‘‘సినిమా చూస్తున్నంతసేపు కడుపుబ్బి చచ్చిపోయామనుకోండి!’’ అన్నాడు హరి.‘‘అంత కామెడీ లేదే కడుపుబ్బి నవ్వడానికి?’’ అడిగాడు గిరి.
‘‘మేనేజర్ థియేటర్లోని బాత్రూమ్ లాన్నీ లాక్ చేయించాడు. ఇంక కడుపుబ్బక మరి ఏమవుతుంది?’’ అన్నాడు హరి.
---------------------------
పేషెంట్: రెండ్రోజులుగా భోజనం చేయలేదండి...
డాక్టర్: పక్కకెళ్లండి, ఇది క్లినిక్...
పేషెంట్: నేను బిచ్చగాడ్ని కాదు డాక్టర్, ఆకలి కావడం లేదని మీ దగ్గరకొచ్చా...
---------------------------
‘‘నిద్రపట్టడం లేదా? రాత్రి పడుకోబోయేటప్పుడు ఓ టాబ్లాట్ వేసుకోండి!’’
‘‘నిద్రపట్టనిది రాత్రి కాదు డాక్టర్ గారూ! మద్యాహ్నం ఆఫీసులో.’’
---------------------------
తల్లితోపాటు ఎగ్జిబిషన్ కు వెళ్లిన ఐదేళ్ల కుర్రాడు
తల్లినుండి విడిపోయి తప్పిపోయూడు.
ఇంతలో అటువైపు పోలీసు రావడం చూసి దెర్యంగా
‘‘ఏమండీ! ఎవరైనా స్ర్తీ నేను వెంట లేకుండా
ఇటువైపుగా వెళ్లడం గాని చూశారా?’’ అన్నాడు.
---------------------------
జడ్జి: ఏమ్మా! నువ్వు కూడా నీ భర్త వెంట దొంగతనాలు
చేస్తున్నావా?
ఆమె: అవును ‘బాబయ్యా! ఈకాలంలో ఒక్కరి సంపాదన మీద ఇల్లు ఎలా గడుస్తుంది బాబయ్యా?
---------------------------
తల్లి: ఆ టింకూతో గొడవపడొద్దని ఎన్నిసార్లు చెప్పాను. కోపం
వస్తే పది అంకెలు లెక్కపెట్టుకోమని చెప్పానుగా!
కొడుకు: కాని టింకూ వాళ్లమ్మ వాడిని ఐదంకెలే
లెక్కపెట్టమందట!
ప్రతిసారీ నన్నుభదేస్తుంటే, ఈసారి నేను వన్, టు, త్రీలు మాత్రమే
లెక్కపెట్టి నాలుగు తగిలించాను.
---------------------------
ఓ అల్లరి పిడుగుతో మాట్లాట...
‘‘నువ్వు పెద్దరతే
ఏమవుతావు?’’
‘‘పెద్దవాడినవుతాను’’
‘‘అదికాదు, పెద్దయ్యాక
ఏమవుతావని?’’
‘‘ఏమీ అవ్వను!’’
‘‘డాక్టరు అవుతావా?’’ ‘‘మా డాడీకి
ఇంజినీరుని కావాలనుంది’’
‘‘ఓహో! అలా చెప్పు!’’
‘‘కాని - మా అమ్మకి
నేను డాక్టరవ్వాలని’’ ‘‘అయితే నీకు
ఏమవ్వాలనిఉంది?’’
‘‘తాతయ్యని అవ్వాలని’’
‘‘అదేమిటి?’’
‘‘అప్పుడేగదా అంతా
నా మాట వినేది. నేనేది కావాలనుకుంటే అది అవ్వనిచ్చేది.’’
---------------------------
‘‘సైన్సు మాస్టారు
ఐదు రూపాయుల నాణెం గ్లాసులోని ద్రావణంలోపడేసి ఇది దీంట్లో కరుగుతుందా? కరగదా? చెప్పండి! అని
అడిగాడు.’’
‘‘కరగదు సార్!’’ స్టూడెంటు
అన్నాడు.
‘‘కరెక్ట్! ఎలాగో -
కారణం చెప్పు!’’
‘‘అది
కరిగిపోయేటట్లరతే, మీరు ఏ పావలానో, అర్ధరూపాయినో
వేస్తారు గాని, ఐదు రూపాయలు
వేస్తారా?’’
---------------------------
‘‘నిమ్మకాయ ఎలా
ఇస్తున్నా వోయ్?’’
‘‘రూపాయికి మూడండి!’’
‘‘అబ్బా! చాలా
ఎక్కువ చెబుతు న్నావ్?’’
‘‘అయితే రెండే
తీసుకోండి.’’
---------------------------
‘‘నువ్వు ఫీజు కింద
ఇచ్చిన చెక్కు బ్యాంకు నుంచి తిరిగొచ్చింది’’ కోపం గా అన్నాడు డాక్టర్.
‘‘చిత్రంగా వుంది
సార్! నా రోగం కూడా అంతే కదా!’’ అన్నాడు సుబ్బారావు.
---------------------------
మొదటివాడు: మా తమ్ముడు జలాంతర్గామిలో పనిచేసేవాడు. వాణ్ణి
ఉద్యోగంలోంచి సస్పెండ్ చేశారు.
రెండోవాడు: దేనికి?
మొదటివాడు: వాడిది వేడి శరీరం. గాలి కావాల్సినప్పుడల్లా
కిటికీలు తెరవడం వాడి అలవాటు.
Post A Comment:
0 comments: