jokes, telugu jokes, apurupa jokes, apurupa, telugu blog, fun, fun time, navvulu


మాస్టారు: ఒరేయ్ బబ్లూ! ‘‘వాడు దొంగలించుచున్నాడు’’ ఈ వాక్యాన్ని భవిష్యత్ కాలంలోకి మార్చరా?

బబ్లూ: ‘వాడు జైలు కెళ్తాడు’

---------------------------

గిరీశం: మా అల్లుడికి మరీ అనుమానం,  ఇంక కోపం కూడ రా...  పరమేశం

పరమేశం: ఎ... ఏం జరిగింది?

గిరీశం: పలకరింపుగా నవ్వాఅంతే! నన్ను చూసి నవ్వుతావా అని అలిగి వెళ్ళిపోయాడు.పరమేశం: అసలు అల్లుణ్ణి చూసిన తర్వాత నీ మొహంలో నవ్వెలా వచ్చింది?

---------------------------

‘‘మీ చెల్లెలు సన్నబడడం కోసం అన్నంతినడం బాగా తగ్గించేసిందట కదా... ఇప్పుడెలా వుంది?’’‘‘చాలా బావుంది... కిందటి వారం నుంచి అసలు కంటికి కనిపించకుండా పోయింది...’’

---------------------------

‘‘మన టీమ్ బాగుపడాలంటే నాకో మంచి ఆలోచన వచ్చింది సార్, ఆ ప్రకారం చెయ్యదలచుకున్నాను’’ అన్నాడు క్రికెట్ క్రీడాకారుడు.

‘‘అయితే నీ ఫేర్వెల్ పార్టీని ఎప్పుడు అరేంజ్ చెయ్యమంటావ్’’ వెంటనే అడిగాడు టీమ్ మేనేజర్.

---------------------------

‘‘కొలంబస్ గురించి మీలో ఎవరైనా ఏమైనా చెప్పగలరా’’.

‘‘అతను అమెరికాను కనిపెట్టెను. అతడు బహు పొదుపరి’’.

‘‘అమెరికాను కనిపెట్టాడు, బాగానే వుంది. మరి పొదుపరి అని ఎందుకు చెబుతున్నావ్?’’

‘‘కాకపోతే ముప్ఫైవేల మైళ్ళ దూరాన్నినావలో ప్రయాణం చేసిన వాడిని ఏమనాలి టీచర్...?’’

---------------------------

‘‘మా మావయ్య మీద నుంచి అమాంతంరోడ్డు రోలరొకటి పోరందిరా’’.

‘‘ఏం చేశావ్ మరి?’’

‘‘ఎలాగోలా ఇంటిదాకా తీసుకెళ్ళానురా...

ఇంటికి తాళం వేసుంది. తాళం చెవులేమో నాదగ్గర లేవు. ఇంకేం చేయలో తోచక ఆయన్ని తలుపు కింద నుంచి తోసేశాను...’’.

---------------------------

పాఠకుడు: మీ జోకులపుస్తకంలో, అన్నీ బాగున్నాయుండీ!... కాని ఆ 40 వ పేజీలో ఓ జోక్ వుంది చూశారూ!... అదే అంత బాలేదు. పైగా నవ్వు కూడా రాలేదు కూడానూ...

రచయిత: ఓ... అదా! అదొక్కటేనండీ - నేను సొంతంగా రాసింది.

పాఠకుడు: ....????

---------------------------

‘‘అబ్బబ్బ! చెమటలు కారిపోతున్నాయి. కాస్త అద్దాలు దించవే!’’ కార్లో వెడుతూ అన్నాడు సుబ్బారావు భార్యతో.

‘‘ఊరుకోండీ! అద్దాలు దించితే మన కారుకి ఏసీ లేదని అందరికీ తెలిసిపోదూ?’’ అంది భార్య.

---------------------------

భార్య, భర్తను ఓ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లింది. డాక్టర్ పరీక్షించి

‘‘మీఆయన ఆర్నెల్లపాటు ఈ మందులువాడితే తప్ప మనిషిగా మారడు’’అన్నాడు.

‘‘సారీ డాక్టర్! నేను అసలు ఆయన్నెప్పుడూ మనిషిగా అనుకోలేదు’’అసలు విషయం చెప్పింది భార్య.

---------------------------

‘‘మీ కారుకి స్పీడోమీటర్ లేదా?’’ అడిగాడు ఓ కారు యజమానిని ఓమిత్రుడు.

‘‘లేదు.’’

‘‘మీ కారు ఎంత స్పీడ్లో వెళ్తోందో ఎలా తెలుస్తుంది?’’

‘‘చాల తేలిక. బంపర్ చప్పుడైతే ఇరవై కిలోమీటర్ల వేగంతో వెళుతున్నట్లు.

తలుపులు చప్పుడైతే ముప్ఫై కిలోమీటర్ల వేగంతో వెళుతున్నట్లు.

నలభై కిలోమీటర్ల వేగంతో వెళితే నా సీటు ఊగుతుంది.

 అంతకంటే ఎక్కువ వేగం తో ఈ కారులో వెళ్ళకూడదు.’’

‘‘ఏం?’’

‘‘ఇంజను ఊడి కిందపడిపోతుంది’’ అని జవాబు చెప్పాడతను.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: