![]() |
కారణాలు ఏవైనా చాలామంది మహిళలు ఉదయం పూట అల్పాహారం తినరు. టిఫిన్ తినాలనే
ధ్యాసే వారికి ఉండదు. నిద్ర లేచిన వెంటనే ఓ కప్పు కాఫీనో, టీనో తాగి, దానితో సరిపెట్టుకుంటారు. ఇంటి పనులన్నీ ఆ
కాస్త టీతో, కాఫీతో చేస్తారు.
ఇంట్లో ఉన్న వారందరికీ ఆహారాన్ని, టిఫిన్లను తయారు
చేస్తారు కానీ, దాన్ని వండే
స్త్రీలు తినడంలో తీరిక ఉండదు. ఇలా ఏమీ
తినకుండా మధ్యాహ్నం దాకా గడుపుతుంటారు. ఇలాంటివారు పొద్దుట పూట ఏదో ఒకటి కడుపులో
పడేసుకోవాలని అనుకోకుండా నేరుగా ఒంటిగంటకో,
రెండుగంటలకో ఏకంగా
భోజనాన్నే చేస్తారు. కాఫీ, టీలతో
కడుపునింపుకుంటూ పొద్దుట అల్పా హారం చేయనివారిలో మూడొంతుల మంది మహిళలు ఇలానే
ఉంటారు. ఈ కోవకు చెందిన వారు తొందరగా
ఆనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు.. కాబట్టి
మహిళలు మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, ఉదయంపూట మీరెంత బిజీగా ఉన్నా కాస్త తినడం
అలవాటు చేసుకోవాలి. కుటుంబానికి సేవలు చేస్తున్నామనే భావంతో తిండి, నిద్ర మానేసి, ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా వుంటే నష్టం
మీకేనని గుర్తించాలి.

Post A Comment:
0 comments: