social phobia, health articles, health tips, fears, stage fear, apurup, telugu blog,
కొంతమందిలో కొన్ని రకాల సామాజిక కారణాలపట్ల భయాలు లేదా ఫోబియాలు ఉంటాయి. ఇటువంటి వారు కొత్తవారితో మాట్లాడాలంటే విపరీతమైన ఆందోళనకు గురవుతారు. ఈ రకమైన భయాన్ని సోషల్ ఫోబియా అని వ్యవహరిస్తారు.

సోషల్ ఫోబియా రెండు రకాలుగా ఉంటుంది. అవి - సాధారణ సామాజిక ఫోబియా, ప్రత్యేక సామాజిక ఫోబియా.
  • సాధారణ సామాజిక ఫోబియాకు గురైన వ్యక్తి పదిమందిలో ఉన్నప్పుడు అందరి దృష్టి తనపైనే ఉందని భావిస్తాడు. కొత్త వారిని పరిచయం చేస్తున్నప్పుడు అతడు తీవ్ర భయాందోళనలకు గురవుతాడు.
  • కొత్త వ్యక్తుల ముందు తినడానికి, తాగడానికి కూడా భయపడతాడు. పదిమంది కూర్చున్న గదిలోకి ప్రవేశించడానికి కూడా జంకుతాడు. వీలైనంత వరకూ అటువంటి పరిస్థితులను తప్పించుకు తిరగడానికే ప్రయత్నిస్తాడు.
  • పెళ్లిళ్లు, పార్టీలు మొదలైన వాటికి ఎక్కువ మంది వస్తారు కనుక వాటికి హాజరు కాకుండా తప్పించుకుంటూ ఉంటాడు.

ప్రత్యేక సామాజిక ఫోబియాకు గురైన వ్యక్తులు వృత్తిరీత్యా పదిమందిలో తిరగాల్సి ఉన్నా, ఏదేని ఒకబృందానికి నాయకత్వం వహించాల్సి ఉన్నా, మార్కెటింగ్, బోధనా రంగాల్లో ఉన్నా వారు పెద్దగా ఇబ్బంది పడరు. పదిమందితో సరదాగా ఉంటారు. అయితే పదిమందిలో మాట్లాడటం వంటివి చేయలేరు. పదిమందిలో మాట్లాడాలనే భావనే వారిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. క్లాసు రూమ్లో ఏదేని ప్రశ్న అడగాలన్నా భయంతో నత్తిగా మాట్లాడటం మొదలెడతారు.
లక్షణాలు
  • ఈ రకమైన ఫోబియాకు గురైన వారిలో సర్వ సాధారణంగా కనిపించే కారణం తమను అందరూ అజ్ఞానులుగా భావిస్తారనే భయం.
  • ఆయా పరిస్థితులను తట్టుకోగలగడానికి వారు చేపట్టే మార్గం దాని జోలికి వెళ్లకుండా మిన్నకుండిపోవడం లేదా దానినుంచి తప్పించుకో వడం. పార్టీలు, పెళ్లిళ్లు, లేదా పదిమందిలో మాట్లాడటం మొదలైన వాటినుంచి తప్పించుకుంటూ ఉంటారు. ఈ రకంగా తప్పించుకోవడం వలన వారికి తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది. అలాగే పదిమందికీ తాను ఆందోళనకు గురైనట్లు కనిపిస్తున్నాననే భావనతో ఆందోళన చెందుతుంటాడు.

అయితే తన వైఫల్యాల గురించిన ఆలోచనలన్నీ వాస్తవాలవుతూ ఉంటాయి కనుక ఫోబియాకు గురైన వ్యక్తికి ఈ రకమైన ఆందోళన శత్రువేమీ కాదు.
భయం వలన నత్తిగా మాట్లాడుతారు. దీనితో తాను విఫలమయ్యాననే నమ్మకం అతడిలో మరింతగా బలపడుతుంది. కొన్నిసార్లు పది మందిలో విజయవంతంగా మాట్లాడగలిగినా, ఎక్కడో చేసిన పొరపాటు గురించే గంటలకొద్దీ విచారిస్తూ ఉంటాడు.
సంక్లిష్టతలు
కొంతమంది తమ భయాన్ని పోగొట్టుకోవడానికి మద్యం, లేదా మత్తు పదార్ధల వంటివి వాడుతుంటారు. ఎప్పుడైనా ఒకసారి వీటిని వాడటం వలన పెద్దగా నష్టం ఉండదు కానీ, అధిక మొత్తాలలో వాటిని ఉపయోగిస్తే పరిస్థితి మరింత క్షీణించి కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. ఉదాహరణకు మద్యానికి లేదా మత్తు పదార్ధలకు బానిస కావడం వంటివి.
ఏం చేయాలి?

సోషల్ ఫోబియా అనేది అతి సాధారణమైన సమస్య అని గుర్తించాలి. చాలామంది తమ స్వయంకృషితోనే ఈ సమస్యనుండి విముక్తులవు తారు. పరిస్థితి మరీ తీవ్రతరమైతే, రోగికి మానసిక చికిత్సా విధానాలతో సహాయమందించాల్సి ఉంటుంది.
Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: