కొంతమంది భర్తలు ఇంట్లో ప్రేమగా, ఎంతో సౌమ్యంగా ఉండి, బయటవారిపై చిర్రుబుర్రులాడుతూ ఉంటారు.కొంతమంది అందుకు భిన్నంగా ప్రవర్తిస్తుంటారు. భార్య అణకువను అలుసుగా తీసుకుని దౌర్జన్యం చేసే భర్తలు కొందరైతే అన్ని పనులలో చేదోడు వాదోడుగా నిలిచే భర్తలు కొందరు. కొంతమంది భర్తలు వీలైనప్పుడల్లా భార్యల్ని షాపింగ్ కో, సినిమాకో, షికారుకో తీసుకెళ్తుంటారు. సహజంగానే రోడ్లు ట్రాఫిక్ తో రద్దీగా ఉంటాయి. ఎవరైనా ట్రాఫిక్ మధ్యలో తమ వాహనం ముందు నుంచి సడన్ గా టర్న్ తీసుకుంటే సదరు శ్రీవారిలో ఆగ్రహం ఎగదన్నుకొస్తుంది. సదరు వాహనదారుడ్ని కొట్టినంత పనిచేస్తాడు. దాంతో ట్రాఫిక్ జామ్. లేనిపోని రభస.కొంతమంది భర్తలు, భార్యలతో కలిసి విందులకు, వేడుకలకు, పెళ్లిళ్లకు వెళుతుంటారు. అక్కడున్న వారితో రాజకీయాల గురించి, మతం గురించి చాలా ఆవేశంగా చర్చిస్తారు. తమ శ్రీమతులకు లేనిపోని టెన్షన్ తెచ్చిపెడతారు. సరదాగా ఉన్న వాతావరణం కాస్తా అకస్మాత్తుగా గంభీరంగా మారిపోతుంది. భార్యతో, ఇంట్లో వారితో ఎంతో సౌమ్యంగా ఉండే ఈ తరహా భర్తలు బయటకు వచ్చినపుడు అలా ఎందుకు ఉండలేరూ...? వీరాగ్రహాన్ని ఎందుకు ప్రదర్శిస్తారో ఎవరికీ అర్థం కానటువంటి విషయాలు. వారు అలా తయారైనపుడు వారి కోపాన్ని తగ్గించడానికి ఇలా చేయండి.
- తార్కికతను, హాస్యాన్ని జోడించి ఎంతోయుక్తితో ఆ కోపాన్ని చల్లబరచండి.
- ఇతరులపై అరచి, కేకలు వేసినప్పుడల్లా మీ సున్నితమైన మనసు ఎంత గాయపడుతుందో చెప్పగల చొరవ, స్వేచ్ఛ అధికారం మీకున్నాయి.
- పరిస్థితిని అధిగమించడానికి ఎన్నో మార్గాలున్నాయి. వారు అలా కోపగించడం సముచితం, సహేతుకమైనది కాదు అని వారికి చెప్పగలగాలి.
- ఆయన కోపం వలన బయటవారికన్నా మనకే ఎక్కువ హాని జరుగుతుందని మెల్లిగా చెప్పాలి.
- కోపాన్ని పోగొట్టేందుకు ఏవో హాస్యోక్తులు చెప్పి నవ్వించండి. డ్రైవ్ చేసినప్పుడు ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటే వెహికల్ కన్నా హాయిగా బస్ లో వెడదామని చెప్పండి.
- ఆయన ప్రవర్తన ఎందర్నో ఇబ్బంది పెడుతోందని పదిమందిలో తలదించుకోవడం బాగోదని చెప్పి చూడండి. మీ మాటలతో ఆయనలో త్వరగా మార్పు రావచ్చు.
Post A Comment:
0 comments: