ఈ రోజుల్లో సోషల్‌ మీడియా లేకపోతే ఒక్కసారిగా మొత్తం స్తంభించిపోతుందన్న విషయం వాస్తవమే. అయినప్పటికీ, అదే సోషల్‌ మీడియా వల్ల లేనిపోని ప్రమాదాలు మెడకు చుట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో ఫేస్బుక్‌, మైస్పేప్ లాంటి సోషల్‌ నెట్‌వర్కింగ్‌ వైబ్ సైట్లు వాడే విషయంలో మీ ప్రైవసీని కాపాడుకోవడానికి, మీ వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూసే అధికారం వేరొకరికి ఇవ్వకుండా ఉండడానికి ఈ జాగ్రత్తలు పాటించండి...

  • ఫేస్ బుక్‌లో మనకు సంబంధంలేని వ్యక్తులు కూడా అనేకమంది ఫ్రెండ్ రిక్వేస్టులు పంపిస్తుంటారు. వారి గురించి పూర్తిగా చెక్‌ చేసిగానీ మన లిస్టులో యాడ్ చేసుకోకూడదు..

  • కొంతమంది, ఫ్రెండ్స్ లిస్టు నెంబరు పెంచుకోవడానికి, ఎవర్ని పడితే వారిని యాడ్ చేసుకుంటూ ఉంటారు. అలా ఎప్పుడైతే యాడ్ చేసుకుంటమో మన ప్రైవసీకి మనమే భంగం కలిగించుకుంటున్నామని గుర్తుంచుకోండి.

  • అలాగే, మన ఫొటో ఆల్బమ్ కూడా కొంతమంది కావాల్సిన ఫ్రెండ్స్ కు మాత్రమే షేర్‌ చేస్తే మంచిది..

  • మీ వ్యక్తిగత సమాచారం, ఫోస్ నెంబర్లు బాగా నమ్మకస్తులైన వ్యక్తులకు, స్నేహితులకు పర్సనల్‌గా ఫోస్ చేసి మాత్రమే ఇవ్వండి.. అంతేగానీ, ఛాట్‌బాక్స్‌లో గానీ, ఇతర సోషల్‌ మీడియా మాధ్యమం ద్వారా గానీ ఎక్స్‌ఛేంజ్‌ చేసుకోవద్దు.
  • అలాగే, మీ ఫేస్ బుక్‌ కాంటక్ట్‌ ఇన్ఫర్మేషన్ లో మీ ఫోస్ నెంబర్లు గానీ, ఇంటి అడ్రస్  వివరాలు గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వవద్దు.
  • ఎవరైనా అపరిచితులు వ్యక్తిగతంగా మీకు మెయిల్స్ పంపి, స్నేహం చేయడానికి ఆసక్తి చూపిస్తే, మీ విచక్షణను బట్టి నిర్ణయం తీసుకోండి. అంతేగానీ, పర్సనల్‌ సమాచారం ఇచ్చి రిస్క్ తీసుకోవద్దు.
  • కొంతమంది ఒక ప్రత్యేకమైన అప్లికేషన్ల ద్వారా ఆన్ లైన్ గేమ్స్ ఆడాటనికి మీకు రిక్వేస్టులు పంపుతారు. మీకు ఆసక్తి ఉండి, వారితో పరిచయం పెంచుకోవాలనుకుంటే, అది గేమ్ వరకే పరిమితం చేయండి.అంతేగానీ, మీ పర్సనల్‌ ఆల్బమ్స్,, నోట్స్‌కు వారికి యాక్సెస్ ఇవ్వద్దు.
  • మీకు ఎవరిమీదనైనా అనుమానం కలిగినా, నమ్మకం పోయినా, లేకపోతే వారు మీకు అంత ప్రాధాన్యం ఉన్న వ్యక్తిగా అనిపించకపోయినా, వెంటనే మీ ఫ్రెండ్‌స లిస్ట్ లోంచి డిలీట్‌ చేయండి. ఇలా చేయడం వల్ల  నష్టమేం లేదు.
  • మీ మెయిల్‌కు అసందర్భంగా ఎవరెవరో అపరిచితులు పదే పదే మెయిల్స్ పంపిస్తుంటే, ఆ మెయిల్‌ ఐడిని సాధ్యమైనంత వరకూ మార్చేయడమే మంచిది.
  • అన్నింటి కన్నా ముఖ్యమైన విషయం ఏమింటే, మీ ఫేస్బుక్‌, ఇ-మెయిల్‌ పాస్ వర్డ్ని ఎవరికీ బహిర్గతం చేయకూడదు.

  • ఎవరైనా మిమ్మల్ని టర్గెట్‌ చేసి, మిమ్మల్ని వేధించడానికి సోషల్‌ మీడియాను ఒక వాహకంగా ఉపయోగించు కుంటున్నారని భావిస్తే, వెంటనే ఈ విషయాన్ని ఆలస్యం చేయకుండా పోలీసులకు తెలియజేయండి. ఇటువంటి కేసులను పరిష్కరించడం కోసం ప్రత్యేకంగా సైబర్‌ పోలీస్ విభాగం పనిచేస్తోంది.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: