jokes, telugu jokes, apurupa jokes, apurupa, telugu blog, fun, fun time, navvulu
  ‘‘అరటిపండు ప్రత్యేకత ఏంట్రాహరీ?’’ అని అడిగాడు మాస్టారు.
‘‘తింటే బలపడతాం, తొక్కితే జారిపడతాం సార్’’ అని చెప్పాడు హరి.
 

---------------------------

‘‘అబ్బబ్బ... ఏంటయ్యా ఆ గొడవ! బయట ఆ శబ్దమేంటి’’ అని చిర్రెత్తుకొచ్చినట్లు అడిగాడు లైబ్రెరియాన్

‘‘అంతా నిశ్శబ్దంగా ఉన్నారు.

మనం బయుట గోడకు పెట్టిన ‘నిశ్శబ్దం గా ఉండవలెను’ అనే ‘బోర్డు మాత్రం గాలికి టప.... టప... కొట్టుకుంటోంది’’ అని చెప్పాడు అటెండర్.

---------------------------

మాస్టారు: మూడవ ప్రపంచ ప్రజలంటే ఎవర్రా రవీ?రవి: మనదంతా ఒకే ప్రపంచం సార్! మూడు ప్రపంచాలు ఉండవండీ! అని ఠక్కున చెప్పాడు.

---------------------------

ఎక్కడికో వెళుతున్న పుల్లారావు మొహం భయంగా ఉండడం గమనించి అడిగాడు మిత్రుడు -

‘‘ఎక్కడికి?’’
‘‘ఛాతీ ఎక్సరే తీరంచుకోవడానికి’’చెప్పాడు.

ఆ పనయ్యాక హుషారుగా వస్తున్న అతన్ని చూసి మళ్ళీ అడిగాడు మిత్రుడు.
‘‘ఏమైంది, సంతోషంగా ఉన్నావు?’’‘‘నా చర్మం వలవకుండానే ఎముకల ఫొటోలు తీస్తే సంతోషంగా ఉండక ఇంకెలా ఉంటాను’’ చెప్పాడు పుల్లా రావు.

---------------------------

‘బాక్సింగ్ నేర్చుకోవడానికి, కారు డ్రైవింగ్ నేర్చుకోవడానికి మద్యగల తేడా,

‘బాక్సింగ్ నేర్చుకునే టప్పుడు ఎదుటి మనిషిని గుద్దలేం.

---------------------------

ఇరుగింటావిడ: ఈ వరకట్న దురాచారాన్ని అందరం గట్టిగా వ్యతిరేకించి నిషేదించాలొదినా!
పొరుగింటావిడ: అవునొదినా! నాకూ అలాగే అనిపిస్తోంది. మాకు ఒక్కగానొక్క అబ్బాయి. వాడి పెళ్లయిపోగానే మేమూ అదే చెయ్యాలనుకుంటున్నాం.
---------------------------


రోగి: మొన్న వేరే డాక్టరుగారు, మీరు చెప్పిందంతా తప్పు అని - నమ్మవలసిందేమీ లేదని - భయపడవద్దని అన్నారండీ!
డాక్టర్: మీకు పోస్టుమార్టం జరిగినప్పుడు నేను చెప్పిందే కరెక్టు అని ఒప్పుకుంటాడు. కావాలంటే ఇదే నా చాలెంజ్ అని చెప్పండి ఆయనతో...

---------------------------

‘‘‘బాబూ! ఆటో కావాలా?’’ అడిగాడు ఆటోవాలా.
‘‘నాకిస్తే నువ్వెలా బతుకుతావు?  వద్దులే...!’’ అన్నాడు పాసింజర్.

---------------------------

‘‘నూటికి రూపాయిన్నర చొప్పున లక్ష రూపాయలకి ఏడాదికి వడ్డీ ఎంతవుతుందో చెప్పరా రాజా?’’ అడిగాడు మహేష్.
‘‘ఇంకా నేను నోట్సు రాసుకోలేదురా...!’’ చెప్పాడు గణేష్.

---------------------------

‘‘ఏరా వాసూ! నేనిచ్చిన ఉత్తరం పోస్టు చేశావా?’’ అడిగాడు తండ్రి.
‘‘లేదు డాడీ... డాబ్బాకు తాళం వేసుంటేనూ’’ అమాయాకంగా అన్నాడు వాసు.



Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: