jokes, telugu jokes, apurupa jokes, apurupa, telugu blog, fun, fun time, navvulu
అమెరికా నుంచి వస్తున్న తన ఫ్రెండ్ కొడుకుని రిసీవ్ చేసుకోవడానికి. వెంగళప్ప ఎయిర్ పోర్ట్ కు వెళ్ళాడు, సాయం వచ్చిన తన మిత్రుడితో చెప్పాడు -
‘‘పాతికేళ్ళ తర్వాత మొదటిసారి అతను ఇండియా రావడం..’’
‘‘పాతికేళ్ళా? మరి అతన్ని గుర్తుపట్టగలవా?’’ అడిగాడు మిత్రుడు వెంటనే.
‘‘గుర్తుపట్టలేను.’’
‘‘పోనీ అతను నిన్ను గుర్తుపట్టగలడా?’’ అడిగాడు ఆ మిత్రుడు మళ్ళీ.
‘‘ఎందుకు గుర్తుపట్టలేడు? వాడిలా నేను పాతికేళ్ళు అమెరికాలో ఉండ లేదుగా?’’ జవాబు చెప్పాడు వెంగళప్ప.
           
---------------------------


రాజు: రచనా వ్యాసంగం థ్యాంక్ లెస్జాబ్ అనుకుంటున్నావా?
శ్రీను: లేదు! అలా అనుకోవడం లేదు.
ఎందుకంటే - ఇప్పటి వరకూ నేను పత్రికల కు పంపినవన్నీ రిటర్న్డ్ విత్ థ్యాంక్స్అని తిరిగొచ్చాయి


---------------------------

టీచర్: క్లాసులు ఎగ్గొట్టి, సిన్మాలకు వెళ్ళడం చాలా తప్పు! దాంట్లో నేర్చుకునేదేం ఉండదు. అదే క్లాసుకువస్తే, ఎంతో జ్ఞానంవస్తుంది.
ఇప్పుడు చెప్పు! నిన్నక్లాసులు ఎగ్గొట్టి, సి నిమాకు వెళ్ళినందుకు నీకేమనిపించింది?
స్టూడెంట్: ఇలా క్లాసులెగ్గొట్టే పరిస్థితి రాకుండా ఇంచక్కా స్కూలుకు సెలవిస్తే బావుంటుందనిపించింది.

---------------------------

ఉద్యోగానికి అప్లికేషన్ఫారం పూరిస్తున్నాడు సుసుబ్బారావు ‘‘ఇంతకు ముందు ఎప్పుడైనా అరెస్ట్ చేయబడ్డారా’’ అన్న ప్రశ్నకు
లేదుఅని రాశాడతను.
‘‘ఎందుకని?’’ అన్న ప్రశ్నకు
క్షణం ఆలో చించి అసలు దొరికితే గదా!అని రాశాడతను.


---------------------------

‘‘మా ఆయన గత పదేళ్ళుగా నాతో ఒక్కమాట కూడా మాట్లాడిన పాపాన పోలేదు. అందుచేత విడాకులిప్పించండి...’’ అంది
సూర్యకాంతమ్మ. ‘‘ఏమయ్యా! ఆమె చెప్పింది నిజమేనా!’’ అడిగాడు జడ్జి.
‘‘నిజమేగాని, అసలు ఆవిడ మాట్లాడటం ఆపనిదే మద్యలో నేనింకెలా మాట్లాడాలి’’ అడిగాడు భర్తా రావ్.

---------------------------

రోడ్డు మీద పోతున్న ఒకతన్ని ఓ కారు ఢీ కొట్టి వెళ్ళిపోయింది. వెంటనే పోలీసాఫీసరు వచ్చి
‘‘మిమ్మల్ని గుద్దేసి వెళ్ళిన ఆ కారు నంబరు ఎంతో చెప్పగలరా?’’ అని ప్రశ్నించాడు.
‘‘చెప్పడానికి ప్రయుత్నిస్తానుండండి. ఆ నంబరుని అదే నంబరు పెట్టి హెచ్చవేసి వచ్చినదాన్ని మూడు పెట్టి భాగించి ఆ వచ్చిన దానికి స్క్వేర్ రూట్ కడితే వచ్చే జవాబు అసలైన కారు నంబరులోని అంకెలను తారు మారు చేస్తే ఎంత ఉంటుందో...అలానే ఉంటుంది. పైగా అది పూర్ణ సంఖ్య కూడా...’’
అంటూ చెప్పాడా లెక్కల మాస్టారు.

---------------------------

‘‘ నా కుడి చేతిలో ఎనిమిది యాపిల్ పండ్లు, ఎడమ చేతిలో పది యాపిల్ పండ్లు ఉంటే...
నా రెండు చేతుల్లో ఎన్ని ఉన్నట్లు?
‘‘ రెండు చేతుల యాపిల్ పళ్ళు సార్...’’


---------------------------

‘‘లెక్కల్లో నీకు అంత తక్కువ మార్కులు ఎందుకు వస్తున్నాయో... తెలుసా?’’
‘‘ఎందుకో... తెలియటం లేదు టీచర్...’’
ఖచ్చితంగా తెలియటం లేదా లేక సరిగ్గా ఆలోచించలేక పోతున్నావా? ఓసారి లెక్కేసుకో’’


---------------------------

‘‘మీరు జూలియుస్ సీజర్ గురించి విన్నారా?’’
‘‘విన్నాం సార్...’’
‘‘ఆయానే కనక బతికుంటే ఇప్పుడు ఏంచేసేవాడో ఆలోచించిగలరా?’’
‘‘చెయ్యటానికి ఏముంది టీచర్... పెన్షన్ తీసుకుంటూ ఉండేవాడు...’’


---------------------------

ఓ కాలనీలో ఇళ్ళంటుకుని మండుతుండడంతో వెంగళ్రావు ఫైర్ స్టేషన్కి ఫోన్ చేసి జరిగింది చెప్పివెంటనే రమ్మని కోరాడు.
‘‘ఎలా రావాలక్కడికి?’’ అని అడిగారు ఆ కాలనీకి దారి తెలియక.
‘‘ఎలా ఏమిటి? మీ దగ్గరుండే ఎరర్రంగు ఫైర్ ఇంజన్తో రండి’’ అని ఫోన్ పెట్టేశాడు వెంగళ్రావు.
           



Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: