మా పక్కిం టి విమల అస్తమానూ భర్త
గురించి చెడుగా చెప్తూ తిడుతుంటుంది. ఇప్పుడు నన్ను
చూడు, మా ఆయన ఎందుకూ పనికి రాని చవట. పైసాకు కొరగాని దద్దమ్మ... కాని నేను
ఆయన గురించి ఎప్పుడైనా ఏమైనా చెడ్డగా చెప్పానా...’’
టీచర్ : మూడో ప్రపంచ యుద్ధం
మొదలైతేఏమౌతుంది?
రవి : అమ్మో... నాకు చాలా భయంగా ఉంది.
టీచర్ : ఎందుకు?
రవి : మన చరిత్ర పుస్తకంలో మరో చాప్టర్
పెరుగుతుంది కాదా టీచర్!
జైలర్ అడిగాడు ఖైదీని - ఈ జైల్లో
అందర్నీ చూడ్డానికి బంధు వులు, స్నేహితులు వస్తారు.. మరి నీకెవరూ లేరా?
ఖైదీ జవాబిచ్చాడు - ‘‘చాలామందే ఉన్నారు... కానీ వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు’’
‘సారీ మేడమ్... మీ వారికి నేను చికిత్స చేయలేను. ఎందుకంటే నేను పశువుల
డాక్టర్ను’ అన్నాడాయన తన దగ్గరికొచ్చిన ఓమహిళతో...
‘అందుకేగా మీ దగ్గరికొచ్చింది.
సంగతేమిటంటే చెప్పడు. పైగా అరుస్తాడు. గట్టిగా అడగబోతే కరుస్తున్నాడు’ అందామె.
పదేళ్ళ కూతురు తల్లిని అడిగింది.
‘‘మమ్మీ సినిమా తార నీలూ తను తల్లి
కాబోతున్నట్లు ఎలా తెలుసుకుంది’’
తల్లి జవాబు చెప్పేంతలో పక్కనే ఉన్న
ఆమె చిన్న కూతురు జవాబిచ్చింది.
‘‘ అరె... అక్కా... నీలూకి చదువొచ్చుగా తను తల్లి కాబోతున్న విషయం
పత్రికల్లో చదివి తెలుసుకుని వుంటుంది’’.
పట్టణమంతా కర్ఫ్యూ విధించారు. ఒక
వ్యక్తి లుంగీ బనీనుతో బయటికెళ్ళాడు. పోలీస్ అతన్ని పట్టుకుని ‘‘పద పోలీస్ స్టేషన్కి, కర్ఫ్యూ విధించారని తెలీదా’’అన్నాడు. ఆ వ్యక్తి ‘‘మంచిది... కానీ చొక్కా వేసుకొసా
్తన్సార్!’’ అన్నాడు దీనంగా.దానికి పోలీస్ ‘సరే’నన్నాడు. లోపలికి వెళ్ళిన వ్యక్తి
ఎంతసేపటికీ బయటికి రాకపోయే సరికి తలుపు తట్టాడు పోలీస్. లోపలికెళ్ళిన వ్యక్తి
కిటికీ కొంచెం తెరిచి ‘‘ఏం కావాలి’’ అని అడిగాడు.
‘‘బయటికి రా’’అన్నాడు పోలీస్.
‘‘ఎలా వస్తాను, బయట కర్ఫ్యూ విధించారని తెలీదా’’ అన్నాడు వ్యక్తి కిటికీ మూసేస్తూ…
‘‘నేను అతను చేసిన ఈ సిగ్గుమాలిన పనికి
అతనిపై ప్రతీకారం తీర్చుకునేంత వరకూ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను’’ అంది శపథంగా. తండ్రి మొత్తం విని ‘‘ఇంతకీ నిన్ను ఎక్కడ కొట్టాడు?’’
కూతురు: ఎడమ చెంప మీద.
తండ్రి ఆమె కుడి చెంపమీద కొట్టి ‘‘వెళ్ళిఅతన్తో చెప్పు... అతను నా కూతుర్ని కొడితే నేను అతని భార్యను
కొట్టి ప్రతీకారం తీర్చుకు న్నానని’’ అన్నాడు తండ్రి
నవ్వుతూ.
రాము: సార్. తివాచీ దులుపుతుంటే ఈ
రూపాయి దొరికింది తీసుకోండి!
యజమాని: వెరీగుడ్, నీ విశ్వాసానికి ఈ రూపాయి బహుమతిగా ఉంచేసుకో.
ఓ వారం తర్వాత యజమానిది అయిదు రూపాయల
నోటు ఎక్కడో పోయింది.
యజమాని రాముని అడిగాడు:- ‘‘రామూ - నాది అయిదు రూపాయల నోటు ఎక్కడో పోయింది. నీకుగానీ దొరి కిందా?’’
‘‘ఆ దొరికింది సార్... దాన్ని నేను
విశ్వాసా నికి బహుమతిగా ఉంచేసుకున్నా’’ జవాబిచ్చాడు
రాము వినయంగా.
ఒక ఉపాధ్యాయుడు సైకిల్కు లైట్
లేకుండావెళ్తున్నాడన్న కారణంగా కోర్టుకు తీసుకొచ్చారు పోలీసులు. జడ్జి
ఉపాధ్యాయుణ్ణి చూసి అత ను తనకు చదువు చెప్పిన గురువేనని గుర్తు పట్టేశాడు.
‘ఏ నాటికైనా మిమ్మల్ని కలవాలని
అనుకుంటుండేవాడ్ని, ఇన్నాళ్టికి మీరు కలిశా రు... నా కోరిక
నెరవేరింది’ అన్నాడు సంతోషం గా. అయితే ఆ మరుక్షణమే
అతని మొహం లో రంగులు మారాయి.
గంభీరంగా మొహం పెట్టి ‘‘వెళ్ళి ఆ బెంచి మీద కూర్చుని ఇకపై ఎప్పుడూ సైకిల్కు లైట్ లేకుండా
వెళ్ళను అని 400 సార్లు ఇంపోజిషన్ రాయండి’’ అన్నాడు కళ్ళెరజ్రేసి.
‘అమ్మా...! కడుపు నొప్పి’ ఏడుస్తూ
వచ్చింది చిట్టి. ‘అన్నం తినవు. అడ్డమైన చెత్తా చెదారం
పొట్టలో పడేస్తావు. అందుకే నీకు ఆ నొప్పి’ అంది అమ్మ
కాస్తంత విసుగ్గా సిరప్ తాగిస్తూ. కాసేపటి తర్వాత చిట్టి వాళ్ల నాన్న ఆఫీసు నుంచి
వచ్చీ రాగానే... తలనొప్పంటూ కణ తలు నొక్కుకున్నాడు.
‘తల్లోని ఆ ఖాళీ ప్లేస్కి చెత్తా
చెదారాన్ని ఎలా పంపించగలిగావు డాడీ...?’
ఆసక్తిగా అడిగింది చిట్టి.

Post A Comment:
0 comments: