భర్త: ‘‘వీడికి ఈ మధ్య మతిమరుపు బాగా ఎక్కువైంది. తండ్రిని
... నన్ను పట్టుకుని అంకుల్... అంటే కొట్టక ముద్దెట్టుకుంటారా ఎవరైనా?’’
భార్య: ‘‘అయ్యో! మీ మతిమరపు మండిపోనూ! వాడు మనబ్బాయి
కాదండీ... మనవాడి ఫ్రెండ్.’’
సుబ్బారావు
ఇంటర్వ్యూకు వెళ్లాడు. తన సర్టిఫి కెట్ను మేనేజర్కు చూపించాడు. ‘బాగానే చదువుకున్నట్లున్నావు. నేను కొన్ని
సింపుల్గా ఉండే పదాలు చెబుతాను. వాటికి వ్యతిరేక పదాలు చెబితే మిమ్మల్ని
ఉద్యోగంలోకి తీసుకుంటాను...’
మేనేజర్:
పైనా
సుబ్బారావు:
కిందా
మేనేజర్:
బ్లాక్
సుబ్బారావు:
వైట్
మేనేజర్:
కుడి
సుబ్బారావు:
పడమర
మేనేజర్:
తప్పు చెబుతున్నాను...
సుబ్బారావు:
ఒప్పు చెబుతున్నావు
మేనేజర్:
నీకేమైనా బుద్ధుందా? తప్పు చెప్ప డమే కాకుండా
ఒప్పు చెప్పాను అంటున్నావు(కోపంగా)
సుబ్బారావు:
ఒప్పు చెప్పడమే కాకుండా తప్పు చెప్పాను అంటావా?
మేనేజర్:
క్వయిట్ ప్లీజ్!
సుబ్బారావు:
టాక్ ప్లీజ్
మేనేజర్:
గెటవుట్ రాస్కెల్
సుబ్బారావు:
కమిన్ జంటిల్మన్!
మేనేజర్:
యూ ఆర్ రిజెక్టడ్
సుబ్బారావు:
ఐయామ్ సెలెక్టెడ్!
‘‘ఈ మేక ధర ఎంత’’?
‘‘వెయ్యి రూపాయలు’’
‘‘మరి ఆ మేక ధర ఎంత’’?
‘‘రెండు వేలు’’
అదేంటి? రెండో మేక మొదటి మేక కంటే చిన్నది కదా?
నిజమే
కాని రెండో మేక నా వెయ్యి రూపాయల నోటు తినేసింది.
టీచర్:
ఇతరులు చేయలేని పని నువ్వు చేయగలవా?
సుబ్బు:
చేయగలను సార్. నా చేతిరాత నాకు తప్ప ఎవరికీ అర్థం కాదు. నేను ఒక్కడినే చదవ గలను.
అప్పారావు:
గాడిదను ఒకడు చితకబాదు తుంటే వెళ్లి అడ్డుకున్నాను. దీన్నిబట్టి నీకు ఏం అర్థమైంది?
సుబ్బారావు:
నీకు సోదరప్రేమ ఎక్కువ అని అర్థ మైంది.
సుబ్బారావు, అప్పారావులు మార్కెట్ వెళ్లి చెరొక గుర్రాన్ని
కొన్నారు. రోజు పొద్దున్నే వెళ్లి తమ గుర్రాలను మేపుకు రావాలనుకున్నారు.
‘అది సరేగానీ...నీ గురమ్రేదో, నా గుర్రమేదో గుర్తుపట్టడం ఎలా?’ అన్నాడు సుబ్బారావు.
‘చాలా వీజీ...నేను నా గుర్రం
తోకను కట్ చేస్తాను. దీంతో తోక లేని గుర్రం నాది. తోక ఉన్న గుర్రం నీది’ అన్నాడు అప్పారావు. ‘గొప్ప ఐడియా’ అని మెచ్చుకున్నాడు సుబ్బారావు.
ఇద్దరి
సంభాషణని కొందరు కొంటె కుర్రాళ్లు విన్నారు. ఎవరికి తెలియకుండా సుబ్బా రావు గుర్రం
తోకని కట్ చేశారు.
‘ఇప్పుడెలా? కనుఫ్యూజ్ గా ఉంది’ అన్నాడు సుబ్బారావు.
‘డోంట్ వర్రీ. నా గుర్రం
మెడలో గంట కడ తాను. దీంతో గంట ఉన్న గుర్రం నాది. గంట లేనిది నీది’ అన్నాడు అప్పారావు.
ఈ
విషయాన్ని కూడా విన్నారు కొంటె కుర్రాళ్లు. రహస్యంగా ఆ గంట కట్ చేశారు.
‘అరే ఇప్పుడెలా? గుర్రాలను ఎలా గుర్తు పట్టాలి?’ అన్నాడు సుబ్బారావు.
‘ఇప్పుడు ఒకే ఒక మార్గం
ఉంది. తెల్లగుర్రం నాది. నల్లగుర్రం నీది. ఇక ఎవరు మనల్ని కన్ఫ్యూజ్
చేయలేరు’ ఆత్మవిశ్వాసంతో చెప్పాడు
అప్పారావు.
మన
రాష్ట్రానికి చెందిన సుబ్బారావు పంజాబ్లోని ఒక ఊళ్లో వ్యాపారం చేసి పెట్టిన
పెట్టుబడంతా నష్టపోయూడు. అతను ఆ ఊళ్లో ఏం చేశాడు?
జవాబు:
సెలూన్ పెట్టాడు!
సుబ్బారావు:
ఏమిటయ్యా...పాడై పోయిన చికెన్ పెట్టారు. మీ మేనేజర్ను పిలువు.
సర్వర్:
సారీ..సార్ అతను నాన్వెజ్ తినడు.
టీచర్:
కుక్క మీద వ్యాసం రాయమని చెబితే అచ్చం మీ అన్నయ్యలాగే రాసావు. కాపీ కొట్టావా ఏమిటి?
టీచర్:
కాపీ కొట్టలేదు టీచర్. అన్నయ్యా నేను రాసింది ఒకటే కుక్క మీద.
తండ్రి:
సుబ్బూ ఒకసారి ఊహించు...హఠాత్తుగా మన ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. తప్పిం
చుకోవడానికి దారి లేదు. అప్పుడు ఏంచేస్తావు?
కొడుకు:
ఊహించడం మానేస్తాను!
సుబ్బారావు
ఇండియన్ రైల్వేస్ ను ఎలా మోసం చేశాడు?
టికెట్
తీసుకున్నాడు గాని రైలు ఎక్కలేదు.

Post A Comment:
0 comments: