సూపర్ మార్కెట్లో షాపింగ్ చేయడంలో ఒక సౌకర్యం ఉంటుంది. దైనందిన జీవితంలో అవసరమయ్యే వస్తువుల్లో చాలా భాగం ఒకే ప్రదేశంలో దొరుకుతాయి. జాబితా రాసుకోకుండా షాపులో అడుగుపెట్టినా సరే... ఇక్కడి వరకు రాగానే మనకు కావలసిన వస్తువులన్ని గుర్తుకు వచ్చేస్తాయి.
కానీ, సూపర్ మార్కెట్ మాయజాలంలో చెపిలేనన్ని చమత్కారాలుంటాయి. వాటి మాయలో పడితే పర్సుకు చిల్లుపడడంతోపాటు ఇంటినిండా అవసరం లేని వస్తువులు పెరిగిపోతాయి. అందుకే కొన్ని జాగ్రత్తలు...
- సాధారణంగా తాజా ఉత్పత్తులను లోపల పెట్టి పాత సరుకును చేతికందే లాగ పెట్టడం వ్యాపార లక్షణం. కాబట్టి అరల్లో ముందుగా కనిపిస్తున్నవి కాక లోపల అమర్చిన వాటిని తీసుకోవాలి.
- ఒకటి కొంటే మరొకటి ఉచితం... ఆఫర్లో తీసుకు న్నపిటికీ ఎక్స్పైరీ డేట్ లోపు వాటిని ఉపయోగించగలమా లేదా అని చూసుకోవాలి. జామూన్ మిక్స్, కర్జూరాలకు ఈ ఆఫర్ ఎక్కువగా కనిపిస్తుంటుంది.
- ఏదో ఒకటి రెండు ఉత్పత్తులకు తక్కువ ధర పెట్టి వాటి మీద దష్టి ఉంచేలా చేయడం వ్యాపార సూత్రం. ఆ రెండు వస్తువులల ధర ఆధారంగా ఆ దుకాణంలో ధరలు తక్కువ అనే నిర్ణయానికి రాకూడదు.
- సూపర్ మార్కెట్లో ట్రాలీకి బదులు ‘బాస్కెట్ వాడితే బాస్కెట్ బరువు పెరిగేకొద్దీ అవసరం లేని చోట నిలపకుండా కొనుగోలు తోందరగా ముగించేస్తారు.
- ఆకలిగా ఉన్నప్పుడు షాపింగ్ చేస్తే మనకు తెలియకుండానే ఇంటికి అవసరమైన పప్పు దినుసులు, సబ్బులు, షాంపూల కంటే బిస్కట్లు, చాక్లెట్లు, చిప్స్, జ్యూస్, తినుబండారాలే ఎక్కువ కోనేస్తాం.
- కంటికి కనిపించే ఎత్తులో ఎక్కువ లాభం వచ్చే ఉత్పత్తులను పెట్టి, తక్కువ లాభం వచ్చే వాటిని పై అరల్లో, కింది అరల్లో సర్దుతారు. తల పెకైత్తి, కిందకు దించి కూడా చూసుకోవాలి.
- రాత్రి ఆలస్యంగా షాపింగ్ చేస్తే దుకాణంలో రద్దీ ఉండదు. ఆఖరి గంటలో కూరగాయలు, పాలు వంటి మరుసటి రోజుకు తాజాగా వచ్చే వాటి పై ధరలు తగ్గించి తీసుకునే అవకాశం వుంటుంది.
Post A Comment:
0 comments: