health tips, rain, rainy session, apurup, telugu, telugu blog, varsham, vana,
వాతావరణం మారగానే
ఆ ప్రభావం ఎంతో కొంత మన ఆరోగ్యం మీద పడుతుంది. వర్షాకాలం మరీను. ఈ కాలంలో
జాగ్రత్తలు తీసుకోకపోతే మనం నిరంతరంగా పనిచేయలేము. ఎప్పుడో ఒకసారి సరదాగా వానలో
తడిస్తే ఆ ఆనందం వేరు. అయితే రోజూ నిమిషాలతో పరుగులు తీసేవారు ఆరోగ్యాన్ని
కాపాడుకోవాలంటే వర్షాకాలం కాస్త ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందే. వానొస్తే
పనికొచ్చే కొన్ని సూచనలు ఇవి
- సిల్కు, షిఫాన్ దుస్తులు వాడాలి. ఇవి వాడటం వల్ల బట్టలు
ఉతికే శ్రమ, ఆరబెట్టే సమయం
ఆదా అవుతాయి.
- పాదాలు
ఎక్కువసేపు నీళ్లలో నానితే కాలివేళ్లు ఒరిసిపోతాయి. వర్షాకాలం ఎక్కువగా వేధించే
సమస్య ఇదేనని చెప్పాలి. తప్పనిసరై నీళ్లలో వెళ్లవలసి వచ్చినపుడు పాదాలకు కాస్త
గ్లిజరిన్ రాసుకుని వెళ్లటం మంచిది.
- రాత్రి నిద్రపోయే
ముందు వేపనూనెను కాలివేళ్ల మధ్య రాస్తుంటే ఒరుపులు చాలా త్వరగా తగ్గుతాయి.
- తల తడిస్తే
వెంటనే ఆరబెట్టుకోవాలి. లేకపోతే జలుబు చేయడమే కాదు, జుట్టు కూడా రాలుతుంది.
- కొబ్బరినూనెని
వెచ్చబెట్టి జుట్టు కుదుళ్లకు పట్టేలా మర్దనా చేస్తే జుట్టు కుదుళ్లు గట్టిపడటమే
కాదు, జలుబు చేయదు.
నూనెతో మర్దనా చేసాక గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే చుండ్రు కూడా పోతుంది.
- వేడినీళ్లలో
నాలుగు యూకలిప్టస్ ఆయిల్ చుక్కలు గాని,
యూకలిప్టస్ ఆకులు గాని
వేసి స్నానం చేస్తే ఈ కాలంలో తరచూ ఇబ్బందిపెట్టే జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు తగ్గుతాయి. అలసట కూడా దూరమవుతుంది.
- నువ్వుల నూనె
రాసుకుని వారానికి ఒకసారి స్నానం చేయటం చర్మానికి, ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది.
- తులసాకురసం,
తేనె కలుపుకుని
వర్షాకాలంలో అప్పుడప్పుడూ తీసుకుంటూ ఉంటే రోగనిరోధక శక్తి పెరిగి అస్తమానూ జలుబు,
జ్వరాలు రాకుండా ఉంటాయి.
- వర్షాకాలంలో
జలుబు చేస్తే పంచదారని నిప్పులమీద వేసి వచ్చే పొగని పీల్చండి. జలుబు నుంచి వెంటనే
ఉపశమనం దొరుకుతుంది.
Axact
Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.
family tips
fitness tips
health tips
ladies health
men health
Post A Comment:
0 comments: