.
పొద్దున్న నేనూ మా ఆవిడా గొడవ పడ్డాము. నేనేమో ‘గబ్బార్ సింగ్’
సిన్మాకెళ్ళామని మా ఆవి డేమో ‘రచ్చ’ సిన్మాకెళ్ళాలని...
ఫ్రెండు మధ్యలో అడిగాడు ‘‘సరేగానీ రచ్చ
సిన్మా ఎలా ఉంది?’’ అని.
ఒక ఫూల్ ఇంకో ఫూల్తో ఇలా అన్నాడు:
యూ ఆర్ ది మోస్ట్ బ్యూటి ‘ఫూల్’
కలర్ ‘ఫూల్’
వండర్ ‘ఫూల్’
వెంగళప్ప గొడవ:
‘నువ్వు నన్ను మోసం చేశావు’ అని తన రేడియోను
చూపిస్తూ గట్టిగా అరిచాడు. ‘నేను నిన్నేమీ మోసం చేయలేదు. మంచి రేడియోనే అమ్మాను’
అన్నాడు షాపతను. అప్పుడు వెంగళప్ప ఏమన్నాడంటే-
‘రేడియో లేబులేమో జపాన్ అని రాసి ఉంది. కానీ రేడియో మాత్రం
దిస్ ఈజ్ ఆల్ ఇండియా రేడియో’ అంటోంది.
నిన్న రాత్రి సుబ్బారావుగారింట్లో దొంగలుపడ్డారు. కారు,
నగలు, డబ్బు...అన్నీ ఎత్తుకు పోయారు. కానీ టీవీ మాత్రం ఎత్తుకు
పోలేదు. కారణం ఏమిటి?
జ: ఆ సమయంలో సుబ్బారావు టీవి చూస్తున్నాడు.
కొత్త సినిమా టైటిల్స్:
ఆమె నవ్వింది
ట్యాగ్ లైన్: ఏడ్చినట్లే ఉంది
అతని పేరు పిడుగు
ట్యాగ్ లైన్: ఆమెను అడుగు
బాంబుల మోత
ట్యాగ్ లైన్: తుస్స్...!!!
కొత్త సామెత:
కత్తి వచ్చి కాలు మీద పడినా కాలొచ్చి కత్తి మీద పడినా
కాలికే కుట్లు.
రామారావు రోడ్డుమీద ఉల్లాసంగా పాట పాడుకుంటూ వెళ్తున్నాడు.
ఇంతలో ఒకతను ప్రాణాలకు తెగించి స్పీడ్గా పరిగెత్తడం కనిపించింది. ఏదైనా అపాయం
ముంచుకొ స్తోందేమోనని రామారావు కూడ అతని వెంటే వేగంగా పరుగెత్తాడు. కొంత దూరం
వెళ్ళాక పరుగెడుతున్న అతను రొప్పుతూ అడిగాడు. రామారావు కూడ రొప్పుతూ అతని
వద్దకెళ్ళి ‘‘దేనికి అలా పరిగెత్తారు’’ అని అడిగాడు.
‘‘మీరు చూడలేదా? అక్కడ ముప్ఫై కిలోమీటర్ల వేగంతో మాత్రమే
వెళ్ళండి అని బోర్డుపై రాసుంది’’ అన్నాడు పరుగు వీరుడు.
ఇద్దరు మిత్రులు హోటల్లో భోజనం చేశారు. సర్వర్ వచ్చి
ఇద్దరికీ చేతులు కడిగాడు. పక్కనే మేకుకు తగిలించి వున్న కోటు ఒకతనికి తొడిగాడు.
కోటు తొడిగించుకున్న అతను సంతోషంతో బిల్లు చెల్లించి పది రూపాయలు టిప్ కింద ఇచ్చి
బయటపడ్డారు. బయటికొచ్చాక పక్కనున్న ఫ్రెండ్ అడిగాడు. ‘‘సర్వర్ కు ఎవరైనా
పది రూపాయలు టిప్ ఇస్తారా’’అని.
‘‘పది రూపాయల కంటే కోటు విలువ ఎక్కువ కదా!’’ జవాబిచ్చాడు
స్నేహితుడు, తనకు సరిపోయిన కోటును మురిపెంగా చూసుకుంటూ.
కొత్తగా కవితలు రాస్తున్న మిత్రుణ్ని అడిగాడు సుబ్బారావు,
‘‘ఏంట్రా ఈ మధ్య కవితల పుస్తకం భారీగా ఖర్చు పెట్టి
అచ్చేశావట... ఏమైనా అమ్మావా?’’అని.
‘‘ ఆ.. అమ్మాను... వాచీ, వుంగరం, స్కూటర్’’ జవాబిచ్చాడు.
ఓ రచయిత తన మిత్రునితో ‘‘నేను బ్రహ్మాండమైన
కథ రాశాను గురూ. దాన్ని పత్రికకు పంపుదావుని అనుకున్నాను కాని ఏం చెయ్యును ఆ కథను మా
అబ్బాయి చించేశాడు’’ అన్నాడు విచారంగా. దానికి మిత్రుడు, ‘‘మీ అబ్బాయికి ఎన్నేళ్ళు?’’
‘‘ నాలుగేళ్ళు’’
‘‘అరే ఆశ్చర్యంగా ఉందే... ఇంత చిన్న వయసులోనే మీ అబ్బాయికి
ఎంత చక్కటి విమర్శనా జ్ఞానం అలవడింది!’’ అన్నాడు మిత్రుడు తాపీగా...
Post A Comment:
0 comments: