jokes, telugu jokes, apurupa jokes, apurupa, telugu blog, fun, fun time, navvulu
రాత్రి సమయం. చల్లగా గాలి వీస్తుంది...
‘‘నేను పాట పాడతాను. నువు తాళం వెయ్యి’’ అన్నాడు భర్త.
‘‘తాళం ఎప్పుడో వేశాను. ఇక ఎవరూ రారు. మీరు పాడడం మొదలుపెట్టండి’’ అంది భార్య.

  ---------------------------------------------------

కస్టమర్: ఇవాళ నేను ఎక్కువ తాగినట్టున్నాను. స్ర్ర్పహ తప్పకుండా ఉండటానికి ఏదైనాతీసుకురా!
సప్లయర్: అలాగే! ఇప్పుడు మీ బిల్లు తెచ్చిస్తాను ఉండండి.

 ---------------------------------------------------

.డెరక్టర్: ఈ సీన్లో మీరు పదో ఫ్లోర్ నుంచి జంప్ చేయాలి.
హీరో: అలా చేస్తే చస్తాను!
డెరెక్టర్: ఫరవాలేదు లెండి. మన సినిమాలో ఇదే లాస్ట్ సీన్.

 --------------------------------------------------------------

టీచర్: ఒరేయ్ గోపీ, నువ్వు పెద్దయ్యాకా మంచి పేరు తెచ్చుకోవాలి..

గోపి: అప్పటిదాకా ఎందుకు... మీరే ఒక మంచి పేరు ఆలోచించి చెప్పండి టీచర్.

------------------------------------------------------------

 కళ్లు మూసుకుని పాటలు పాడుతున్న కమలను చూపిస్తూ ‘‘ఆవిడ ఎందుకలా కళ్లు మూసుకుని పాడుతుంది’’ అడిగాడు హరి.
‘‘ఆమె మనస్సు చాలా మెత్తనిది. శ్రోతల భాద చూడలేక అలా కళ్లు మూసు కుంది! అన్నాడు గిరి.

 ----------------------------------------------------------
 
‘‘దొంగతనం జరగ్గానే మీరు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఇంటికి వెళ్ళగానే బీరువా తెరిచి ఉందంటున్నారు. వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయని అంటున్నారు. అయినా మీ కసలు అనుమానం రాలేదా?’’ అడిగాడు పోలీస్.
‘‘దొంగలు పడ్డారని నాకేం తెలుసు? ఎప్పటిలాగా మా ఆయన సాక్సుల కోసం వెతుక్కున్నారేమోనని అనుకున్నానంతే...’’ చెప్పింది భార్యా మణి.

 ----------------------------------------------------------------
  
పెళ్ళిళ్ళ పేరయ్య: ‘‘అబ్బాయి బుద్ధి మంతుడండీ. గుమస్తా పర్వతం చేస్తున్నాడు.’’
పిల్లతండ్రి: ‘‘గుమస్తా పర్వతం ఏంటయ్యా?’’
పెళ్ళిళ్ళ పేరయ్యు: ‘‘వెన్నటిదాకా గుమస్తా గిరి (కొండ) చేసేవాడండీ, ఈ మద్య నే ప్రమోషన్ వచ్చిందట! అందుకని.’’

--------------------------------------------------------------------------------

విలేఖరి: ‘‘ఏమిటీ! మీ సినిమాలో హీరోయిన్గా ఓ మూగ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారా? ఎందుకని?’’
నిర్మాత: ‘‘నోరుండి మాత్రం ఉద్ధరించేదేవుంది? ఎవరికైనా డబ్బింగ్ చెప్పించాల్సిందేగా.’’

----------------------------------------------------------------------------

‘‘పాడడం వల్ల రక్తం వేడెక్కుతుందని శాస్తజ్ఞ్రులు చెబుతున్నారు, మీకు తెలుసా?’’ భర్తను అడిగింది ఇల్లాలు.
‘‘నిజమే... ఎందుకంటే నువ్వు పాడుతున్నప్పుడల్లా నా రక్తం వేడెక్కుతూ ఉంటుంది’’ ఠక్కున అనేశాడు భర్త.

 ---------------------------------------------------------------------------- 



‘‘నువ్వు మీ ఆవిడతో తగవులాడడం మానెయ్యాలి. సంసారమనే రథానికి భార్యాభర్తలిద్దరూ రెండు చక్రాల వంటి వారు తెల్సిందా?’’ అని ఇంకా ఏదో చెప్పబోయ్యాడు తండ్రి.
‘‘నిజమే కావచ్చు. కాని ఒకటి సైకిల్ చక్రం... మరొకటి ట్రాక్టర్ చక్రం అరతే ఎలా ఉంటుందో మీరే చెప్పండి’’ అన్నాడు కొడుకు దీనంగా.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: