telugu jokes, apurupa jokes, navvulu, telugu blog, apurupa,
ఏమండి....  ఈ ధియేటర్లో ఎలుకలున్నాయి. షో మధ్యలో నుంచి ఓ ప్రేక్షకుడొచ్చి కంప్లయింట్ ఇచ్చాడు.
’’ఆ.... అందుకే కదా, ఈ రోజు పాముల్ని వదిలిపెట్టా’’ అన్నాడు ధియేటర్ మేనేజర్.

------------------------------------------------


తండ్రి: ‘‘రాత్రి పదకొండు గంటలకు కరెంటు పోయింది తెలుసా’’
కొడుకు: ‘‘అలాగా! నేను చదువుకుంటూ ఆ విషయం అస్సలు గమనించలేదు మరి!’’

------------------------------------------------

ఓ మతిమరుపు ప్రొఫెసర్ గారు బస్ ష్టాప్ నిలబడి ఉండడం చూసి అతని దగ్గర చదివిన విద్యార్థి ఒకతను కారాపి ‘‘రండి సార్! ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను’’ అన్నాడు.
తీరా ఆయన ఇంటి దగ్గర కారుఆపాక ఆ ప్రొఫెసర్ గారు ఇంటికి తాళం ఉండడం చూసి ‘‘మైగాడ్! మా ఆవిడబస్ స్టాప్ లోనే ఉండిపోయింది!’’ అన్నాడు కంగారుగా.

------------------------------------------------

‘‘మా అబ్బాయి ఎప్పుడూ ఊహల్లో తూలిపోతుంటాడోయ్’’ అన్నాడు రామారావు.
‘‘అరతే ఎందుకైనా మంచిది పైలట్ ట్రైనింగ్ ఇప్పించు’’ అన్నాడు సుబ్బారావు

------------------------------------------------

‘‘రెండుప్లేట్లు వేడివేడి గారెలు పట్రావోయ్’’ ఆర్డరేశాడు సుబ్బారావు
‘‘చిత్తం సార్’’అని వెళ్ళి రెండు నిమిషాల్లో సర్వర్.
‘‘ఆహా.. కమ్మగా ఉన్నాయ్... ఉప్పు బాగ సరిపోయింది, పిండి రోట్లో రుబ్బారా?’’ తింటూ అడిగాడు సుబ్బారావు.
‘‘అవును సార్’’
‘‘ఎంతైనా గ్రెండర్లో రుబ్బితే ఇంత రుచిరాదు. చాలా బాగున్నాయి. మరో నాలుగు పట్రా’’
‘‘థ్యాంక్యూ సార్. మీరైనా  నా ‘చెమట’విలువ గ్రహించారు’’ అంటూ వెళ్ళాడు సర్వర్.

------------------------------------------------

‘‘ఆయన గొప్ప దానకర్ణుడునుకుంటాను. రోజూ బిచ్చగాడికి పదిరూపాయుల నోటు ఇస్తున్నాడు.’’
‘‘అదేం కాదు! ఆ బిచ్చగాడే ఆయనకి వెయ్యి రూపాయులు అప్పిస్తే ఈయన రోజు కో పదిరూపాయుల
చొప్పున అప్పు తీరుస్తున్నాడు.’’

------------------------------------------------

‘‘చల్లని సాయంత్రం... ఎవరూ లేని ఏకాంతం... సన్నగా మొదలైనవర్షం... నీకేమనిపిస్తోంది గీతా?’’
‘‘మేడమీద ఎండ‘పెట్టిన వడియిలు తడిసిపోతాయేమోనని కంగారుగా ఉంది రాహుల్...’’

------------------------------------------------

‘‘మీరు కవితలు, కథలు కాకుండా ఇంకేమైనా రాస్తారా?’’ అడిగాడు ఎడిటర్.
‘‘ఆ... స్నో... పౌడర్...’’ చెప్పాడు కొత్త రచరత.

------------------------------------------------

‘‘అతి చాదస్తుడెవర్రా?’’
‘‘కొత్త చెప్పులకి కూడా పసుపు బోట్లు పెట్టి వాడేవాడు సార్’’ చెప్పాడో విద్యార్థి వినయంగా.

------------------------------------------------

ఓ కోతల రాయడు: మా ఊళ్లో పెద్దకొండ ఉంది. ఎంత ఎత్తు అంటే...
పొద్దున్నే ఆ కొండ ఎక్కిచూస్తే రాత్రికి ఉదయించే చంద్రుడు కన్పిస్తాడు.
రెండో కోతల రాయడు: మా ఊళ్లో అంతకన్నా పెద్దది ఉంది. సాయంకాలం ఆ కొండ ఎక్కితే... మర్నాడు ఉదయం
కన్పించాల్సిన సూర్యుణ్ని చూడొచ్చు.

------------------------------------------------

హోటల్లోకి ఓ కస్టమర్ విసుగ్గా వచ్చి కూర్చున్నాడు. టేబుల్ శుభ్రంగాలేదు. రెడీగా మంచినీళ్లు లేవు. సప్లయర్ను పిలిచి- ‘‘ఓ గ్లాసుడు మంచినీళ్ళిస్తావా?’’ అని అడిగాడు.
‘‘తాగడానికాండీ!’’ అన్నాడు సప్లయర్.
ఒళ్లుమండిన కస్టమర్, ‘‘అబ్బే! ఈ టేబుల్ కడిగేద్దామని’’ అన్నాడు.
Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: