ఈ క్రింద సూచించిన ప్రకారం చేస్తే జ్ఞాపకశక్తి తప్పక పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
  • రాత్రి తొమ్మిది గంటల తర్వాత చదువుకోవాలనుకుంటున్నారా? అయితే ప్రతి అరగంటకొకసారి అరగ్లాసు నీరు త్రాగండి. మేల్కొనేటప్పుడు వచ్చే అలసట నుండి ఉపశమనం కలుగుతుంది. అది కూడా పదకొండు గంటల వరకే మంచిది. ఆ పైన మేల్కొంటే ప్రమాదమే.
  • చదివి చదివీ అలసిపోయినప్పుడు మీకు అలసట అనిపిస్తే కాస్త అటు ఇటు పచార్లు చేస్తూ తిరగండి. నిద్ర పోగొట్టడానికి టీకాఫీలుకూల్ డ్రీంక్స్ వంటివి తాగకండి.
  • చాలామంది చదువుకునేటప్పుడు బోర్లా పడుకుని లేదా వంగి కూర్చుని చదువుతుంటారు. అలా చదివితే ప్రమాదమే. నిటారుగా కూర్చుని చదవాలి. దీంతో చదవడానికి ఏకాగ్రత కుదురుతుంది.
  • ఒక క్యారెట్టు, గోబి ఆకులు 10 నుండి12 అంటే కనీసం 50-60 గ్రాములు, కొత్తిమిరి ఈ మూడు కోసి ప్లేట్‌లో ఉంచుకోండి, ఆపై కాస్త ఉప్పు, మిరియాలపొడి, నిమ్మకాయ రసం కొద్దిగా కలిపిన తర్వాత ఉదయంపూట టిఫిన్‌గా తీసుకోండి.
  • భోజనంతో బాటే ఒక గ్లాసు మజ్జిగ తీసుకోండి. మజ్జిగ చాలా చలవని మన పెద్దవారంటారు. అవును అది నిజం. మజ్జిగలో అన్ని విశిష్ట గుణాలున్నాయి.

విద్యార్థులు గనక పై సూచనలు, చిన్న చిన్న చిట్కాలను సక్రమంగా పాటిస్తే వారి జ్ఞాపకశక్తి పెరిగి చదివింది గుర్తు ఉంచుకునే అవకాశం వుంది.


Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: