టీచర్: చంటీ! పౌష్టికాహారం అంటే ఏమిటీ?
చంటి: ప్లేట్ మీల్స్ మేడమ్.
టీచర్: సంపూర్ణాహారమంటే?
చంటి: ఫుల్ మీల్స్ మేడమ్.
--------------------------------
‘‘నిన్న ఈగల మందిచ్చావ్. అది ఇల్లంతా చల్లినా ఈగలు చావలేదేమిటి?’’ షాపతన్ని అడిగాడు సుబ్బారావు.
‘‘భలేవారు సార్ మీరు! ఆ మందు ఈగల నోట్లో పోయాలి, అప్పుడే చస్తాయి’’ అన్నాడు షాపు ఓనరు.
--------------------------------
బరువు చూసుకునే మిషన్ మీద నిలబడ్డ గోవిందం చేతిలోకి టికెట్ వచ్చింది. తన బరువు చూసుకొని వెనక్కి తిప్పి జాతకం చూసుకున్నాడు. దాంట్లో మరో తొమ్మిది గంటల్లో మీకు ప్రమాదం జరగబోతోంది అని రాసిఉంది. నిజంగానే మరో తొమ్మిది గంటల్లో అతని భార్య పుట్టింటి నుంచి తిరిగి వచ్చింది.
--------------------------------
చంటి: ప్లేట్ మీల్స్ మేడమ్.
టీచర్: సంపూర్ణాహారమంటే?
చంటి: ఫుల్ మీల్స్ మేడమ్.
--------------------------------
‘‘నిన్న ఈగల మందిచ్చావ్. అది ఇల్లంతా చల్లినా ఈగలు చావలేదేమిటి?’’ షాపతన్ని అడిగాడు సుబ్బారావు.
‘‘భలేవారు సార్ మీరు! ఆ మందు ఈగల నోట్లో పోయాలి, అప్పుడే చస్తాయి’’ అన్నాడు షాపు ఓనరు.
--------------------------------
బరువు చూసుకునే మిషన్ మీద నిలబడ్డ గోవిందం చేతిలోకి టికెట్ వచ్చింది. తన బరువు చూసుకొని వెనక్కి తిప్పి జాతకం చూసుకున్నాడు. దాంట్లో మరో తొమ్మిది గంటల్లో మీకు ప్రమాదం జరగబోతోంది అని రాసిఉంది. నిజంగానే మరో తొమ్మిది గంటల్లో అతని భార్య పుట్టింటి నుంచి తిరిగి వచ్చింది.
--------------------------------
ఇండియా నుంచి అమెరికా వెళ్ళిన ఓ జంట ఐదేళ్లుగా అమెరికన్
సిటిజన్ షీప్ కోసం ప్రయత్నిస్తోంది. చివరికి ఒకరోజు- వాళ్లకి అక్కడి పౌరసత్వం
లభించినట్లు తెలిపే లెటర్ వచ్చేసరికి, భర్త గబాగబా
వంటింట్లోకి వెళ్లి ఆనందంగా ‘‘సోనూ! మనకి
అమెరికన్ సిటిజన్ షీప్ వచ్చేసింది. ఇక ఇప్పుడు మనం అమెరికన్లం తెలుసా?’’ అన్నాడు.
‘‘అలాగా! ఇకపై ఇక్కడలాగే పని పంపకం
చేసుకోవడానికి మనకి అధికారం వచ్చేసిందన్నమాట! సరే!
ఇంద! ఇవన్నీ నేను తోమాను. ఇక మీరు కడగండి’’ అంట్లు అన్నీ వదిలేసి చెయ్యి కడుక్కుని లేచింది సోను.
--------------------------------
‘‘బోత్తిగా బుర్ర లేదు నీకు! అసలు ఎందుకొచ్చాయి ఈ ఇంటర్వ్యూకి?’’
‘‘ఎలాగూ బుర్ర లేదన్నారుగా! కనీసం
వికాలాంగుల కోటాలోనైనా ఉద్యోగం ఇప్పించండి సార్...’’
--------------------------------
రాజు: నన్ను నమ్ము రాధా! ఉద్యోగం రాగానే నిన్ను పెళ్లి
చేసుకుంటా!
రాధా: నన్ను చేసుకోవటం ఇష్టం లేదని సూటిగా చెప్పొచ్చుగా!
--------------------------------
పెళ్లిళ్ల పేరయ్యని అతని మేనల్లుడు,
తనకు డబ్బున్న పిల్లతో పెళ్లి చేయమని కోరాడు.
‘‘అలాగే’’ అని బిల్ గేట్స్
దగ్గరకి వెళ్లాడు పేరయ్య.
‘‘నీ కూతురికో మంచి సంబంధం తెచ్చాను’’ అన్నాడు.
‘‘సారీ, నేను మా అమ్మాయి
పెళ్లి విషయుంలో జోక్యం చేసుకోను’’ అన్నాడు బిల్
గేట్స్.
‘‘సారీ! పెళ్లి కొడుకు వరల్డ్ బ్యాంక్ వైస్
ప్రెసిడెంట్ కాబట్టి, మీకు ‘దీటైన సంబందం అని తెచ్చా’’ అంటూ లేవ బోయాడు
పేరయ్యా.
‘‘అలాగా! అయితే చూద్దాం’’ అన్నాడు.
పేరయ్య వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ దగ్గరకెళ్లి
‘‘నా మేనల్లుడికి వైస్ ప్రెసిడెంట్ ఉద్యోగం
కావాలి అన్నాడు.
‘‘ఆ పోస్ట్ ఖాళీ లేదు’’ అన్నాడు ప్రెసిడెంట్.
వెళ్ల‘బోతూ ‘‘అతడు బిల్ గేట్స్ అల్లుడు కదా అని మీ దగ్గరకొచ్చా’’ అన్నాడు.
‘‘అలాగా! ముందు చెప్పలేదేం’’ అంటూ వైస్ ప్రెసిడెంట్ ఉద్యోగమిచ్చాడు ప్రెసిడెంట్.
--------------------------------
‘‘అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి నిన్న
బ్యూటీపార్లర్ కి వెళ్లావు కదా... ఏం చెప్పారేమిటి?’’ అడిగింది రాణి.
‘‘అలంకరించుకోవడం మానేస్తే అందం రెట్టింపు
అవుతుంది అని ’’ చెప్పింది విమల.
--------------------------------
‘‘ఎప్పుడు చూసినా నాది, నావి అంటావే కాని మనది, మనవి అని అనవేం?’’ అడిగాడు రాజు.
‘‘ఇవాళ మార్కెట్కి వెళ్ళి మనం
తొడుక్కోవడానికి గాజులు పట్రండి’’ అంది రమ్య.

Post A Comment:
0 comments: