ్రేష్ఠుడిని అనుకుంటాడు. కనుక కలిసి జీవించదలచినవాడు ఆదేశాలు, సందేశాలు, ఉపదేశాలు ఇవ్వడం మానాలి. మీలో తేజస్సు పెరిగిననాడు మీరు తమకన్నా శ్రేష్ఠులనే విషయం వారికి అర్ధం
కాగలదు. అప్పుడు వారే మిమ్మల్ని సందేశం ఇవ్వమని అడుగుతారు. కనుక పోటీ పడటం మాని తేజస్సును పెంచుకోవడం మొదలు పెట్టండి.
ప్రేమ - బరువు :
శ్రీ రామతీర్ధ స్వామి ఒకసారి ఒక అరణ్యంలోని పర్వతం ఎక్కుతున్నప్పుడు,ఆ కాలిబాటలోనే నాలుగేళ్ళ పిల్లవాణ్ణి వీపున ఎక్కించుకొని ముందుకు సాగిపోతున్న ఎనిమిది సంవత్సరాల పాప కనిపించింది. మామూలుగా ఒక వ్యక్తి ఆ కాలిబాటలో కొండనెక్కి వెళ్ళడమే కష్టమైతే, కేవలం ఎనిమిదేండ్ల వయసు గల ఆ పాప ఆ పిల్లవాణ్ణి ఎత్తుకొని కొండ ఎక్కడం ఆయనకు ఆశ్చర్యాని కలిగించింది. ''పాపా! ఆ పిల్లవాడు నీకు బరువు కావడం లేదా?'' అన్నాడు. ఆ పాప ''వీడు నా
తమ్ముడు, మరి నాకెలా బరువవుతాడు!''అన్నదట.   
తప్పని పరిస్థితిలో ఏదైనా వస్తువును నెత్తి నెత్తుకోవాల్సి వస్తే అది మనకు చాలా బరువవుతుంది. కానీ అదే మనం ఇష్టపడి ప్రేమతో ఆ బరువెత్తుకుంటే అది మనకు భారంకాదు. అలాగే మనంతట మనం ఎవరి నెత్తినన్నా ఎక్కి కూర్చుంటే వారికి బరువవుతాము. కానీ అదే వారు ప్రేమతో నెత్తి నెత్తుకుంటే (తమకన్నా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టుకుంటే) బరువయ్యే ప్రసక్తే లేదు. కనుక ప్రేమ పెంచుకోండి? ఎవరికీ బరువు కాకుండా అందరితో కలిసి బ్రతకవచ్చు.
నీడలు - ఘర్షణ :
"Then the people of the world are glad No one in the world can contend against him"

''ఆ తరువాత ప్రపంచ ప్రజలు ఆనందంగా ఉంటారు, ఆయనకు వ్యతిరేకంగా ఎవరూ సంఘర్షణ చేయలేరు''. - తావో తెహకింగ్‌
రిన్‌ ఘాయీ అనే జెన్‌ తత్వవేత్త నీడలనుగురించి ఒక పాట వ్రాశారు. ''మెట్ల మీది చెట్టు నీడ చిమ్ముతోంది. (ఊడుస్తోంది) అయినా దుమ్ము లేవడం లేదు; సరస్సు మీద కొంగలు ఎగురుతున్నాయి వాటికి తమ ప్రతిబింబం నీళ్ళలో కనిపించాలని లేదు; సరస్సుకు వాటికి ప్రతిబింబించాలని లేదు అయినప్పటికీ ప్రతిబింబాలు తయారవుతూ మళ్ళీ అంతమవుతూ ఉంటాయి''. ఇలా జీవించడం నేర్చుకోండి. ఆకాశంలో ఎగిరే పక్షికి పదచిహ్నాలు ముద్రించబడవు. అలాఎవరితోనూ ఘర్షించని నీడలలాగా వర్తించినప్పుడు, సూక్ష్మ మైన హింసా వృత్తులను కూడా విడిచి పెట్టినప్పుడు పోటీ ఉండదు అప్పుడు కలిసి జీవించడం సులభమౌతుంది.   
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
There are some things that are so serious that you have to laugh at them.

నవ్వుతూ తుళ్ళుతూ ఉండే వారంతా గుంపుగా ఒకచోటకనిపిస్తారు మీకు. అంటే! నవ్వు వ్యక్తులను దగ్గరికి తెస్తుందన్న మాట ఈప్రపంచంలో గంభీరమైనదంటూ ఏదీలేదు. చూడగల కండ్లు ఉన్నవాడికి ప్రతి దానిలోనూ హాస్యం కనిపిస్తుంది. కొందరికి మాటలను చిత్రంగా వాడటంలోనూ, వ్యక్తులను, సంఘటనలను వ్యంగ్యం, హాస్యం అనే కోణాలలో చూడటలోనూ సహజమైన ప్రజ్ఞ ఉంటుంది. అయితే మనమంతా ఆ దృక్కోణాల నుండి జీవితాన్ని చూడటం అభ్యసించవచ్చు.

శత్రువులు లేరు :
ఇలా నవ్వించేవారు అందరికి దగ్గరౌతారు. వారు అజాతశతృవులు (శతృవులు లేని వారు) అవుతారనడంలో సందేహం లేదు. అటువంటి వ్యక్తులను నేనెరుగుదును. ఎప్పుడూ గంభీరంగాను కోపమొచ్చినప్పుడు మండిపడుతు ఆఫీసులో స్టాఫ్‌నంతా గడగడ లాడించే యముడిలాంటి ఆఫీసర్లు, మేనేజర్లు, డైరెక్టర్లు సహితం తమ ఆఫీసులోనే క్లర్కుగా పనిచేసే ఆవ్యక్తిని క్లబ్‌కు తీసుకుని వెళ్ళడం, పిక్నిక్‌కు తీసుకెళ్ళడం, తమ ఇంట్లో తమ బంధువుల మధ్య జరిగే పార్టీలకు ఆహ్వానించడం జరిగేది. చిన్న పిల్లల దగ్గరి నుండి ముసలివారి వరకు అంతా ఎప్పుడూ ఆయన చుట్టూ గుంపుగా ఉండేవారు. ఇలా అందరినీ ఆకర్షించ గలగడానికి కారణమేమిటో ఆయన మాటలు కొన్ని మీకు చెబితే అర్ధమవుతుంది.
హాస్య విధానం :
మొదటి స్టెనో గ్రాఫర్‌ ఎవరో తెలుసా! ''గణపతి'' ''షార్ట్‌హాండ్‌కు ఆపేరు రావడానికి కారణం గణపతి చేతులు పొట్టిగా ఉండటమే''.
''లంకా విజయం తరువాత రాములవారు పుష్పక విమానాన్ని కిష్కింధలో దింపిన తరువాత, కిష్కింధలో ఆడవాళ్ళంతా సీతమ్మ వారిని చూడటానికి వచ్చారు. ఒకరాతి మీద ఆవిడ కూర్చొని ఉంటే ముందు ముఖాన్ని చూసి ఆవిడను చూసి బాధపడి వెళ్ళిపోతూ ఇంత అందంగా ఉంది వెనకాల ఒక తోక కూడా ఉంటే ఇంకెంత బాగుండేది అనుకున్నారట''.

 ''మొన్న పాకిస్థాన్‌ నుండి ఒక వ్యక్తి వచ్చి ఢిల్లీలో ఒక పండ్ల డాక్టరు దగ్గర పిప్పిపన్ను పీకించుకున్నాడట అప్పుడా డాక్టర్‌ ఏమయ్యా! మీకు అక్కడ పాకిస్థాన్‌లో పండ్ల డాక్టర్లు లేరా? అంటే అందుకా పేషెంట్‌ ''ఎందుకులేరు, ఉన్నారు- కానీ మాదేశంలో ఎవడూ నోరు తెరవకూడదు కదా! అన్నాడట''. ఇలా సాగుతాయి ఆయన వ్యాఖ్యానాలు.

సైడ్‌ ఎఫెక్ట్‌ :
అయితే ఈ ధోరణిలో సాగే వారికి కష్టాలు లేవనుకోబోకండి. అల్లోపతి మందులకు మల్లే దీనికి ్బడా సైడ్‌ఎఫెక్ట్‌ ఉంది. ఇలా నవ్వుతూ తుళ్ళుతూ ఉండే వ్యక్తి ఉన్నత స్థానానికి పనికిరాడని, గంభీరంగా ఉండేవారే కార్యదక్షులనే అపోహ ఒకటి ప్రజలలో ఉంది. కాబట్టి ఈ విధంగా మీరు ఉండదలిస్తే కొన్ని పదవులు, గొప్పవారనే గుర్తింపు పోగొట్టుకోవలసి రావచ్చు. మీరు నలుగురితో కలిసి జీవించడం ముఖ్యమా, లేక అహంకార పుష్టినిచ్చే పదవులు, గుర్తింపు ముఖ్యమా! మీరే ఎన్నుకోండి.
జాగ్రత్త :
మీ హాస్య, వ్యంగ్య సంభాషణల వల్ల మీరు మరొక సమస్యను కూడా ఎదుర్కోగలరు. మీ మాటలను ఎదుటివారు తప్పుగా అర్ధం చేసుకోవచ్చు. సున్నితమైన వారి భావాలు దెబ్బతినవచ్చు, మీరు వారిని విమర్శిస్తున్నారను కోవచ్చు. లేదా మరీ గంభీరంగా ఉండటం అలవాటయిన రాతిస్వరూపులకు మీ విధానంలో అసభ్యత కనిపించ వచ్చు. కనుక ముందు వ్యక్తుల స్వభావాలను అర్దం చేసుకుంటూ సభానుగుణంగా, వ్యక్తుల కనుగుణంగా మీ హాస్యసంభాషణను కొనసాగిస్తూ కలిసి జీవించండి.
నవ్వండి :
అలా చమత్కారంగా మాట్లాడగల పటిమ మీలో లేకపోయినా సరే కలిసి నవ్వడం మాత్రం నేర్చుకోండి. మీ ఇష్టాయిష్టాలను ప్రక్కకుబెట్టి మీశత్రువు నవ్వించినా నవ్వడానికి సిద్ధంగా ఉండండి. అప్పుడు కలిసి జీవించడం సులభమౌతుంది.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
నీవు నీవుగా ఉండిపో, మరో ముఖ్యమైన విషయం..... ఆప్యాయత నటించకు. – డెసిడెరాట్టా

ఏనుగు - ఎలక :
ఒకసారి ఒక ఏనుగు ఆకులు తింటూ ఉంటే దానికి దగ్గరలో అటూ ఇటూ తిరుగుతున్న ఎలక ఒకటి కనిపించింది. వెంటనే ఏనుగు ''ఏయ్‌! ఇక్కడ నుండి వెళ్ళిపో అర్భకపు ప్రాణి! నేను చూడక నీ మీద కాలు వేశానంటే నలిగిపోతావు'' అంది. ఎలక దిగులుగా ముఖంపెట్టి ''చిన్నప్పుడు నేను జబ్బు పడ్డాను లేదా నేను కూడా నీ అంత ఉండేదాన్ని'' అన్నది.
కపటం :
ఇలా ఉంటుంది ప్రజల రీతి. సత్యాన్ని ఒప్పుకొనే ధైర్యం లేదు. ప్రతివాడూ ఏదో ఒకటి అవుదామని చూసేవాడేగాని, తాను తానుగానే నిలిచిపోవడానికి గానీ. తననుతాను ఒప్పుకోవడానికిగానీ సిద్ధంగాలేడు. అంతా కపటంతో నటించే ఈ ప్రపంచంలో ఒకరిని ఒకరు మోసగించుకుందామని చూస్తూన్నారేగాని కలిసి ఉండలేక పోతున్నారు.

జీవితం అంటే ఒకర్ని మరొకరు నమ్మించి మోసగించడం, అందరూ అందర్నీ మోసగించడం అంటాడు షేక్ప్స్‌యర్‌.

విశ్వాసం :
వ్యక్తులు బజార్లో కనిపిస్తే చాలు కౌగిలించుకొని ఏడుస్తారు. కానీ మామూ లుగా చచ్చారో బ్రతికారో కూడా కనుక్కోరు. నలుగురు చూస్తున్నప్పుడు ఎక్కడలేని ఆపేక్ష చూపిస్తారు. చాటుగా వారి గొంతు నులమడానికైనా వెనుకాడరు. ఈ వర్తనంఆధ్యాత్మికత, భక్తి పేరుతో ఆశ్రమాల్లో చేరిన వారిలో కూడా కనిపిస్తూ ఉంటుంది. "We cannot teach old dog new tricks"  ఎరిగి ఈ కపట వర్తనంలో ఉన్న ముసలి జంతువులకు మనం కొత్తనీతులు నేర్పలేము. వారిని చూసి మనం ఈవిషయాలు నేర్చుకోకుండా ఉంటేచాలు. లేదా ప్రపంచంలో చాలామంది ఈ కపట వర్తనం లోనే గనుక ముణిగి ఉంటే అసలు ప్రేమ ఆప్యాయతలపైన ఎవరికీ విశ్వాసమే లేకుండా పోయి కలిసి జీవించడం అసంభవమౌతుంది.

మీరూ - లోపాలు :
అందుకే ..... "With all its shame" drudgery and broken dreams it is still a beautiful world be cheerful" లజ్జారహితమైన, హీనవృత్తులు కలిగిన, తీరని కోరికలతో నిండి ఉన్నదైనప్పటికీ ఇది ఒక రకంగా చాలా అందమైన ప్రపంచం. కనుక ఆనందంగా ఉండండి. అంటుంది డెసిడెరాటా.
ఈ సృష్టి నుండి తనను వేరుగా చూచిన వారికే ప్రపంచంలో లోపాలు కనిపిస్తాయి.ఏవ్యక్తీ తనలో తాను లోపాలు వెతకలేడు. తన కండ్లకు తానెప్పుడూ అందంగానే మంచివాడిగానే కనిపిస్తాడు. మరి ఈసృష్టి నుండి తాను వేరు కానప్పుడు దీనిలో ఎవరైనా లోపాలు చూడగలరా?

దుఃఖం :
అసలీ ప్రపంచంలో మోసం, దుఃఖం మొదలైనవి లేవు కేవలం అవి చూచే వారిలోనే ఉన్నాయి. మొత్తం సృష్టిలో అన్ని ప్రాణులు ఆనందంగా ఉన్నాయి. ఒక్క మనుష్యుడు తప్ప ఉన్నదున్నట్టుగా ఈ ప్రపంచం జీవరాసులన్నిటికీ ఒక వరం. తక్కిన ప్రాణులకు ఇక్కడ ఇలా ఉండటమే ఆనందం. శ్వాసించడమే ఆనందం. కానీ ఈ ప్రపంచాన్ని చూచే మానవుడిలో దుఃఖం ఉంది. సంస్కృతంలో దుఃఖాన్ని 'వేదన' అంటారు. వేదం అంటే జ్ఞానం. 'న' అంటే అది లేకపోవడం.
అంటే జ్ఞానం లేకపోవడమే దుఃఖం. సృష్టిలో ఇతర ప్రాణులకు ఎదుటి ప్రాణుల యొక్క జ్ఞానంలేదు; కేవలం తమకు తాముగా బ్రతుకుతాయవి. ఈ ప్రపంచంలో ప్రతివాడూ తన బ్రతుకు తాను బ్రతికితే దుఃఖమే లేదు; ఈ జ్ఞానం లేకపోవడమే దుఃఖానికి దారితీస్తుంది.
ఎలా మారిలి?
మన చుట్టూ ఉండే ప్రపంచం యొక్క జ్ఞానం మనకు మనోవృత్తి (ఆలోచన)రూపంలో ఉంటుంది. ఈ ఆలోచన కారణంగా తన చుట్టూ ఉన్న వ్యక్తులను, వస్తువులను అలాగే స్వీకరించలేడు. తనకు నచ్చిన విధంగా వాటిలో మార్పును కోరుకుంటాడు. ఇలా కోరుకోబడే ప్రతి వ్యక్తి కోరిక ఇతరుల కోరికకు వ్యతిరేకంగా ఉంటే ఏ కోరిక ననుసరించి ఈ ప్రపంచం మారాలి?
ఆలోచన :
అంతేకాదు ప్రతి ఆలోచన ఆలోచించబడే వ్యక్తికి, ఆలోచించేవారికి మధ్య అగాధాన్ని (దూరాన్ని) సృష్టిస్తుంది. దూరం లేకుండా ఆలోచించడం సాధ్యం కాదు. ఈ దూరం ఎంత తగ్గితే అంతగా ఆలోచనలు తగ్గుతాయి.
దూరం :
ఒక మెజిష్ట్రేట్‌ ముందుకు ముద్దాయిగా ఆయన కొడుకును తీసుకువస్తే న్యాయనిర్ణయం చేయడం చాలా కష్టమౌతుంది; వారి మధ్య దూరం తక్కువ, అందువల్ల ఆలోచనలు ఆగిపోతాయి. ఎంత పేరు మోసిన సర్జనయినా తన భార్యకు గానీ, కొడుకుకుగానీఆపరేషన్‌ చేయలేడు. అందుకు ఇంకొక డాక్టర్‌ అవసరమౌతాడు; వారి మధ్య్బడా దూరం తక్కువే.
ఇంకెవరన్నా దుఃఖంలోనూ కష్టాలలోనూ ఉంటే మనం సలహా చెప్పగలం కానీ స్వయంగా మనమే కష్టాలలో ఉంటే మనకేమీ తోచదు అక్కడ దూరం అసలే లేదు. అక్కడ మనస్సు పూర్తిగా శూన్యమై పోతుంది.
విడదీస్తుంది :
కనుక ఆలోచన మనను ముక్కలుగా చేసి, ప్రపంచం నుండి విడదీసి, ప్రపంచం జ్ఞానం కలిగేలా చేసి, అందులో లోపాలను చూసేలా చేస్తుంది. ఆలోచన, ఆనందాన్ని ఎరుగదు. కేవలం దుఃఖాన్నే ఎరుగును. ఈఆలోచనే ''వేదన' (దుఃఖం). స్వరూపజ్ఞానాన్ని తీసివేసి ప్రపంచ జ్ఞానాన్ని కలిగించి మోసం చేస్తుంది ఈ ఆలోచన.
కాబట్టి ఇది మీ ప్రపంచం అని గ్రహించి-ఆలోచించకుండా, తర్కించ కుండా- ఉన్నదున్నట్టుగా దీన్ని స్వీకరించడం నేర్చుకోండి. అప్పుడు కలిసి జీవించడం సాధ్యమౌతుంది.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
ఈ ప్రంపంచం అంతా తల్లక్రిందులుగా ఉన్నది అనే సంగతి ధ్యానం చేసిన వారికి తెలుస్తుంది. ఒకసారి అది గ్రహించిన వారు తమ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించినట్లు ప్రజలకు కనిపిస్తుంది. 

జీవితం - మృత్యువు :
జీవితాన్ని గురించి తెలుసుకోవాల్సిన పనిలేదు మృత్యువును గురించి తెలుసుకుంటే జీవితం అవగతమౌతుంది. మృత్యువు అంటే మార్పు; ప్రతిక్షణం అది ప్రపంచంలోనూ మన శరీరంలోనూ, మనస్సులోనూ, బుద్ధిలోనూ,  కలుగుతూనే ఉన్నది. దీన్ని జీవతానికి వ్యతిరేకంగా భావించక, స్వీకరించగలుగుతూ ఉంటే ప్రతిక్షణం ప్రతి మార్పు భూతకాలంలోకి జారిపోతూ కనిపిస్తుంది. అప్పుడు ప్రతిక్షణం మనకు మనమే నిత్య నూతనులముగా కనిపిస్తాము. ఈ ప్రతిక్షణం నిత్య నూతనత్వంలోనే జీవనం ఉట్టి పడుతుంది.
భయం లేదు :
జీవితంలో అంతా భద్రత కోరుకుంటారు. ఇదొక పిచ్చి ప్రపంచం. భద్రత కలిగిన జీవితంలో సారంలేదు. అందులోకి విసుగు ప్రవేశిస్తుంది. స్థిరమైన ఉద్యోగం, సొంత ఇల్లు, బ్యాంక్‌ బాలెన్స్‌ యాంత్రిక జీవనానికి, భావదాస్యానికి, మనోరుగ్మతలకు దారితీస్తాయి అభద్రతలో నిలిచినవాడు ప్రతిక్షణం జాగరూకుడై ఉండాలి. ఆకులాగా ఏ క్షణమునైనా గాలికి ఎగరగలిగిన వాణ్ణి కదిలించడానికి ప్రతివాడు భయపడతాడు.


స్పష్టంగా చెప్పండి :
ఈ తల్లక్రిందులు ప్రపంచంలో మరో విచిత్రం కనిపిస్తుంది. అదే... తన లోపాలను, తప్పులను దాచిపెట్టడం; కపటంతో తనకులేని గొప్పతనాన్ని ప్రకటించ ప్రయత్నించడం. దీనికి వ్యతిరేకంగా ప్రవర్తించి చూడండి. కేవలం అబద్ధాలే ప్రచారమయ్యే ఈ ప్రపంచంలో స్పష్టంగా తన నోటితోనే తన బలహీనతలు, లోపాలు, తప్పులు ఎవడన్నా చెప్పుకుంటాడంటే ఎవరూ నమ్మరు. నువ్వు
చెబుతున్నది జోక్‌ అయినా అయి ఉంటుంది. లేదా ఏదో ప్రయోజనాన్ని ఆశించి చెబుతున్న అసత్యమైనా అయిఉంటుంది అనుకుంటారు అంతా.
మోసం :
ప్రతివారూ ఈ జగత్తులో తాను మోసంగింప బడ్బడదని, వీలైతే ఇతరులను మోసగించాలని ప్రయత్నిస్తారు. మీరు ఇందుకు వ్యతిరేకంగా ప్రవర్తించడండి. ఫలానా వాడికి డబ్బులిస్తే తిరిగి రావని, వాడిచ్చే సరుకు కల్తీదని తెలిసి కూడా వాళ్ళకు ఈ మాటలు చెబుతూ డబ్బు ఇవ్వండి. సరుకు కొనండి.
మీకు అవకాశం వచ్చినా సరే ఇతరులను మోసం చేయబోకండి. విచిత్రమైన మీ పద్ధతికి ముందీ జగత్తు ఆశ్చర్యపోతుంది. క్రమంగా మీరే సరిగ్గా ఉన్నారని తామే తల్లక్రిందులని గ్రహిస్తుంది. (ఒకవేళ గ్రహించకపోయినా మీకు వచ్చే ఇబ్బందేమీ లేదు)
మధ్యలో :
" Man is not the end only the means"
మనిషి గమ్యం కాడు మార్గం మాత్రమే. అందుకే తన మీద తనకు తృప్తి లేదు. గమ్యం చేరిన వాడికి తృప్తి ఉంటుంది. లేదా ఇంకా ప్రయాణం ప్రారంభించని వాడికి శాంతి ఉంటుంది. తానే మార్గమైతే, అలసట, అశాంతి, విసుగు తప్ప మరేముంటాయి. అందుకే తనే తనకు అతీతంగా ఎదుగుదామని చూస్తాడు మనిషి అయితే తాను పైకన్నా ఎదగ గలుగుతాడు. లేదా క్రింద పడిపోతాడు.
క్రిందపడి జంతువులా బ్రతకగల్గిన వాడూ ఆనందంగా ఉండగలడు. పైకి ఎదగగలిగిన వాడు ్బడా ఆనందంగా ఉండగలడు.కానీ మధ్యలో నిలిచిన వాడికి మాత్రం దుఃఖం తప్పదు. ఈ తల్లక్రిందుల ప్రపంచంలో మనుషులంతా తల్లకిందులుగా చేతుల మీద నడుస్తుంటే, ఈ మార్గం నుండి ప్రక్కకు జరిగి తన కాళ్ళమీద నిలుచున్నవాడు అందరికీ దూరమైనట్లు కనిపించినా అందరితో కలిసి, అందరికీ మార్గదర్శనం చేయగలడు.   
నికి వాళ్ళు సరిగ్గానే వ్రవర్తిస్తారు కానీ తమకు వ్యతిరేకంగా ఉన్నవారి వ్యవహారం తల్లక్రిందులుగా కనిపిస్తుంది.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
''అందరితో కలిసి జీవించాలంటే అన్నిటికీ అవుననాలా? తప్పదా? అనేది ప్రశ్న. కాదు... అలా అవసరం లేదు. ''డెసిడెరాటా'' ఏమంటోందో వినండి....
"As far as possible without surrender, be on good terms with all persons. Speak your truth quietly and clearly; and listen to others, even to the dull and the ignorant; they too have their story Avoid loud and aggressive persons; they are vexations to the spirit"

సాధ్యమైనంత వరకు ఎవరికీ లొంగకుండా, అందరితో మంచి సంబంధాలు కలిగి ఉండండి. మీరెరిగిన సత్యాన్ని ప్రశాంతంగా, స్పష్టంగా చెప్పండి.  అజ్ఞానుల, మూర్ఖుల మాటలు కూడా వినండి. వారు చెప్పుకునే కథలు కూడా ఉంటాయి. పెద్ద గొంతుతో ఉద్రేకంగా వాదించేవారిని దూరంగా ఉంచండి. వారు మీ మనస్సును చెదరగొట్టగలరు.


సూటిగా సాగిపో :
వ్యక్తిత్వాలను పణంగా పెట్టి తానుసాగే పథాన్ని విడిచిపెట్టి, తాను నమ్మిన విధి విధానాన్ని బలిపెట్టి ఎదుటి వారి మాట వినకపోతే వారేం చేస్తారో అనే భయం చేతనో లేక, నేను వారి నుండి పొందుతున్న సౌకర్యాన్ని సేవను కోల్పోతానేమో అనే లోభం చేత వారికి లొంగిపోయే జీవన విధానం సరి అయినది కాదు. ప్రస్తుతం జీవితంలో ఈ విధానం వల్ల జీవితం  సుఖవంతమైనప్పటికీ అది సుదీర్ఘ కాలంలో బానిస బ్రతుకుగా మారి మానసికమైన అస్థిరత్వాన్ని
కలిగిస్తుంది. ''ధైర్యంగా ఉన్నవాడు ధనవంతుడు, ధైర్యంలేనివాడు బీదవాడు' అంటుంది
అమ్మ. ధనవంతులుగా బ్రతకండి.


నేర్చుకోండి :
చాలామంది నాకు నేర్పడానికే నా దగ్గరికి వస్తుంటారుగాని నేర్చుకోవడానికి కాదు. (పైకి మాత్రం నేర్చుకోవడానికే వస్తున్నట్లు చెబుతారనుకోండి). ఎంతో దూరంనుండి శ్రమకోర్చి, డబ్బు ఖర్చుపెట్టుకొని వచ్చి మనకు నేర్పేవారు ఎంత కరుణామయులు. వారు కూడా ఒక జీవితం గడిపారు. వారికీ అనుభవాలున్నాయి; వార అనుభవసారాన్ని చిన్న మాటల్లో మనకు అందించడానికి వచ్చారు. గాలి వెలుతురు కావాలి అని కోరుకునేవారు ఇంటికి తలుపులు కిటికీలు తెరిచి ఉంచాలి;  అలాగే నలుగురిలో కలిసి జీవించదలచిన వాడు ఇతరుల నుండి నేర్చుకోదలచిన వాడు, ఇతరులు చెప్పేది ఓపికగా వినడానికి సిద్ధంగా ఉండాలి.

తప్పుకోండి :
ఒక్కొక్కసారి ఆ చెప్పేవారి మాటలో వారి దంభాహంకార ప్రదర్శన, స్వసామర్ధ్య ప్రదర్శన మాత్రమే ఉండి పనికి వచ్చేది. ఏమీ లేకపోయినా లేక తలాతోక లేని వాగుడు ఉన్నా ్బడా, వారితో కలిసి జీవించదలచినవారు ఓపికగా వారి మాటను వినాలి. వారి గొంతు యొక్క స్థాయి, ఉద్రేకము పెరుగుతున్నాయి అనుకున్నప్పుడు మాత్రం మెల్లిగా అక్కడ నుండి లేచి వెళ్ళి పోవడం మంచిది. లేదా అలా వెళ్ళిపోవడం అనే కార్యం వారిని అవమానించి నట్లవుతుంది
అనుకున్నప్పుడు, మనస్సును అక్కడినుండి తప్పించి మరోవైపుకు మళ్ళించే కళ నేర్చుకోండి.

''ఎటువంటి ప్రజ్ఞ లేనివాడి ముఖ్య లక్షణం ఏమిటో తెలుసా?.... ప్రతి విషయాన్ని ఖండించడం'' అంటాడు ''బారోష్‌షోకాల్ట్‌''. వ్యక్తులు మాట్లాడేప్పుడు వారిని జాగ్రత్తగా పరీక్షించండి. వారు ఏస్థాయికి చెందినవారో వారినుండి మీరు ఏమి నేర్చుకోవచ్చో మీకు ఇట్టే తెలిసిపోతుంది.

జాగ్రత్త :
ఇన్నిటి మధ్య "Better to keep your mouth shut and appear stupid than to open it and remove all doubt"  నోరుమూసుకొని ్బర్చోవడం వల్ల మీరు మూర్ఖులుగా కనిపించినా సరేగాని,నోరు తెరిచి వారి సందేహాలన్నీ తీర్చకండి. కానీ పరిస్థితి మిమ్మల్ని బానిసత్వం వైపు నెట్టుకు వెళుతున్నప్పుడు లేదా ఎదుటి వారి వాగుడు, మూర్ఖత్వం తారస్థాయికి చేరుకుంటు న్నప్పుడు మాత్రం, ఉద్రేకపడకుండా వారిని పక్కకు తీసుకువెళ్ళి ప్రశాంతంగా స్పష్టంగా మీరెరిగిన సత్యాన్ని చెప్పండి. దానివల్ల అక్కడి సమస్య తీరిపోవడమే గాక, భవిష్యత్తులో కొనసాగవలసిన సత్సంబంధాలు దెబ్బతినవు.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
None but a fool thinks he is always right     - A poet

ఈ మధ్య ఒక పత్రికలో కొన్ని మంచి మాటలు చదివాను. మీరు కూడా చదవండి మరి...
ఒక తియ్యటి మాట ''దయచేసి'' (PLEASE)
రెండు తియ్యటి మాటలు ''మీకు ధన్యవాదాలు'' (THANK YOU)
మూడు తియ్యటి మాటలు ''నువ్వంటే నాకు ఇష్టం'' (I LIKE YOU)
నాలుగు తియ్యటి మాటలు ''బహుశ నీదే ఒప్పు కావచ్చు' (PERHAPS YOU ARE RIGHT)
అయిదు తియ్యటిమాటలు ''నిన్ను చూచి నేను గర్వపడుతున్నాను'' ( I AM PROUD OF YOU)
ఆరు తియ్యటి మాటలు ''నేను తప్పు చేశానని అంగీకరిస్తున్నాను'' (I ADMIT I MADE A MISTAKE)


శుభోదయం :
More common a person, the more familiar the person, the less noticeable he becomes.

ఒకే ఆఫీసులో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న వ్యక్తికి తనచుట్టూ ఉండే వ్యక్తులు కనిపించడం మానేస్తారు. అతి పరిచయం వల్లవ్యక్తిగానీ వస్తువుగానీ మాయమైపోవడం సహజమే. కనుక ఒకచోట పనిచేసే మనుషులంతా యంత్రాలుగా మారిపోతారు. తెల్లవారి పనికి వెళ్ళగానే పరస్పరం, ప్రేమగా, తియ్యగా పలకరించుకోవాలనే వారికి గుర్తుండదు. కానీ మీరు ఆఫీసు కెళ్ళగానే వరుసగా కనిపించిన వారందరితో ''శుభోదయం'' (Good Morning) అంటూ ముందుకు సాగిపోయారనుకోండి. మీరంటూ ఒక వ్యక్తి ఉన్నారని, ఇంకా బ్రతికే ఉన్నారని, ఉత్సాహంగా ఉన్నారని అంతా గుర్తిస్తారు. అంతేకాదు పొద్దున్నే తియ్యగా పలకరింపబడటాన్ని ఎవరు
మాత్రం ఇష్టపడరు?
అలాగే ఇంటికి వెళ్ళేప్పుడు కూడా తియ్యగా వీడ్కోలు చెప్పండి. మీరు యంత్రాలు కాదు మనుషులమని గుర్తించండి. యంత్రాలు వేటికవి పనిచేయగలవు గానీ మనుషులు మాత్రం ప్రేమతో కలిసి పనిచేయాలి. అందుకు తియ్యగా మాట్లాడాలి ఇలా మాట్లాడే వారే కోకిలలు.

కొత్త పదాలు :
ఒకవేళ మీరు ఉదయం ఆఫీసుకు రాగానే అందరినీ పలుకరించే అలవాటులో ఉన్నా ఆ పదం కూడా యాంత్రికంగా మారిపోయి ఉంటుంది. ఆ పదం వాడటం వల్ల ప్రజల నుండి ఎటువంటి స్పందన రాదు. కనుక ఆ స్థానంలో కొత్త పదాలు వాడటం మొదలుపెట్టండి. (ఆమ్లెట్‌ మార్నింగ్‌ అని లేదా వారు శాఖాహారులైతే చద్దన్నం మార్నింగ్‌ అని అనవచ్చు).

దయచేసి - ధన్యవాదాలు :
ఏదైనా పనిచేసి పెట్టమని కోరేప్పుడు స్త్రీ పురుష, వయో, సాంఘిక స్థాయీ భేదాలు లేకుండా ''దయచేసి ఈ పని చేసి పెట్టండి'' అని కోరండి. చేయబడిన పని ఎంత చిన్నదయినా సరే ధన్యవాదాలు తెలియజేయండి. ఈ విషయం మీ ఇంట్లో భార్యాపిల్లకు, ఆఫీసులో మీతో పనిచేసే వారికి కూడా వర్తిస్తుంది.

నా కిష్టం :
మీరు ఒక వ్యక్తిని ఇష్టపడినంత మాత్రాన సరిపోదు ఆ విషయం తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది. హృదయంతో హృదయం మాటల ద్వారానే ముడిపడుతుంది. తప్పు ఒప్పుకునే ధైర్యం - ఒప్పును స్వీకరించగల హృదయ వైశాల్యం;
 " It is said best men are moulded by their faults"
''ఉన్నత మానవులంతా వారి పొరపాట్ల వల్లే మలచబడ్డారు' మానవుడన్న ప్రతివాడూ పొరపాటు చేస్తాడు. కానీ గొప్పవాళ్ళకు తమ తప్పును ఒప్పుకునే ధైర్యం ఉంటుంది. ఎంత మంది ముందైనా సరే ''నేను తప్పు చేశానని అంగీకరిస్తున్నాను'' అనగలడతను.కేవలం అహంకారం చేత, ధైర్యంలేక తప్పు ఒప్పుకోక పోవడం వల్లనే మానవ సంబంధాలు చాలా వరకు దెబ్బతింటాయి.
తమవల్ల తప్పు జరగగానే మాటల ద్వారా దాన్ని కప్పిపుచ్చుదామని ప్రయత్నించడమో లేక సాక్ష్యాలు సృష్టించి దానిని ఒప్పుగా నిరూపించడమో,  లేదా ఆ పొరపాటు జరిగిన స్థలంలోనూ సమయంలోనూ తాను లేనని ఋజువు చేయడమో చేస్తారు కొందరు. "The alibi is just an attempt to prove that you weren't wrong" తాను తప్పు కానని నిరూపించడానికి చేసే ప్రయత్నమే 'ఎలిబీ' కాబట్టి తప్పించుకోవడానికి మనం వినియోగించే శక్తి యుక్తులను ''అసలు ఆ తప్పు ఎలా జరిగింది? దానికి దోహదపడిన పరిస్థితులు ఏమిటి?'' అనే విషయాలను విచారించడంలో వినియోగిస్తే, మరొకసారి ఆ తప్పు జరగకుండా ఆపవచ్చు.
సలహాలు, విమర్శలు స్వీకరిస్తున్నారా?
కాకులు కూడా ఉన్నాయి ఈ సమాజంలో. అవి ''కావు-కావు''- ''నీవు చేసేవి సరిఅయినవి కావు'' అంటూ విమర్శించడం వాటికి అలవాటు. వాటి అరుపులు కర్ణకఠోరంగా ఉంటాయి. అయినా వాటితో కూడా సమాజానికి పనిఉంది. సమాజాన్ని శుభ్రంగా ఉంచడానికి (పాకీ పనికి) కాకులు చాలా అవసరం. విమర్శించేవారే లేకపోతే ప్రతివారు తాము లోపరహితులమనే అనుకుంటారు. వారిలోపాలు (చెత్త) వారికి కనిపించవు. మీరు కోకిలలైనా సరే కాకులతో కలిసి జీవించక తప్పదు. లేదా దీనికి వ్యతిరేకంగా మీరు కాకులై ఎదుటివారు కోకిలలైనా కలిసి జీవించాల్సిందే.
సలహాలను, విమర్శలను మీరు ఓపిగ్గా వినగలిగితే మీరు మంచివారు; ఆ విమర్శను గురించి ప్రశ్నిస్తూ ఎదుటివారు దాన్ని ఇంకా వివరంగా చెప్పే అవకాశాన్ని మీరు కల్పిస్తే మీరు ఉత్తములు; మీకు లభించిన వారి సలహా లేదా విమర్శకు మీరు ధన్యవాదాలు తెలియజేస్తే మీకన్నా ఉత్తమోత్తములు ఈలోకంలోనే లేరు అనవచ్చు.
" Advice is an uncertain gift"
సలహా అనేది అందేది లేనిది తెలియని బహుమతి. కనుక వాటిని స్వీకరించడానికి ప్రయత్నించండి. ఒకవేళ అది ఉపయోగకరమైనదయితే, కేవలం నేను వెళ్ళే మార్గాన్నే అనుసరిస్తాను అనే మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి దీన్ని ఆచరించ ప్రయత్నిండండి. లేదా ఇతరులు మీకు చేసే సహాయాన్ని కాలదన్నుకున్నట్టే అవుతుంది. ఎవరికి తెలుసు! వారు చెప్పేదే ఒప్పు కావచ్చుకదా!


ఆత్మ విశ్వాసం :
చాలామంది ఆత్మ విశ్వాసం పేరుతో తాము చేసే తప్పులను ఒప్పుకోరు. ప్రతిక్షణం తాను తప్పు చేస్తున్నానేమో అని మధనపడే న్యూనతా భావం కన్నా ఆత్మవిశ్వాసం వెయ్యిరెట్లు గొప్పది అనడంలో సందేహం ఏమాత్రం లేదు; కానీ ఆత్మ విశ్వాసం పేరుతో విమర్శలను, సలహాలను స్వీకరించకపోవడం, కూడా లోపమే. సలహా స్వీకరించి ధన్యవాదాలు చెప్పండి. విమర్శల నుండి ఏం చేయాలో,  ఏం చేయగూడదో నేర్చుకోండి.


ఎవరిది బాధ్యత :
ఒక పనిని మనం కలిసి చేస్తున్నప్పుడు, ఎవరి ఆధీనంలోనన్నాపని చెడిపోతే     ఆవ్యక్తిని ''నువ్వు ఎక్కడ తప్పు చేస్తే ఇలాగయ్యింది!'' అని ప్రశ్నించకండి. ''మనం ఎక్కడ పొరపాటు పడటం వల్ల ఈ తప్పు జరిగింది? అని అడగండి. అందరూ కలిసి సాధించవలసిన పనిలో తప్పు జరిగితే, బాధ్యత అంతా కలిసి తీసుకోండి.  అప్పుడు వ్యక్తులు ధైర్యంగా ముందుకు సాగగలుగుతారు. అభిప్రాయాలు - ప్రశ్నల రూపంలో :
ఎవరైనా ఒక పనిని గురించి వివరించినప్పుడు సూటిగా....
''ఓ! దానికి చాలా సమయం పడుతుంది''
''కొన్ని వేల రూపాయలు ఖర్చవుతుంది''
''నీ ప్లానేమీ బాగాలేదు''.....
అనబోకండి
''ఈపని పూర్తికావడానికి ఎంత సమయం పడుతుందను కుంటున్నావు?''
 ''ఎంత ఖర్చవుతుందనుకుంటున్నావు?''   
''నీ ఆలోచన నీకు లోపరహితంగా కనిపిస్తోందా? మళ్ళీ ఒకసారి ఆలోచించు'' అనకండి. ఈ విధంగా అభిప్రాయాలు ప్రశ్నల రూపంలో అయితే బాగుంటాయి; ఎవరినీ బాధించవు.
నాకు కూడా ఎదురైంది :
ఎప్పుడూ ఇతరుల లోపాలు సూటిగా ఎత్తి చూపకండి. ఎవరైనాతాము ఎదుర్కొంటున్న సమస్య గురించి మీకు చెబితే ''నాకు ్బడా ఇటువంటి సమస్యే ఎదురైంది'' అంటూ ప్రారంభించండి. ''అప్పుడు నేను ఆ లోపాన్ని ఇలా గ్రహించాను; ఇలా దాన్ని సరిదిద్దుతున్నాను; ఇలా ఆ సమస్యను అధిగమించాను' అని చెప్పి ముగించండి. ఎవరూ ఉపదేశాలు వినడానికి సిద్ధంగా ఉండరు కానీ అవే ఇతరుల అనుభవాలుగా వినడానికి ప్రతివారూ సిద్ధపడతారు.

కుహూఁ - కుహూఁ - కావ్‌ - కావ్‌ :
ప్రారంభంలో చెప్పిన ఆరు తియ్యటి మాటలు నేర్చుకొని కోకిలలుగా మారండి. అయినా సరే కాకులతో కలిసి ఉండటానికి సిద్ధపడండి. వారి విమర్శలు, సలహాలు ఓపికగా వినండి. సలహాలకు ధన్యవాదాలు చెప్పండి. విమర్శల నుండి నేర్చుకోండి.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
" The less men think more they talk"

ఒకసారి వెనక్కు తిరిగి చూసుకోండి : ''మీలో ఎవరు ఎక్కువగా మాట్లాడతారు?'' ఈ ప్రశ్న వేసుకోండి. మీరా? మీభార్యా? మీ పిల్లలలో ఎవరన్నానా? మీ మిత్రులలో ఎవరన్నానా? మీ ఆఫీసులో ఎవరన్నానా?
ఒకసారి వెనక్కు తిరిగి మీరు గడిపిన రోజును గుర్తుకు తెచ్చుకోండి. ఉదయం ఆఫీసుకు లేదా షాపుకు వెళ్ళకముందు మీ ఇంట్లో ఆఫీసుకు వెళ్లాక అక్కడ, భోజన సమయంలో, మళ్ళీ ఆఫీసులో, మిత్రులతోపాటు హోటల్లో, క్లబ్‌లో.... ఎవరు ఎక్కువగా మాట్లాడారు?
వీటన్నింటిలోను మీరు ఎక్కువగా మాట్లాడినట్లు జవాబు వస్తే మాట్లాడటంలేదు. వాగుతున్నారు అని అర్దం చేసుకోండి.ఇక మీరు క్రమంగా మిత్రులను కోల్పోతారు. మీ ఇంటి సభ్యులే మిమ్మల్ని అసహ్యించుకోవడం మొదలెడతారు.
పాపం ఒకసారి వినేవారి ముఖాలు కూడా చూడండి : మీరు మాట్లాడేప్పుడు ఎవరన్నా వినకపోవడం మీ దృష్టికి వస్తే వెంటనే మాట్లాడటం ఆపండి. మెల్లిగా అతడు మీవైపు చూస్తాడు. అప్పటికే మీరు ఆ విషయం పైన ఎక్కవగా మాట్లాడారేమో..... ఆ విషయం తెలుసుకోవడానికి
''ఇంకా వింటారా?'' అనిఅడగండి. మొహమాటానికి ఆవ్యక్తి చెప్పమనవచ్చు కూడా. కానీ ముఖంలో ఉత్సాహం లేక కంఠం నీరసంగా పలికితే మీరు ఇప్పటికే చాలా వాగారని గ్రహించండి.

ఎదురు మాట్లాడరు :   
నేను మాట్లాడేప్పుడు ఎవరూ ఎదురు మాట్లాడరు. అంతా నిశ్శబ్ధంగా వింటారు కనుక నేను మంచి వక్తను అనుకుంటే అదిపొరపాటే. అసలు మీరు మీ మాటలతో ఎదుటి వారికి మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదేమో ఆలోచించండి! మీ మాటలు ఎంత మూర్ఖంగా ఉన్నాయంటే, మీతో వాదించడం కూడా వ్యర్ధమేనని వారు మౌనంగా ఉన్నారేమో కూడా చూడండి.

ఊతపదాలు :
ఒకసారి నేను ఒక పెద్దమనిషి ''గురుదక్షిణ యొక్క గొప్పతనం'' అనే విషయంపైన మాట్లాడటం విన్నాను. ఆయన 45 నిముషాల ఉపన్యాసంలో 142సార్లు ''ఆయొక్క-ఈ యొక్క'' అనే పదాలు వాడాడు. అంతేకాదు వ్యాసుడు వేదాలను తెనిగించాడని అన్నాడు. మరోచోట ఇంకొక పెద్దమనిషి రామాయణం వ్యాసుడు వ్రాశాడన్నాడు. ఆ మొదటి వ్యక్తికి తరువాత వివరంగా అతడి లోపాల
గురించి చెప్పినప్పుడు ''ఊత పదాల వాడకం గురించి నాకు చాలామంది చెప్పారండి కానీ ఎందుకో నన్నవి విడవడం లేదు'' అన్నాడు. అప్పుడు నేను ''చాలామంది ఆ మాట చెప్పగా మీరు విన్నారే గాని, నమ్మలేదు; నమ్మి ఉంటే ఎప్పుడో మార్చుకునే వారు'' అన్నాను. అప్పుడాయన ''మరి ఇందులో నుండి బైటపడే మార్గమేమిటి?'' అన్నాడు నేను ఆయన ఉపన్యాసాలను టేపు చేసుకొని స్వయంగా తన లోపాలను వినడం ద్వారా వాటినుండి బైటపడవచ్చని చెప్పాను.  అయితే ఇక రెండవ విషయం తప్పులు మాట్లాడటం, మనందరికీ తప్పులు పోతాయి అనడంలో సందేహం ఏమాత్రం లేదు. కాకపోతే వాటిని తగ్గించడానికి
మనం బాగా హోమ్‌వర్క్‌ చేసుకోవాలి. అంటే ఇంటి దగ్గర విషయాన్ని చక్కగా అధ్యయనం చేసుకురావాలి.

కోన్‌ (KOAN) ::
మొత్తం ప్రపంచ మత, తత్వ సంప్రదాయాలన్నింటిలోను కూడా జెన్‌ (ZEN) చాలా విచిత్రమైన తత్వశాస్త్రం. అన్ని మతాలకు మత గ్రంథాలున్నాయి గాని దీనికి లేదు. జెన్‌ ఉపదేశాలను కోన్‌లు (Koans) అంటారు. తర్కబద్ధం కాని ఒక పిచ్చికథ లేదా విచిత్ర పదవిన్యాసం, లేదా మాటలకందని కొన్ని గమ్మత్తయిన సైగలను కోన్‌ అంటారు. ఈ కోన్‌ల ద్వారా ఆ తత్వవేత్తలు తమ శిష్యులను బుద్ధినుండి దాని తర్కపరిధి నుండి లేపి అనంత మనోరహిత శూన్యంలోకి నెట్టివేస్తారు.

ఉదాహరణకు .....

బాగా ప్రఖ్యాతిగాంచిన జెన్‌మాస్టర్‌ ఒకరు భుజాన గుడ్డల మూట ఒకటి పెట్టుకొని ఒక చిన్న నగరంలోకి ప్రవేశించాడు. ఇద్దరు విద్యార్ధులు ఆయనను గుర్తించి, దగ్గరికి వెళ్ళారు. అందులో ఒకడు జెన్‌ యొక్క అర్ధం ఏమిటి. (What is the significance of Zen?)  అని అడిగాడు. వెంటనే ఆ మాస్టర్‌ భుజాన ఉన్న గుడ్డల మూట తీసి నేలకు విసిరికొట్టాడు. తరువాత రెండవవాడు ''మరి
జెన్‌ను సాక్షాత్కరించుకోవడం ఎలా? (What is the actualization?)  అన్నాడు. వెంటనే ఆ మహాత్ముడు గుడ్డలమూటను భుజాన వేసుకొని తన దారిన తాను వెళ్ళాడు.
మనసు అనే బరువును తీసి పారవేసి అమనస్కులు (మనస్సు లేనివారు) గా మారడమే జెన్‌ అంటే. ఈ స్థితికి చేరుకున్నవారు జనజీవన స్రవంతిలో కలిసిపోయి, అహంకార రహితులై సాధారణ మానవులుగా యధావిధిగా పనులు చేసుకొని పోవడమే 'జెన్‌'ను సాక్షాత్కరింపచేసుకోవడం. ఈ రెండు విషయాలను ఆ మాస్టర్‌ బట్టలమూటను పారవేసి, మళ్ళీ ఎత్తుకోవడమనే కోన్‌ (Koan) ద్వారా సూచించాడు.
వాగడం మాని మాట్లాడటమంటే ఇది. విషయాన్ని చెప్పడానికి పదిమాటలు అవసరం లేదు ఒక్కటి చాలు.

T.V లో వాగుడు
మీరు టి.విలో సంభాషణలు (Interviews) చూసే ఉంటారు. పది మాటలలో అడగగల ప్రశ్నను 50 మాటలలో సాగదీస్తారు ప్రశ్నించేవారు. కెమేరా అంతసేపు తమవైపుతిరిగి ఉండాలి. తాను ఎక్కువ సమయం వరకు టి.విలో కనిపించాలి అనే కోరిక తప్ప మరొకటేదీ కనిపించదు వారి ప్రశ్నలో.
మరి ఈ వాడుగు తగ్గించుకోవడం ఎలా? ''నేను ఎక్కువగా వాగుతున్నానా (మాట్లాడుతున్నానా)'' అని ఇతరులను అడగండి. వారు అవునంటే (అవుననకపోయినా అలాంటి సూచన అందితే) ఈ క్రింది ఉపాయాలతో వాగుడు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి.

ముద్దంటే నాకిష్టం :
ఒక మంత్రిగారు ఉపన్యాసాలకు ఎక్కడికి వెళ్ళినా ఆయన భార్య వెంట ఉండేది. ఆయన ఉపన్యాసం కొంత కొనసాగిన తరువాత ఆవిడ ఒక కాగితం మీద ''ముద్దు'' (Kiss) అని వ్రాసి స్టేజిమీదికి పంపేది. వెంటనే ఆయన తన ఉపన్యాసాన్ని 5-6 నిమిషాలలో ముగించేవారు. చాలా రోజులు ఈ వ్యవహారం నడిచిన తరువాత మంత్రిగారి సెకరెటరీ 'ముద్దు' కు అర్ధమేమిటని అడిగితే
ముఖ్యమైన విషయాలు తప్ప మరీమే వద్దు (keep it simple stupid) అని
 ''ము....ద్దు'' అక్షరాల మధ్య 13 అక్షరాలు ఉన్నాయని చెప్పారట. కనుక మీకు తెలియకుండానే మీకు ఉద్రేకం ఎక్కువయ్యి వాగుతూ ఉంటే, ఎవరినైనా గడియారం ఊపడం ద్వారాగానీ, లేక ఒక వేలు పైకి లేపి చూపించడం ద్వారాగానీ, వాగుడు తగ్గించమని హెచ్చరించేలా చెప్పిపెట్టండి. వెంటనే మీ నాలికకు పగ్గాలువేసి జోరునాపండి.

రెండింతల నష్టపరిహారం :   
మీరు ఎంతసేపు మాట్లాడితే అంతకు రెండింతల సమయం (Double) ఎదుటివారిని మాట్లాడనివ్వాలి. ఇకమీరు ఇన్నాళ్ళూ ప్రజలను మీ వాగుడుతో ఎంత బాధించారో తెలుస్తుంది. క్రమంగా మీరే మాట్లాడటం తగ్గించగలరు.

 ఆగితే పాపం :
మీ వాగుడు మధ్యన మీరు ఊపిరి పీల్చుకోవడానికి ఒక్క క్షణం ఆగితే చాలు, వెంటనే ఎదుటివారిని మొదలు పెట్టమని ముందేచెప్పి ఉంచండి. దానితో ఎదుటివారు కూడా మాట్లాడవలసింది ఉన్నది అనే విషయం మీకు గుర్తుకు వస్తుంది. మీ వాగుడుకు పగ్గాలుపడతాయి.

సెన్సార్‌ :
ప్రశ్నలను, జవాబులను కూడా సాధ్యమైనంతగా కుదించడం అలవాటు చేసుకోండి. ప్రారంభంలో అది అంత సులభమైన విషయం కాకున్నా మీకది క్రమంగా అలవడగలదు.

ఒకే విషయం :
అనేక విషయాలు కొద్ది మాటలలో ఇరికించిగానీ, లేక ఒకే విషయాన్ని అనేక మాటలతో సాగదీసి గానీ ప్రజలను బాధించకుండా, స్పష్టంగా ఒకే విషయాన్ని కొద్ది మాటలలో చెప్పి సమాజంలోని ఇతరులతో మీ సంబంధాన్ని, స్నేహాన్ని ధృఢం చేసుకొని, ఆనందంగా జీవించండి.


బతికిపోయాం :
ఒక ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ టెలికాస్ట్‌ అవుతున్నప్పుడు ఆడియో (శబ్ధం) ఆగిపోయి కొన్ని నిముషాల వరకు కేవలం దృశ్యం మాత్రమే మిగిలింది. మళ్ళీ శబ్ధం రావడం మొదలుకాగానే అనౌన్సర్‌ (వ్యాఖ్యానించేవాడు) మీకు కొన్ని నిము షాల వరకు విశ్రాంతి లభించిందనుకుంటాను అన్నాడు. ఎన్నో వేలమంది ''నిజమే. అనౌన్సర్‌ గోల లేకుండా ప్రశాంతంగా ఆట చూడగలిగినందుకు ఆనందిస్తున్నాం' అంటూ టి.వి. స్టేషన్‌కు ఉత్తరాలు వ్రాశారు. కాబట్టి ఏవాక్కునైతే ప్రేమలో ముంచి ఉపయోగించడం వల్ల అందరినీ ఆలింగనం చేసుకోగలమో, అదే వాక్కును విపరీతంగా ఉపయోగించి అందరినీ దూరం చేసుకోబోకండి.   
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
" He's my friend, the man said "he listens to me"

ఓపికగా మీ మాట వినేవాడిలో ఎన్ని లోపాలున్నా అతడు మీకు మిత్రుడిలా కనిపిస్తాడు. కాని విననివాడు ఎంత మంచి వాడైనా దుర్మార్గుడిలా కనిపిస్తాడు. ఎలా వింటున్నారు ?
మీరు వినేటప్పుడు....
''విసుగుదలతో వింటున్నారా?''
''ఏమాత్రం విషయంలో శ్రద్ధ చూపడంలేదా?''
''మధ్యమధ్య ఏదో రకంగా విఘాతం కలిగిస్తున్నారా?''
ఈ విధంగా వినడం,నేర్చుకోవడానికి మీకుగానీ, మాట్లాడే వ్యక్తిలో ఉత్సాహం నింపడానికిగాని ఉపయోగపడదు.
సరిగ్గా వినడంవల్ల మీరేం పొందగలరు?
మానవ సంబంధాలలో అతిబలమైన వంతెన వినడం.

1. వక్త మిమ్మల్ని ఇష్టపడతాడు :
 వినేవాడి ముఖంలోని శ్రద్ధ ''ఓ వక్తా! నువ్వు చాలా ముఖ్యమైనవాడివి'' అనే భావాన్ని చూపిస్తుంది. ఈ ప్రపంచంలో అతడి మాటను అతడి భార్యగాని, పిల్లలుగానీ, మిత్రులుగానీ, ఆఫీసులో కలిసి పనిచేసేవారుగాని ఎవరూ వినరు. మీరు వింటున్నారు కనుక మిమ్మల్ని విశ్వశించవచ్చునని, మీ మీద ఆధారపడవచ్చునని అతడనుకుంటాడు.

2. మీరు నేర్చుకోవచ్చు :
"Who learns by finding out has seven fold the skill of him who learns by being told."

తనంతతాను తెలుసుకున్న విషయంలో వచ్చే సామర్ధ్యం, వినడం వల్ల వచ్చినదానికి ఏడింత లెక్కువుంటుంది''. అనే మాట నిజమైనప్పటికీ జీవితాలు గడిచిపోతాయిగాని ఏడు వందల మందిలో ఒక్కడుగూడా విషయాన్ని తనంతటతాను నేర్చుకోలేడు. మనకు తెలిసిన దానిలో నూటికి 99 శాతం వినడం చూడటంవల్లే నేర్చుకున్నామనడంలో సందేహం లేదు.

3. వక్త గురించి తెలుసుకోవచ్చు :
తనకు అందిస్తున్న ఆ విషయాన్ని నేర్చుకోవడానికి ఆయన జీవితంలోఎన్ని కష్టాలుపడ్డారో, ఎవరెవరిని సేవించాడో, ఎన్ని గ్రంథాలు అధ్యయనం చేశాడో తెలుస్తుంది. దానితో మీకు ఆయనపై గౌరవం పెరుగుతుంది. అతడి అలవాట్లు, సామర్ధ్యం, శీలం మొదలైనవి మెచ్చుకోవడం మొదలెడతారు.


4. మీకు సృజనశీలత కలుగుతుంది :
మనం వినేప్పుడు కేవలం వినడం మాత్రమే జరగదు మన మనస్సు కూడా ఆలోచిస్తూ ఉంటుంది. వక్త యొక్క ఆలోచనలు, మన ఆలోచనా మార్గంలో కొత్త ద్వారాలను తెరవవచ్చు. ఒక్కొక్కసారి అతడు చెబుతున్న దానికి మనకు వచ్చిన ఆలోచనకు ఎటువంటి సంబంధం ఉండకపోవచ్చు కూడా. అయినా అతడి వాక్కే మీ ఈకొత్త ఆలోచనకు నాంది పలికింది అనడంలో సందేహం ఏమాత్రం లేదు.


5. ఎవరినుండి వినాలి?
మనకెప్పుడూ పైవాళ్ళు అంటే తల్లిదండ్రులు, ఆఫీసర్లు, అన్నలు మొదలైనవాళ్ళు చెబితే వినడం అలవాటు. కానీ క్రింది వాళ్ళు పిల్లలు, మీ క్రింద పనిచేసేవారు, తమ్ములు మొదలైన వారినుండి కూడా వినడం మొదలెట్టండి.


ఎలా వినాలి ?
1. కిటికీలో నుండి ఇంకెటో చూస్తూ కూడా మనం అతడు చెప్పింది వినవచ్చు. కానీ ఆయననే చూస్తూ వినడంవల్ల మనం శ్రద్ధ చూపుతున్నామని గ్రహించి, చెప్పడంలో ఆయన మరింత ఉత్సాహం చూపగలడు.
2. మధ్యమధ్య ''ఇదేనా మీరు చెప్పింది?'' ''ఇదేననుకుంటా మీ ఉద్దేశం'' ''అరే! ఈ విషయాలన్నీ మీరు ఎలా నేర్చుకున్నారు?' అంటూ ప్రశ్నించండి. అప్పు డాయన మరింత ధైర్యంగా ఉత్సాహంగా కేవలం విషయాన్నే గాక దాన్ని సేకరించిన తన వ్యక్తిగత జీవిత విధానాన్ని కూడా మీ ముందుంచ గలడు. అతడు చెప్పింది మీకు అర్ధం కాలేదనుకుంటే ''అదికాదు నేను చెప్పింది'' అంటూ మళ్ళీ ప్రారంభించగలడు.
3. అంతేకాదు మళ్ళీ మళ్ళీ ''ఇది నిజంగా చాలా చక్కటి విషయం!'' 'అరే! ఇంత వరకు ఈ విషయం నేను ఎక్కడా వినలేదు!' ''ప్రస్తుతం సమాజానికి కావలసింది ఇదే!'' ''ఈ విషయం అందరికీ చెప్పగలిగితే ఎంత మార్పు వస్తుందో తెలుసా!'' అనడం వల్ల మీరు ఇంకా వినడానికి సిద్ధంగా ఉన్నారనే విషయం వక్తకు అర్ధమౌతుంది. అంతేకాదు వక్త పూర్తిగా చెప్పడం
అయిన తరువాత కూడా ''ఇంతేనా! ఇంకా ఏమైనా చెబుతారా''అనండి.  ఆయన గనుక మంచి వక్త అయితే అదే విషయాన్ని మరొక కోణం నుండి ప్రారంభిస్తాడు.

4. అతడు చెప్పిన విషయం మీకు కొత్తది కాకున్నా, పెద్ద విలువైనది కాకున్నా, విషయం తప్పయినా అతడికి ధన్యవాదాలు తెలియజేయండి. దానితో ఈసారి ఆయన తప్పక మీకు తెలియని విషయం, పనికివచ్చే విషయం, విలువైన విషయం చెప్పగలడు. ఏం చేయగూడదు?
అతడు చెప్పిన వ్యక్తి పేరో, వస్తువుపేరో, వీదిపేరో తప్పయినా సరే ''అతడు గాంధి కాడు-నెపోలియన్‌' అని అనబోకండి. తాను తప్పు చెప్పానని తెలియగానే ఆయన అవమానంగా భావించవచ్చు. తరువాత చెప్పవలసింది మరిచిపోవచ్చు లేదా చెప్పేది చెప్పడంఆపకుండా మీతో వాదించడానికి సిద్ధపడవచ్చు.
''నాకు తెలుసు'' అనబోకండి. అతడు చెప్పేది పూర్తిగా వినకముందే ఆయన ఫలానాది చెప్పబోతున్నాడని, అది మీరెరుగుదురని మీకెలా తెలిసింది? కనుక సరిగ్గా వినడం నేర్చుకోండి.
షేక్స్ప్‌యర్‌ అన్నట్టు "The disease of not listening" ''వినని రోగం'' (వినకపోవడమే రోగం) గురించి చెప్పడానికి చాలా ఉంది. ఆంగ్లంలో వీటిమీద చాలా పుస్తకాలు ్బడా ఉన్నాయి. మీరు చదివి ఇంకా నేర్చుకోవచ్చు. ఒకటిమాత్రం గుర్తుంచుకోండి. వినడం అనే కళవల్ల మానవ సంబంధ
బాంధవ్యాలు బాగుపడినంతగా మరిదేనివల్ల అంత ఉపయోగం ఉండదు. కనుక సరిగ్గా వినండి - కలిసి జీవించండి!

చెప్పేవాడు చాదస్తుడైనా కనీసం వినేవాడు వివరం గలవాడై ఉండాలి.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
By words the mind is excited and the spirit elated Aristophanes (5th centuty B.C. dramatist)

వారికి అర్ధంకావడం ముఖ్యం :   
కలిసి జీవించాలంటే మీరు తక్కినవారందరికీ అర్ధం కావాలి. కనుక మీరు మాట్లాడే మాటలు మీ పాండిత్యాన్ని, భాషా ప్రావీణ్యాన్ని నిరూపించేదిగా కాక మీ భావాలను అందరికీ అర్ధం అయ్యేలా చూపగలగాలి. చాలా పుస్తకాల్లో ఎన్నో ఉపయోగకరమైన విషయాలున్నప్పటికీ భాషా కాఠిన్యత వల్లే అవి చదవబడటం లేదు. మనకు తెలిసిన పదాలన్నింటినీ ఉపయోగిస్తూ వ్రాయవచ్చు. కానీ మాట్లాడలేము.

అందుకు కారణాలు :
మీ భాష ఎటు దారితీస్తుందో ఈ క్రింది ఆరు కారణాలు చూస్తే అర్ధం అవుతుంది.
1. అర్ధం తెలియదు :
వినేవారికి మీరు వాడిన పదం యొక్క అర్ధం తెలియక పోవచ్చు. ఒకవ్యక్తి మాట్లాడుతూ 'తుషారం' అన్న పదం వాడాడు.దాని అర్ధమేమిటో అక్కడ కూర్చున్న వారిలో చాలామందికి తెలియదు. తెల్లవారుఝామున గడ్డిమీద కనిపించే స్వచ్ఛమైన మంచు బిందువు అంటే అందరికి అర్ధం అవుతుంది. అదేదానిఅర్ధం కూడా.
కనుక సాధ్యమైనంతవరకు సాధారణ మానవుడికి అర్ధమయ్యే పదాలే వాడండి.

2. వినరు :
టి.వి. చూస్తున్న ఇద్దరిలో ఒకడు పక్కవాణ్ణి ఇంతకు ఇప్పుడతడు ఏమో చెప్పినట్టున్నాడు ఏమిటది అంటాడు. మీరు చెప్పేదయినా అంతే. కాబట్టి వారికి ఉత్సాహం కలిగి వినేటట్లుగా మాట్లాడండి.

3. మరో అర్ధం :
వినేవారు మీరు వాడిన పదానికి మరో అర్ధం ఊహించుకోవచ్చు.
ఒకసారి ఒక వ్యక్తికి తేలు కుట్టింది. ఆయన వైద్యుడి దగ్గరికి వెళితే వైద్యుడు మందిచ్చి
''కుట్టిన చోట పెట్టండి'' అన్నాడు. ఆ పెద్దమనిషి ఆ మందు తీసుకువెళ్ళి గదిలో తనను తేలు ఏ మూలన కుట్టిందో అక్కడ పెట్టాడట. అట్లా ఉంటుంది అర్ధం చేసుకోవడం.

ఒక మిల్ట్రీ ఆఫీసర్‌ సిపాయిల పెరేడ్‌ చూడటానికి వచ్చాడు. ఒక సరళరేఖలో నిలుచుని ఉన్న సిపాయిలను చూస్తూ ముందుకు వెళ్ళిన ఆయన ఒక సిపాయి ముందు ఆగిపోయి ''ఒరేయ్‌ మూర్ఖుడా ప్యాంటు జిప్పు పెట్టు'' అన్నాడాడు ఆ సిపాయి. ''ఇక్కడే అందరిముందు పెట్టమంటారాండి అన్నాడు'' ఊ! అవును! ఇక్కడే అన్నాడాయన. వెంటనే ఆ సిపాయి క్రిందికి వంగి ఆఫీసర్‌ ప్యాంటు జిప్పు పెట్టాడు.
ఆ మిల్ట్రీ ఆఫీసర్‌కు సిపాయి ప్యాంటు జిప్‌ తెరుచుకొని కనిపిస్తోంది. అందుకే జిప్‌ పెట్టమన్నాడు. సిపాయికేమో ఆఫీసర్‌ జిప్‌ తెరుచుకుని కనిపించింది. కనుక జిప్‌ పెట్టు అన్న పదానికి ఆఫీసర్‌ జిప్‌ పెట్టాలని అర్ధమయ్యింది. కాబట్టి మన దృష్టి దేనిపైన ఏవిధంగా ఉంటుంది. అనే దానిపైన మనం వినే పదంయొక్క అర్ధం మారుతుంది. కనుక మనం అందించదలచిన అర్ధం వారికి అందిందా లేదా చూచుకోండి.

4. ఊహించరు :
వినేవారు మీరు వాడే పదాన్ని ఊహించకపోవచ్చు. మీరు, మీ గుంపు, మీరు మీ మనుషులు, మీ హితైషులు, మీ బంధువులు, మీ మిత్రులు, మీపార్టి, మీతో పనిచేసేవారు అని వాడే కన్నా, మీరు మీవాళ్ళు అంటే బాగా నప్పుతుంది. వినేవారికి నచ్చని పర్యాయపదాలు మీరు వాడినప్పుడు, ఆ తరువాత ఇక మీరేం చెబుతున్నారో వారు వినడానికి సిద్ధపడరు. కనుక ఆ ప్రాంతీయులకు ఏ పదాలు నచ్చుతాయో గ్రహించి వాటినే ఎంచుకొని జాగ్రత్తగా మాట్లాడండి.
5. స్థాయి దించండి :
మీరు మాట్లాడదలచినప్పుడు ప్రజల స్థాయికి దిగిరండి.
కడుపులో నొప్పి వస్తున్న ఒకావిడ డాక్టర్‌ దగ్గరకెళితే అన్ని టెస్టులు చేసి మందులు వ్రాసి ఇచ్చింది. అసలు జబ్బేమిటి డాక్టర్‌ అని అడిగితే ఆవిడ ''సిస్ట్‌ ఇంద ఓవరీస్‌''అంది. బాగా
ఇంగ్లీషు వచ్చిన వారికి కూడా ఆపదం యొక్క అర్ధం తెలియదు. ఆ పదాలు కేవలం మెడికల్‌ డిక్ష్షనరీలో లభిస్తాయి. ఇటువంటి పరిభాషిక పదాలు డాక్టర్లు పేషంట్ల వద్ద చాలా వాడుతుంటారు. ఆ ఎదుటి వారు డాక్టర్లు కారని వారికివి అర్ధం కావని వారు గ్రహించలేరు. వారి స్థాయికి దిగిరాలేరు.
న్యూట్రాన్‌ స్టార్స్‌ బ్లాక్‌, హోల్స్‌ను వివరించమంటే యండమూరి వీరేంద్ర నాథ్‌ ''పూరీల పిండిని గట్టిగా రెండు చేతులతో వత్తుతూ పోతే టెన్నిస్‌ బాల్‌ సైజు నుండి టేబుల్‌ టెన్నిస్‌ సైజుకు కుదించుకు పోతుంది. చూడండి అలాగే న్యూట్రాన్‌ స్టార్‌ అంటే అణువులు నూక్లియస్‌ స్థాయికి కుదించబడగా కుంచించుకు పోయిన నక్షత్రం అని అర్ధం. పిండి వడియాలు నూనెలో వేయిస్తే పెద్దగా విచ్చుకుంటాయి. వేడివల్ల వ్యాకోచించడం జరుగుతుంది. భూమి, సూర్యుడు, నక్షత్రాల కేంద్రంలో ఆకర్షణ శక్తి తన చట్టూ ఉన్న అణువులను తనవైపు లాక్కుంటూ సంకోచింప చేయాలని
చూస్తుంది. ఆ గోళంలోని వేడి, అణువులను వ్యాకోచింప చేద్దామని చూస్తుంది. కొంతకాలానికి ఈ వేడి చల్లారిపోగా వెంటనే ఆకర్షణశక్తి విజృంభించి అణువు లన్నింటినీ కుదించుకుంటుంది. క్రమంగా గురుత్వాకర్షణ శక్తి పెరగగా అక్కడ గోళం ఉండకుండా కేవలం ఆకర్షణ శక్తి మిగులుతుంది. దీన్నే బ్లాక్‌హోల్‌ అంటారు. అది తనవైపుకు వచ్చే కాంతిని కూడా ఆకర్షించుకొని చీకటిని మాత్రమే మిగుల్చుతుంది. కనుక దాన్ని 'బ్లాక్‌ హోల్‌' అంటారు. అంటూ వివరిస్తారు.
ఇదీ ప్రజలు స్థాయికి దిగివచ్చి విషయాన్ని వివరించడమంటే.


6. వేగంగా :
వేగంగా మాట్లాడటం వల్ల ఈ అనర్ధాలు కలుగుతాయి  అవి -
1. వినేవాడికి అర్ధంకాదు
2. కేవలం మీకు మాట్లాడే అలవాటు ఉంది కనుక మాట్లాడుతున్నారా లేక నిజంగా తాను అర్ధం చేసుకోవడం ఇష్టంలేక అలా మాట్లాడుతున్నారా అనుకుంటారు వినేవారు.
3. మీరు చెప్పదలచిందంతా వేగంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నయినా అర్ధమయ్యేట్లుగా చెబితే చాలు.
4. మీరు వేగంగా చెప్పడం వల్ల మీరు చెప్పింది ఏమిటో అర్ధంకాక, మీ తొందర చూసి పని అర్జంట్‌ అని భావించి, తాను ్బడా ఆపని వేగంగా లోపభూయిష్టంగా సగమే చేసి వస్తాడు మీసేవకుడు. లేదా పని తప్పించు కోవడానికి మీరు చెప్పింది సరిగా అర్ధం కాలేదంటాడు లేదా తన పనిలో
లోపాన్ని మీవిధానంలో కోపంగా పేర్కొంటాడు. అయితే ఏం చేయాలి? మీ మాటలను టేపులో రికార్డు చేసి వినండి, మీరు ఎలా మాట్లాడుతు న్నారో మీకు అవగతం అవుతుంది. ఆ తరువాత దాన్ని మీరు మార్చుకోవచ్చు. మీరు మాట్లాడేటప్పుడు 180 లలో మీరు మీ తలను తిప్పుతూ అందరి ముఖాలలోకి తొంగి చూస్తూ మాట్లాడండి. ప్రతిఒక్కరికీ మీరు వారితోనే మాట్లాడుతున్నారనిపించేలా ప్రవర్తించండి. (ప్రతివ్యక్తి తనకు ప్రాధాన్యత (Attention) ఇవ్వబడాలని కోరుకుంటాడు).
మళ్ళీ మళ్ళీ ''మీకు అర్దం అవుతోందా?'' అని ప్రశ్నిస్తూ వెళ్ళండి.ఒక విషయం చెప్పిన తరువాత రెండవ విషయం జ్ఞాపకం రాకపోతే ''ఒక గ్లాసెడు మంచినీళ్ళు ఇవ్వండి'' అనిగానీ ''గాలి ఎక్కువగా వస్తోంది ఆ కిటికీ మూయండి'' అనిగానీ అనండి. దానితో మీరు తరువాతి విషయం ఆలోచించే సమయం లభిస్తుంది.
చెబుతూ చెబుతూ ''ఇందులో ఆరు విషయాలున్నాయి'' అనకండి – ఆ తరువాత మీకు కేవలం అయిదే గుర్తుకు వస్తే ప్రమాదం. ఇలాకాక ఆరు పాయిం ట్స్‌ చెప్పిన తరువాత ''ఈవిధంగా ఇందులో ఆరు విషయాలున్నాయి'' అనండి. ముఖ్యంగా వేగంగా మాట్లాడేవారి కొరకు :
ఆరు రకాలుగా మీరు మాట్లాడే వేగాన్ని తగ్గించుకొనచ్చు.
1. ఒక ఆలోచనను మీరు కొన్ని వాక్యాలలో వివరించిన తరువాత కాస్త ఆగండి (Give pause) .... ఆవిషయం వారు అర్ధం చేసుకోవడానికి కొంత సమయమివ్వండి.
2. ప్రశ్నించండి.... కాస్త ఆగండి! శ్రోతలు జవాబు కొరకు మీరు ఎదురు చూస్తున్నారనుకునేటట్లుగా ప్రవర్తించండి.
3. వారినుండి జవాబు వస్తే వారికి విషయం అర్ధమౌతోంది అని తెలుస్తుంది. ఈ విధంగ్బాడా మీ మాట్లాడే వేగానికి ఒక బ్రేకు పడుతుంది.
4. వేగం తగ్గించే ఉపాయాలలో అతిముఖ్యమైనది... చెప్పే విషయాన్ని మళ్ళీ మళ్ళీ (Repeatedly) వేరు వేరు మాటలలో చెప్పండి అందువల్ల ఒకే విషయానికి అనేక పదాలు వెతకడం వల్ల మీరు మాట్లాడే వేగం తగ్గడమేగాక ఒకసారి కాకపోయినా మరొక సారయినా వారికి విషయం అర్ధమౌతుంది.
5. మీకు టి.వి. అనౌన్సర్స్‌, న్యూస్‌రీడర్స్‌ మాటలు అర్ధమౌతున్నాయి కదా! ఎందుకు? జాగ్రత్తగా పరీక్షించండి వారి మాటలను రికార్డు చేయండి. మీరు కూడా అవే మాటలు మాట్లాడుతూ రికార్డు  చేయండి. రెండు రికార్డులను వినండి మీకు భేదం తెలుస్తుంది.
6. మీకు వచ్చిన పుస్తకం నుండి 20 పదాలున్న ఒక పేరాగ్రాఫును మీరు మామూలుగా మాట్లాడే వేగంతో చదవండి. గొంతును పెంచుతూ, వేగాన్ని తగ్గిస్తూ మరొకసారి చదవండి. మూడవసారి మరికాస్త వేగాన్ని తగ్గిస్తూ చదవండి. ఈ మూడింటినీ టేపు చేసి వినండి. వేగం ఎలా తగ్గించుకోవాలో అందువల్ల కలిగే లాభమేమిటో మీకు తెలుస్తుంది.   
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో కలిసి జీవించాలంటే ఇతరుల నుండి తానేమి కోరుకుంటున్నాడో, ఇతరులకు తానేమి ఇవ్వగలడో (ఇవ్వదలిచాడో) స్పష్టంగా చెప్పగలగాలి. ఇలా సంబంధాలు నెలకొల్పడానికే భాష ఏర్పడింది. కానీ ప్రస్తుతం ఒకరు చెప్పేది మరొకరికి అర్ధం కాకుండా ఉంది. లేదా వినకుండానూ ఉన్నారు. దీనివల్లే మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. దీన్నే టైమ్‌ అనే పత్రిక Semantic Aphasia అంటుంది. ''ప్రస్తుతం పదాలు అర్థాలకన్నా అనర్ధాలను కలుగజేస్తూ, ప్రజలను విడదీసి ఒంటరివాళ్ళను చేస్తున్నాయి' అంటుందా పత్రిక.
" It is as if some power had dropped around transparent cylinder about us so that words trying to reach us hit the cylinder and bounce away"
''అదేదో శక్తి ఒక్కొక్కరి చుట్టూ అద్దాల కవచాన్ని ఏర్పరచినట్లు, అందుకే చేరవచ్చే శబ్ధాలు వాటిని తగిలి మనసుకు చేరకుండానే వెనుదిరుగుతున్నట్టు అనిపిస్తుంది''.
రమ్యమైన రస్సెల్‌ కథ :
ఇలా అర్ధం కాని మాటలనుగూర్చి 'రస్సెల్‌' ఒక చక్కని కథ చెబుతారు....
ఉద్యోగం నుండి రిటైరైన ఒక ఒంటరి వ్యక్తికి ఏమీ తోచటేదట. ఆయన తన మనోరంజనం కొరకు వస్తువుల పేర్లు మార్చి పెట్టుకోవడం మొదలెట్టాడు. అన్నాన్ని కుర్చీఅని, కుర్చీని అన్నం అని అన్నాడు. ''హా! హా! ఈరోజు నేను కుర్చీని తిన్నాను, అన్నంలో ్బర్చున్నాను'' అనుకున్నాడు. అలాగే అన్ని వస్తువుల పేర్లు మార్చి పెట్టుకున్నాడు. ఒక లిస్టు తయారుచేసి వస్తువుల పేర్లు అసలు పేర్లకు ఎదురుగా తాను మార్చిన పేరు వ్రాశాడు. కొత్తపేర్లు అలవాటయ్యే వరకు ఆ కాగితాన్ని ఉంచి తరువాత చించివేశాడు. ఈ మధ్యకాలంలో ఆయన అసలు బయటికి వెళ్ళలేదు. ఎవరితోనూ మాట్లాడలేదు. ఇప్పుడు ఆయనకు పూర్తిగా కొత్త మాటలే అలవడ్డాయి పాత వాటిని పూర్తిగా మరిచిపోయాడు. ఇంతలో ఆయన జబ్బు చేయడంతో మంచాన పడ్డాడు. ముసలాయనకు ఏమైందీ చూద్దామని లోపలికి వచ్చిన వ్యక్తులకు ఆయన ఏం చెబుతున్నాడో ఒక్కముక్క కూడా అర్ధం కాలేదు. ఈయనకు పిచ్చి ఇక లాభంలేదంటూ వారంతా ఆయన్ను
విడిచి వెళ్ళిపోయారు. ప్రస్తుతం మనందరి పరిస్థితి ఇలాగే ఉంది. ఆఫీసర్‌ చెప్పేది క్రింది పనివారికి అర్ధం కాదు-వారిది ఆఫీసరుకు, భార్యది భర్తకు, భర్తది భార్యకు అర్ధంకాదు. ఇక కలిసి జీవించడం ఎలా? ఉక్కిరిబిక్కిరి చేస్తున్న జనసమూహాల మధ్య కూడా వ్యక్తి ఒంటరివాడై మిగిలిపోతున్నాడు. నన్నర్ధం చేసుకునే వారే లేరా!
అనే భావం ముఖంలో కనిపిస్తుండగా దిక్కులు చూస్తున్నాడు. మరి ఈ పరిస్థితిలో మనం ఏం చేయాలి?


మాట్లాడు - విను :
''నువ్వు మాట్లాడేమాట నువ్వు విను'. చాలామంది మాట్లాడుతూ పోతారు. వారు చెప్పిందే మరోసారి చెప్పమంటే వారికి అది సాధ్యం కాదు. స్వయంగా వారు చెప్పేది వారు వినక పోవడం వల్ల ఇలా జరుగుతోంది. ''నువ్వు వాడిన పదాన్ని ముందు నువ్వు తెలుసుకో' ఒక వ్యక్తి 'సింపుల్‌టన్‌' అనే పదాన్ని 'అమాయకుడు' అని అర్ధం వచ్చేచోట వాడాడు. నిజానికి ఆ పదానికి
'మూర్ఖుడు' అని అర్ధం. ఆవిషయం ప్రస్తావిస్తే ఆయన తనకా పదం యొక్క అర్ధం తెలియదు అన్నాడు. (అయినా సరే ఆయన ఆ పదం వాడాడు) ''నువ్వు వాడిన మాటలో నువ్వు పొందుపరచదలచుకున్న అర్ధం ప్రతిబింబించేలా చెయ్యి''. తెలంగాణా ప్రాతంలో 'బొంద'ను 'గుంట' అంటారు. ఉభయగోదావరి జిల్లాలలో పదం వాడితే అంతా నవ్వుతారు.
అక్కడ గుంట అంటే అమ్మాయి అని అర్ధం. ''తొయ్యడం, దొబ్బటం, నూకటం నెట్టడం'' మొదలైనవి పర్యాయ పదాలు, ఆంధ్రప్రదేశ్‌లో ఇందులోని ఒక్కొక్క పదం ఒక్కొక్క ప్రాతంలో బూతుపదంగా వ్యవహరించబడుతుంది. ఇవి ఎరిగి మాట్లాడాలి లేదా మనం మాట్లాడదలచింది ఒకటైతే వారికి మరొకటి అర్ధమౌతుంది.

అర్ధమౌతే :
ఈ విధంగా నిన్ను ఇతరులు అర్ధం చేసుకుంటే ఏమౌతుంది? నువ్వు తెలివిగలవాడివని ప్రజలు గుర్తిస్తారు. నువ్వు మాట్లాడే విషయం నువ్వు ఎరుగుదువని వారు గ్రహిస్తారు. (ఈ ప్రపంచంలో చాలామంది తాము ఎరుగని విషయాలను గురించి గంటలకొద్దీ వాగడం కద్దు). అప్పుడు ఈ రెండు విషయాలు ప్రగతికి బాటలు వేస్తాయి.


పశ్నించుకోండి :
మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి....
1. మీ ఆఫీసర్‌ మిమ్మల్ని అర్ధం చేసుకోగలుగుతున్నాడా?
2. మీ క్రింత పనిచేసేవారు మిమ్మల్ని అర్ధం చేసుకుంటున్నారా?
3. మీ ఇంట్లోవారు మిమ్మల్ని అర్ధం చేసుకునేలా ప్రవర్తిస్తున్నారా?
4. అలాగే మీరు మీ పై ఆఫీసరును, క్రింత పనిచేసే వారిని, మీ ఇంట్లోవారిని ఎంతవరకు అర్ధం చేసుకుంటున్నారు?

ఆలోచించండి.... ''అంటే ఏమిటి?'' అని వారు ప్రశ్నిస్తున్నారంటే మీరు చెప్పదలచుకున్నది సరిగ్గా మాటల్లో పెట్టలేక పోతున్నారన్నమాట. అలాగే వారు ఎలా, ఏయే మాటలు మాట్లాడటం వల్ల వారి భావాన్ని మీముందు ప్రకటించగలరో మీరు వారికి వివరించి చెప్పగలుగుతున్నారా?
ఏ పద్ధతిలో మాట్లాడితే మీరు పరస్పరం ఒకరినొకరు అర్ధం చేసుకోగలరో తెలిసి కూడా మీరాపద్ధతిని ఉపయోగించడం లేదా! ఒకవేళ అదే నిజమైతే మరి ఎందుకని ఆ పద్ధతిని ఉపయోగిండం లేదు? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.

ఇదీ జవాబు :
మీరు చెప్పినదంతా విన్నవాళ్ళను మళ్ళీ తిరిగి ఆ విషయం చెప్పమనండి. అప్పుడు మీరు ఎక్కడ స్పష్టంగా చెప్పలేదో, ఎక్కడ వారు అసలే అర్ధం చేసుకోలేదో మీకు తెలుస్తుంది.
పొగడ్తలు - ఓదార్పులు :
" Is it people who produce good results feel good about themselves? Or people who feel good about themselves produce good results"
ఉన్నతమైన ఫలాన్ని పొందగలిగినవారు తమను ఉన్నతంగా భావించుకుంటారా? లేక తమను ఉన్నతంగా భావించుకునేవారు మంచి ఫలితాల నిస్తారా? అనేవి ప్రశ్నలు.
తమను ఉన్నతులుగా భావించుకునేవారు అంతటితో తృప్తి పొంది ఏ ఉన్నత కార్యాలు చేయక, సమాజానికి ఏ ఉన్నత ఫలితాలు అందివ్వక ఉండిపోవచ్చు. కనుక ఒకసారి ఉన్నత కార్యాలు చేసినవారు తమను ఉన్నతులుగా భావించుకుంటారు. అనడమే సబబు.  కానీ అటువంటివారు మళ్ళీ మళ్ళీ ఉన్నత కార్యాలు చేస్తూ సమాజానికి ఉపయోగపడటం కొరకు వారిని పొగడాలి. అది వారికి స్ఫూర్తిదాయకమై ముందుకు సాగగలరు. ఉన్నత కార్యం చేసినప్పటికీ కొందరికి ఫలితం
లభించకపోవచ్చు. అయినా అటువంటి వారిని కూడా ఓదార్చాలి.

విజయం పొందినవాణ్ణి అంతాసన్మానిస్తారు. కానీ అపజయం పొందినవాణ్ణి వెలివేస్తారు. పొగడ్తలు, ఓదార్పుల అనే ఆయుధాలతో ప్రపంచాన్నే జయించవచ్చు. కానీ ఆహంకారులై ఉండి కేవలం తమను ఉన్నతులుగా భావిస్తూ, సమాజానికి ఏ విధంగానూ ఉపయోగపడని వారి దగ్గర మాత్రం ఈ రెండూ ఉపయోగించకూడదు.

   
ఇష్టపడతారు :
''నాకేదైనా పని చెబుతారా!''
''నేను చేయదగ్గ పనేదైనా ఉందా!''
'' నేను ఖాళీగా కూర్చోలేను బాబు!'' నాకేమైన పని చెప్పండి''.....
మొదలైన మాటలను అంతా ఇష్టపడతారు. పనిచేసే వారికన్నా ప్రేమగా చేస్తామనే వారే ఎక్కువగా గౌరవించబడతారు. (అలాఅని పనితప్పించుకు తిరుగుతూ కేవలం మాటలు
చెప్పమనికాదు)

ఇష్టపడనిది :
మీ వెనుక జరిగే ప్రచారాన్ని పట్టించుకోకండి. అదేమని అడగకండి. ఇలా అడగబడటాన్ని ఎవరూ ఇష్టపడరు. "It is Royal to be good and to be abused"
''మంచి చేసి విమర్శింపబడటం గౌరవప్రదం.''
ఒకవేళ మీరు అదేమని వారిని ప్రశ్నిస్తే తామలా అనలేదంటారు.అంతేకాదు భవిష్యత్తులో వారి ద్వారా జరగాల్సిన పనులు ఆగిపోతాయి. అందువల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు.

Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
ఎవ్వరు  ఏన్ని చెప్పిన నేను చివరికి నేను చెప్పేదొకటే? చివరిక్షణం వరకు ఆత్మవిశ్వాసం విడువవద్దు.
 
 ఒక మహాత్ముడు తన సఫలత యొక్క మూల సూత్రాన్ని వివరిస్తూ ఇలా వ్రాస్తాడు. నేను ఉదయం లేవగానే ''నేను చేయగలను చేస్తాను'' అనే మంత్రాన్ని జపిస్తాను.
 విశ్వాసమే ఆత్మ బలానికి అంతంకాని ధార. నదిని ఈదేవాడు మధ్యలో తాను ఆవలి తీరానికి చేరగలననే ధైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడా ఇక అతడి మరణం తథ్యం. విమానం నడిపే పైలట్‌ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతే అతడు తనతో బాటు విమానంలో ఉన్నవారి నందరినీ ఆ పై లోకాలకు తీసుకువెళ్ళగలడు.
 
 రైలు కొండ ఎక్కేటప్పుడు " I think, I will, I think I will" అంటుంది. (నేను ఎక్కగల ననుకుంటాను) అంటాడో కవి. కొండ దిగేటప్పుడు వేగం పెరగగా "I thought I could, I thought I could" (నేను ఎక్కగలనని అనుకున్నాను ఎక్కాను) అంటున్నట్టుగా వినిపిస్తుందని అంటాడా కవి.
 
 ఒక స్కూల్‌లో చరిత్రకు సంబంధించిన పాఠం ఒకటి విద్యార్ధులను వ్రాయమని ఆజ్ఞాపించాడు. అధ్యాపకుడు. కొద్ది సేపటికి ఒక విద్యార్ధి వ్రాయడం లేదనిగ్రహించి, ఆ పిల్లవాణ్ని నిలుచోబెట్టి ఎందుకు వ్రాయడం లేదో చెప్పమని గద్దించి అడిగాడు. ఆ పిల్లవాడు ''సార్‌ మీరు చెప్పిన ప్రతి అక్షరం నాకు గుర్తున్నది. మరి మళ్ళీ అది నేను ఎందుకు వ్రాయాలి'' అన్నాడు. అధ్యాపకుడు కోపంగా నిజంగానే నువ్వు పాఠాన్ని అక్షరం పొల్లుపోకుండా వప్ప చెప్పగలిగావో ఫరవాలేదు, నిన్నేమీ అనను. కాని చెప్పలేక పోయావంటే మాత్రం దండిస్తాను'' అన్నాడు. కాని అందరూ ఆశ్చర్యపోయేట్లుగా ఆ పిల్లవాడు పాఠం వప్పచెప్పాడు.
ఇంకోసారిక్లాసు రూములో పడ్డ వేరుశనగక్కాయ పొట్టుచూసి ఉగ్రుడై ఆ టీచరు పిల్లలందరినీ దండించడం మొదలు పెట్టాడు. ఆ పిల్లవాడి వద్దకు వచ్చేసరికి ''సార్‌ నన్ను కొట్టకండి, నేను తప్పు చేయనప్పుడు ఎందుకు శిక్ష ననుభవించాలి?' అన్నాడు. టీచర్‌ ఆ పిల్లవాణ్ణి విడిచి పెట్టి తక్కిన పిల్లవాళ్ళను దండించాడు. ఆ పిల్లవాడెవరో కాదు, లోకమాన్య బిరుదాంకితుడైన బాల గంగాధర తిలక్‌. అవి ఆయన విద్యార్ధి జీవితంలో జరిగిన సంఘటనలు. ఆత్మ విశ్వాసానికి నిధియైన ఈ మహాత్ముడు స్వతంత్రసంగ్రామంలో ''స్వాతంత్య్రం నా జన్మహక్కు'' అని గర్జించాడు. ఏదోఒకరోజు నాదేశం శృంఖలాలు తెగుతాయి అనే విశ్వాసంతోటే ఆయన ముందుకుసాగాడు. మరణాసన్న సమయంలో కుడా ఆయన ఆ విశ్వాసం విడవలేదు. ఆత్మ విశ్వాసంలోనుంచే ఆశ, ఆశలోనుండే ఉత్సాహం ఉత్పన్నమౌతు న్నాయి.ఉత్సాహమున్నచోటే విజయం ఉంటుంది. సాహసియైన వ్యక్తి ఒకసారి ఓడి పోయినా హతాశుడుకాడు. తిరిగిమరింత ఉత్సాహంతో పనిచేయనారంభిస్తాడు.

మిల్టన్‌ వాక్యాలు వినండి...
''యుద్ధంలో ఓడిపోతే ఏం? సర్వస్వం పోగొట్టుకోలేదు కదా?'' 
 బ్రవునింగ్‌ మాటలు ఆలకించండి....
 ''నేనెప్పుడూ పోట్లగిత్తనే, ఇంకో పోట్లాటకు కూడా సిద్ధమే. దానిని కుడా ప్రాణాలతో సమానంగా కొనసాగిస్తాను.

పండిట్‌ మదనమోహన్‌ మాలవీయ, కాశీ విశ్వవిద్యాలయ స్థాపనకు కావలసిన నిథిని సేకరిస్తూ హైద్రాబాద్‌ వచ్చి నైజాం నవాబును కుడా యాచించాడు. నవాబ్‌ మాత్రం నిర్కొహమాటంగా నిధి ససేమిరా ఇవ్వనన్నాడు. ఆత్మవిశ్వాసం గల మాలవీయ నిరాశ పడలేదు. మంచి అవకాశం కొరకు ఎదురు చూడటం మొదలు పెట్టాడు. అదే సమయంలో ఒక ధనవంతుడు మరణించాడు. అతడి శవయాత్ర సాగిపోతున్నది. అతని బంధువులు గుప్పెళ్ళతో డబ్బు విసిరేస్తుంటే ప్రజలు కోలాహలంగా ఏరుకుంటున్నారు. కాసేపు ఆలోచించిన మాలవీయ తాను కుడా వెళ్ళి డబ్బులు ఏరుకోవడం మొదలుబెట్టాడు. ఆయనను ఎరిగిన వారంత ఆశ్చర్యంగా ''మాలవీయాజీ ఇదేమిటి? ఇలా చేస్తున్నారు? అని అడిగారు. ఆయన నవ్వుతూ ''ఏం చేయను నేను బెనారస్‌, వెళ్ళగానే హైదరాబాద్‌ నుండి నిధి తెస్తానని వెళ్ళారుకదా ఏవి అని అడిగితే ఏం చేయను. బ్రతికున్న నవాబేమో ఇవ్వనన్నాడు. అందుకనే హైదరాబాద్‌లో శవాల నుండయినా డబ్బు వసూలు జేసుకువెళదామని'' ఈ విషయం ఆనోటినుండి, ఆనోటికి వెళ్ళి చివరికి నవాబును చేరింది. నిజామ్‌ సిగ్గుపడి తానే స్వయముగా మాలవీయ వద్దకు వచ్చి క్షమాపణలడిగి గొప్ప నిధిని దానం చేశాడు. కనుక ఆత్మవిశ్వాసాన్ని విడవకండి సఫలత మీదౌతుది.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
జీవితాన్ని స్వస్థతగా ఉంచుకోవాలంటే, మనస్సును స్వస్థతగా ఉంచుకోవడం ఎంతో అవసరం. మనస్నే శరీరాన్ని నడుపుతుంది. శోకం,క్రోధం,గ్లాని, వైరాగ్యం మొదలైనవన్నీ మనస్సులోనే ఉత్పన్నమౌతాయి. వాటియొక్క ప్రభావం రక్తసంచాలనంపైన, మెదడుపైన, నరాలపైన, వీటివల్ల అన్ని అంగాలపైన ఉంటుంది. శోకంవల్ల ఆకలి మందగిస్తుంది. క్రోధంవల్ల రుచి చెడిపోతుంది. ఈర్ష్యా, ద్వేషాలవల్ల ఆనందం దెబ్బతింటుంది. మనం కోరుకుంటే మనస్సును ఉత్సాహంతో నింపి దానిని బలంగా తయారుచేయవచ్చు. నిరుత్సాహంతో నింపి దానిని బలహీనంగా తయారుచేయవచ్చు. మన జయాపజయాలు మన చేతిలోనే ఉన్నాయి.


స్వతంత్ర సమరయోధుడు ''చంద్రశేఖర్‌ ఆజాద్‌'' పేరులో ఆజాద్‌ పేరు చేర్చబడిన సంఘటన ఒకటి ఉంది.
23 జులై 1906లో మధ్యప్రదేశ్‌ 'భావరా' అనే పేరుగల గ్రామంలో పుట్టాడు ఆయన. ఈయన తండ్రి ఏదో విషయంలో కోపగించగా భయంతో 12 సంవత్సరాల పిల్లవాడుగా ఉన్నప్పుడు ఇంటినుండి బొంబాయికి పారిపోయాడు. 15 సంవత్సరముల వయస్సులో బనారస్‌ చేరి సంస్క ృతం, హిందీ నేర్చుకోవడం మొదలెట్టాడు. అదే సమయంలో దేశంలో గాంధీగారి పిలుపు నందుకొని సహాయ నిరాకరణోద్యమం జరుగుతోంది. ఉత్తేజితుడైన ఈ పిల్లవాడు కుడా ఒక విద్యార్ధుల గుంపులో కలసి పెద్దగా నినాదాలు చేస్తూ సాగిపోయాడు. పోలీసులు అతణ్ణి పట్టుకొని వెళ్ళి మేజిస్ట్రేట్‌ ముందు నిలబెట్టారు.
మేజిస్ట్రేట్‌ ఈ పిల్లవాణ్ణి ప్రశ్నించడం మొదలు పెట్టాడు.

నీ పేరు?
ఆజాద్‌ (స్వాతంత్య్రం)

తండ్రిపేరు?
స్వాధీనత!

ఈ పిల్లవాడు మొండివాడని గ్రహించి చివరి ప్రశ్న వేశాడు

''నీ ఇల్లెక్కడ'?
జైల్లో!

ఇక మేజిస్ట్రేట్‌కు కోపం ఆగింది కాదు. ఆయన ఆ పిల్ల వాడికి 15 కొరడా దెబ్బలు శిక్ష విధించాడు.
జైలు ఎదురుగా మైదానంలో అందరి ముందు దెబ్బలు తింటూ ప్రతి దెబ్బకు చంద్రశేఖర్‌ ''వందేమాతరం'' నినాదం ఇస్తూనే ఉన్నాడు. జైలునుంచి చంద్రశేఖర్‌ బైటికి రాగానే డా|| సంపూర్ణానంద ఆయనకు ''అజాద్‌' అన్న బిరుదు నిచ్చాడు. అప్పటినుండి ఆయన చంద్రశేఖర్‌ ఆజాద్‌గా ప్రసిద్ధికెక్కాడు. సూర్యుడు అస్తమించని సామ్రాజ్యాన్ని 15 సంవత్సరాల పిల్లవాడు తన మాతృభూమిని బానిసత్వము నుండి బైటపడవేయడం కొరకు ఎదిరించడమే నిర్భయత.

సాహసం యొక్క లేమినతమే భయం.అంతేకాని భయానికి వేరేఅస్థిత్వం లేదు. మన ఆదేశానుసారమే మన మస్తిష్కం నడుస్తుంది. ఏ విధంగానైతే మనం మనస్సులో సాహసాన్ని ఉత్పన్నం చేస్తున్నామో అలాగే భయాన్ని నిరాశను కుడా పుట్టిస్తున్నాము. జబ్బుచేసినప్పుడు ఈ నాజబ్బు తగ్గదు అని నిశ్చయించుకున్న తరువాత ఎన్ని మందులు వాడినా ఇక జబ్బు తగ్గదు. అలాగే ఒక విద్యార్ధి నాకిది గుర్తుండదు. నేను ఇది చదవలేను అనుకుంటే అలాగే జరుగుతుంది. భయంచేత నిరాశ, నిరాశచేత ఉత్సాహహీనత దానిచేత దుఃఖం ఉత్పన్నమౌతాయి. మనస్సులోని సంకల్పం చాలా విచిత్రమైంది. ఇటువంటి ఈ సంకల్పం ఒక స్వార్ధరహితమై, సమిష్టి శ్రేయోదాయకమై, నిర్భయమై, పవిత్రమైనదైతే ఎలాగుంటుందో చూడండి.

 బ్రిటీష్‌ ప్రభుత్వం వీరసావర్కర్‌ (వినాయక్‌ సావర్కర్‌) కు ''కాలాపానీ' (The Black waters) శిక్ష విధించింది. ఈ శిక్ష ప్రకారం ఆయన రెండు జన్మల (40 సంవత్సరాలు) వరకు అండమాన్‌ దీవులలో నరకతుల్యమైన, శ్రమదాయకమైన జైలుశిక్ష అనుభవించడం కొరకు పంపడం జరిగింది. ఆయన మెడలో ''40 సంవత్సరాలు కారాగారవాసం'' అన్న బోర్డు వేలాడ గట్టబడి ఉంది. ఆయన మెడలోని పట్టాను చూచి జైలర్‌ ''నువ్వు 40 సంవత్సరములు జైలు శిక్ష అనుభవించేవరకు జీవించి ఉంటావా?' అని అడిగాడు. వీరసావర్కర్‌ ఏమాత్రం జంకక  ''నేను తప్పక జీవించి ఉంటాను. కానీ అసలు అంతవరకు భారతావని మీ అధీనంలో ఉంటుందనుకోబోకండి'. అన్నాడు.
చరిత్రపుటలు వీర సావర్కర్‌కు సాక్ష్యంగా నిలిచాయి. అక్షరాలా అయనన్నట్లేజరిగింది. నిశ్చయం దృఢమైనది, నిర్భయమైనది, పవిత్రమైనది, అయితే దానికి ఈ సృష్టిలోని ఎదురులేదు. అటువంటి నిర్భయతకు విజయమేకాని అపజయం ఎదురుకాదు.

అజ్ఞానం విజ్ఞానం వైపుకు ప్రయాణిస్తుంది,  కానీ మూఢత్వం మరణంవైపుకు దారితీస్తుంది. - ఠాగూర్‌
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
సన్మానాల వెంట పరిగెత్తకండి. మీలో అర్హత ఉంటే అవే మీవెంటపడి రాగలవు. దీపం చుట్టూ పురుగులు చేరతాయి గానీ, దీపం వాటికొరకు పరిగెత్తదు. నిప్పురవ్వను దాచిపెట్టలేము. కొంగున ముడివేద్దామని చూస్తే అది కాల్చుకునైనా బైటపడుతుంది. మీలో అర్హత లేనప్పుడు సన్మానాల కొరకు ఎగబడితే ఆపహాస్యమే ఎదురౌతుంది. పైగా సన్మానాలలోనే విజయం ఉన్నదనుకోకండి. ఆత్మ తృప్తిలోనే విజయం ఉన్నది. 

ప్రసిద్ధ కళాగురువు ''జామినీరాయ్‌'' యొక్క ఖ్యాతి దశదిశలా వ్యాపిస్తున్నా ఆయన పటాటోపాన్ని, సన్మానాలను ఇష్టపడే వాడు కాడు. ఆయన ఏదైనా మీటింగులో గాని, గోష్టిలోగాని పాల్గొనగా ఎవరూ చూడలేదు. ఆయన సమకాలీనులైతే ఆయన కలకత్తా విడిచి బైటకి వెళ్ళడం మేము చూడలేదనేవారు. విదేశీయుడైన భారతీయ కళాప్రేమి ''ఆస్టిన్‌కోట్స్‌'' యొక్క డైర్బీడా ఇందుకు ప్రమాణాన్నిస్తుంది. అందులో ఆయన ఇలా వ్రాశారు.... ''ఒకరోజు నేను జామినీరాయ్‌ ఇంటికి వెళ్ళాను. ఆయన నాకు ఢిల్లీకి రానుపోనూ రిజర్వ్‌ అయివున్న ఫస్టుక్లాస్‌ రైల్‌టికెట్‌ తీసి చూపారు. అది సెంట్రల్‌ గవర్నమెంట్‌ తరుపున జరగబోయే సన్మానానికి ముందుగావారే చేసిన ఏర్పాటు. ''ఐతే మీరు వెళతారా''? అని నేను అడిగాను. ఆయన నవ్వుతూ లేదన్నట్లుగా తల ఊపారు. ''కానీ ఎందుకు?'' అని మళ్ళీ నేనడిగాను అందుకు ఆయనన్నారు. ''ఆ సన్మానమేదో ఇక్కడికే పంపవచ్చు కదా?'' అన్నారు. అలాగే జరిగింది కుడా.


మనుష్యులను జయించడానికి శక్తియుక్తులు చాలవు. మహో దాత్తమైన మనస్సు, ప్రేమపాశం అవసరం.   - స్పినోబీ
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
నీవే నీకు మిత్రుడివి. నీవే నీకు శత్రువువు కూడా.
ఈ ప్రపంచంలో నువ్వు సాధించద లచుకొన్న దాని కొరకు ప్రయత్ని స్తుండగా దానికి అడ్డుపడుతున్నది కుడా నువ్వే. నీ ప్రయత్నానికి సహాయం కుడా నీనుండే లభిస్తుంది.
 నీవే నీ స్వర్గానికి నరకానికి మార్గదర్శివి.
 నువ్వు ఏది కోరుకుంటావు అనేది నీ చేతిలో ఉంది. నిర్ణయం నీది. నీవు సర్వస్వతంత్రుడివి. ఒకవేళ నువ్వు నరకాన్ని, దుఃఖాన్ని, అపజయాన్ని కోరుకున్నావా ఇక ఇతరులకు దోషం అంటగట్టవద్దు. నేను ఇది కోరుకున్నాను అనేది స్మరణలో ఉంచుకో. ఏది కోరుకుంటావో అదే లభిస్తుంది. ఈ ప్రపంచంలో అడగనిది ఏదీ దొరకదు. కాని కోరికకు వస్తూపలబ్ధికి మధ్య కొన్ని సంవత్సరాల దూరం ఉండవచ్చు. లేక కొన్ని జన్మల తరువాతే లభించవచ్చు. కానీ ఎప్పుడైనా ఏదైనా లభిస్తే తప్పక ఎప్పుడో కోరికలనే బీజాలు నాటాననీ, పంట ఇప్పుడు కోసుకుంటున్నాననీ గ్రహించు. ఎప్పుడు కోరుకున్నా వనేది నీకు స్మరణకు రాకపోయినా పంట ఈరోజు అందటమే ఒకప్పుడు బీజం పడిందనటానికి ప్రమాణం. కనుక నీ జీవిత యాత్రను నీవు ఎప్పుడైనా మలుపు త్రిప్పుకోవచ్చు. నీవు వెళుతున్న మార్గం తప్పని నీకు తెలిస్తే, మార్చుకోవటం నీ చేతులలో ఉంది. తప్పక మార్చుకోవాలి కుడా. ఈ సృష్టిలో సంతోషం నీ కెవ్వడూ అందించడు. నీవు సంతోషంగా ఉండదలిస్తే ఉండటమే. జాగ్రత్తగా వీక్షించు. నిజానికి నీకు ఇప్పటివరకు లభించింది నీ యొక్క అవసరాలకు మించేఉంది. అనాదికాలంనుంచి నీవు కోరింది నీకు లభిస్తూనే వచ్చింది! నీ కొరకే నీ జీవితాన్ని రచించింది. కాని ఇది మనకు సత్యం అనిపించదు. నేను కోరుకోనిది నాకు లభించిందనిపిస్తుంది. దుఃఖం కావాలని, విఫలత కావాలని ఎవడూ కోరుకోడు. కాని ఎంతోమంది దాన్ని పొందుతుండటము చూస్తాము. ఐతే నీ కోరికను మాటలలో పెట్టటంలో పొరపాటు చేసి వుంటావు.
విఫలత కారణంగానే, నువ్వు సఫలతను కోరుకుంటున్నావు. కనుక ఎప్పుడెప్పుడు నువ్వు విజయం కోరుకుంటే అప్పుడప్పుడు విఫలత యొక్క స్మరణ కలుగుతుంది. ఈ విధంగా అపజయం యొక్క ఆలోచనే మనస్సులో బలంగా తయారవుతూ ఉంటుంది. విజయం మార్గంలో కొన్ని మజిలీలెదురౌతాయి. అక్కడ కొంత విశ్రమించి విజయం అనే గమ్యానికి చేరక, ఆ మజిలీనే అపజయంగా భావించి, నిరాశతో చాలామంది వెనక్కు వెళతారు. పైగా విఫలత వస్తుందేమోనన్న భయంతో దాని స్మరణే పెరిగి చివరికి అదే ప్రకటమౌతుంది. అప్పుడు నువ్వుంటావు. నేను విజయం కోరుకున్నాను. కానీ అపజయం లభించింది. కాని జరిగింది వ్యతిరేకం.

నీవు అపజయం నీకు తెలియకుండానే కోరుకున్నావు. లాఓత్స్‌ అనే మహానుభావుడంటాడు :- విజయం కోరుకుంటే అపజయం లభిస్తుంది. కనుక నీకు నిజంగా విజయాన్ని కావాలంటే విజయాన్ని కాంక్షించకు.ఇక నిన్నెవడు విఫలుణ్ని చేయలేడు. ''నేను సన్మానం కోరుకున్నాను కాని అవమానం లభించింది''అని నువ్వంటావు. తనపై తనకు సద్భావం లేనివాడే ఇతరుల నుండి గౌరవం కోరుకుంటాడు. తనలోని లోపాలను కప్పిపుచ్చుకోవటా నికి, ఇతరులు తనను గౌరవించాలని, సన్మానించాలని కోరుకుంటారు. తనలోని న్యూనతా భావాన్ని ఇతరులు చేసే సన్మానాలతో కప్పిపుచ్చుకుందామని ప్రయత్ని స్తాడు. తనయొక్క స్థానం స్థాయి తెలిసినవాడు ఇతరులు తనను సింహాసనంపై కుర్చోబెట్టాలని ఆశించడు. ఆ విధంగా తనను తాను అవమానించుకోడు. 'లాఓత్స్‌' అంటాడు.

 నన్ను ఎవ్వరు అవమానించలేరు. ఎందుకంటే నేను అసలు సన్మానాలు ఆశించను. ఇదే సన్మానాలు పొందే విధానం.
''నన్ను ఎవరూ ఓడించలేదు. ఎందుకంటే విజయం యొక్క ఆలోచనే నేను విడిచిపెట్టాను. ఇక ఏ విధంగా ఓడించగలవు?
''విజయం కోరుకున్నవాడినే నీవు అపజయంపాలు చేయగలవు.
ఈ ప్రపంచంలో సన్మానం కోరుకోనివారికే సన్మానం లభిస్తుంది. విజయం కుడా విజయం కోరుకోనివారికే లభిస్తుంది.
ఎవరైతే తాము ముందే విజయమని ఎరుగుదురో ఇక వారేవిధంగా ఇక విజయం ఆశిస్తారు? స్వయం పరమాత్మే మనను మానవులుగా పుట్టించి గౌరవం ఇచ్చాడు. సన్మానించాడు. ఈదుర్లభయోనితో చక్కటి జీవనమిచ్చాడు. సౌభాగ్యమిచ్చాడు. ఆయన నుండి విజయం పొందింది అన్ని ప్రాణులలోనూ ఒక్క మనిషి మాత్రమే. మధురమైన ఈ ప్రకృతి సౌందర్యాన్ని ఆయనిచ్చిన కండ్లతో చూసి విజయులుకండి. సెలయేటి గలగలలు కండి! గామారండి! పనికిరాని చిన్నచిన్న విషయాలలో విజయం కోసం బిచ్చగాళ్ళలాగా చేతులు చాచకండి!!


శ్రమద్వారానే ఆరోగ్యదాయకమైన ఆలోచనలు కలుగుతాయి; ఆలోచించి చేసేపని ద్వారానే శ్రమ ఆనందదాయకమౌతుంది. శ్రమనూ, ఆలోచననూ విడదీయడం శ్రేయస్కరం కాదు. - రస్కిన్‌
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
''ధనహీనమైనదైనా స్వధర్మమే ఉత్తమం'' – గీతాచార్యుడు

వ్యక్తి తన గమ్యాన్ని అయితే భయం వల్ల లేదా లోభం వల్ల మార్చు కుంటాడు. ఈ రెంటికీ లొంగకుండా ముందుకు సాగినవాడే విజయాన్ని పొందగలడు. ఏదో ఒక కారణంవల్ల ప్రతి క్షణం గమ్యాన్ని మార్చేవాడు ఢిల్లీకి వెళదామని రైలు ఎక్కి మళ్ళీ రెండు స్టేషన్‌ల తరువాత దిగి బొంబాయి రైలు ఎక్కినట్టుగా ఉంటుంది. ఇలా రైళ్ళు మార్చడంలోనే జీవితమంతా గడచిపోయి అసలు ఏ గమ్యమూ చేరలేకపోవచ్చు.

 శ్రీమతి రుక్మిణీ అరుండెల్‌ నృత్య, సంగీతాదికళలలో వైదుష్యమున్న ఒక గొప్ప కళాకారిణి. దేశ కళా సంస్క ృతిక పునర్జాగరణ కొరకు 'తిరువన్‌ మియార్‌లో దాదాపు వంద ఎకరాల స్థలంతీసుకొని అందులో కళాక్షేత్రం అనే ఒక సంస్థను స్థాపించింది. అక్కడ ఇప్పటికీ యోగ్యులైన గురువుల ద్వారా విద్యార్ధీవిద్యార్ధినులకు నృత్య, సంగీతాది (గాత్ర, వాద్య) చిత్రకళలలో శిక్షణ ఇవ్వబడుతున్నది. 1977లో ఆవిడ తన కళా సమాజంతోబాటు భారతీయ నృత్య ప్రదర్శనలివ్వడానికి హాలెండ్‌ వెళ్ళింది. ఒకరోజు ఉదయం ఆవిడ విడిదిచేసిన హోటల్‌ గదిలో ఫోన్‌ గంట మ్రోగింది. ఆపరేటర్‌ ఆవిడతో భారత ప్రధానమంత్రి మొరాజ్జీ దేశాయ్‌ ఆవిడతో మాట్లాడబోతున్నట్లుగా చెప్పింది. మొరార్జీదేశాయ్‌ ఆవిడతో భారత రాష్ట్రపతి పదవి స్వీకరించమని కోరాడు. ఒక్క క్షణం ఆవిడను స్తబ్ధత ఆక్రమించుకున్నది. కాసేపు ఆవిడ ఏమీ
మాట్లాడలేకపోయింది. ''ఏమిటీ రాష్ట్రపతి పదవా''? అనిమాత్రం అన గలిగింది మళ్ళీ తమాయించుకొని ''నేను ఆ పదవి గురించి ఏమీ ఎరుగనే?'' అన్నది. మొరార్జీదేశాయ్‌ ఆవిడకు ధైర్యం చెబుతూ ''ఫరవాలేదు మీరే తెలుసుకోగలరు. ప్రస్తుతం మీరు మీ కార్యక్రమాలన్నీ రద్దు చేసుకొని భారతదేశానికి తిరిగిరండి'' అన్నాడు.

''మీరు చెబుతున్నారు కనుక అలాగే రావడానికి ప్రయత్నిస్తాను'' అన్నది. శ్రీమతి అరుండెల్‌ అదురుతున్న గుండెలను చిక్కబట్టుకొని. ఆ రాత్రి ఆవిడకు నిద్రపట్టలేదు. ''నేను అంత శ్రేష్టమైన పదవికి అర్హురాలినేనా? నేనీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించగలనా? ఒకవేళ నేను ఆ పనిని సరిగ్గా చేయగలిగినా మరి నా కళాక్షేత్రం ఏమవుతుంది?'' ఈ విధంగా ఆలోచిస్తూ రాత్రంతా గడిపింది. తెల్లవారుజామున ఒక చిన్న కునుకు తీసిలేచింది. ఆవిడ మనస్సు ఇప్పుడు స్థిరమైంది.తన జీవిత గమ్యం కళేనని నిర్ణయించుకుంది. ఉదయం ఫోన్‌లో మొరార్జీ దేశాయ్‌తో వినమ్రంగా ''నేను రాష్ట్రపతి పదవిని స్వీకరించి నిర్వహించడానికి అసమర్ధురాలను'' అని తన నిర్ణయం చెప్పివేసింది. మొరార్జీదేశాయ్‌ ఆవిడకు ఎంతో నచ్చచెప్పచూశాడు.రాజకీయాలకు దూరంగా కళకు సమర్పితమై విశ్వవిఖ్యాతిగాంచిన ఆవిడను అందరూ రాష్ట్రపతిగా స్వీకరిస్తారని తాను కూడా ఆ పదవికి న్యాయం చేకూర్చగలదని చెప్పాడు. ఎన్నిసార్లు చెప్పినా ఆవిడ మాత్రం స్వీకరించలేదు. చివరికి ఓటమి నొప్పుకున్న మొరార్జీదేశాయ్‌ ''మీకు నిజంగా నా ప్రస్తావన స్వీకారం కాకపోతే అదే విషయం స్పష్టంగా తెలియజేస్తూ ఒక టెలిగ్రామ్‌ ఇవ్వవలసింది'' అన్నాడు. శ్రీమతి అరండేల్‌ వెంటనే టెలిగ్రామ్‌ పంపింది. రెండవ రోజు దేశ విదేశాలలోని అసంఖ్యాకమైన పత్రికలు కళాక్షేత్రంపై ఆవిడకు గల సమర్పణను, ఇంత గొప్ప పదవిని కాదనగలిగిన ఆవిడ త్యాగబుద్ధిని కొనియాడుతూ వ్రాశాయి. ఆ తరువాత ఆవిడ కళకే పూర్తిగా సమర్పితమైంది

సాధారణంగా గొప్పవాళ్ళు ఆ గొప్పతనాన్ని కేవలం తమ తెలివి తేటలతోనే కాకుండా నిరంతర పరిశ్రమవల్ల పొందుతారు. - బ్రూస్‌ బార్టన్‌
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
ప్రతి జీవికి ఆహారం కావాలి. ఆ ఆహారం కోసమే అనేకరకాల పవృత్తులతో వివిధ - వృత్తులు. వ్యాసంగాలు చేస్తుంటాం. ప్రతి 3 లేక 4 గంటలకు ఏదైనా ఆహారం తీసుకోకపోతే కడుపులో కలవరం బైలుదేరుటయేగాక - నీరసము, విసుగు, కోపం, తలనొప్పిలాంటి శారీరక బాహ్యలక్షణాలు కనుపిస్తుంటవి. దీనినే ఆకలి అనుకోవచ్చు. ఆకలి ప్రారంభించగానే
తగిన ఆహారం తినకపోతే శరీరం మానసికంగాను, శారీరకంగాను చెయ్యవలసిన పనులపట్ల విముఖత జెందుతుంది ఆహారాన్ని నియబద్ధంగా తీసుకొనే అలవాట్లు గలవారికీ ఆకలి వెయ్యటం సహజంగా సంభవిస్తుంది. ఆ విధంగా కాక చిరుతిళ్ళు తినేవారికి, కాఫీ తేనీరులాంటి పానీయాలు అధికంగా సేవించేవారికి అమితంగా పొగత్రాగేవారికి యింకా మరికొన్ని ఇతర కారణాల వల్ల ఆకలి అనేది కలుగదు. శరీరంలో ఆకలిని కలిగించే దాన్ని ''ఫీడింగ్‌ సెంటర్‌' అని ఆహారం భుజించిన తర్వాత ఇకచాలు అనేభావం (తృప్తి) కలిగించే దాన్ని ''పేషైటీ సెంటర్‌' అని అంటారు. ఆహారపు తృప్తికి మూలమైనది రక్తంలోని ''గ్లూకోస్‌' పదార్థం ఇది రక్తంలో తగ్గినప్పుడే ఆకలి కలుగుతుంది. ఆహారపదార్థాలు అనేక విధాలుగా ఉంటుందని, అయితే మన శరీరానికి ఉపయోగపడే ఆహారానికి 4 విధాలైన గుణధర్మాలు విధిగా ఉండవలసి ఉంది.

అందులో
1. దేహంలో వేడిని, శక్తిని కలిగించే గుణము.
2. దేహంలో తరగిపోతున్న శక్తిని పూరించగల్గి-దేహం పెరుగుదలను గావించే గుణము.
3. దేహంలోని ఏంజైములను, హార్మోనులను, హిమోగ్లోబిన్‌, మొదలగునవి తయారుజేయు గుణము.
4. దేహధర్మాలను సక్రమపరచి నిర్వర్తింపజేయు గుణము.

ఈ గుణ ధర్మాలు కలిగియున్న పదార్ధాలు మాత్రమే శరీరోపయోగకరమైన ఆహారమని తెలియవలసి ఉంటుంది. మిగిలిన ఆహారమంతా వ్యర్థ పదార్థమేగాక శరీరానికి హానికరంగా కూడా పనిచేస్తుంది.
శరీరానికి ఆహారానికి గల సంబంధాన్ని బట్టి ఆలోచించితే, మానవ శరీరం 96 శాతం నాలుగు ముఖ్య పదార్థములతో నిర్మించబడ్డదని శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. అందులో 1. 65 శాతం ప్రాణవాయువు 2. 18 శాతం కర్బనం 3. 10 శాతం హైడ్రోజన్‌ 4. 3 శాతం నత్రజని.

ఈ విధంగా 96 శాతం గల నాల్గు ముఖ్య పదార్ధాలను మినహాయిస్తే మిగిలిన నాలుగు శాతంలో సున్నం, భాస్వరం, ఇనుము, సోడియం, అయోడిన్‌, క్లోరిన్‌, మెగ్నిషియం, కోబాల్డ్‌, క్రోమియం లాంటి నిరుపయోగ పదార్ధాలుంటవి. మనిషి మరణించిన తరువాత ఈ నిరుపయోగ పదార్థాలే బూడిద రూపంలో మిగులుతుంది. ఆహారం అనేది దేహంలో అంతార్భగంగా ఉండేదే ! ఈ ఆహారంపోషక ప్రదమైనప్పుడు దేహం ఆరోగ్యంగా ఉంటుంది. పోషకాహారాల్లో కార్బోహైడ్రేట్లు, ప్రొటీనులు, క్రొవ్వు, విటమిన్లు, ఖనిజలవణాలు, నార (పీచు) పదార్ధాలు, నీరు మొదలగునవి రసాయనిక సమ్మేళనాలుగా వుంటాయి. ఈ పోషకాలవల్లనే ఆరోగ్యం పరిపూర్ణంగా లభిస్తుంది. కాబట్టి ఆహారంలో ఉండే పోషక పదార్ధాలవల్ల దేహంలో గల మూలపదార్థాలు ఆధారపడి ఉంటాయి. అందువల్ల పరిపూర్ణారోగ్యం పొందాలన్నా! వ్యాధులను నిరోధించా లన్నా, నిర్మూలించాలన్నా మనం తినే ఆహారం యొక్క పోషక విలువల్ని గుర్తించి తింటూ వుండాలి. ఆ విధంగా కాక రుచిగా ఉందనో, మరెప్పుడూ లభించదనో, కృతిమ ఆహారాలు భుజిస్తూ వుంటే, (చిరుతిళ్ళు, బజారు అంగళ్ళల్లో అమ్మే వంటకాలు) శరీరమూల పదార్ధ పోషకత్వం నశించుట యేగాక పలువిధములైన అనారోగ్యాలు సంభవించే ప్రమాద మున్నది.

Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
''ఓ బ్రూటన్‌! ఇందులో మన భాగ్యం యొక్క తప్పేమీలేదు. మనలను మనం నికృష్టులుగా ఎంచేకునే మనదే తప్పు'' -షేక్స్పియర్‌



మనం మన వెంట ఏం తీసుకువచ్చామో తెలియదుగానీ, పరమాత్మ మనకు ఆలోచించడానికి బుద్ధిని, కర్మ చేయడానికి కాళ్ళు, చేతులు ఇచ్చాడు. ఆలోచించండి. అర్దంచేసుకోండి, పనిచేయండి. అదేపురుషార్ధం. మిమ్మల్ని మీరు తుచ్ఛులుగానూ, హీనులుగాను, నికృష్టులుగానూ అనుకోవద్దు. మీ శక్తిని అర్ధంచేసుకోండి. పురుషులు పౌరుషాన్ని, సింహంగర్జనను మరచిపోతే అస్థిత్వమే సమాప్తంకాగలదు. ఒక్కసారి కండ్లు తెరచి చూడండి. మీలాంటి మనుషులే ప్రపంచ ఇతిహాసాన్ని మార్చేశారు. వారిని ప్రేరకులుగా, ఆదర్శంగా పెట్టుకొని

ముందుకు నడవండి. నెపోలియన్‌ బోనాపార్ట్‌ ఉత్సాహానికి చెలియలికట్టు ఉండేదికాదు. ఆయన

నిరంతరం యుద్ధాలతో మునిగి యుండేవాడు. ఒకసారి ఇలానే యుద్ధం చేస్తూ అల్ఫస్‌ పర్వతాలను సమీపించాడు. ఆయన తనసేనతో ఆ పర్వతాలను దాటి వెళ్ళాలనుకున్నాడు.

ఈ పర్వతాల్లోని ఒక శిఖరంపైన ఒక వృద్ధ తపస్వి నివసిస్తూ ఉండేది దారి తెలుసుకోవడం కొరకు కొందరు సైనికాధికారులను వెంటపెట్టుకొని నెపోలియన్‌ ఆవిడ వద్దకు వచ్చాడు. ఆయన కోరిక విన్న ముసలమ్మ పకాపకా నవ్వింది. ఆవిడ ఈ విధంగా అంది. ''నీలాంటి మూర్ఖులు చాలామంది ఈ పర్వతా రోహణచేస్తూ ప్రాణాలు విడిచారు. కనుక నువ్వు ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపో''

ముసలమ్మ మాటవిని నెపోలియన్‌ నిరాశపడలేదు. అసంభవమనే శబ్ధాన్ని శబ్ధకోశంనుంచే తొలగించమనే ఆయన,ఆ వృద్ధస్త్రీతో ఇలా అన్నాడు. ''మీ మాటలు నాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చాయి. మార్గం దుర్గమమైంది. అన్నారు కనుక నేను మరికాస్త జాగరూకుడనై పర్వతాన్ని దాటడానికి ప్రయత్నిస్తాను. అంతేకాని వెనక్కు తిరిగే ప్రసక్తి మాత్రం లేదు.''

ఆ వృద్ధనారి నెపోలియన్‌ యొక్క అచంచల విశ్వాసానికి ముగ్ధురాలై ''మీలాంటి సాహసికి ఈ ప్రపంచంలో అసంభవమైన పని ఏదీలేదు. వెళ్ళు నీ కార్యంలో నీవు విజయం పొందాలని ఆశీర్వదిస్తున్నాను'' అన్నది



తన దృఢ నిశ్చయానికి, ఆ తపస్విని ఆశీర్వాదాన్ని జోడించి నెపోలియన్‌ సేనతో సహా ఆ పర్వతాన్ని దాటివెళ్ళాడు. ప్రకృతి మనకు బుద్ధినిచ్చింది. చేతనత్వాన్నిచ్చింది. నిర్ణయించగల

శక్తినిచ్చింది. వెనువెంట పనిచేయగల క్షమతను కూడా ఇచ్చింది. అయినా ఇంకా నా అదృష్టం బాగాలేదంటారెందుకు? అదృష్టం అంటే ఏమిటి? ఇప్పుడు కనపడనిది. ఏనాడో చేసుకున్నదీ ఇప్పుడు ఫలవవంతం కావడమేకదా, మరి ఇప్పుడు తినడానికి పండ్లు లేవని విచారించేకన్నా ఇప్పుడే బీజాలెందుకు నాటవు? కనుక భాగ్య నిర్మాతవు కూడా నీవేనని గ్రహించు. ప్రపంచ ఇతిహాసాన్ని అదృష్టం వ్రాయలేదు. నీ ప్రగతిని అదృష్టం నిర్ణయించదు. ఆవిష్కరణ (క్రొత్తవి కనుక్కోవడం) పరిశ్రమవల్ల సాధ్యమైందికాని అదృష్టంవల్ల కాదు. ఈ సంసారంలోని వైభవం, అభివృద్ధి చెందిన దేశాల యొక్క సంపద నిరంతర పరిశ్రమవల్ల వచ్చిందేకాని అదృష్టంవల్ల వచ్చింది కాదు.

''నాయ మాత్మా బలహీనే నలభ్యః'' - భౌతిక ప్రగతిని అలా ఉంచండి.

ఆఖరికి ఆత్మ సాక్షాత్కారం కూడ నిర్భలుడికి కలగదంటున్నది ఉపనిషత్తు. కాలిమీద కాలేసుకొని ్బర్చోవడం వల్ల ఎవడి డుపు నిండింది? విజయం భాగ్యం వల్లకాదు! శక్తియుక్తి, వ్యవస్థలపై ఆధారపడి ఉంటుంది.

తులసీ రామాయణంలో సముద్రాన్ని దాటడం ఎలాగ అనే ప్రశ్న వచ్చినప్పుడు అందరూ సలహాలిస్తారు. విభీషణుడి సలహా మేరకు శ్రీరామచంద్రుడు సముద్రుడిని ప్రార్ధించడానికి ఉద్యుక్తుడౌతుండగా, లక్ష్మణుడు ముందుకువచ్చి ఇలా అంటాడు. ''దైవదైవ ఆలసీపుకారా'' దేవుడూ-దేవుడూ అని బద్ధకస్తుడే పిలుస్తూ ఏపనీ చేయకుండా కూర్చుంటాడు. ఓ మహాబలా! ఆజానుబాహూ! ప్రార్ధనలతో జాప్యం చేయకండి. మీ భుజబలంతో కార్యం సిద్ధింపచేయండి''

జీవితంలో అనేకసార్లు అవకాశాలు వచ్చి తలుపు తడుతూ ఉంటాయి. అప్పుడు మనం బద్ధకంగా నిద్రిస్తూనన్నా ఉండి ఉంటాము లేదా క్లబ్బుకెళ్ళి పేకాడుతూనన్నా ఉంటాము. అదృష్టాన్ని నమ్ముకొని కూర్చోకండి. ఒకసారి వచ్చిన అవకాశం మళ్ళీ రమ్మన్నా తిరిగిరాదు. మనయొక్క ఉన్నతి వికాసం అనే ద్వారం తెరవడానికి మనం ఏనాడూ ప్రయత్నించలేదు.



ప్రయత్న మెక్కడుందో అక్కడే విజయం కూడా ఉంది. ఆగ్రహం సాధారణంగా బుద్ధిహీనతతో ప్రారంభమై పశ్చాప్తాపంతో అంతమౌతుంది. - పైథాగరస్‌.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
''మనస్సులో క్రోధం ఉత్తేజం కలుగగా దానిని శాంతివైపు మళ్ళించిన వాడిని నేను సారధి అంటాను. మనుష్యుడు క్రోధంపై ఆక్రోధంతోను, అసాధుతపై సాధుత్వం తోను, లోభంపై ఉదారతతోను, అసత్యంపై సత్యంతోను విజయాన్ని పొందగలడు''. – గౌతమబుద్ధుడు

డాక్టర్‌ ఇక్‌బాల్‌ గొప్ప దేశభక్తుడు. ఉర్ధూ, సాహిత్యంలో గొప్ప షాయర్‌గా (కవి) కూడా ప్రసిద్ధుడు. స్వాతంత్య్రానికి ముందు ఆయన వ్రాసిన దేశభక్తి కవితలు ఎందరో యువకులకు ఉత్తేజాన్ని ఇచ్చాయి. ''సారే జహాసే అచ్ఛా, హిందుస్తాన్‌ హమారా''... అనే ఆయన గీతం హిందీ మాతృభాషగా కలిగిన ఉత్తరాదిలోనే కాదు. దానిఅర్ధం తెలియని దక్షిణాదిన కూడా అది ఎంతోమంది నోట నలిగింది.
డా|| ఇక్‌బాల్‌ ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఉండేవాడు. అందుకే ఆయన కవితలు అందరినీ సంతోషపెట్టగలిగాయి. ఒకసారి ఆయనను కలవడానికి ఒక మౌల్వీ వచ్చాడు. మాటల సందర్భంలో సంగీతం విషయం వచ్చింది.ఆ మౌల్వీ స్త్రీలు పాటలు పాడడాన్ని ఎంతో నిరసించాడు. ఆయన ఇక్‌బాల్‌తో స్త్రీలు పాడిన పాటలు వినడం వల్ల కామోద్రేకం కలుగుతుంది. అంతేకాదు వారిని చూస్తూ వారి పాట విన్నామంటే చాలు ఇక, కాముకత మరీ విపరీతమౌతుంది.'' అన్నాడు.
డా|| ఇక్‌బాల్‌ నవ్వుతూ ఇలా అన్నాడు. ''ఐతే ఒక పనిచేయండి. స్త్రీల కచేరీలకు వెళ్ళినప్పుడు లంగోటీ బలంగా లాగి కట్టుకోండి. కండ్లకు గంతలు కూడా కట్టుకు వెళ్ళండి. అప్పుడు వారి పాటలు విని ఆనందించగలరు. దానివల్ల మీకు హాని కూడా ఏమీ ఉండదు''.
ఆ మౌల్వీసిగ్గుతో తలవంచుకున్నాడు


మనస్సు మార్గాన్ని మళ్ళించడంలోనే విజయం ఉంది. ప్రస్తుతం మనస్సు యొక్క గతి ఎటువున్నది? నేనుదాన్ని ఎటుతీసుకువెళ్ళదలచుకున్నాను, అనే విషయం ఎప్పుడూ స్మ ృతిపథం నుండి జారనివ్వవద్దు. మీ ఆదర్శం (లక్ష్యం) వైపే మీ మనస్సు వెళ్ళాలి. వ్యర్ధస్థానాల నుండి మీ మనస్సు తిరిగివచ్చి కాసేపైనా మీరు ఆజ్ఞాపించిన చోట తిరిగి కూర్చోగలుగుతుంటే మీరు తప్పక గమ్యం చేరుకోగలరని తెలుసుకోండి. మనస్సును అదుపులో పెట్టుకోవడంమంటే దానిని తొక్కిపట్టడం కాదు. లేదా దానికి భయపడటం అంతకన్నా కాదు. సుప్రసిద్ధ హిందీ కవియిత్రి మహీయన్‌ మహాదేవివర్మ యొక్క జీవిత సంఘటన ఒకటి యున్నది. ఆవిడ బౌద్ధభిక్షువు అవుతూ ఆగిపోయింది. ఆవిడ స్వయంగా ఆ విషయం ఇలా చెప్పుకున్నది.
''అప్పుడు నేను ప్రీవియస్‌లో చదువుతున్నాను.ఆ రోజుల్లో బౌద్దభిక్షువు నవ్వాలని నాకెంతో అనిపించింది.అప్పుడు సిలోన్‌లోని బౌద్ధ సంఘానికి భిక్షువు నవదలచుకున్నాను, దీక్ష తీసికోవడానికి నన్ను రమ్మంటారా లేక మీరే భారత దేశానికి వస్తారా?' అని వ్రాశాను. వారు దానికి జవాబుగా ''మేము భారతదేశానికి వస్తున్నాము. నైనితాల్‌లో మా విడిది ఉంటుంది అక్కడికి వచ్చి కలవండి'' అని వ్రాశారు. నేను భిక్షిణి కావాలని నిశ్చయించుకొని నా సంపత్తినంతా దానం చేశాను. నైనితాల్‌ వెళ్ళితే అక్కడ ఇంగ్లీషు దొరలకన్నా భోగాలెక్కువగా కనిపించాయి. వీరు భిక్షువులా? భిక్షువులే కాదలచుకుంటేఈ సంపత్తి అంతా ఎందుకు? అనుకున్నాను. సింహాసనంపై గురువుగారు కూర్చొని వున్నారు. ముఖాన్ని విసనకర్రతో కప్పుకున్నారు. నేను ఇంకోవైపునుండి అయన్ను చూడటానికి ప్రయత్నిస్తే వారి ముఖం తిప్పేసుకున్నారు. బయటకి వచ్చాక మంత్రి మహోదయుణ్ని అడిగితే 'మహాస్థవీరులు'' స్త్రీ ముఖాన్ని వీక్షించరు అన్నాడు.
అంటే ఆయనపై ఆయనకే నమ్మకం లేదన్నమాట. అటువంటి బలహీనుడి నుండి నాకు దీక్ష తీసుకోవాలనిపించలేదు. ఆ తరువాత వారెన్నో ఉత్తరాలు వ్రాశారు. కానీ నేను జవాబు నివ్వలేదు. ఈ మనస్సు అంత తొందరగా మాట వినదు.అన్నిచోట్లకు తిరిగి రావడం దాని యొక్క స్వభావం. మరి ఇది ఎలా అదుపులోకి వస్తుంది? దీనికి జవాబు గీతాచార్యుడు చెబుతున్నాడు.
''అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే''
అభ్యాసం వల్ల వైరాగ్యం వల్ల మనస్సు అదుపు చేయబడుతుంది. మనస్సు దేనిని ప్రేమిస్తుందో, అన్నిటినీ వదిలి అది అక్కడికి వెళుతుంది. అలాంటి మానసిక వత్తిడినే వైరాగ్యం అంటారు. అంతే కాని బలవంతంగా వస్తువులను విడిచిపెట్టడం వైరాగ్యం కాదు.
 ''హంసాపామే మానససరోవర్‌ తాల్‌ తలమ్యా క్యోండోలే'' అంటాడు కబీర్‌దాస్‌. మానవ సరోవరాన్ని చేరిన రాజహంస చెరువులు, కుంటలకు వస్తుందా? కనుక మీకు దేనిపైనైతే ప్రేమ ఉందో దానినే లక్ష్యంగా చేసుకోండి. అప్పుడు సహజంగానే మనస్సు తక్కినవాటి నన్నిటినీ వదిలి
ఆ లక్ష్యం వైపుకు వెళుతుంది. రెండవది అభ్యాసం. మనసు ప్రత్యేక వస్తువు పైన ఉన్నా అలవాటు కానంతవర్బ అటూ ఇటూ పరిగెత్తవచ్చు. కనుక అభ్యాసం నిరంతరం పరిశ్రమ కూడా మనస్సుకు అవసరం.
ఈర్ష్యా, ద్వేషం, చింత, అశాంతుల యొక్క తల్లి అయిన భయాన్ని సమూలంగా నాశనం చేయండి, లేదా మనస్సులో ఉత్సాహం హర్షం ఉత్పన్నం కాదు. చిత్తం ఏకాగ్రం కాదు. ఏ కార్యంలోనూ పూర్తి శక్తిని వినియోగించలేరు. కనుక మనస్సును కాస్త అదుపు చేసుకొని సఫలత పొందండి.

పని చేయనివాడే సోమరిపోతుకాడు పనిబాగా చేయని వాడు కూడా సోమరిపోతే. - సోక్రటీస్‌
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
''మౌనమే ఉత్తమ సంభాషణ కానీ మాట్లాడ్డం అవసరమైతే తప్పక మాట్లాడు. అయితే వీలైనంత తక్కువ. ఒక శబ్ధం అవసరమైన చోట రెండు వాడకు''   - మహాత్మాగాంధీ

అనగనగా ఒక ఊళ్ళోఒక పెద్దమనిషి ఉండేవాడు. అతడు ఒట్టి వాగుడు గాయ. ఎవరెన్ని రకాలుగా నచ్చజెప్పినా వాగుడు మాత్రం మానేవాడుకాదు. ప్రతి విషయం తనకు తెలుసనేవాడు. తెగ గొప్పలు చెప్పేవాడు. తాను చేయలేని పని లేదనేవాడు.

ఒకసారి అతడి నేస్తమొకడు. ''నువ్వు అన్నీ చేయగలవేమో కాని మన గొర్రెల గోపన్న లాగా, రాతిమీద నుండి రాతిమీదికి చెంగు చెంగున లేడి పిల్లలా దూకుతూ మన ఊరి కొండెక్కలేవు'' అన్నాడు. ఆ వాగుడకాయ పెద్దమనిషికి చాలాకోపం వచ్చింది. ఆయన ''అదేమీ లేదు! కావాలంటే పందెం కాయి నేను కుడా గోపన్నలాగే పర్వతం ఎక్కగలను అన్నాడు. అతడు పందెంలో ఓడిపోతే అతిగా మాట్లాడటం మానాలని లేదా అతడు కొండెక్కగలిగితే అతనికి 1000

రూపాయల నగదు ఇవ్వాలని నిర్ణయించారు.

అందరూ చూస్తుండగా గోపన్న వాగుడుగాయీ కొండెక్కడం మొదలెట్టారు. ఆయనగారు తన సహజధోరణిలో తన చిన్నప్పుడు ఎలా కొండలెక్కే వాడో ఏమేమి సాహసకృత్యాలు చేశాడో చెబుతూ ఎక్కుతున్నాడు. గోపన్న చిరునవ్వు నవ్వుతూ ముందుకు సాగాడు. ఒక 10 నిమిషాలు ఎక్కేసరికి మనవాడి పని అయిపోయింది. ఆయాసంతో ఇకతాను ఒక్కఅడుగు కూడ ముందుకు వేయలేనంటూ చతికిలబడి పోయాడు. గోపన్న నవ్వుతూ, ''మామూలుగా ఎక్కితే మీరూ ఎక్కగలిగే వారండి. మాట్లాడుతూ ఎక్కడం ఎవరికీ సాధ్యంకాదు'' అన్నాడు.

మన వాగుడుగాయ కాసేపు ఆలోచించి ఇలా అన్నాడు. ''నిజమే ఎక్కువగా వాగడంవల్ల చిన్నకొండే ఎక్కలేకపోయానే. మరి జీవితంలో విజయం అనే శిఖరాన్ని వాగుతూ చేరడం ఇంకెంత కష్టం!''

ప్రపంచంలోని అన్ని పోట్లాటలకు అనుచిత భాషణమే కారణం. విశ్వశాంతిని మనం మన అసంతులిత వాణితో భంగం చేస్తున్నాము. మన కుటుంబ సభ్యులతో, మిత్రులతో, వ్యాపార వ్యవహారాలలో చక్కగా మాట్లాడటంవల్ల  పని సాన్బులమవడం, వెగటుగా మాట్లాడటంవల్ల వ్యవహారం చెడటం రెండూ జరుగుతాయి.

మీరు మీజీవితాన్ని ఒక్కసారి సింహావలోకనం చేసుకోండి. ఎక్కడయితే జీవితంలో మీరు అపజయం పొందారో, అవన్నీ ఒక లిస్టుగా వ్రాసుకోండి. అన్ని సంఘటనలలోనూ దాదాపు కఠోరవాణే దూరిందని తెలుస్తుంది. ఇతరుల స్వాభిమానాన్ని మీరు దెబ్బకొట్టినప్పుడు ఇతరుల యొక్క బలహీనతలను మీరు అవహేళన చేసినప్పుడు, ఇతరుల యొక్క భావనలను మీరు నిరాదరించినప్పుడు, ఇతరులను మీరు అవమానించినప్పుడు, ఇతరుల యొక్క అవకాశం, పరిస్థితిని పట్టించుకోకుండా వారిని దోషులుగా నిలబెట్టినప్పుడు లేదా ఆసక్తి, క్రోధం, లోభం మొదలైన వాటికి మీరులోనై, మీ మాట పై, మీరు అదుపును కోల్పోయినప్పుడు తప్పక మీరు ఇతరులను శతృవులుగా మార్చుకుంటారు.

ఆచార్య రామచంద్రశుక్ల మితభాషి. ఒకసారి ఆయన శిష్యులిద్దరు ఈ విషయంపై పందెం వేసుకున్నారు. ఒకడన్నాడు ''నేను గురువుగారి నోటివెంట ఒక్కసారి ఐదు మాటలు వెలువడేట్టు చేస్తాను'' ఇంకొక శిష్యుడన్నాడు. ఇది సాధ్యం కాదన్నాడు.

వారిద్దరూ ఆచార్యుల వద్దకు వచ్చారు. మొదటివాడు ''గురుదేవ్‌ నేను మీతో ఐదు మాటలు మాట్లాడిస్తానని వీడితో పందెం వేశాను, దయచేసి ఐదు మాటలు మాట్టాడండి'' అన్నాడు.

ఆచార్య నవ్వుతూ ''నీవు.. ఓడిపోయావు'' అన్నారు.
 
మాట అన్నిటికన్నా గొప్ప సాధన. మీ ఆలోచనలను వ్యక్తం చేయాలన్నా, భావనలను ప్రకటించాలన్నా వాణి మార్గం. కనుక మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆగండి. కండ్లు మూసుకుని ఆలోచించండి. మనసులోని ఉద్రేక వేగాలకుఆనకట్ట వేయండి. అవసరమైనంతే వాణి ద్వారా ప్రకటించండి. విజయం మీదౌతుంది. లక్ష ఆలోచించినా ఉపయోగంలేదు. వేయిచెప్పినా ఫలితంరాదు. ఏదో విధంగా నూరు పనులు చేసినా కూడా ఫలితం శూన్యం.

శాస్త్రీయమైన ఆలోచనతో కూడిన ఆచరణతో ఒకమంచి పనిచేసి ప్రయోజనం పొందితే అది అన్నిటికన్నా మిన్న. - ఒక సూక్తి