![]() |
| Jeans |
తీరైన ఆకృతికి జీన్స్ ప్యాంట్ చక్కని
ఎంపికవుతుంది. మరి వీటిని శభ్రపరిచే విషయంలోనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
అందుకు ఈ నియమాలు పాటించి చూడండి.
- లేత రంగులో ఉన్న ప్యాంట్‌ని ముందు చల్లటినీళ్లలో నానబెట్టి తర్వాత కాసేపు సర్ఫ్‌నీళ్లలో నానబెట్టి, గంటయ్యాక ఉతికితే సరిపోతుంది. సాధ్యమైనంత వరకూ జీన్స్ దుస్తులను వేడికి దూరంగా ఉంచాలి.
- జీన్స్ ప్యాంట్లను ఉతికే నీళ్లలో చెంచా ఉప్పు వేసి, ఆ నీళ్లలో గంట పాటు నానబేటిట ఉతికితే రంగు పోదు. అంతేకాదు మురికి, ఇతర మరకలున్నా త్వరగా వదిలి ప్యాంట్ కొత్తగా కనిపిస్తుంది.
- ఎంతో ఇష్టపడి కొన్న జీన్స్ రంగు పోతునట్లు అనిపిస్తే, పావు బెకట్ నీళ్లలో కప్పు వెనిగర్ కలిపి. ఈ నీళ్లలో జీన్స్ ప్యాంటును నానబెట్టలి. కాసేపయ్యాక సబ్బుతో ఉతికి, గంజి పెట్టి ఎండలో ఆరేయాలి. గంజి పెట్టడం వల్ల రంగు కోల్పోకుండా ఉంటుంది. ఇస్త్రీ చేయిస్తే ఇంకా మంచిది.
- ఒకవేళ జీన్స్ దుస్తుల మీద మరకలు పడితే రెండు చెంచాల వంటసోడాలో కాస్త వెనిగర్ కలపి ఆ మిశ్రమాన్ని మరక మీద రాసి పావుగంటయ్యాక బ్రష్ తో రుద్దితే శుభ్రమవుతుంది.
- మార్కెట్‌లో ఇప్పుడు లిక్విడ్ డిటర్జెంట్ లు దొరుకుతున్నాయి. వీటిలో నానబట్టి చేత్తో ఉతికితే అవి ఎక్కువ కాలం మన్నుతాయి.. వేసుకున్న ప్రతిసారీ ఉతకడం కూడా సరికాదు.
- వీటిని భద్రపరిచే విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇస్త్రీ చేసి మడతలు పెట్టి, కవర్ లో భద్రపరచాలి. ఇలా చేయడం వల్ల జీన్స్ కి ఉన్న బ్యక్టీరియా దూరమవుతుంది.

Post A Comment:
0 comments: