music, music theraphy, health tips, health, apurup, telugu, telugu blog
మానసికపరమైన ఒత్తిడితో ఎవ్వరు కూడా జీవించాలని అనుకోరు. కాని ఇంట్లోని పలు సమస్యలు, కార్యాలయంలోని పనుల కారణంగా ఒత్తిడి పెరిగే అవకాశం వుంది. అలాంటివారు మృదువైన శ్రావ్యమైన సంగీతం వింటే ఒత్తిడి దూరమవడామే కాకుండా మనసుతో పాటు శరీరం సైతం ఉల్లాసంగా ఉంటుంది. దీనికి కారణం శరీరంలో సంతోషానికి సంబంధించిన సిరోటిన్ అనే రసాయనం విడుదల అవ్వడామే. 

రోజంతా పని వత్తిడిలో పడిపోయే వారు సంగీతం లేదా పాటలు వినడం వల్ల ప్రయోజనలు 

  • శరీరంలో ట్రాయిటోఫన్ రసాయనం కూడా ఉంటుంది. ఇది సంగీతం వినడం ద్వారా శరీరంలోని ఒత్తిడి దూరమై మంచి నిద్ర వస్తుంది. సంగీతం వినడంతో మీ శరీరంలోని కొన్ని జబ్బులు ఉదాహరణకు రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దీంతోపాటు శరీరంలో నొప్పి ఏదైనా ఉంటే సంగీతం నివారణోపాయంగా పని చేస్తుంది.
  • ఆఫీస్ లో మీ పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత మీలో ఉన్న అలసటను తొలగించికునేందుకు ఈవెనింగ్ రాగాన్ని వినండి. సంగీతం వినడం మనోరంజకమైన కార్యక్రమంతోపాటు మీరు ఒంటరిగా ఉన్నారనే భావన మరియు శరీరంలోని ఒత్తిడి కూడా తగ్గుతుంది.
  • లాఫ్టర్ ధెరపీ ఎలాగో అలాగే మ్యూజిక్ ధెరపీ అలాగే ఉంది. మ్యూజిక్ థెరపీ ఉపయోగించడం వలన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇంజనీర్లు, ఐటీ ప్రొఫెషనల్స్, కాల్ సెంటర్‌లలో పని చేసే ఉద్యోగులతోపాటు మీడియాకు చెందిన ఉద్యోగులు మ్యూజిక్ థెరపీని ఉపయోగిస్తున్నారని ఓ సర్వేలో వెల్లడైంది.
  • అతి తక్కువ సమయంలో పనిని పూర్తి చేయడం, తమకిచ్చిన టార్గెట్‌ను పూర్తి చేయడంతో శారీరకపరమైన ఒత్తిడి పెరుగుతుంది. అలాగే తమ పనిలో పోటీ పెరగడంతో మానసికంగా ఒత్తిడికి గురవుతుంటారు. ఇలాంటి సమయంలో కోపం త్వరగా వస్తుంటుంది. దీనికి విరుగుడుగా మనిషి సంగీతం వింటుంటే ఒత్తిడినుంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.
  • ప్రస్తుతం చాలామంది అతి చిన్న వయసులోనే ఒత్తిడికి గురవుతున్నారని, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకుగాను మ్యూజిక్ థెరపీని కొనసాగిచడం మంచిదని నిపుణులు కుడా సలహ ఇస్తున్నారు.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: